Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, September 30, 2020

Bharatavarsha -42

 చిన్న  పదముల  చిక్కము ద్విపదయే 

 చెన్నారి  పాద  చేలమే చూచినన్. 


చెన్న  పట్టణము చేరిన అంగయారుకు రోమి రహదారియందు కలిసిననూ   కొలది నిమిషములు మాట్లాడుటయే గాని అతడితో సమయము గడుపుటకు  అవకాశము లేకుండెను.   పిలిచిననూ ఎచ్చటికీ పోక  ఇంటికి చేరి  అతడు గుర్తుకువచ్చు చున్ననూ మౌనముగా నుండి అత్తగారికి సేవచే యుచుండెను.   అత్తగారి తోడు కొంత  ఊరటనిచ్చి ననూ వయో బేధము  మనోభావముల నెఱిఁగిం చుటకు అడ్డముగా నిలుచుటతో  ఆమెకు వంటరితనమే మిగిలినది.  వంటచేసి పెట్టి ఆలనా పాల నా  చూచుచూ   అత్తగారికి తన కోరికను ఎట్లు తెలపవలెనో తెలియక సతమత మగుచుం డెను. మీనాక్షికీ విషయము తెలుపగా  నేరుగా  రోమి వచ్చి అడిగినచో బాగుండుననెను.  కానీ ఇంత  త్వరగా అడుగుటకు మనసొప్పక  డయానాకి విషయము తెలపెను.   
డయానా :  తీర్థ యాత్రలకు అత్తగారితో బోయిన నీ  సమస్య సమసిపోవును   
అంగయారు  : తీర్థయాత్రలకు  తీసుకు పోయి వంటరిగా ఉన్నప్పుడు అడగమందువా ?
డయానా : నీవు వంటరిగా పోవుట కాదు , జంటగానే పోవలెను , రోమి మీ ఇరువరినీ కొనిపోవును. 
అంగయారు : అట్లు ఇరువరమూ కలిసి అడుగుట ... 
డయానా : నసిగె దవెందులకు ?
అంగయారు : అట్లు ఇరువరమూ కలిసి అడుగుట .... 
డయానా : మరల నసుగుడు.  నీవు ఏమియునూ అడుగా వలదు . మీరిరువరినీ చూచి ఆమె అర్థము చేసుకొని ఆమే  మిమ్ములను అడుగును . 

అంగయారు మనసుకు పట్టిన మబ్బులు విడిపోయినవి. డయానా పథకం పారినది. వారు ముగ్గురూ కలిసి అనేక ప్రదేశములు చుట్టి వచ్చెడివారు.  ఆదివారము ఎచ్చటకీ పోకున్ననూ రోమి అంగయా రు ఇంటికి వచ్చెడివాడు. అంగయారు సంగీతముతో  రోమినేకాక అత్తగారిని కూడా అలరించెడిది.   
వారు విడిగా బైటకు పోయివచ్చిననూ అభ్యంతరముండెడిదికాదు. 


న్నెకో  రికలన్నీ  కానల కంపి   

కాగిన కన్నెకు  డకు శుభమాయె


వేచి చూచిన శుభఘడియల గుదెంచెను. పెండ్లి పంజరమున యాంత్రిక జీవితమును గడిపిన  అంగ యాఱుకన్నె శృంఖలములు తెగినవి  కానీ అత్తగారు ఎందులకో మౌనంగానే ఉన్నారు. రోమికూడా తొందర చూపకుండుటతో కొంతకాలమాగవలనని అంగయారు నిశ్చయించుకొనెను.  

కానీ జీవిత మాధుర్యమును గయారు చవిగొనుచున్నది.    ఉ. వంటిరి   జీవిత    మైనను   న్నెలుదట్టము     అంగయా  రుకున్  

వింటిని      ఆదివా     రమున  వెచ్చని   గానము     సంధ్యవే    ళలన్         

తుంటరి   తుమ్మెద  ల్లెతన    తోడును   తిప్పును    తోటలం దునన్         

జంటగ     గానమే      నెరిపి   జాటును    మెండుగ   మిత్రశీ    లతన్ 


 కన్నెకథయంత కళ్ళార చూచిన 

 వన్నెకాడు నీడల్లె వెనుకనే తిరినాడు  


 మెరుపల్లె  నిత్యమూ మెఱసి వెలసె 

నేరుగా వెరచి  నేత్రము లర్ధించె  


గేహవ ర్ణమున దేహము మెరియుచు

లచినా డతడు లపే తెలిపినాడు


ఎర్రని గుఱ్ఱము వలే దేహ కాంతి కలిగి మెరియుచూ వలచి వలపింపజేసిన ఆ సింగళీయుని వలపుల సింజిని  ఆనతికాలమునే అంకెకత్తెగా అవతరించి ఆతడి మానస సరోవరమందు రాజీవ (ఎర్ర కలువ)మై నిలిచిపో యెను. 


 పసిడి కిన్నెరకు లుకు తోడు

 పసకాఁడు కన్నెకు పొసఁగు ఱేడు


బంగారు వీణకైననూ పలుకు తోడు కావలెను. అట్లే బంగారు కన్నెకు పసకాడి  తోడు కావలెను. 


 మాట   పొత్తుకొన తనువులే  ఒత్తుకొన   

 మాటు తొలగెను మనసులే  కలిసెను   


మాటలు కలిసిన పొత్తు కుదరకుండునా , చూపులు తూపులతో మొదలైన ప్రేమ నవ్వుల తేరులపై పువ్వులు కురియగా  సాగకుండునా ? పొత్తు కుదిరిన తనువులు కలవకుండునా ?


చిత్ర  శాలల చెలతిరిగి  చెలరుచు      

చిత్ర  ములెన్నో చూడప్రే మపొరలె. 


గృహము పాఠశాల తప్ప అన్యమెరుగని బేల  లజ్జావతి  బాహ్యప్రపంచము నడుగిడి జీవిత మాధుర్యమును గ్రహించవలెనన్న షిరోమి కల మొదట కన్నెకు  భీతి గొల్పుచుండిననూ, కొద్దికాలంలోనే ఆకల  నెరవేరెను.   ప్రేమ వ్రతము మహారణము కదా !


 మరుసటి వారము లంక కొనిపోవుటకు ఏర్పాట్లు జేసెను.     


వివారము నర్త మణి  రువారము  

వణించు నర్తనమే రాత్రి విలాసము
ఖునితో చేయగా శృంగార యాత్ర

ఖ్యత పెరిగి రసల్లా పముహెచ్చె.


