Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, September 14, 2020

Bharatavarsha - 35

 రాత్రి కురిసిన వర్షము రహదారియందు నిలిచి యుండి వాహన చక్రముల క్రింద త్రొక్కిసపడి పాదచారులకక్కసము కలిగించుచున్నదిస్కోడా మందగమనమున సాగర్ కేన్సర్ ఆసుపత్రికి పోవుచున్నది. అగస్త్యుడు వాహనమును నడుపుచూ అద్దమందు చూడగా వెనుక కూర్చొని యున్న తులశమ్మగారి మొఖమున  వ్యాకులత తొంగి చూచుట అగుపించెనుసుందరి ముఖమున అభావత అగుపించు చుండెను.   


అగ: దినేషుడు మబ్బుల చాటున ముసుగు తన్ని పడుకొండెను. ఎప్పటికి లేచునో ?

సుం: నేడు లేచుట దుర్లభము. వాయుగుండమున్నది దని రేడియోలో చెప్పినారు.

తుల: అట్లయినచో మన ప్రయాణము సజావుగా సాగునా?

అగ: మీరు భారము నాపై పడవేసిన నేను చూసుకొందును.

తుల: అయ్యో వందల మైళ్ల నుండి వచ్చిన పని మరిచి మాకై శ్రమించుచున్నావు?

అగ: నేను మరువలేదు అవసరార్ధము దానిని పక్కన బెట్టితిని.

సుందరి ఎదో చెప్పనంతలో వాహనము ఆసుపత్రి కి జేరెను. అతడు పరుగులాంటి నడకతో లోపలి పోయి రోగిని తరలించుటకు వైద్యుని అనుమతి కోరగా ఒక గంటలో పెద్ద డాక్టరుగారు వచ్చు వరకు వేచి యుండుమని ఆ వైద్యుడు చెప్పెను. వార్డుకి బోయి వచ్చిన సుందరి తల్లితో గూడి వేచియుండుగది లో నుండగా అగస్త్యుడు వారికి విషయమును తెలిపి ఠాణాకి పోయివత్తునని నిలిపి ఉంచిన వాహనము పైకి లంఘించి సుడిగాలి వలె వాహనమును పరిగెత్తించ సుందరి విస్తు పోయి చూచుచుండెను.

అగస్త్య తిరిగి వచ్చి పెద్ద డాక్టర్ గారి ని కలవగా సుందరి ఆర్ధిక పరిస్థితి అంతయూ నెరిగి యుండుటచే ఎక్కువ ప్రశ్నలు అడుగక ఒక వైద్యుని, నర్స్ ని  అంబులెన్స్ లో రోగితో పాటు యుండవలసిందిగా ఆదేశించెను. వారు కృష్ణమూర్తిగారిని వార్డు నుండి వాహనము లోనికి తరలించుటకు ఏర్పాట్లు చేయుచుండగా అగస్త్యడు వేచి చూచుచుండెను. సుందరి అగస్త్యుని కు దగ్గరా పోయి, ఆ ప్రక్కనుంచి పోవు వ్యక్తిని చూపుచూ అతడే పురుషోత్తముడు, అతడినందరూ షో యని పిలుతురు యని చెవిలో గుసగుస లాడెను. “నిన్న రాత్రి నేను యామిని, సమంతల జాడ కనుగొని వారిని నిజము దెలుపకున్నఠాణాకు పోయెదనని  హెచ్చరించగా వారు మరల నిర్లఖ్యము జూపిరి.  తుదకు నేను పోలీసుల వద్దకు బోయి పిర్యాదు చేయగా పోలీసు అధికారి వారిని ఠాణాకు పిలిచి విచారించెను.  ఠాణానందు నాకొక నిజము తెలిసెను లకుమ ఇంటి యజమాని షో సోదరుడని  తెలియ వచ్చెను. మా అందరిని ఖైదు చేసి విచారించుచుండ ఇతడే (షో) వచ్చి వారిని జామీనిచ్చి విడిపించుకు పోయినాడు. “అనగా నీవు రాత్రి ...” యని సుందరి సందేహించుచుండగా "కృష్ణ జన్మస్థానమందు గడిపితిని ముందు వాడిని అనుసరించవలెను” యని అగస్త్యుడు షోని అనుసరించు చుండగా సుందరి అతడిని అనుసరించెను.

