లకుమ చరవాణి మ్రోగినది "పచాకో గారేనా మాట్లాడునది" అయ్యో అతడు గోవాకు చెందిన వ్యక్తి తెలుగెట్లు వచ్చును యని స్ఫురించి " వియార్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ ." యని ఆంగ్లముననెను. " పచాకో ఎవరు ? ఎవరినైనా పట్టినావా? దర్శకుడా? కథా నాయకుడా? "యనుచూ నాయుడు గొంతు వినిపించెను " షటప్ " యని లకుమ అనగా అది పట్టించుకొనక " నీకెంత మంది నాయకులున్ననూ నా కథా నాయికవు నీవే. " యనుచున్న నాయుడిని లకుమ కత్తిరించి అతడి సంఖ్యను ఆగమన నిరోధ పట్టిక ( block list) కు చేర్చెను. "కామాతురానాం న భయం న లజ్జ, వీడు సిగ్గు శరము అను మాటలెప్పుడో మరిచినాడు ఇప్పుడు సమయ సందర్భములు కూడా మరచినాడు వీడివద్ద డబ్బు తీసుకొని ఒప్పంద పత్రముల (కాల్షీట్ల) పై సంతకము పెట్టి పెద్ద తప్పుచేసితిని.
ఆ డబ్బు తిరిగిచ్చివేసినచో అని అగస్త్య అనుచుండగా అది మనకే ప్రమాదమని లకుమ అనెను. అది ఎట్లు అని అగ స్త్యుడడుగుచుండగా లకుమ చరవాణి మ్రోగెను. "ముంబై టాటా మెమోరియాల్ హాస్పిటల్ ఈస్ బెస్ట్ ఆప్షన్ ద ట్రీట్మెంట్ ఈజ్ టోటల్లీ ఫ్రీ. మేడం కాల్డ్ ఎయిర్ అంబులెన్స్. వేర్ ఈజ్ ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ? "విజయవాడ" వెల్ ఇట్ ఐస్ ఫోర్ నౌ, బై ఫైవ్ ది ఎయిర్ అంబులెన్స్ షుడ్ రీచ్ విజయవాడ ఎయిర్పోర్ట్. కెన్ యు రీచ్ ది ఎయిర్పోర్ట్ బై ఫైవ్? "వియార్ జస్ట్ 30 మినిట్స్ అవె , థాంక్యూ వెరీమచ్ " థాంక్ మేడం నాట్ మీ. " చిరు దరహాసంతో ముగించాడు పచాకో. లకుమ సంతోషంగా అందరికీ విషయం తెలియబరచి " మా అమ్మ చాలా మంచిది " అనగా " ఇందాక దుష్టురాలన్నావు? " అని అగస్త్య హాస్యమాడెను " చెడ్డదే గానీ సహాయాగుణం ఉంది" ఆమెను చూసి భరణి నవ్వసాగెను. " మా ఇంటి యజమానికి కూతురికి చిన్న పిల్లవాడు ఉన్నాడు తినుటకు చేతపెట్టిన వాడెవ్వడైననూ మంచివాడే అనుచుండును."
భవనయజమాని అను మాట కర్ణ భేరిని తాకగానే లకుమ అంతరంగంలో అలజడి ప్రారంభమైంది. అది తులశమ్మగారికి లకుమ ముఖమునందు స్పష్టంగా కనబడెను. ఆమె ముఖములోకి చూసిన లకుమ ఆమె హావభావాలు గ్రహించి " వాడు (భవన యజమాని ) ఇంత వెధవ అని తెలీక వాడి ఇంట ఉంటిని. నాకొకసారి ఆ యజమాని విషయము తెలియవచ్చెను. అందరు డబ్బు ఎరవేసి ఆడవారిని లొంగదీసుకోనుత నీకు తెలియును. కానీ అతడు ఇల్లు ఎరవేసి స్త్రీలను లొంగ దీసుకొనును. యామిని సమంత వాడి పక్షము చేరినారు.