పీయూష  ముగ్రోలి పాలవె  న్నెలలో  

తేలి  శోభన తీరము లుజూసిరి.

 

     

లకాని   గుండె  లపుల  దిండుగా

లులు   కనుచూ   న్నెతి రగసాగె దేశాంత రమువాడు దెగువ కలవాడు 

 గొనిపోయి దేశము గారము జేసి నాడు


 

Saturday, September 26, 2020

Bharatavarsha 41

బారామతి నగరమందు జలోచి పథమున బహు మహీజ వర్ధిత , సౌరు  సాటోప  గౌరు గంభీర నక్షత్ర నందనము గలదు.  ఆ సువిశాల ఉద్యానవనము సాంద్ర, నీరంధ్ర  లతిక పరివృత  పుష్ప దములతో, ఘన ద్రుమములతో, పిల్ల పల్లవములతో, వనమూలికలతో, పచ్చని దరువులు తో నొప్పు చుండెను. అందొక  తటాకము ఎర్రని తామరలతో మెరియుచూ కసిగాటు గోటు బీటగిల్ల విహర్తలకు గుప్తకేళి  మోహము గొల్పుచుండెను. ఆ సుందర ఉద్యానవనమున రవిద్యోత రహిత పూపొదలయందు లకుమ  అగస్త్యులు తీగెలలో తీగలవలె మదోత్తేజిత లటపట లాడుచుండిరి.   

ప్రేమికులకీ ఉద్యాన వనములు శ్రీరామ రక్షగా నిలచినవి. వారము రోజుల నుండి ఇచ్చట బారామతిలో నుండి  ఎదురుచూచిన శుభ ఘడియ రానే వచ్చినవి. కనువిందు జేయునీ అందాలు ఒకనాడు నా చేత చిక్కునని కన్న కల నిజమైనది యనుచూ 


 తే. నీపరు  వాల పాల  నురువు లనుజాచి      

  నతడి యారు  పెదవి,  నీజవ్వ  నప్రణ   

త్రాణ ముతెలుపు  నీజి  లిబిలి  సొగసు 

బిగిమాన మురతి కేళికే భూరి వరము        

పాలు  పొంగు వంటి  పరువపు మెరుపు ను చూసినచో నా పెదవులు తడి యారిపోవును నీ వయసు లో ఉన్న ( ప్రణయ త్రాణము ) శృంగార శక్తి నాకుఆశక్తిని  పెంచుచుండును. నీ సొగసు జిగిమానము (బిగుతు) నిరుపమానము. అది రతి కేళికే బహుమానము. యని పొదరింట  అగస్త్యుడు పై బడుచుండ 

అనువు గాని చోట తమకమేలరా !వేళ చూసి నన్నేలరా ! 

వయసులో వేడుండనిమ్మురా!! చిన్నది నీని నమ్మరా!! 

ని చెలికాని వారించుచున్నలకుమ ఆందోళనను గాంచి 

అగస్త్య: ప్రాణ రక్షణ కొరకు నీవు వాడిని తన్నినావు గానీ చంపవలెనని కాదు కదా. 

లకుమ: నాకు ఆశ్చర్యముకల్గుచున్నది, విదిషకీ విషయమెట్లు తెలిసెను. ముందుగా నీకెట్లు దెలిపెను? 

అగస్త్య: విదిష అమ్మమ్మ భవిష్యవాణి నెఱిఁగించెడి దైవజ్ఞురాలుఈమెకూ ఆశక్తి వంశపారంపర్యముగా వచ్చెనేమో?  ఈమెకు తల్లి ఆత్మ కనిపించుచున్నదట . 

లకుమ: అది నీవు నమ్ముచున్నావా? 

అగస్త్య: ఆ విషయము ప్రక్కన పెట్టి నీవు ఆందోళన జెందక స్తిమితముగా నుండవలెను.   

ల:  నాకాందోళనేల కల్గును మా యమ్మ ఉండగా. నాకు మా అమ్మపై నమ్మకమున్నది. 

అ:కానీ ఆమెకే నీపై నమ్మకము లేదు. ఆ నమ్మకమే యున్నచో నీవు  సొంతగా చిత్రనిర్మాణము జేయక ఇట్లగచాట్లు పడవలసిన ఖర్మమేమి?

ల:అది నామనసునెప్పుడూ దొలిచివేయుచుండును,కానీ నీకు నాపై నమ్మకమున్నదా ? 

అ: ముంజేతి కంకణమునకు అద్దమేల, నీకు నాకు జత కుదిరిన నాటినుండి నేను విశాఖలో నుండుట మానివేసితిని. నీ చుట్టూ భ్రమరము వలే తిరుగుచూ నన్ను నేను పట్టించు కొనుట మానివేసితిని.  అన్నిటికంటే ముఖ్యమైన విషయము మానాన్నకు నాపై నమ్మకంలేదు. అది నాకు లాభించును. 

ల:నాకేమీ అర్ధము కానున్నది. అది నీ  కెట్లు లాభించును? 

అ: నాకే కాక నీకునూ లాభించును  అదిచెప్పినచో నాకేమిత్తువు? 

ల:నీకు వలసినదిత్తును యని కన్ను గీటుచూ అనెను. 

అగస్త్యకి రక్తపోటు  పెరిగి తగ్గిన పిదప మానాన్నకి పశ్చాత్తాపము పెచ్చు. మా అమ్మని నిర్లక్ష్యము జేసినందుకు ఎప్పుడూ దుఃఖించు చుండును. 

ల:జేయునదేమియునూ లేకున్ననూ మగవారు అట్లు నటింతురేమో. మా నాన్న కూడా ఇట్లే జెప్పుచుడెడివాడు. నేను మా అమ్మ నాన్న విడిపోయిన కొత్తలో ఆతడి వద్దకు పోవుచుడెడిదానను. 

అ:అటులనా? మీనాన్న ఎచ్చట ఉండును? ఏమి జేయుచుండును?  

ల:ఆయన చిత్ర దర్శకుడు, కేరళవాసి. ఇప్పుడు రంగమునుండి పింగము లోనికి బోవలదు. మీ నాన్న విషయము జెప్పుము. 

ల: మా నాన్న పశ్చాత్తాపము నటన కాదు, నిజము. నాకు లక్షలు ఇచ్చుచున్నాడు. ఇందుకు నేను జేయవలసిన దల్లా ...

ల: మీ నాన్న పక్షము వహించవలెను , నిజము జెప్పుము నీవెవరి పక్షము?