గదిలో మంచముపై రోగి మెల్లగా మూల్గుచూ కదులు చుండెను. ప్రక్కన షో కాక మరొక సహాయకుడు  కూడా ఉండెను.  అతడు షో వైపు జూచి " రాత్రి నొప్పి జెచ్చుగా నుండి ఆర్తనాదములు జేయుచుండుటచే మత్తు మందిచ్చినారు. ఆయువు పట్టుపై దెబ్బ గట్టిగా తగిలినది బ్రతికున్న మా పూచీ లేదని   వైద్యులు మరొక  24 గంటలు గడిచినగాని ఏమియునూ చెప్పజాలమనుచున్నారు."

షో :  వాడికి తెలివి వచ్చిన కాగితములపై సంతకములు తీసుకొనమని జెప్పితినికదా  తీసుకొంటివా?"    

సహాయకుడు :  తెలివెచ్చట వచ్చెను , రాత్రాంతయూ  స్పృహలేకట్లే పడియుండెను ఇదిగో మీరిచ్చిన కాగితములట్లేదు యున్నవి. 

 షో : పెండ్లాయు వదిలి వేసెను కావున ఆమెకు చెప్పి ప్రయోజనము లేదు , పిల్లలు అమెరికా బోయినారు వారికి  విషయము తెలిపి రమ్మనగా  ఛీ కొట్టినారు. ఇక తోడబుట్టిన వాడను కనుక నాకు తప్పదు, ఆయూ నాకిప్పుడేదిదారి. వీడు పోయిన పోలీసు వ్యవహారమగునని రహస్యముగా వైద్యము జేయించుచూ, ఆ పిల్లను కూడా బంధించి యుంచినాను, తరువాత తెలిసి వచ్చెను ఆ ముండ ఒక ఎం పీ కూతురని.    ఎంత ప్రమాదమునుస్వీకరించి తిని.  ఇంత  జేసి  వీడిపేర యున్న ఆస్తులూరకపోని చ్చిన  ఈనగాచి నక్కలపాలు జేసినట్టే కదా.

సహాయకుడు: నిండా ములిగినవానికి చలిఎట్లుండును?ఆ పిల్ల నోరూరించే రసగుల్లా. కానీ అది ఆడపులి వలె యున్నది.

షో :ఓరీ ద్రోహి! నీవు రాత్రచ్చటికి పోయినావని నీ వాలకం చూచిన తెలియుచున్నది. వాడిని వదలి అచ్చటికి ఎట్లు పోయినావు ? రాత్రంతా దానితో కూలికినావా ? నా నెత్తిన శఠగోపము బెట్టినావుకదారా! అకటా !!!

సహా : దాని పొడవు  నాపై గుప్పెడు డైననూ  హెచ్చుగా యుండును  , దేహదారుడ్యము తో పాటు ధైర్యము హెచ్చు గా యున్న ఆపిల్ల నా బెదిరింపులకు లొంగలేదు, రెండు చేతులూ కట్టివేసిననూ బుర్రతో గుద్ది నన్ను పడవేసెను. ప్రతీకారము తీర్చుకొనుటకు చేతి కట్లు విప్పగా ...

షో : హతవిధీ! దాని చేతి కట్లేల  విప్పితివి?

సహా : మీరు నాకంటే ముందు బోయి ఆమె కాలి కట్లేల విప్పినారు?

షో :   నా పరిస్థితి తేలు కుట్టిన దొంగ వలే యున్నది, నా ఖర్మ...  

సహా : ఖర్మ కాదు అదృష్టమనవలెను నేను తన్నులు తిన్ననూ ఒడుపుగా తలుపు తాళము బెట్టి వచ్చినాను.

రోగి ఎదో మాట్లాడు చున్నాడు చూడండి

రోగి : (షో ని చూచి)  మంచి నీరు .. మంచి నీరు

షో:  ( సహాయకుని జూచి ) కాగితములు  కాగితములు 

రోగి : ......

షో:  వైద్యునికి కబురు చేయవలెను . అయ్యో నా అన్న అయ్యో నా అన్న

యనుచు బయటకు పరిత్తుచూ ఈ దృశ్యమునంతయూ చరవాణి తో చిత్రీకరించుచున్న

అగస్త్యను గుద్దుకొనగా ఇద్దరూ క్రింద పడిరి. షో విషయము గ్రహించి ఆగ్రహోదగ్రుడయ్యెను

షో "ఓరీ  రాస్కల్ , గుంటనక్కవలె పొంచి యుండి మా సంభాషణ అంతయూ వినుటయే గాక  చిత్రీకరించుచున్నావా?" యని అగస్త్య పై పడగా సుందరి క్రిందన పడిన  చరవాణిని  చట్టుక్కున చిక్కించుకొని పారిపోయి పోలీసులకు ఉప్పందించగా వారు  శ్లాఘనీయ వేగముతో రంగప్రవేశము చేసి పురు షో  త్తముని పట్టుకొనిరి. అప్పటికింకనూ అతడు అగస్త్య తో పెనుగులాడుచుండెను. 

