Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, September 21, 2020

చంపకమాల - చామంతుల దండ

చంపకమాల  - పోతన భాగవతంలో చంపకమాల పద్యాలను విరివిగా వాడారు. 



సున్నితభావాలను వ్యక్త పరుచుటకు వాడు చందస్సు కావుననే దీనిని చామంతుల దండ  అన్నారు. ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి. 

చంపక మాల లక్షణములు: పాదాలు: 4;   ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 21

ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర

యతి : ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము

ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు


1. మొదట యతి జ్ఞానం లేనప్పుడు వ్రాసిన యతి రహిత చంపకమాల. 

అనువు- గవేడ -భారతి -సత్కృప- నొసంగె - కవిత్వ -శక్తతన్ 

కినుక- మువీడి- నిచ్చెను - కుశాగ్ర- రసజ్ఞ- నవచై -తన్యమున్

అనిత - మునీకృ -పధన్య- ముగా దె- సనాత-నిదివ్య-బాసటన్ 

మనము-నబుట్టు-పద్యము-లనిత్తు-తల్లికి-నివాళి –నిత్యమున్.



2. యతి , ప్రయాసా సహిత  చంపకమాల        

   జ         భ     జ          జ        జ          ర

I I I       I U I    U I I      I U I     I U I      I U I     U I U                                 

అనువు- గవేడ -    భారతి - అహార్య- మహత్వ- కవిత్వ  - శక్తతన్  
కినుక- మువీడి- నిచ్చెఘ-   నకావ్య- రసజ్ఞ-      నవచై – తన్యమున్
కనక -   మునీకృ -పబృగు-  వుగాదె- సనాత-     నిదివ్య- బాసటన్  
మనము- నబుట్టు -పద్యము -లుమాల-  గనిత్తు -తలొగ్గి  -వాణికిన్ 



అహార్య- that  can not be stolen;  మహత్వ-  great  
కవిత్వ శక్తతన్  - the power of poesy
కినుక- మువీడి- నిచ్చె - given to me leaving anger ; ఘనకావ్య - great epics 
రసజ్ఞ- నవచై – తన్యమున్ - the new consciousness of receiving 
కనకము నీకృప  - your kindness is gold ; బృగువు గాదె - isn't it favorable? 
సనాతని దివ్య బాసటన్ - with the great support of Saraswati
మనమున బుట్టు పద్యములు - poems born in the heart
మాలగనిత్తు offer as a garland . తలొగ్గి వాణికిన్ by respectfully bowing my head.





No comments:

Post a Comment