అ:నిజము జెప్పవలెనన్న నేను నీపక్షము, డబ్బు పక్షము.

 శరీరము వంక ఆశగా చూచుచూ జెప్పుచున్న అగస్త్యను జూసి  లకుమ సిగ్గు గొనెను

అ: నిన్ను మానాన్నకి పరిచయము జేసి  చిత్ర నిర్మాణము చేపట్టమందును

ల: అయినచో నీవు హీరో , నేను హీరోయిన్

అ: ఛీ ఛీ నాకు నటిచవలెనని ఆశలేదు , నాకు  పైనే ఆశ. అన్ని  విషయములు చెప్పితిని కదా , అన్న మాట నిలబెట్టుకొనుము.

ల:ఇది ఉద్యానవనము ఇచ్ఛటెట్లు  కుదురును?

అ: అయినచో మీ ఇంటికి పోయెదము , మీ అమ్మ ముంబయి పోయినది కదా రాత్రికి కానీ రాదు. ల:అట్లు నాకెవరు జెప్పినారు. తాను మధ్యాన్నమే వచ్చునేమో ?

అ: మధ్యానమే వచ్చుటకు ఆమె విమానము పై పోయినా? సమయము కావలెను కదా  వచ్చుటకు ?

ల: వారము రోజులనుండి ఇచటనే యుండి బారామతి గూర్చి ఏమి దెలుసుకొనినావు?

అ: బారామతి  మయూర పండిట్ అను మారాఠీ కవి జన్మ స్థలమని భారతవర్ష జెప్పినాడు.  

ల: ఈ వర్షునకు సాహిత్యము తప్ప  ఇంకేమియు దెలికున్నది!  

అ: అట్లు కొట్టిపారేయవలసిన కవి కాదు. అతడు 108 రామాయణములను వ్రాయ నిశ్చయించి 95 రామాయణములను వ్రాసేనని వినికిడి.

ల: బాగు బాగు, ఇచ్చట విమాన శిక్షణా కేంద్రము ( కర్వేర్ ఏవియేషన్ స్కూల్ ) కలదని వినలేదా? 1996 లో బారామతి నగరానికి 12 కిలోమీటర్ల దూరములో  ఈ వైమానిక పేలిక ను నిర్మించినారు. మా అమ్మ అచ్చటనుండి ఛాపర్ కానీ విమానములో కానీ పోయి వచ్చుచుండును. ఇప్పుడు నాపని మీదే  వకీలును కలవ ముంబాయిపోయెను. నీవు ఇచ్చట యున్నట్లు ఆమెకు తెలియదు. నీవు ఇంటికి వచ్చిన చో  ఆమె చూచును అది బాగుండదు . పైగా సుందరి కూడా ఇచ్చటనే యున్నది, పైలట్ శిక్షణ పొందుచున్నది. దానికొరకు పది లక్షలు ఖర్చు జేసెను. భగవంతుడు మేలు జేసి తన శిక్షణ పూర్తి జేసుకొని పైలట్ గా స్థిరపడిన చో మంచిదే కదా. వారిద్దరూ ఉద్యానవనం నుండి నిష్క్రమించి. రహదారిపై నడుచుచుండగా వారిపక్కన నుండి ఒక కారు దూసుకుపోయెను . 

అ: అదిగో ! మన కారు పోవుచున్నది ,  అందు సుందరి ఎచ్చటికి పోవుచున్నది?

ల: సుందరిని విమానాశ్రయము వద్ద  దింపి మా అమ్మను దీసుకు వత్తురు.  

ఇంక అయినట్టే యని దిగాలుపడుచున్న అగస్త్యను "నా స్నేహితురాలి ఇంటికిపోయెదము."  అని నవ్వుచూ లకుమ  వాహనమును పిలిచెను

                                                                     ****

సబ్బవరమందు  క్షేత్ర గృహమున  మంజూష  విదిష లిద్దరూ  సరస సంవాదమందు  మునిగి లోకమును మరిచి ఆనందడోలికలయందు తెలియాడుచుండిరి . "నాటి గోశాల నేటి పర్ణ శాలగా మారి చూడ ముచ్చటగా  నున్నది." యని  మంజూష అనగా,  విదిష  "చిత్రముల గీయుటకు మనసునాహ్లాద పరుచు నట్లీ  పర్ణశాలను ప్రత్యేకముగా అలంకరించితిని." అనెను. "ఎచ్చట చూచినా వర్షుని చిత్రములే కనబడుచున్నవి ప్రత్యేక అలంకరణ యనిన ఇదేనేమో!" యని  మంజూష అనగా, విదిష బుగ్గలు ఎరుపెక్కెను.   భారతవర్ష చిత్రపఠం ముందు వారిరువురూ చాపపై  కూర్చుని యుండిరి. విదిష చేత వీణ మ్రోగు చున్నది.  

  నాహృద  యంశృతి  బాసిన

సంత వీణియ దొరకొని మీటర శూరా! 

అహర్ని శమునీ ధ్యాసే 

హతహ  పడునాడు లతపన తీర్చ గ రారా!!    

 నా మనసు వసంత వీణ నానాడులే  తీగలు తీగలు శృతి తప్పి అలమటించుచున్నవి. నీవు వాటిని సరిచేసి నా తపనను దీర్చవలెనని చక్కటి రాగాలాపనతో వీణ వాయించుచున్నది. మంజూష ఎదురుగా కూర్చొని ఆలకించి ఆనందించుచున్నది. " నీవింత చక్కగా పాడగలవాని నా  వద్దెందుకు దాచితివి. ఇంతలో చిత్రకళకు స్వస్తి జెప్పి సంగీత పాఠశాల ప్రారంభింతువా ?" అనెను.

చిత్రకళ ఆర్ధికంగా నన్ను నిలబెట్టినది. సంగీతము మనసును విశ్రాంతి  పరచుటకు. ఇప్పుడు ఎక్కువమంది   తైల వర్ణ చిత్రముల కొరకు నావద్దకు వచ్చుచున్నారు. అని విదిష అనగా "  నీ  విజయమును  వార్తాపత్రికలు , బుల్లితెర చానళ్ళు ఆరు నెలలుగా ఊదర గొట్టుచున్నవి. ఇప్పుడు డీ రాష్ట్రమున నిన్ను దెలియనివారుందురా!” యని మంజూష అనగా విజయము నాదని  నీవునూ అనుచున్నావా ?” యని విదిష వాపోయెను  నీ వ్యాజ్యము న్యాయ చరిత్రలోనే పెను  సంచలనము. ఇంత సత్వరన్యాయము ఎచ్చటనూ  దక్కలేదని లోకము కోడై కూయుచుండగా నన్నడిగెదవేమమ్మా" యని మంజూష విదిషనాట పట్టించుచూ విదిష కంట నీరు చూసి " అయ్యో నీకింత భాద కలుగునని దెలిసిన ఇట్లనెడిదానను కాను."