షో : నన్ను విడువుము నేను సంఘములో పెద్దమనిషిని, సినీప్రముఖుడిని అని మరచి  నన్ను గొనిపోవు చున్నావు.

వైద్యుడు : రోగికి కృత్రిమ శ్వాస అమర్చినాము .. 24 గంటలు గడిచిన గానీ ఏమి యునూ చెప్పజాలము.

పోలీసు అధికారి :  నీవు పైకి కనిపించునట్లు  పెద్దమనిషివి కావని   నేరస్తుడ వని అందుకు వీడియో సాక్ష్యమున్నదని   నీవే  మరచి మాట్లాడుచున్నావు 

షో :  24 గంటలలో బయటకు వచ్చి నీ పని పట్టెదను

పోలీసు అధికారి : అగస్త్యని వీడియో నా కిచ్చివేయుము

 అగస్త్య : మరి నాకో ?

 పోలీసు అధికారి : అదియేమైననూ భక్ష్యమా ? ఇవ్వనిచో నిన్నునూ వెనెక్కించెదను.

అగస్త్య :  సాక్షిని నిర్బంధించుట పెద్ద తప్పగునేమో ?

పోలీసు అధికారి : ఓరీ డింభకా , నాకే  చట్టము భోధించుచున్నావుకదారా ! నీ మక్కెలు విరిచి చుక్కలు చూపించెదను

సుందరి :  అయ్యా  పెద్ద ( పెద్ద ను పట్టి పలుకుచూ  )  ఇన్స్పెక్టర్  గారు , సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి మార్కేన్ద్య కట్జూ గారు చెప్పినట్లు న్యాయస్థానములు  90 శాతము అవినీతి అక్రమముల తో నిండి యున్నవని వార్తా పత్రికలలో చదివి నది నిజమని ప్రత్యక్షానుభవము న తెలుసు కొంటిని " 24 గంటలలో బయటకు వచ్చి నీ పని పట్టెదను" అని వాడు వద రు చు న్నాడనిన నాయముని కిలోల లెక్కన తూకమునకు వేయుచూ  న్యాయమూర్తులెంతకు దిగజారినారో అవగతమగుచున్నది. ఇంకా మీరు పోలీసుకు కొమ్ములు లేని  రాక్షషులని  నిరూపించ బూనినారా ? సజ్జనులమీద ఏమి మీదౌర్జన్యము ?

పోలీసు అధికారి :  దారిన బోవు తద్దినమును ఇంటికి పిలుచుచున్నావు . కాలికంటినది దీసి నెత్తికి పపూసుకొందువేమమ్మా ? ఈ బాలకునివలె నీకునూ దుర్గతి  ప్రాప్తించునేమో, నీ రాతెట్లున్నదో?

మెల్లగా సిబ్బంది , రోగుల బంధువులు ,  కొద్దీ మంది సందర్శకులు పోగయినారు ఆ మందనుండి ముందుకొచ్చిన

తులశమ్మగారు :  అయ్యా ఇన్స్పెక్టర్ గారు నా భర్త ఈ ఆసుపత్రిలో కేన్సర్ వైద్యము కొరకు  అతడు లక్షలు వెచ్చించుచున్నాడు. ముఖపరిచయము తప్ప మామధ్య ఏ బంధమును లేదు. దీనిని బట్టి మీరర్ధము జేసుకొనిన నేను చెప్పనవసరంలేదు.

సుందరి : అతడి మాసిన వస్త్రములు, మురికి ఆకారము చూసి మీరు పొరబడి యుండవచ్చు , అతడు వందల కోట్లకధిపతి యైన తండ్రి బిడ్డ మేము దారిన బోవు తద్ధనము అనుకోను వీలులేదు . అతడు అట్లనుకొను వీలున్ననూ, మామధ్య పెద్ద స్నేహము లేకున్ననూ మానవత్వముతో మమ్ము చూచుచున్నాడు. దొడ్డమనసున్న మంచివారిని , శ్రీమంతుని మీరేమి సాధింతురు?   

