చిన్న పదముల చిక్కము ద్విపదయే
చెన్నారి పాద చేలమే చూచినన్.
కన్నెకో రికలన్నీ కానల కంపి
కాగిన కన్నెకు కడకు శుభమాయె
వేచి చూచిన శుభఘడియల గుదెంచెను. పెండ్లి పంజరమున యాంత్రిక జీవితమును గడిపిన అంగ యాఱుకన్నె శృంఖలములు తెగినవి కానీ అత్తగారు ఎందులకో మౌనంగానే ఉన్నారు. రోమికూడా తొందర చూపకుండుటతో కొంతకాలమాగవలనని అంగయారు నిశ్చయించుకొనెను.
కానీ జీవిత మాధుర్యమును గయారు చవిగొనుచున్నది.
ఉ. వంటిరి జీవిత మైనను వన్నెలుదట్టము అంగయా రుకున్
వింటిని ఆదివా రమున వెచ్చని గానము సంధ్యవే ళలన్
తుంటరి తుమ్మెద ల్లెతన తోడును తిప్పును తోటలం దునన్
జంటగ గానమే నెరిపి జాటును మెండుగ మిత్రశీ లతన్
కన్నెకథయంత కళ్ళార చూచిన
వన్నెకాడు నీడల్లె వెనుకనే తిరినాడు
మెరుపల్లె నిత్యమూ మెఱసి వెలసె
నేరుగా వెరచి నేత్రము లర్ధించె
గేహవ ర్ణమున దేహము మెరియుచు
వలచినా డతడు వలపే తెలిపినాడు
ఎర్రని గుఱ్ఱము వలే దేహ కాంతి కలిగి మెరియుచూ వలచి వలపింపజేసిన ఆ సింగళీయుని వలపుల సింజిని ఆనతికాలమునే అంకెకత్తెగా అవతరించి ఆతడి మానస సరోవరమందు రాజీవ (ఎర్ర కలువ)మై నిలిచిపో యెను.
పసిడి కిన్నెరకు పలుకు తోడు
పసకాఁడు కన్నెకు పొసఁగు ఱేడు
బంగారు వీణకైననూ పలుకు తోడు కావలెను. అట్లే బంగారు కన్నెకు పసకాడి తోడు కావలెను.
మాట పొత్తుకొన తనువులే ఒత్తుకొన
మాటు తొలగెను మనసులే కలిసెను
మాటలు కలిసిన పొత్తు కుదరకుండునా , చూపులు తూపులతో మొదలైన ప్రేమ నవ్వుల తేరులపై పువ్వులు కురియగా సాగకుండునా ? పొత్తు కుదిరిన తనువులు కలవకుండునా ?
చిత్ర శాలల చెలతిరిగి చెలరుచు
చిత్ర ములెన్నో చూడప్రే మపొరలె.
గృహము పాఠశాల తప్ప అన్యమెరుగని బేల లజ్జావతి బాహ్యప్రపంచము నడుగిడి జీవిత మాధుర్యమును గ్రహించవలెనన్న షిరోమి కల మొదట కన్నెకు భీతి గొల్పుచుండిననూ, కొద్దికాలంలోనే ఆకల నెరవేరెను. ప్రేమ వ్రతము మహారణము కదా !
మరుసటి వారము లంక కొనిపోవుటకు ఏర్పాట్లు జేసెను.
రవివారము నర్త రమణి రువారము
రవణించు నర్తనమే రాత్రి విలాసము
సఖునితో చేయగా శృంగార యాత్ర
సఖ్యత పెరిగి సరసల్లా పముహెచ్చె.
పీయూష ముగ్రోలి పాలవె న్నెలలో
తేలి శోభన తీరము లుజూసిరి.
వలకాని గుండె వలపుల దిండుగా
కలులు కనుచూ కన్నెతి రగసాగె
దేశాంత రమువాడు దెగువ కలవాడు
గొనిపోయి దేశము గారము జేసి నాడు
This comment has been removed by the author.
ReplyDeleteఅందమైన మలుపు తిరిగిన అంగాయర్ కన్నె కథ.ఎంత అద్భుతమైన భాష! ఇప్పటి వరకు జరిగిన కథ ఒక ఎత్తు. ఈ ఒక్క భాగం ఒక ఎత్తు.పదములు పాఠకులను మరో ప్రపంచంలో విహరించేలా చేస్తున్నాయి.
ReplyDeleteఎవరి జీవితం మీద వారికి హక్కు ఉండాలి కదండీ. కొత్తమలుపులు కొత్త సాహిత్యం తో పరిచయ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. మీ ప్రోత్సాహం చాలా గొప్పది. అనేక పద్యాలు సమాంతరంగా ఈ ప్రోత్సాహం మీద రాస్తున్నాను. మీకు సదా కృతజ్ఞలు.
Delete