Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, September 19, 2020

Bharatavarsha -38

మరుదినమున సబ్బవరమున అపరాహ్నవేళ క్రతువు ప్రారంభమయ్యెను. 

అదే సమయమున భాగ్యనగరము నుండి చెన్నపట్నము బయలుదేరిన అంబులెన్సు విశిష్ట తుతారి ధ్వనిజేయుచూ ఘంటాపథమున (హైవే) అతిరయమున సాగుచుండెను. అంబులెన్సు ధ్వని వినినంతనే గుర్తుపట్టి మార్గమద్యముగా బోవుచున్న వాహనములు దావలి శ్రేణిగా నేర్పడి మందగమనమున బోవుచున్నవి. ఆ దృశ్యమును గాంచి "అష్టదిక్పాలకులు అధిపతివలె అనుభూతిని పొందుచున్నాను అని అగస్త్య యనెను"


లకుమ చరవాణి మ్రోగుచునే యున్నది, మొదట అరుణతార, తరువాత మంజూష, ఆపై ప్రస్తుతము రూపుదిద్దుకుంటున్న చిత్ర దర్శకుడు ఆపై కాబోవు దర్శకుడు నాయుడు. 

అరుణతార: ఎక్కుచుటయున్నావు క్షేమమే కదా? రెండు దినముల నుండి నీ చరవాణి ఎల మోగబోయినది?

లకుమ: బ్యాటరీ పాడగుటచే…

అరుణతార: నీవు జెప్పకున్ననూ నాకన్నీ తెలియుచుండును, నా అనుంగులచట యుండి  నిన్ను గమనించి నాకు  ఎప్పటికప్పుడు తెలియబరుచుచున్నారు. సాగర్ కేసర్ ఆసుపత్రి లో నున్నవాడు  ప్రస్తుతము బాగానే యున్నాడు. పార్లమెంట్ సమావేశములు జరుగుచుండుటవల్ల నేను ఢిల్లీలో బసచేసి యున్నాను, నేటితో సమావేశములు ముగియును. రేపు ముంబై వచ్చుచున్నాను.  నీవు రేపు ముంబై వచ్చినచో నేరుగా మాట్లాడెదను. దూర సంభాషణలు పరిమితి దాటినచో  ప్రమాదకరములు.  ఏమైనా వలసినచో నా సెక్రటరీ నడుగుము.  

పచాకో : గుడాఆఫ్టర్నూన్ మేడం ! ఐ యామ్ పచాకో  పి ఎ టు మిసెస్ అరుణతార. ప్లీస్ కాల్ మీ ఈఫ్ యు నీడ్ ఎనీ థింగ్. ఇట్ ఐస్ ఆ ప్లెజర్ టు సెర్వ్  యు.

లకు:నా చుట్టూ మనుషులనుంచి గూఢచర్యము చేయుచున్నది ఆమ్మో అది తల్లా! పెద్ద శాడిస్టు.

తులశమ్మగారు : శాడిస్టు అనగానేమి ?

అగ: ఇతరులను బాధించి వినోదించువారిని శాడిస్టులందురు.

తుల:నీబాగు కోరి ఆమె పడు వేదనకు నీవిచ్చిన బిరుదమిదియా?

లకు: నా జీవితమునకు దర్శకత్వము వహించుచూ నాకిష్టములేని పనిని నాపైరుద్దుట నేమనవలెను?

సుందరి:  అపరిక్షితకరకం అపరిక్షితకరకం అనెను.

(విష్ణుశర్మ అనే సంస్కృత పండితుడు పంచతంత్రంమను అడవి జంతువులతో, కూడిన నీతి కధలను వ్రాయగా పరవస్తు చిన్నయ సూరి అనే పండితుడు వాటిని తెలుగులోకనువదించెను. పంచ తంత్రములు అనగా ఐదు తంత్రములు.  మిత్ర లాభము, మిత్ర భేదము, అపరిక్షితకరకం, లబ్ద ప్రణాసం,  కాకోలు కీయం. అపరిక్షితకరకం నందు పరాధికారము పైవేసుకొనరాదను కథ చెప్పబడెను.  కుక్క చేయవలసిన పనిని, తనది కాని పనిని చేసి ప్రాణములమీదికి తెచ్చుకొని గాడిద మరణించెను.   అనవసరమైన విషయములందు జోక్యం కల్పించుకొనవలదని తల్లిని పరోక్షంగా హెచ్చరించుటయే “అపరిక్షితకరకం” అను మాటకర్థము విషయము అర్ధమైన తల్లి మౌనము వహించెను)

భరణి : కృష్ణమూర్తిగారు నిద్రించుచున్నారు , మౌనముగానుండవలెను. 