" మీకుటుంబము మమ్మాదుకొననిచో .." "ఛీ ఏమి మాటలవి , చిన్నప్పటినుండి కలిసి ఒకే బడిలో చదువుకొని  ఒక ఇంటి వారివలె నున్నాము. మనము ఒకరికొకరు జేసుకొనుట గొప్పవిషయమన్నట్లు జెప్పుచున్నావు"  నే నాజన్మాంతమూ వర్షకు రుణపడి యున్నాను" యని   విదిష గద్గద స్వరముతో పల్కుచుండ నీవు కన్నీరు పెట్టుకొనిట్లు మాట్లాడిన నే నుండజాలను పోయివత్తును యని మంజూష లేచెను.  విదిష కళ్ళు తుడుచుకొని " సరే నేను  నవ్వుచుందును నెవిచ్చటికీ పోవలదు." యని మంజూషను వారించెను. " ఎంత గడసరి జాణ వో   నాకు తెలపక నీవు వీణ కొనుటకు  వాల్తేర్ అప్లాండ్స్ కు బోయినావు. నన్నడిగినచో మా ఇంట నున్న వీణ నీకివ్వకుందునా ?  మా అమ్మ నిన్ను  అచ్చట చూసి  ఇంటికి పిలుచుకుపోయి వీణనివ్వనిచో  కొత్త వీణ కొనెడిదానవేకదా!" యని ఒక్క మొట్టికాయ వేసెను. ఆహ్ .. అబ్బా అది వర్షుడి వీణ నేనెట్లడుగగలను" యని విదిష అనగా. " అడగ వలసిన పని ఏమున్నది. అడుగుట  కంటే  దొంగిలించుట  సులభము " యని మంజూష అనగా విదిష దిగ్భ్రమ నొంది చూచుచుండెను. "తాటకీ ! నీవు జేసినదేమే? వర్ష హృదయమును దొంగిలించలేదా ? " యనుచు చెవి నులమగా ఉప్పొంగిన హృదయముతో విదిష  మంజూషను హత్తుకొనెను.

మీ అమ్మ నన్ను అంగీకరించునా ? యని దిగులు చెందుచున్న విదిష తో  మంజూష " ఆమె నిన్నెప్పుడో ఆ దృష్టి తో నే చూచుచున్నది. " అనగా  " ఏ దృష్టి తో ?" యని విదిష అడుగగా " అబ్బా ఏమి జాణ  మావదిన , మా అమ్మ   ఏ దృష్టి తో చూచుచున్నాదో  నేను చెప్పవలెనట." యని మంజూష మొఖం త్రిప్పుకొనగా "  చెప్పవా .. చెప్పవా..  యనుచూ విదిష మంజూష గెడ్డము పట్టి బతిమాలెను. నిన్నెన్నెటి నుంచో కోడలిగానే చూచుచున్నది. అందుకు కూడా కారణమున్నది  కొన్ని వార్తా పత్రికలలో బైరెడ్డి నిన్ను బలాత్కరించెను  అని అర్ధము వచ్చునట్లు వ్రాసి , బొమ్మలు ద్వారా సంకేతములిచ్చిరి. విదిష  నోట మాటరాలేదు. ఎంత ఉత్తమురాలు నీ తల్లి. ఆమె కోడలగుట కు నేను పెట్టిపుట్టినాను. విదిషకళ్లు  మరల  చమర్చినవి .  

Thursday, September 24, 2020

Bharatavarsha 40

 .         చ్చటి  చేలుము  చ్చటగ    ట్టము    గట్టిన   పల్లెజూ  చినన్

               నచ్చటె  వెచ్చగ  మనము  నాట్యము జేయును పట్టుబ  ట్టపై       

                ముచ్చట  గొల్పుచు  ముత్యపు  మిద్దెలు,   వీధులు   పైడిచే రులే                

                మెచ్చుచు బల్లిపా    డిదని   ల్కిన   చాలదు   చూచిరా వలెన్   "పచ్చని చేల మధ్య మట్ట సముగా ఒదిగిన  భవనములు, వ్యర్ధములు  లేని విశాలమైన వీధులు  శుభ్రమైన  లోగిళ్ళు, తిన్నని వరుసల్లో తీర్చి దిద్ది నట్లు న్న భిన్న వర్ణముల కాంతులీను  ఇళ్ళు ,  ముఖ్మలు గుడ్డపై  పేర్చిన ముత్యముల  శ్రేణులే కదా ఈ పల్లెనందున్న ఇళ్ళు! గగన విహారము  జేయు గంధర్వులెవరైనను  గాంచిన వేల  ఎకరాల మధ్యనున్న తెల్లని భవన సముదాయము  వెండి పళ్ళె మందు బొండు మెల్లెలు న్నట్లగుపించి ఎత్తుకు పోదురేమో!"యని మృదంగమును గుడ్డయందు మూటకట్టి భుజమున దాల్చి నడుచుచున్న కేశవుడు చేతిసంచి పట్టుకొని వెంట వచ్చుచున్న పార్వతితో అనెను. 


మారు మూల గ్రామమైన బల్లిపాడుకు రైలు మార్గములేదు గావున కేశవుడు అచటికి 8 మైళ్ళ దూరములో గల కొవ్వూరుకు బోవబయలుదేరెను. చంద్రమతి గారు కేశవుని విశాఖపట్నము పోవలదని బల్లిపాడు నందుండిపొమ్మని ఎంతపోరిననూ వినక  విశాఖ పట్నము బోవు రైలు కొరకు కేశవుడు కొవ్వూరు బోవుచుండగా అక్క తమ్ముడిని రైలెక్కించి వీడ్కోలిచ్చుటకు వెంటబోవుచున్నది.

