ఉత్పలమాల అంటే నల్లకలువపువ్వుల దండ అని అర్థం. పిండివంటలు జిహ్వానందము, జంత్రములు శ్రవణానందము, పుష్పములు నేత్రానందము, శృంగారము రసానందము. రసములన్నింటిలోను గొప్ప రసము శృంగారము. అందుకనే శృంగారాన్ని రసరాజము అన్నారు. అలాటి శృంగారాన్ని సాహిత్య పరిష్వంగము లో పొందుటకే ...
భ ర న భ భ ర వ
U I I U I U I I I U I I U I I U I U I U
పించము - దాల్చిన - ర్తనము -జేయుము రారి ని కోరి జే రినా
రంచల అంబుజా ననలు పొంకము జూసిన మోహమే గదా
కాంచిన భాగ్యమే దెలియ అంకిలి వీడును పాశ మే విచా
రించిన గోపికా తరుణు లందరు నొందిరి ఆత్మానం దమున్
ఇది నేను వ్రాసిన పద్యము. దీనికి ప్రతిపదార్ధము క్రింద ఇస్తున్నాను
పింఛము దాల్చి = నెమలిపించము ధరించి ; నర్తనము జేయు = నాట్యము జేయు
మురారిని = శ్రీ కృష్ణుని ; అంచల జేరినారు = ప్రక్కన జేరినారు ; అంబుజాననలు = స్త్రీలు
పొంకము జూసిన = బాహ్య సౌందర్యము జూసిన ; మోహమేకదా = మోహము కలుగును
కాంచిన భాగ్యమే = కృష్ణుని అట్లు జూచిన వారికి అదృష్టమేకదా
దెలియ అంకిలి = రహస్యము దెలియఁగా ; వీడును పాశమే = మోహము తొలిగిపోవును
విచారించిన = ఆలోచించిన ; గోపికా తరుణు లందరు = గోపికా స్త్రీలందరు
నొందిరి ఆత్మానం దమున్ = ఆత్మానందమును పొందిరి
U I I U I U I I I U I I U I I U I U I U
దామిని తాకిపం టచెలి
మామిడి పూసికో కిలము మేఫణ తింతన కూర్మిపా డునో
భామిని గోముగా పిలచి మగడు
కామిని హాసము గనిన కల్గిన మోదము కల్గకుం డునా?
అందరికీ సుపరిచితమైన ఉత్పలమాల పద్యం
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్
ఇంత అందంగా పద్యాలను రాయటమే కాక, పామరులను కూడా పండితులను చేసే విధంగా పద్య నియమాలను, లక్షణాలను తెలియ చేస్తున్నందుకు దన్యవాదముులు.
ReplyDeleteAnother poem with your inspiration is posted
Deleteగాండ్రించు శార్దూలము
ReplyDeleteఘీంకరించు మత్తేభం
ఊగును డెందము కందముతో
మనస్సు సరళమగును తరళంతో
ఆటవిడుపు తేటగీతి, ఆటవెలదులు
అలంకారములు ఉత్పల, చంపకమాలలు
పూలబాల గారి కలమునకు
Good
ReplyDelete