కృష్ణ: కొద్దీ వారములుగా మీ ఆసుపత్రినందు వంటిరి మౌన జీవితమును గడిపితిని  నేడు చాలా కాలముతరువాత మీరు మీ రంతా ఇట్లు మాట్లాడుకొనుట మిక్కిలి ఆనందముగా యున్నది. చెన్న పట్నము చేరినది నేనా  నా దేహమా యనునది సందేహమే.   నేను నిద్రించుట లేదు కళ్ళు మూసుకుని ఆలకించుచూ ఆనందించుచున్నాను . చివరిక్షణములలో ఎవరికైనను దక్కవలసినదిదే.

అంబులెన్స్ వైద్యుడు భరణి మీకేమీ ఢోకాలేదండీ మీరు నిశ్చింతగా నుండవచ్చు యని కృష్ణమూర్తి గారితో  చెప్పి అగస్త్యుని చూచి అడయారు ఆసుపత్రి నందు మీకు తెలిసినవారు కలరని చెప్పినారు కదా ఒకసారి వారితో మాట్లాడి పడక ఖాళీ యున్నాడో లేదో విచారించినారా ? యని అడుగగా అగస్త్యుడు తన మిత్రుని సంప్రదించెను.  రోగుల రద్దీ ఎక్కువగా నుండుటచే పడక లేవియూ ఖాళీ గా లేవని క్షమించవలెనని కానీ  మంచి ప్రయివేటు ఆసుపత్రులున్నవని భరోసాఇచ్చెను. అగస్త్యునకు నక్షత్రావాలోకనమయ్యెను.

భరణి ఒకసారి కృష్ణమూర్తిగారిని  తాకి నాడిని పరీక్షించగా వొళ్ళు వేడిగా నుండుటచే చెవియందుచేది జ్వరమానిని తో  ఉష్ణోగ్రత పరిశీలించి 101 ఉన్నాడని చెప్పినారు 

ఇదేమైనా ప్రమాదమునకు దారితీయునా యని తులసమ్మ గారు ఆందోళన చెందిరి. 

మరేమీ ప్రమాదంలేదని చెప్పి సూదిమందిచ్చి  దీనిని న్యూట్రో పెనిక్ ఫీవర్ అందురని   జ్వరము తగ్గిపోవునని వారము పైగా తగ్గకున్న  ప్రాణాంతకమగునని  ఆసుపత్రిలో చేర్చుట అవసరమని చెప్పుచుండగా కృష్ణమూర్తిగారు ఊపిరి పీల్చుకొనుటకు ఇబ్బందిపడుచుండుట గమనించి నర్స్ కి సైగ చేయగానే సన్నని  గొట్టమును పాత్రను  సిద్ధముచేసెను.  అంబులెన్స్ వైద్యులు  ఉండనిచో .. మనమేమయ్యెడి  వారమని తులశమ్మగారు వణుకుచుండగా సుందరి " ఉన్నప్పుడు  , లేనిచో ఏమగునని భయపెట్టుటెందులక ని  తల్లిని కసిరేను. వైద్యుడు సన్నని గొట్టమును ఎడమభుజము నుండి  వాలుగా క్రిందకి ఛాతి క్రిందకు  పోనిచ్చి అట్లు రెండుసార్లు చేసి అది సరైన స్థానమని నిర్ణయించుకొని అక్కడ ఆ గొట్టమును లోనికి గ్రుచ్చి ద్రవమును బైటకు లాగెను. దీనిని పెరి కార్డియల్ ఎఫ్యూజన్ అందురు. దీనిని ఇట్లు తీసివేయుటకు డ్రెయినింగ్ అందురు.  

"ఈయనకు హైపర్ విస్కాసిటీ కూడా ఉండవచ్చును"అని చెప్పగాతులశమ్మ గారు మూర్ఛ

 గిల్లిరి  సుందరి ముఖము పాలిపోయెను.  "హైపర్ విస్కాసిటీ ఎంత   ప్రమాదకరముదీని వలన ప్రాణన

ష్టము కలదా? "యని అడిగెను.  భరణి నీళ్లు నములుచుండెను. అగస్త్య  " మేము దేనికైనను సిద్ధమే ,

మాకు నిజము తెలిపి  మంచి సలహా ఇచ్చిన మీ మేలు మరువమ"నెను. " హైపర్ విస్కాసిటి మే లీడ్ టు పరాలిసిస్, స్ట్రోక్ ఓర్ కోమా."యని ఆంగ్లమున గొణిగెను. మనమెక్కడున్నాము యని అగస్త్య అడిగెను "ఇంకొక అరగంటలో మనము విజయవాడ చేరబోవుచున్నాము "అని వాహన చోదకుడు చెప్పెను. తక్షణము లకుమ చరవాణి అందుకొని " ఈజ్ ఇట్ మిస్టర్ పచాకో ?" ని విషయమును చెప్పగా " గివ్ మీ ఫైవ్ మినిట్స్ విల్ డూ వాట్ బెస్ట్ కెన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ సూపర్ స్పెషలిస్ట్."