“అమ్మ(చారుమతిగారి)మరణానంతరము నాకు ఇప్పటివరకు నిన్ను జూచుటకు అవకాశము చిక్కలేదు. పెద్దమ్మ చంద్రమతి పుణ్యమా యని ఈనాటికి నిన్ను స్వగ్రామమునూ చూడగలిగితిని.” యని కేశవు డనెను. “ఇంత మనోహరమగు పల్లెను వీడి బోవనేల ? ఈ మారు మూల దిబ్బ పై యుండుట కష్టమ ని పోవుచున్నావా?”  “విశాఖపట్నమువలె పెద్ద పట్నము కాదు కదా అనుచున్న పార్వతితో కేశవుడు “అక్కా పట్టణము పెద్దదైన మనమేమి జేసుకొందుము?”  అయిననూ ప్రదేశము నందేమున్నది అంతా  మనుషులలోనే యున్నది.  నీవు మారు మూల దిబ్బ అనుచున్న ఈ పల్లెను యంత్ర కర్మాగారములతో నింపినచో, వీధులు నదులు చెత్తతో నిండును, ప్రకృతి నాశనమగును కానీ అభివృద్ధి ఆగునా? మనము  మారుమూల దిబ్బలనుచున్న పల్లెలెన్నో ప్రపంచ కీర్తిని పొందెను కదా. 

జక్కనవల్ల  కైదల , క్షేత్రయ్య వల్ల  మొవ్వ , సిద్ధేంద్రయోగి వల్ల  కూచిపూడి , అన్నమయ్య వల్ల  తాళ్ళపాక, ఆదిభట్ల వల్ల  అజ్జాడ అటు చరిత్ర లో  ఇటు జన హృదయములలో  శాశ్వత కీర్తిని పొందలేదా? ఈ పల్లె ఒకనాటికి దివ్యకాంతులీనవలెను. అట్లు బోవుచున్న వారికొక యువకుడు ఎదురు వచ్చుచూ కేశవుని జూచి నవ్వి " మొన్న ఉత్సవ కార్యక్రమములో నీ మృదంగవాదమదిరెను కానీ ఎప్పుడూ ఈ డోలు మేడలో ఉండవలెనా ? ఏమిచేతువోయి నిత్యమీ డోలుతో ? యని వేళాకోళము జేసెను. పార్వతికరికాలి మంట నెత్తికెక్క " దొమ్మీ రేడా , నీవేల అంత  పెద్ద  చరవాణి చేతపుచ్చుకుని తిరుగుచున్నావు ? అది నిత్యమీ నీ చేతనుండవెలనా ? యని అడిగెను. దిస్  ఈ స్ ఫర్ కమ్యూనికేషన్ విత్ ఫ్రెండ్స్ యు నో యనాంగ్లమున బింకముగా పల్కినాతడికి  దిస్  ఈ స్ ఫర్ కమ్యూనికేషన్ విత్ గాడ్ యు నో యని కేశవుడు  చెప్పెను.అట్టి ఘాతమునూహించని ఆ బుడతడి తేజమడికి వత్తి కాలెను. వారు బస్సుకొరకు ముందుకు సాగుచుండిరి. ఎదురుగా ఒక వృద్ధురాలు ఒక నడివయస్కురాలు వచ్చుచూ వీరిని పలకరించిరి. 

“నాన్నా  కేశవా గాయత్రీ మంత్రం జపిస్తున్నావురా ?”  “చేస్తున్నాను మామ్మగారూ”  యని కేశవుడు అనగా ఆ వృద్ద్ధురాలు కేశవుని సమీపించి తల పైచెయ్యిఉంచి మంత్రములు చదువ నారంభించెను.  పక్కనే ఉన్న నడివయస్కురాలు నవ్వు చుండెను.

ఆ వృద్ధురాలు మంత్రోచ్చారణ ముగించి "  పబ్యా అను నవసంఖ్యాక సూక్తములను జపించిన శత్రునిగ్రహము కలుగును. సువర్ణస్య అనుఏకాదశ సంఖ్యాక మంత్రములజపించిన సర్వకామ సిద్ధియగును. ఆధ్యాత్మికైఃకః' అను మంత్రముజపించినమోక్షమందును. ''ఆసనోరుద్రమ్‌'' అని జపించిన దీర్ఘీయుష్కుండగును.''అపనః శోశుచత్‌'' అను దాని మధ్యాహ్నకాల సూర్యుని స్తుతించిన ముంజగడ్డి మధ్యనుండు ఇషీక (గడ్డిపరకవలె) సులభముగ పాపము నుండి ముక్తుడగును.  ప్రయాణములో శుభమగుటకు ''జాతవేదసే'' అను మంత్రమును జపింపవలెను.” అని చెప్పి ఆశీర్వదించెను.

వారట్లు ముందుకు పోవుచుండగా వీధిలో అరుగులపైన కూర్చున్న పెద్దలు " కేశవా మరల ఎప్పుడు వత్తువు?" యని ప్రశ్నించు చుండిరి. త్వరలో తప్పక వచ్చెదనని కేశవుడు వినయముగా సమాధానము జెప్పుచూ సాగుచుండెను. ఇంతలో చెట్టుకింద మధ్య వయ్కసులైన కొందరు పురుషులు వారిని ఆపిరి. అందొక ధరకర్వాటుడు (బట్టతల) "ఇట్లు జరుగునని నేను ఎనిమిదేళ్ల  క్రితం జెప్పితిని, ఎమ్మా పార్వతీ జెప్పితినిగానా? అమ్మ(చారుమతి)చనిపోయిన కొత్తలో జెప్పితిని. కేశవుడికా చిన్న పిల్లాడు గుర్తుండకపోవచ్చు, నీకు గుర్తుండవలెను. 

 మీ అమ్మ ఆస్తి అంతా మీ పెద్దమ్మతన ఆస్తిలావాడుకొన్నది. కొడుకుని కూతురిని అమెరికా పంపించింది. నేనానాడే  చెప్పేను, దేవుడనే వాడున్నాడని "ఇప్పుడవన్నీ ఎందుకులెండి" అనెను  పార్వతి.  "మీ అమ్మని ఎంత ఇబ్బంది పెట్టింది , ఆస్తంతా లాక్కొంది , ఆఖరికి మీ అమ్మ  కాలవ గట్టున గుడిసెవేసుకొన్నది" ఈ లోపున ఇంకొకడొచ్చిజేరెను. అతడు ఒత్తుతల కలిగి గిత్తవలె నున్నాడు.  " రోజులెల్ల కాలం ఒకేలాగుండునా ? ఎంత పిసినారమ్మ మీ పెద్దమ్మ , ఎంగిలిచేత్తో  ఆమె కాకిని    గొట్ట నేనెన్నడూ చూడలేదు.  ఏంచేసుకొనును  అంత  ఆస్తి ? మీపెద్దమ్మ సంగతి నీకు తెలీదు  దేవుడి ఉత్సవానికి పైసా రాల్చెడిది కాదు. 

