తరళము లేదా తరలము అనగా అర్థము హరము మధ్యనుండురత్నము లేదా ప్రకాశించునది. అనురాగము , మణి యను అనేక నానార్థములు ఇంకనూ యున్ననూ "నాయకమణి" యను సంస్కృత అర్థము నాకు ప్రియము. ఇంకనూ మరిన్ని పద్యములు సాహిత్య ప్రియముగా తీర్చి కూర్చవలె.
తరళము పద్యము లక్షణములు
తరళము పద్య గొప్పతనము : చదువుతుంటే చాలా మనో రంజకముగా యుండు పద్యము తరళము. తరళము పద్యము వృత్తం రకానికి చెందినది. నా అబిప్రాయములో తరళము, కంద పద్యము కంటే కష్ట మైనది. ఈ పద్య ఛందస్సుకే ధ్రువకోకిల అనే పేరు కూడా యున్నది . తరళము పద్యములో 19 అక్షరములు, 26 మాత్రలు, 4 పాదములు ఉండును. ప్రాస నియమం కలదు. ప్రతి పాదమునందు 12 వ అక్షరము యతి స్థానము
మాత్రా శ్రేణి: I I I - U I I - U I U - I I U - I U I - I U I - U
మిశ్రగతి శ్రేణి (3-4) : I I I - U I I - U I - U I I - U I - U I I - U I - U
ప్రతి పాదమునందు న , భ , ర , స , జ , జ , గ గణములుండును.
ఈ పద్యమందు గొప్ప విమానము వాలు వైఖరి వర్ణింపబడెను. శబ్దం వర్ణించుటకు తరళమును మించినది లేదు.
I I I - U I I - U I U
- I I U - I U I - I U I – U
విహగ రాజగు దెంచెనో ఉరిమే హిమాని
ఘటి ల్లె నో
మహిత విభ్రమ నాదమున్ గమనా నుకూల మహత్వ మున్
అహిత సంహతి నెల్లచెం డుమహా స్త్ర మేన నిఎంచి యా
విహగ వీరణ తేజమున్
కనిబె గ్గడిల్లి రిచూప రుల్.
విహగ రాజగుదెంచెనో = గరుక్మంతుడు వచ్చెనో; ఏ హిమాని ( మంచు కొండ చరియలు విరిగి పడడము) ఘటిల్లె నో = సంభవించెనో ; మహిత విభ్రమ నాదము = గొప్ప విభ్రమ కల్గించు శబ్దమును ; పొసగి = పోలి ; అకల్ప = ప్రతిఘటించ లేని ; మహత్వ మున్ = గొప్పతనము తో ; అహిత సంహతి = శత్రు సమూహము; నెల్ల = అందరినీ ; చెండు=సంహరించు ; మహా స్త్ర మేనని = గొప్ప అస్త్రమే నని ; ఎంచి = తలచి; యా విహగ = ఆ విమాన ; వీరణ తేజమున్ = చలన పరాక్రమమును; కని = చూచి ; బెగ్గడిల్లిరి = జడుసుకొనిరి చూపరుల్ = చూచువారు
ఎచట నుండగుదెంచెనో రజతాద్రి భూరి మహత్వ మున్
పొసగి ఘోరవి భ్రమ నాదముభీ తిగొల్ప నుఱ్ఱాడుచూ
పెనువి మానము వాలుచుండ నచ్చోట గూడిరి లోకులా
విహగ వీరణ తేజమున్ కని బెగ్గడిల్లిరి పల్లటన్.
ఎచటనుండి వచ్చెనో కదా రజతాద్రి (కైలాసపర్వతము) వంటి భూరి ( గొప్ప) భూరి మహత్వ మున్ (మెఱుపు)ను కల్గి, ఘోర విభ్రమము(నివ్వెరపాటు, భ్రాంతి)ని కలిగించు ఝంకారముతో భీతి గొల్ప నుఱ్ఱాడుచూ (ప్రకంపించుచూ) పెను విమానము వాలుచుండ గూడిరి లోకులు (జేరిన ప్రజలు) విహగ వీరణ(విమానము యొక్క విశేషంగా కదలు)తేజము (పరాక్రమము)ను చూసి బెగ్గడిల్లిరి ( భీతి నొందిరి ) పల్లటన్ (కంగారు తో)
No comments:
Post a Comment