పోలీసు అధికారి షో నుండి లకుమను బందించి ఉంచిన గది తాళమును స్వాధీన పరుచుకొని  సిబ్బందికి    ఇచ్చి అగస్త్యను సుందరిని అభినందించి "మేము ఆకారమును జూచి అప్పుడప్పుడూ పప్పులో కాలు వేయుచుందుము అని షోను కొనిపోవుచుండగా ఎవరో " వీడి వెనుక సహాయకుడు నక్కి యుండెన"ని జెప్పగా అతడిని కూడా బండి ఎక్కించ మని పోలీసు అధికారి ఆదేశించెను.  పోలీసు సిబ్బంది షో మరియు అతడి సహాయకుని బండి ఎక్కించుచుండగా, పెద్ద డాక్టర్ గారి సమ్మతితో ఆసుపత్రి సిబ్బంది కృష్ణమూర్తి గారిని అంబులెన్స్ లో పరుండబెట్టిరి.  ఒక యువ వైద్యుడు ఒక నర్స్ కూడా వాహనమునధిరో హించిరి. పిదప సుందరి , తులశమ్మగారు వాహనంలో కి ప్రవేశించిరి

పోలీసు వాహనము అంబులెన్స్ పక్కపక్కనే నిలిచి యున్నవి కొద్దిమంది సిబ్బంది చూచుచుండిరి. ఇన్స్పెక్టర్ కూడా అక్కడే యుండెను   అగస్త్య ఆంబులెన్స్ లోకి పోవుచుండగా లకుమ అగస్త్య చెంతకు చేరెను. నా చరవాణిని షో సహాయకుడు సంగ్రహించినాడని చెప్పగా ఇన్స్పెక్టర్ సహాయకుడిపైయుఱిమి చరవాణిని తీసుకొని స్వయముగా లకుమకు అందించాడు. లకుమ చరవాణిని ప్రారంభించగా తల్లివద్దనుండి అనేక సందేశములు కనిపించెను.  మా అమ్మ కంగారు పడుచున్నది ఆమెతో మాట్లాడవలెను అని అగస్త్యతో అనగా  అతడు  అంతకంటే ముందుగా  వ్యవహారముని ఠాణా వరకు లాగవలదని పోలీసు అధికారిని వేడవలెనని ఇన్స్పెక్టర్ కడకు బోయి ఈమె  తల్లి బారామతి నియోజకవర్గ నుండి కొనసాగుతున్న ఎం పీ యని వ్యవహారము పొక్కిన వారి ప్రతిష్టకు భంగమని వేడగా " ఒక ఎం పీ కూతురికి ఇట్లు జారినపుడు మేము చాలా తీవ్రముగా పరిగణించవలెను. కానీ భాదితురాలే స్వయముగా కేసు పెట్టవలదని చెప్పుచున్నందువల్లనూ  నీ మంచితనమును జూచి నేడు నేను కేసు నమోదు చేయక  వారిని ఠాణాకు తీసుకొని పోయి విచారించి వదిలిపెట్టిన నూ  రేపు ఆయువులు వాచి మరణము అంచున వ్రేళ్ళాడుచున్న అతగాడు మరణించిన చో  క్రిమినల్ కేసును ఎవ్వరూ దాచజాలరు. మీకు శుభమగుగాక. యని అతడు పోలీసు వాహనమునధిరోహించెను. అగస్త్య లకుమ ఇద్దరు అంబులెన్స్ నెక్కగా , రెండు వాహనములు ఒకే సారి బయలుదేరినవి. 

3 comments:

  1. మొత్తానికి లకుమ ఆచూకీ కనిపెట్టారు

    ReplyDelete
    Replies
    1. కథా గమనం ఎలావుంది ? భాషా ,కథనం బాగున్నాయా ? మలుపులు ఎలావున్నాయి ? మొత్తానికి కథ ఆసక్తిగా ఉందా ?

      Delete

    2. ప్రతీ పాత్రను ఉన్నతంగా మలచటానికి
      మీరు పడుతున్న శ్రమను నేను అర్థం చేసుకోగలను.అగస్త్య యొక్క సహాయం చేసే గుణం నాకు చాలా బాగా నచ్చింది.మొదట్లో లకుమా బాధ్యతారహితంగా ప్రవర్తించినా సమయం వచ్చినప్పుడు తనేంటో నిరూ పించింది.మీనాక్షి ఎక్కడ ఉందో తెలియరాలేదు.ఈ ప్రపంచంలో ఏ మనిషీ పరిపూర్ణ వ్యక్తిత్వం కలవాడు కాడు. తనేంటో కూడా తాను తెలుసుకోలేని మనిషి ఎదుటివారిలో తప్పును వెతుకుతాడు.తనను తాను తేసుకొగలిన మనిషి ఎదుటివారిని అర్థం చేసుకోగలుగుతారు. భారత వర్ష చదవటం ద్వారా నేను తెలుసుకున్నది ఇదే. కథాగమనం, కథనం చాలా బాగున్నాయి. భాషా సౌందర్యం వర్ణనాతీతం.


      Delete