ఎంతకష్టాల్లో ఉన్నా మీ అమ్మ అడగకుండా కొంత తెచ్చి ఇచ్చేది.  ధర్మాలు చేసి, నలుగురికీ సేవచేసి పోయింది  పుణ్యాత్మురాలు మీ అమ్మ.  ఒత్తు తలాయన ఆపగానే బట్టతలాయన అందుకున్నాడు "  కొడుక్కి  కూతురికి అంతా  దోచిపెట్టి అమెరికా పంపింది , వాళ్ళు కనీసం చూడడానికి కూడారాలేదు. మీరే సేవచేసి ఆవిడ ప్రాణాలు కాపాడేరు ."  బట్టతలాయన కొంచెం ఆపగానే  ఒత్తుతలాయన అందుకున్నాడు " అవునమ్మా మీరు రాక పోతే ఆవిడని పట్టించుకునేవారు ఈ వూర్లో ఎవ్వరూ లేరు . కుక్కచావే వచ్చిఉండేది. కేశవుడి మనసు కలుక్కు మంది. కానీ ఊరిజనం, పెద్దవారు శ్రేయోభిలాషులు.  మాట్లాడలేక " బస్సు వస్తున్నాది  అన్నాడు " " ఇంతకీ ఏమైనా ఇచ్చిందా ఆస్తి ?  "ఇస్తుందండీ , ఇస్తుందిట" అంది పార్వతి "ఆ ఇస్తుంది ఇస్తుంది వెళ్ళండి వెళ్ళండి ." అన్నారాయిద్దరు   పార్వతి కేశవులు కొవ్వూరు బోవు బస్సునధిరోహించిరి.


                                                              ***

 బొకారో  కొవ్వూరు రైలునిలయమునకు  సరైన సమయమునకే వచ్చి ఒక్క నిమిషమాగి   9. 43 నిమిషములకు పెట్టున కూసి పెద్దకుదుపుతో కదిలెను. ఎండ విస్తారముగా కాయుటచే అంతయూ ప్రకాశవంతముగా నున్నది. మృదంగముతో రైలు పెట్టి లోకి ప్రవేశించి కిటికీవద్ద కూర్చినిన కేశవునకు పార్వతి కిటికీ నుంచి సంచి నందించి  క్షేమముగా జేరినట్లు తెలపవలెనని అనునంతలో రైలు కదిలిపోయెను. దయమాలిన యంత్ర మొక్కనిమిష మాగినదికాదు అనుకొనుచూ  కిటికీనుండి చూచుచున్నకేశవునకి పార్వతి చేయి ఊపుతూ కానవచ్చెను.  కనిపించునంతవరకు కేశవుడు అక్కని చూచుచుండెను. అక్క చుక్క అయిన పిదప పెట్టిలోకి జూచిన కేశవునకు ఒక్కప్రయాణీకుడూ కానరాలేదు. 

కేశవుడు మృదంగము దీసి రైలు లయ ననుసరించి వాదనము చేయుచుండెను. కొద్దినిమిషములలో రైలు గోదావరి నిలయము జేరెను. అచ్చట ఒక విద్యార్థి బృందము రైలు పెట్టిలోకి ప్రవేశించెను. వారందరూ ఆధునిక వేషధారులై ఆంగ్లమున సంభాషించు చుండిరి  అందొక విద్యార్థి చేత గిటారు కలదు. పొడవైన కేశములతో పంచ కట్టుకున్న కేశవుని చూచి కిటికీ వద్ద నుండి  తొలగమని ఆ బృందమందు ముఖ్యుడనగా "నేను ఇచ్చట నుండి ప్రకృతి చూచి పరవసించుచున్నాను" అని కేశవుడు సమాధానమిచ్చెను. కేశవుడి మాట తీరు జూసి వీడెవడో వెంగళప్ప వలె నున్నాడు  ఆటపట్టించవలెనని సైగలు వారు ఒకరితో నొకరు జేసుకొనిరి. 

వెనుకనుండి ఎవడో కేశవుని కేశములను లాగెను. కేశవుడు వెనుకకి తిరిగి చూచినంతలో మరొకడు కేశవుని మృదంగ మెత్తు కొని పోవుచుండెను. కేశవుడతని వెనుక పడగా కేశవుని స్థానమందు గిరాటు పూనిన యువకుడు చతికిలపడెను. కిటికీవద్ద నున్న స్థానములన్నీ ఆ యువకులు ఆక్రమించిరి. “నా స్థానము నాకిమ్ము నేనచ్చట కూర్చిని మృదంగము  వాయించుకొనవలెను” అనగా బృందం మొత్తము గొల్లు మనెను. నీ మృదంగ వాదముతో నా గిటారు వాదననోడించినచో నీస్తానము నీకిత్తును లేనిచో నీవు వేరొక చోటు చూసుకొనవలెను అని ఆ యువకుడు తన మిత్రులవంక జూసి కన్ను గీటుచూ చెప్పెను. కేశవుడంగీకరించెను. “గిటారు వాదకుడు పాడుటందు దిట్ట నీవు గాత్రకోవిదుడవైన పాడి గెలవవచ్చు మృదంగము వాదానందే గెలవ వలసిన పనిలేదు” అని ఒకడనగా కేశవుడు  మందహాసము జేసి మీకొరకైనచో పాట  వరకు బోవలసిన పనిలేదు. అనగా వారికి పుండుమీద కారము జల్లినట్టయినది. 

ఈ జుట్టు  పోలిగాడు గొప్ప విద్వాన్సుని వలె నీల్గుచున్నాడు వీడి పని పట్టెదనని పల్కి " ఓడినవారు వాద్యపరికరమును వదిలిపోవలెను, ఇది షరతు.” “మీ షరతు నేనంగీకరించుచున్నాను,  నాదియూనొక  షరతుగలదు పాట పాడువారు తమ సొంతపాటనే పాడవలెను. ఇతరులు వ్రాసిన గీతములు పాడరాదు”  అనగా ఖండిత వదనములను జూపలేక మొగము తిప్పుకొనిరి. 