                                                            ***

క్రతువు ముగిసిన పిదప ఇద్దరు భోక్తలు భుజించిరి. పిదప శేషాచలముగారు వారికి నూతన వస్త్రములొసగి దక్షిణతాంబూలాదులతో సత్కరించి ఆయన విదిష కూడా భుజించిరి. భోక్తలకొరకు రావలసిన వాహనము ఇంకనూ దారిలో ఉండుటచే వారు ఇంటిబయటకు బోయి చెట్టు క్రింద నిలిచి మాట్లాడుకొనుచుండిరి.  బ్రహ్మగారు భోక్తలు మరుసటి దినమెచ్చటికి బోవలెనో మాట్లాడుకొనుచుండిరి. విదిష వారికి కుర్చీలు వేసి అక్కడే నిలుచొనెను.

శేషాచలముగారు వారి మధ్యలో బోయి గోదానము జేసినా మంచిదందురా? యని బ్రహ్మగారిని అడిగెను. 

గోమాత జీవుని వైతరణీ నదిని దాటించును. చేసిన చాలా మంచిది. అనెను

“వైతరిణీనది ఎచటకలదు?” అని దారినబోయెడి  దానయ్య డుగగా బ్రహ్మగారు ఇట్లు జెప్పిరి. 

వైతరణీ నది యమపురి దక్షిణ ద్వారమునకు 86 వేల ఆమడల(12,55,000కి.మీదూరంలో ఉంది. మరణానంతరం జీవుడు మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు (మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల

(3600 కిలోమీటర్లుచొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ,

క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే 

పదహారు పురములను దాటుకుని యమపురికి చేరుతాడు. పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి 

లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి నది దాటిస్తారు. గోదానం చేసినవారు

పడవలో వైతరణి దాటగలరు.

అంతవరకూ మౌనముగాయున్ననూ సందేహము తీర్చుకొను అవకాశము వచ్చెనని తెలుసుకొన్నవిదిష  మొఖమువెలిగెను. “నాదొక సందేహము,మరణించినవానికి దేహమే యుండదు కదా మరి యమభటులు ఎవరిని వైతరణి దాటింతురు?

భౌతిక , కారణ , సూక్ష్మ దేహములని మూడు శరీరములుండును . సూక్ష్మ దేహము  బౌతిక దేహమునకు నమూనా ( ఫోటోకు నెగిటివ్ లాగ) ఇది వాయుతత్వ శరీరం దీనినే "కాస్మిక్ బాడి" అనికూడా అందురు.  దీని భౌతిక రూపమే శరీరము, ఇవి రెండు ఒకదానిలో ఒకటి కలసే ఉండును. మరణించిన వెంటనే,  బొటనవేలు-పరిమాణం లోయున్న  లింగ శరీరమును వెంటనే  ఇద్దరు యమభటులు  స్వాధీనం చేసుకుని తమ యజమాని వద్దకు తీసుకు వెళ్ళెదరు. 

“మీకెలాతెలుసు సామీ?”  దానయ్య ఒక తుంటరి ప్రశ్న వేసెను. 

విష్ణువు గరుడికి జెప్పినట్లు గరుడపురాణమున చెప్పబడెను.

అయితే పునర్జనములుంటా యంటారా? అని శేషాచలముగారు అడిగిరి

“జాతస్యహిద్రువో మృత్యువు, దృవంజన్మ మృతస్యచ” అని భగవానుడు చెప్పినాడు కదా దాని అర్ధము పునర్జన్మ లున్నవనేకదా! ఇటువంటి సందేహాలున్నచో గరుడపురాణమును చదవవలెను. గరుడపురాణం మరణం మరియు మరణం తరువాత జీవితం, ఆత్మ యొక్క ప్రయాణం, పునర్జన్మల గురించి వివరిస్తుంది. 

అంటే మాకు కూడా ఉంటాయా ? దానయ్య అడిగెను. బ్రహ్మకి అర్ధం కాక అయోమయంగా చూచు చుండెను "అంటే మేము కిష్టియంస్వండీ! " అన్నాడు దానయ్య

మీకు కూడా స్వర్గనరకములు పునర్జన్మలు యున్నవి, పౌలు అగస్టీను పునర్జన్మను పొందినారుగదా, మీ పాస్టరుగారు చెప్పలేదా? శరీరం మరణించిన తరువాత, ఆత్మ తీర్పు తీర్చబడుతుంది, నీతిమంతులు మరియు పాపం లేనివారు స్వర్గంలోకి ప్రవేశిస్తారని, పశ్చాత్తాపపడని పాపంతో మరణించే వారు నరకానికి వెళతారు కాథలిక్ చర్చి బోధిస్తుంది.  