అనగా పెద్దామె "అతడు మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోపోడం నీతప్పు కాదమ్మా, లోకం తీరు తెలుసుకుని మసలుకోవాలి. " అన్నారు." అంటే లోకం అంటా ఎలావుందో మనకెలా తెలుస్తుంది " అన్నాడు అగస్త్య " జనసంచారం లేనిచోట నలుగురు నిలబడి రహదారిలో నిన్ను వాహనం ఆపమంటే ఏంచేస్తావ్ ? " ఆపను " అదే ఒక వంటరి అమ్మాయి అడిగితే ఆపుతావా ? ఆపను, ఎందుకంటే ఆ అమ్మాయిని ఎరగా వాడి మనని దోచుకుంటారు."
ఇదే లోక రీతి తెలుసుకోడం అంటే , అమెరికా , యూ. కే . మరియు యూరోపు మొత్తమీద హైదరాబాద్ లో ఈ అమ్మాయికి ఎం జరిగిందో అదే కొన్ని సంవత్సరావులుగా జరుగుతోంది. " ఇళ్ల యజమానులు , మహిళలకి, వంటరి మహిళలకి మాత్రమే ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఉచితంగా కూడా ఇస్తున్నారు కాకపొతే అద్దెకు బదులుగా ఇంకేదో ఆశిస్తున్నారు. ఆయాదేశాల్లో వార్తా పత్రికల్లో కూడా బహిరంగ ప్రకటనలు ఇస్తున్నారు. " ఇంత బాహాటంగా ఇవన్నీ జరుగుతున్నా నాకు ఏమాత్రమూ తెలియదే ?" " ఇప్పుడు అంతర్జాలంలో చూసినా తెలుస్తుంది ." అగస్త్య "రెంటల్ సెక్స్ " అని అంతర్జాలంలో వెదకగా అనేక వార్తలు కనిపించెను. లకుమ అవి చూసి దిగ్బ్రాంతి చెందెను.
అంబులెన్స్ వేగముగా బోవుచున్నది. "ఇట్లయినచో మనము ముందుగాబోయి విమానము కొరకు వేచి యుండవలసి వచ్చును , నిదానముగా పోనిమ్ము . అని లకుమ అనగా వాహనము వేగము తగ్గెను. మనము చెన్నపట్నం పోవుచున్నామా? అని లకుమ హాస్యమాడుచుండ కృష్ణమూర్తిగారు నిద్రలేచి కూర్చొనుటకు ప్రయత్నించిరి కానీ కూర్చొని లేకపోయిరి. “హాయిగా విశ్రాంతి తీసుకొనుచున్నారు తెలివి వచ్చినచో కబుర్లు వినుచు ఆనందించుచున్నారు. గుడ్ పేషంట్“ యని డాక్టర్ భరణి అనగా కృష్ణమూర్తిగారు విని నవ్వినారు.
అడయారు ఆసుపత్రి లో పడక దొరికిన ఎంతో బాగుండెడిది. మీ అమ్మగారికి శ్రమ తప్పెడిది. యని తులసమ్మ గారు అనుచుండ మీరు పొరపడుచున్నారు " మద్యపాన నిషేదము తాగుబోతుల ను ఆపగలదా ఒకటి కానిచో వేరొకటి త్రాగుచున్నారుకదా" అని లకుమ అనగా " భరణి తెగ నవ్వుచుండెను. అగస్త్యుడు " మీ అమ్మ కూడా ... (తాగునా)" అని అగస్త్య నసుగుచుండగా సుందరి " ఏమి తెలివయ్యా అగస్త్యా ! లకుమ ఉద్దేశ్యము తన తల్లికి సహాయము చేయుట వ్యసనము వలె మారినదని చెప్పుట. మాకు కాకున్న మరొకరికి ఆమె సాయము చేయుచుండును" అని చెప్పుచుండగా తులశమ్మగారు ఉత్తములెప్పుడూ కష్టాలతో, భోగాలతో అంటకాగక ఉన్నతాశయాలతో జీవించుచుందురు. ఉదాహరణగా మనము అరుణతారాగారివలె అడయారు కేసర్ ఆసుపత్రిని స్థాపించిన ముత్తు లక్ష్మిగారిని చెప్పుకొనవచ్చు.