చేతకాకున్నచో పాట మాని వాద్య పరి కరములందుకొనవచ్చును. ని కేశవుడనగా సరే యనుచు అతడిని బెదిరించుటకు ర్యాప్  తరహా గానము చేయవలెను  అని షరతు పెట్టిరి. కేశవుడు సరే యనెను. "ఎవరు నెగ్గినారో ఎవరు ఓడినారో ఎవరు నిర్ణయింతురు ?" అని ఒకడడుగగా  " మీరే నిర్ణయించవలెను  " అని కేశవుడనగా  బృందం తెల్ల బోయెను.  "మీ మీద నాకు నమ్మకముంది  అనుచూ   ఏ భాషయందు పాడవలెను ఆంగ్లమా? తెలుగా? యని అడుగగా బృందం మూగబో యెను.  కేశవుడు మృదంగము తీసుకొని  రైలు లయకు  అనుగుణముగా రెండు నిమిషములు వాదన సాగించి ఆపెను. గిటార్ వాదకుడు లయతప్పి భిన్నమైన లయను పుట్టించుచుండెను. రైలు లయ విడిగా వినిపించుచుండెను. “ర్యాప్ గానమనిన మద్దెల గొట్టుటకాదు, సత్తా ఉన్నచో చూపుము” కేశవుడు ప్రారంభించెను. 

 నా తల సూరీడూ .. నా కళ్ళు గోళాలూ .. నా ఉచ్వాస నిశ్వాసాలు గ్రహ గతులూ 

1. నా లక్ష్యము వింధ్య శిఖరము  2. నా మార్గము కఠినాతి కఠినము 

 3. నా మాట  మందార బృందారము నీ వరమూ 

I am kid crawling at your feet maata vegdeveee.

I found these words  at your feet maata vegdeveee.

Quiero un rincón en tu mundo maataa hamsa vaahinee

Quiero el polvo de tu tobillo maata saraswati.


నా తల సూరీడూ ... నా కళ్ళు గోళాలూ ... నా ఉచ్వాస నిశ్వాసాలు గ్రహ గతులూ  

1 నా వేగము  అరుణ కిరణము  చూచి హిరణము  పొందు చలనము 

2 నే గగన విహగము   3. నా…. పదము మేఘపథమూ ....... 

 

Je me réveille seulement pour ta piete maman (I wake up only for your mercy )

non guardo le stelle nel cielo ma  tuoi piedi ( I don't look at stars but your feet)

ich bin das klingeln deiner anklet. Mutter Saraswati (I am the tinkle of your anklet)

Ich bin das Wackeln deiner Bangle. Mutter Saraswati. (I am the jangle of your bangles)


నా తల సూరీడూ ... నా కళ్ళు గోళాలూ ... నా ఉచ్వాస నిశ్వాసాలు గ్రహ గతులూ  

1. నా లోకము కాదొక లోకము  2.నా లోగిలి నవరస కౌగిలి  

3. రుద్రము, క్షుద్రము కరుణము హాస్యము శృంగారము ….

వచనము: భాషాయోష తెఱఁగు మెఱయ వస్త్రములు నా పదములు   బిట్టురమెరగక, రయము నెఱయు ధవళ కాంతులు నా పదములు  విద్వద్వజ్ర సంజాత  శత సంకీర్ణ ఉల్కా సంఘాతములు   నా పదములు  క్షితిజాన్తరాళ కరాళ  రుద్ర విస్ఫోటములు  నా పదములు. 

నా పద ములు తట్టు నీ గుండె తలుపులు,   మ్రోగించు మేళ తాళాలు.

నా తల సూరీడూ ..నా కళ్ళు గోళాలూ .. నా ఉచ్వాస నిశ్వాసాలు గ్రహ గతులూ ... 2

                                                         ***

బృందమంతయూ ఎంతగా యత్నించిననూ సొంతగా పాడలేక ఓటమిని అంగీకరించవలసి వచ్చెను. బృందము వారొకొక్కరికీ కాంతి ప్రసరించుచుండెను. అయిననూ దింపుడు కళ్లెము ఆశ వలె చివరి ప్రయత్నము చేయదలిచిరి  "ఒరేయ్ కైలాష్ నువ్వు  బాగా  అభ్యసించిన తెలుగు పద్యంఅప్పుడప్పుడు పాడు చుందువుకదా అది పాడుము" అని గిటారుడు మిటారిపల్కులను పల్కెను. కైలాష్ పద్యమును పాడదొడిగెను. 

టటకిట, టట్టకిట్ట, టటకిట్ట, టటట్ట,  

టకిట్ట, టట్టకిట్ట, టకిట,  టట్టకిట్ట, టకిటట్ట,  

టోన్ముఖ, టంకృతి స్ఫుటోత్కట, పటహాదినిస్వన,

 వియత్తల దిక్తటతాటితార్భటో ద్భట,  పటుతాండవాటన,

"ట"కారనుతా! బసవేశ పాహిమాం!

పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యమొకటి పాడి కేశవునకు సవాలువిసిరెను. కేశవుడా పద్యమును పాడి వినిపించగా ఆ బృందమునకు తేజమడిగెను. రైలు గోదావరి వంతెనను సమీపించెను. వంతెన మీద రైలు వేగము తగ్గి  పోవుచుండగా రైలు ధ్వని, లయ  రెండునూ మారినవి. కేశవుడు ఆ ధ్వనిని ఆలకించి "షడగ్డ్ గ్ణడగ్డ్ షడగ్డ్  గ్ణడగ్డ్  డని ఈడ్చుచు, గ్ణడగ్ణడగ్డ్,  ట్గగ్ణ గ్ణడగ్డ్  ట్గగ్ణగ్డ్ డని లాగుచు ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ డను లోహానిస్వ నమ్మున గిర గిర దిరుగు అరుగు చక్రముల్ క్రిక్చ్కక్ క్రక్చ్కక్ యని పెక్కు స్ఫులింగముల్   క్కుచు షడట్గగ్ణ టడగ్డ్షడగ్డ్  అంచు లంఘించు రాక్షస క్రీంకార శక్తి స్వరూప పృషదంశ మిత్ర షడగ్డ్ ట్గగ్ణగ్డ్ గ్ణడగ్డ్ షడగ్డ్  బోకారేశ్వర పాహిమాం"  

యని కేశవుడు  పాడగాబృందమునందరూ మొహమొహములు చూసుకొనిరి.  రైలు రాజమండ్రి  దాటి సాగుచుండెను, మృదంగము అంకతలమందు ( వొడి ) బెట్టుకొని కేశవుడు తన స్థానమందు తాను కూర్చొనెను. ఈ గిటార్ వాదకుని పేరు  రాకేష్  కానీ రాష్ యని జెప్పుకొనును. “రాష్ అనగా కదా కాస్త మంచి పేరు పెట్టుకొనరాదా?” యని కేశవుడడుగగా “అయ్యో  ఆంగ్లేయుని వలె కనిపించవలెనుకదా, రాకేష్ యని జెప్పిన ఆ జుట్టు  కట్టు కొరకు వేలాది రూపాయలు వెచ్చిచుచున్నదంతయూ బూడిదలో పోసిన పనీరేకదా” యని వాడి భీతి. “ఇక వీడి పేరు డేవిడ్ , వాడిపేరు మహేష్ “ “నీపేరేమి ?” యని చెప్పుచున్నవాడిని కేశవుడడుగగా  “నా పేరు కైలాష్” “వాడి అసలు పేరు కైలాస శర్మ.” యని డేవిడ్ జెప్పెను  “నీ తెలుగు బాగున్నది.” కేశవుడనెను. 

