Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, September 12, 2020

కందం





1, 3 పాదాలలో మూడేసి గణాలూ..2, 4 పాదాలలో ఐదేసి గణాలు ఉంటాయి.

1, 3, 5, 7 గణాలలో "జగణం" ఉండరాదు.
6 వ గణం లో తప్పనిసరిగా "జగణం" లేక "నలము" ఉండాలి.
8 వ గణం లో చివర తప్పనిసరిగా గురువు ఉండాలి.
మొదటి పాదం గురువు తో మొదలైతే, అన్ని పాదాలూ గురువు తో, మొదటిపాదం లఘువు తో మొదలైతే, అన్ని పాదాలూ లఘువు తో మొదలవ్వాలి.


విరా  జులుద్భ  వించిన IIU   IUI     UII  
నకృతి కీరితి బడసిన  క్షేత్రము, ఇదియే      సల  భ   నల/జ     భ       
రస మధుర ఇతిహాస  IIII నల UII    IIUI  సల
శిమోక్ష  ముచుకుం దఇంద్ర  స్నేహ వైభవమ్    సల           

నీలి అక్షరాలన్నీ లఘు నియమం , ఎర్ర అక్షరాలన్నీ ప్రాస నియమం చూపుతున్నాయి. అమ్మయ్య గణాలు, నియమాలు  సరిపెట్టేసాం ! ఇంకా ఏమైనా చూసుకోవలసింది ఉందా ?  ఉంది. ఏంటది? అదే పదాలు, పదబంధాలు అర్ధవంతంగా వాడామా?  లేక నోటికొచ్చినవి రాసేసామా ? సరే చూద్దాం.   

విరా   జులుద్భ  వించిన

ఈ ప్రదేశం కవులను ఉత్పత్తి చేసింది అని ఈ పాదం అర్థం సిలపతిగారం అనే పురాణ గ్రంథకర్త  గొప్పతమిళ కవి ఇలాంగో అడిగళ్ "పూమ్పుహార్" వాసి. మణిమేఖల కావ్యకర్త చితాలై చాతనార్ఇక్కడ పుట్టకపోయిన ఈ ప్రదేశం గురించి రాసాడు. సిలపతిగారం అనే కథ చదివినవారు అది ఒక పురాణ కావ్యము లేదా  గొప్ప కథ  అనుకుంటారు. అది కథ కాదు జరిగిన విషయాన్నేఅడిగళ్ కధగా మలిచాడు. అతడు హిందూ కవి అయినా జైన సన్యాసి అని  నిరూపింఛ డానికి చాలా కుట్ర జరిగింది

నకృతి కీర్తిం బడసిన పట్టణ మిదియె

ఈ పాదం అర్థం పూంపుహార్ కావ్య రచన కీర్తినిపొందటం
అగస్త్యని ఫాదర్ అఫ్ తమిళ్ లిటిరేచర్ అంటారుఐదు ప్రసిద్ధ తమిళ పురాణాలు  సిలపతిగారంమణిమేఖలం,శైవక చింతామణి , వలయపతి , కుంటలకేసివాటిలో మొదటి రెండుసిలపతిగారంమణిమేఖలం పూంపుహార్కు  సంబంధించినవి.

రస మధుర ఇతిహాస 
సిలపతిగారంమణిమేఖలం దీని జంట కావ్యం  నవ రసాలు కలిగిన మధురమైన ఇతిహాసాలు అని  పాదం అర్థం.కన్నాగి సభలో రాజుని ఎదుర్కోడం వీరం , ఆమె భర్త  కోవలం శిరచ్చేదము భయానకంమాధవితో అతడిపరిచయం శృంగారం.ఇలా ఇతిహాసం చదువుతుంటే అన్ని రసాలు కనిపిస్తాయికన్నాగి  కొవలన్ పూంపుహార్లో నివసించారు.  

                                                      
శిమోక్ష  ముచుకుంద ఇంద్ర  మైత్రీ  చందం 

శివమోక్ష అంటే ఈ ప్రదేశానికి చెందిన శివ మోక్ష కథలలో తిరువెంకదార్ (పట్టినాథర్) కథ ఒకటి.  తిరువెంకదార్ ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టి ఐస్వరాన్ని త్యజించి మోక్షం కోరి  దేశాటనచేసి చివరకు తాను పుట్టిన వూరు కావేరిపూపట్టినం ( పూమ్పుహార్) చేరుకొని  సముద్రాన్ని చూస్తూ ఒక గిన్ని తనపై కప్పించుకుని శివలింగంగా  మారాడు. పట్టినాథర్ గుడి లో ఉండేది ఈయనే. 

ముచుకుంద ఇంద్ర  మైత్రీ  చందం

ముచుకుంద చోళుడు సురరాజు ఇంద్రుడుకి మధ్య స్నేహబంధం ఉంది అని ఈ పాదం అర్థం      ముచుకుంద చోళుడు చాలా శక్తివంతుడు. అతడి సాయం ఇంద్రుడికి కూడా అవసరమైంది. అతడి సాయం పొందిన సురరాజు  అతడిని " ఏం కావాలో కోరుకో ఇస్తాను "అంటాడు.  అప్పుడు  ముచుకుందుడు ఇంద్రుడు వద్ద  నున్న సోమస్కంద (విష్ణుప్రతిమ)మును అడుగుతాడు. ఇంద్రుడు సందిగ్ధంలో పడతాడు. అటువంటి విగ్రాహాలు ఏడూ తయారు చేసి ఇందులో అసలది ఎదో కనుక్కోమంటాడు. ముచుకుంద చోళుడు అసలు విగ్రహాన్ని గుర్తించడం తో ఇంద్రుడు ఏడూ విగ్రాహాలని అతడికి ఇచ్చేసి తన శిల్పి విశ్వకర్మ తో పూపుహార్ నిర్మింపజేసాడు. వారి మైత్రికి నిదర్శనము పూమ్పుహార్.                                

పద్యం అర్ధవంతంగా ఉందా ?

5 comments:

  1. ఇంత విపులంగా వివరించాక పద్యం అర్థవంతంగా లేదని ఎలా చెప్పగలము!

    ReplyDelete
    Replies
    1. Sahitya...... Thanks remaining part of the story will be sent to your mail

      Delete
    2. Too good explanation sir.. mee telugu works chooste... maa lanti language lovers ki vocabulary perugutundi and basha loni beauty ardham authundi.

      Keep enlightening us sir..

      Delete
    3. You are a true language lover. your feedback gives me strength to writer better. thank you sir.

      Delete
  2. ఈ నాటి పరిస్థితుల్లో కంద పద్యములు యందు మీరు చూపిన మక్కువ నేటి తెలుగు ఉపద్యాయులందరికి ఒక ధైర్యము ఇస్తున్నది

    ReplyDelete