ఆమె తల్లి దేవదాసి, ఆ దేవదాసిని పెండ్లియాడి వెలివేయబడినాడు ఆమె తండ్రి. అట్లు వెలివేయబడిన కుటుంబములో బుట్టిన అమ్మాయికి చదువు ఎంతకష్టము ? ఆమె అదృష్టము తండ్రి విద్యాధికుడు. ఆమెకు కొన్ని విషయములు (subjects ) నేర్చుకొనుటకు మాత్రము అనుమతి నొసగెను. కానీ ముత్తు లక్ష్మిగారు తండ్రిగారి అనుమతి పొందిన విషయములేగాక తక్కిన విషయములలో కూడా ప్రావీణ్యురాలయ్యెను. అన్నింటా ఉన్నత శ్రేణి లో ఉత్తీ ర్ణురాలైన ఆమె వైద్యశాస్త్రము లో బంగారు పథకం సాధించి మద్రాసు ప్రభుత్వాసుపత్రినందు మొదటి సర్జను అయ్యెను . పిదప సాంఘిక సంక్షేమ మండలికి తొలి మహిళా సలహాదారుగా ఎంపికయ్యెను. తదుపరి మద్రాసు శాసన మండలికి తొలి మహిళా సభ్యురాలిగా ఎంపికయ్యెను. ఇలా జీవితమునందు అనేక మొదటిస్థానములలో నిలచిన ఆమె ఉన్నతాశయముతో సొంత నిధులు సమకూర్చుకుని స్థాపించిన ఆసుపత్రి ని నెహ్రూగారు 1951 లో ప్రారంభించిరి. తమిళ నటుడు జెమిని గణేశన్ ముత్తు లక్ష్మిగారి సోదరుని బిడ్డ . యని చెప్పగా అందరూ తులసమ్మ గారిని అచ్చెరున గాంచిరి. మనము విజయవాడ నగరములోకి ప్రవేశించినాము. అని వాహన చాలకుడు తెలిపెను. తులశమ్మగారు వాహనమునుండి పైకి చూడగా గేట్వే హోటల్ కనిపించెను. ఆమెది దేవదాసీ కుటుంబమా? దేవదాసీ లలో ఇంత గొప్పవారున్నారా? యని లకుమ అనుచుండగా.
ముద్దుపళని 18వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి. ఈమె తంజావూరు నేలిన రాజు ప్రతాపసింహ యొక్క భోగపత్ని. ఈమె ప్రతాపసింహుని ఆస్థానములో నెల్లూరు శివరామకవితో పాటు ఆస్థాన కవయిత్రి కూడా. ముద్దుపళని రాసిన రాధికా సాంత్వనము ఒక గొప్ప శృంగార ప్రబంధ కావ్యము. ఈ గ్రంథములో నాలుగు భాగములలో 584 పద్యములు ఉన్నాయి. ప్రతి పద్యమునందు ఆమె ప్రతిభ కనబడును వీరేశలింగంగారు ముద్దుపళని పై తీవ్ర విమర్శలు గుప్పించిరి. ఈ కావ్యమును శృంగారము హెచ్చుగా యున్నదని తెల్లవారు నిషేదించిరి. చాలా సంవత్సరాలతరువాత ప్రకాశం పంతులుగారు ఈ కావ్యాన్ని విడుదల చేసినారు.
ప్రతిభకు ఎవ్వరు ఎన్ని అడ్డంకులు కల్పించినా అవి తాత్కాలికమే. ఆడివి ప్రతిభ అసమాన మైనదని నేటి ఆధునిక కవులు, సాహితీ వేత్తలు కూడా ఒప్పుకొనిరి. లకుమచిత్తము క్రమముగా రూపాంతరము చెందుచుండ అంబులెన్స్ విమానాశ్రయమును సమీపించుచుండెను అప్పుడే ఒక పెద్ద లోహ విహంగమొకటిఒక తాటి చెట్టు ఎత్తులోకి వచ్చి గాలిలో వ్రేళ్లాడుచున్నది. అదిగో అదే మన ఎయిర్ అంబులెన్స్. ప్రహరీ వద్ద అనేక మంది కుతూహలంతో వింత విమానమును చూచుటకు గుమ్మిగూడినారు. వాహన చాలకుడు అంబులెన్స్ ని నిలిపినాడు. “ఇది యొక్క పెను విహగమువలె నున్నది.” యని సుందరి అనెను. కీక్.. కీక్.. పచాకో నుండి లకుమకు సందేశము “యు హవ్ టర్మాక్ ఏక్సస్ గో డైరెక్ట్ టు ద ఎయిర్ అంబులెన్సు” అనగా నేరుగా విమానమువద్దకు మన వాహనము బోవచ్చును.