పరిచయములైన పిదప వారు స్నేహభావము కలిగి సన్నిహితముగా మెలిగి మాటలు ప్రారంభించిరి. నీ హాబీస్ ఏమి?  యని రాకేష్ అడుగగా ఏమీ లేవని జెప్పగా డేవిడ్ నీకు అర్థముకాలేదు హాబీస్ అనగా నీవు తీరిక సమయములలో చేయు పని.   నీవు బ్రతుకుటకు ఏపని చేయుచుందువు? “మృదంగము వాయింతును.” “అదిగాక తీరిక సమయములలో ఏమీచేయకుందువా? చేసెదవు కదా వాటినే హాబీస్ అందురు. "నాకు జీవితము భగవంతుని జేరుకొను ప్రయాణము. నేను నిత్యమూ అదే మార్గమున ప్రయాణించుచుందును." కేశవుడనెను. “ నీ లక్ష్యమేమి , అనగా నీ గోల్ ఏమి ?” భగవంతుని జేరుట అని వారికి ఎంత జెప్పిననూ అర్ధము జేసుకొనలేక తికమక పడుచుండగా, “సంపాదించి నిన్ను అభివృద్ధి జేసుకొ నవలెనుకదా?” “సంపాదించవలెను కానీ అది అభివృద్ధి ఎట్లగును. అది నా లక్ష్యము కాదు దానిపై మనసు లగ్నము కాలేదు” మీరు ఆంగ్ల అనుకరణలో సంస్కృతినే కాక  ఆత్మను కూడా కోల్పోయినారు. 

కొంతైననూ  భారతీయ పురాణ గ్రంథపఠనము ఉండనిచో   నేను చెప్పునది అర్థమగుటకు ఆస్కారం తక్కువ. మీరు ఆరు అందమైన అరుదైన  తెలుగు మాటలు  చెప్పగలరా? " వారు చెప్పలేక స్తంభించి యుండిరి " మరి మీరు నిత్యమూ తెలుగు మాట్లాడు చుందురు  కదా ? యని అడుగగా " అవును కానీ తెలుగు పై మనసు లగ్నము కాలేదు " అని చెప్పిరి. ఇప్పుడు ధనార్జన మీద నా మనసు లగ్నము కాలేదను మాట  కొంత అర్ధమైనదా ? అర్థమైనది , కానీ పురాణ పఠనము గ్రంథ పఠనము ఉన్నచో ఇంకనూ బాగుగా అర్ధమగునని ఎందుకు జెప్పితివి?  "గోదాదేవి యను కన్య  రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. ఆమె తండ్రి విష్ణుచిత్తులవారు  ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకొని  వెళ్ళుచుండెడి వారు.  వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఒక  రోజు ఈ రహస్యం   విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి గోదాదేవిని మందలించిరి.  

మరుదినమున   స్వామివారు  మాలాధారణ కావించ కుండుటతో , దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని   బాధపడుచుండగా స్వామివారు విష్ణుచిత్తులవారి కలలో కనిపించి  తనకు  ప్రతిరోజూ గోదాదేవి ధరించిన మాలే  కావాలని ఆదేశిస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగును . వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమగును . గోదాదేవి ఎవరు ? నేనెప్పుడో వినలేదే ? యని మోహన్ అనగా "ఇటువంటి పురాణములను నమ్మ జాల"మని డేవిడ్ ఖండించెను." దీనికి ఏదైననూ చారిత్రాత్మక ఆధారమున్నదా ? "యని రాకేష్ అడుగగా "శ్రీవిల్లిపుత్తూర్ నందు ప్రఖ్యాతి గాంచిన  వైష్టవాలయము కలదు . ఈ ఆలయమునకు  అతి ఎత్తైన పదకొండంచెల గోపురం కలదు.  ఈ గోపురమే తమిళనాడు ప్రభుత్వ అధికారిక చిహ్నం.   

విష్ణుచిత్తార్ లేదా పెరియాళ్వార్ కు  ఈ  ఆలయ తులసి తోటలో  లభించిన కుమార్తె ఆండాళ్. ఆండాళ్ ను మనము గోదాదేవిగాను, పెరియాళ్వార్  లేదా విష్ణుచిత్తార్ను విష్ణుచిత్తులగాను పిలుచుచున్నాము.  గోదాదేవి దక్షిణ భారతదేశంలోని 12 మంది అల్వార్ సాధువులలో  ఏకైక మహిళా అల్వార్. గోదాదేవి రచించిన తిరుప్పావై  చాలా ప్రసిద్ధమైనది.తిరుప్పవాయి, పెరుమాల్, (విష్ణు) స్తుతితో  గోదాదేవి (అండల్) తమిళంలో రాసిన ముప్పై చరణాల సమాహారం.  దీనిని ధనుర్మాసం లో ప్రతిరోజూ, విష్ణువు ఆలయంలో  పఠిస్తారు.

తిరుపతి లోకూడా స్వామివారి మేడలో బ్రహ్మ్మోత్సవములలో శ్రీవిల్లిపుత్తూర్ ఆలయంలో గోదాదేవి ధరించిన మాలానే వెంక టేశ్వరునికి ధరింప జేస్తారు . బల్లిపాడు నందు కూడా ఇదే ఆచారము కలదు. బల్లిపాడు మదన గోపాలస్వామి ( విష్ణువు అవతారము ) ఆలయమందు ప్రతి ఏటా గోదా దేవి కళ్యాణము , రధోత్సవం జరుగును" అటులనా మేము మాకు ఈవిషయములేవియునూ తేలియదే యని కొద్దిమంది అనుచుండ " కారణమేమయి యుండును ? " యని శర్మను కేశవడడిగెను .