భోక్తలను కొనిపోవుటకు వాహనము వచ్చుచున్నది. విదిష మనసుని దొలిచివేయుచున్న ఆఖరి సందేహమును తీర్చవలసిందిగా కోరి “ఆత్మలు మనకి కనిపిస్తాయా ఆత్మలు చనిపోయిన ప్రదేశములలో సంచరిస్తాయా ? 

అన్ని మతాల్లోనూ ఈ ఆత్మలగురించి చెప్పబడింది. ప్రపంచవ్యాప్తంగా యున్న కర్మకాండలు వారి నమ్మకాలకు అడ్డం పడతాయి. ప్రియమైనవారితో భావోద్వేగ అనుబంధం దాని మునుపటి శరీరంతో ఉందని అర్థం చేసుకోవడానికి దానిని తెంపుకోడానికి సూక్ష్మ శరీరంకి సమయం పడుతుంది. అప్పటిదాకా ఆత్మ తాను నివసించిన మరణించిన ప్రదేశాలను మనుషులను వీడలేక తిరుగుతుంది.  12 రాత్రులు మరియు 13 రోజుల వ్యవధిలో ఈ విడదీయడం ప్రక్రియ పూర్త వుతుంది. ఇదే 13 రోజుల సంతాపం వెనకున్న కథ. ఇదే ఈస్ట్రన్ ఆర్థోడాక్ చర్చ్ నమ్మకం.  ప్రపంచవ్యాప్తంగా ఈ నమ్మకం ఇస్లాం, సిక్కు ధర్మాల్లో కూడా కనిపిస్తుంది. ఈ ధర్మాల్లో 13 రోజులు ప్రార్ధనలు చేయుదురు. ఆత్మకు ఓదార్పు నివ్వటమే ప్రార్థనల ఉద్దేశ్యం

అయినప్పటికీ ఆత్మ 40 రోజులు తాను నివసించిన ప్రదేశాల్లో వదిలివెళ్లలేక సంచరిస్తూ ఉంటుంది . ఆత్మలు తమ ఇళ్ళని గుర్తించడానికి వీలుగా రష్యాలో చనిపోయిన వారి ఇంటికి చెట్ల కొమ్మలు పెడతారు.మృతుడికి, రొట్టె ,నీళ్లు పెట్టడం,  పక్క వేయడం కూడా చేస్తాను. 40వ రోజు మృతుడి వస్తువులని అన్నీ దానం చేసి అతడి గురుతులన్నీ చెరిపేసి విందు చేసుకుంటారు.  దీనర్ధం ఏంటంటే ఇంక ఈ ఇంటికి రావద్దు. నిన్ను స్వాగతించలేము. నీకోసం ఇంకా ఏడవలేము. అని చెప్పడం. కొత్త జన్మలోకి వెళ్ళిపో అని చెప్పడం. 

అయితే ఖచ్చితంగా వచ్చే జన్మ ఉంటుందా? ఆత్మకి గత జన్మ గుర్తుంటుందా? 

గత జన్మే కాదు వందలాది జన్మలు గుర్తుంటాయి. తల్లి గర్భంలో ఏడవ  నెల దాకా శిశివు ఈ జ్ఞానాన్ని కలిగిఉంటుంది. తరువాత శిశువు మెల్లగా తలక్రిందులయి స్మృతి (memory) పూర్తిగా నాశనమమయ్యాక  బయటపడుతుంది.   (గరుడపురాణము:  6:46-49). 

వాహనము వచ్చి బ్రాహ్మణులనెక్కించుకొనిపోయెను. విదిష కుర్చీలు తీసుకొని ఇంటి ఆవరణలోకి పోవుచుండ శిధిల గృహములో తల్లి కానవచ్చెను. 

3 comments:

  1. కాసేపు వైరాగ్యంలోకి తీసుకెళ్లారు మరణానంతర ఆత్మ పయనం గురించి బాగా వివరించారు.

    ReplyDelete
  2. I am happy that you basked in the concept of soul journey. I think you have also noticed the interweaving of the scenes. ( two scenes running parallel to each other) discussion in the ambulance and discussion at Vidisha's house. It is a combination of spiritual and medical sciences. Did you enjoy the story and the twists? There are more twists in store. cheers!!!

    ReplyDelete

  3. ఒకేసారి రెండు సీన్లను పండించడం వెనుక మీ బహుముఖ ప్రజ్ఞ, కృషి ప్రస్ఫుటం అవుతుంది.

    ReplyDelete