తరళము.
విహగ రాజగు దెంచెనో ఉరిమే హిమాని ఘటి ల్లె నో
మహిత విభ్రమ నాదమున్ గమనా నుకూల మహత్వ మున్
అహిత సంహతి నెల్లచెం డుమహా స్త్ర మేన గుదెంచె నో
విహగ వీరణ తేజమున్ కనిబె గ్గడిల్లి రిచూప రుల్.
విహగ రాజగుదెంచెనో = గరుక్మంతుడు వచ్చెనో; ఏ హిమాని ( మంచు కొండ చరియలు విరిగి పడడము) ఘటిల్లె నో = సంభవించెనో ; మహిత విభ్రమ నాదము = గొప్ప విభ్రమ కల్గించు శబ్దమును ; పొసగి = పోలి ; గమనా నుకూల మహత్వ మున్ = ఏరో డైనమిక్ టాలెంట్ ; అహిత సంహతి = శత్రు సమూహము; నెల్ల = అందరినీ ; చెండు=సంహరించు ; మహా స్త్ర మేనని = గొప్ప అస్త్రమే నని ; ఎంచి = తలచి; యా విహగ = ఆ విమాన ; వీరణ తేజమున్ = చలన పరాక్రమమును; కని = చూచి ; బెగ్గడిల్లిరి = జడుసుకొనిరి చూపరుల్ = చూచువారు.
కొద్దీ నిమిషాలలో విమానం అందరూ చూస్తుండగానే గాల్లోకి లేచింది.కొద్దీ గంటల్లో ముంబైలో వాలింది. ముంబైలో దిగడం కృష్ణమూర్తిగారిలో చలనమంతరించడం ఒకేసారి జరిగాయి. మృత్యోర్మా అమృతంగమయా !!!
పాత్రల మధ్య సహాయ సహకారాలు, ఒకరి సాంగత్యంతో మరొకరు ప్రభావితం అవ్వటం అనుబంధాలకు అద్దం పడుతుంది.
ReplyDeleteతులసమ్మగారు చెప్పిన రెండు కథలు( డా. ముత్తు లక్ష్మి, కవయిత్రి ముద్దుపళని ) ఎలా వున్నవి ? నచ్చలేదా? వీరిద్దరి మధ్య ఉన్న సంబంధము గమనిచించారా? అరుణతార కూడా వారివంటి స్త్రీ అని అనిపించలేదా? కృష్ణమూర్తిగారు మరణము మీకు ఏమీ అనిపించలేదా? కథ నచ్చలేదా? కథాగమనం మీకు ఆసక్తిగా లేదని అర్థం చేసుకున్నాను. నచ్చలేదు అని వ్రాయండి. విమర్శ కూడా ఆనందమే.
ReplyDeleteఇంత ప్రయాస పడ్డ కూడా కృష్ణ మూర్తి గారు దక్కక పోవడం బాధాకరం. కృష్ణమూర్తి గారి మరణం కూడా విదిష తల్లి మరణం వలె విది రాతే అనుకోవాలి. తులసమ్మ గారు అనుభవశాలి.ఆమె సాంగత్యం లకుమలో మార్పు తెచ్చును. అందుకే అన్నాను ఒకరి సాంగత్యం ప్రభావంతో మరొకరి లోమార్పు అని.కథాగమనం చాలా ఆసక్తిగా ఉంది. మీ రచనల్లో భాషా, కథా పోటీ పడతాయి.ఈ భాగంలో భాషను కథ డామినేట్ చేసింది.
ReplyDeleteWow , This is a big kick for any small writer like me. Thank you very very much
ReplyDeleteమిమ్మల్ని మీరు చిన్న రచయిత అని చెప్పుకోవటం మీ నిరాడంబరతకు నిదర్శనం
ReplyDelete