అంతర్జాతీయ మానవత్వ
సదస్సు
అంతర్జాతీయ మానవత్వ సదస్సు జరుగుతోంది. అగ్ర రాజ్యాలతో సహా అనేక
దేశాలు సదస్సులో పాల్గొన్నాయి.
ప్రతిదేశం కూడా
మానవత్వం అంటే మేమె అని గొప్పలు పోతున్నది. ప్రతి దేశం నుంచి ప్రతినిధులు సదస్సులో పాల్గొని
మాట్లాడుతున్నారు.
అమెరికా
నుంచి ఆల్ఫ్రెడ్: "ఆల్
మెన్ అర్ క్రీయేటెడ్ ఈక్వల్"
అని 1863 లో అబ్రహం
లింకన్ ఎప్పుడో
చాటాడు. బానిసత్వాన్ని నిర్మూలించని, సర్వమానవ సమానత్వాన్ని నెలకొల్పి మానవత్వానికి చిరునామా గా మిగిలాము.
ఫ్రాన్స్ నుంచి ఫ్రాంస్వ : స్త్రీవాదం పుట్టినిది ఫ్రాన్స్ లో . ఫెమినిజం అనే
పదానికి పుట్టినిల్లు ఫ్రాన్స్. ఆతర్వాత
దాని బ్రిటిష్ వాళ్ళు మానుంచే కాపీ
చేశారు. మానవత్వం మాత్రమే కాదు లింగ వివక్ష
లేకుండా , స్త్రీ పురుషులని గౌరవించే సమాజం , ఫ్రాన్స్ అం టేనే
Humanity in action.
బ్రిటన్ నుండి జార్జ్ : మానవత్వం ప్రపంచానికి పరిచయం చేసింది మేమె. “ we are the most polished race on the earth. భూమి పైన బాగా పరిపక్వత చెందిన జాతి మాది .
ఎవరిని
వారు తెగ పొగుడుకున్నారు. అదే
సమయంలో అక్కడ కూర్చున్న
మరో ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి సిగ్గుపడి
అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
ఇండియా నుంచి పూలబాల : మానవత్వం ఎక్కడా లేదని అందరికి తెలుసు. ఉంటె గింటే అది అగ్ర దేశాల్లో అస్సలేదు ఉంటె ప్రతిదేశానికి ఇంత సైన్యం ఎందుకు? ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉంటె ఏ దేశమైన ఆక్రమించేస్తుంది అనే భయంతో ఉన్నాము. విదేశాలమీద ఎన్నడూ దాడి చేయనిది భారత దేశం అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అందరు తియ్యటి కబుర్లు
చెప్పడం నేరుకున్నారు. నాకు గొప్పలు చెప్పడం
ఇష్టం లేదు చేతకాదు. మీ
అందరూ అత్యాధునిక ఆయుధాలతో సైన్యాన్ని పెంచేస్తున్నారు. కంటిమీద కునుకు
లేకుండా చేస్తున్నారు . మీ బోర్డర్స్ మాత్రమే కాకుండా,
ఎందుకు ప్రపంచం
అంతా సాటిలైట్ కళ్ళేసుకుని గమనిస్తున్నారు?
దీని అర్ధం ఏంటి ? క్షణం
కన్ను మూస్తే పక్కదేశం ఆక్రమించేస్తుందనే కదా ? ఎన్ని
యుద్ధ విమానాలు , మిస్సైల్స్ అమ్ముతున్నారు ? ఇతర దేశాలని దోచుకున్న
బ్రిటిష్ వాడూ కూడా మాట్లాడు
తుంటే " ఆఖరికి నిత్యం అతిశయోక్తులు, అహోరాత్రాలు సొంత డబ్బా కొట్టుకునే
ఆయనకి కూడా విసుగొచ్చి వెళ్ళిపోతున్నాడు
చూడండి "
అప్పుడు అందరూ ఆ వెళ్లిపోతున్నా
వ్యక్తి వైపు చూసి గతుక్కు
మన్నారు. అప్పుడు
అన్ని దేశాలు, రెండు విషయాలు తెలుసుకున్నాయి
మిలట్రీ ఆధునీకరణకు బిలియన్లు తెగలేస్తూ మానవత్వం గురించి మాట్లాడ కూడదని, ఆయనే సిగ్గుపడి వెళ్లి పోతున్నాడంటే
తాము తప్పక నీచాతి నీచంగా
గొప్పలు చెప్పుకుంటున్నామని.
భారత్ స్పేస్ సూపర్ పవర్ కాబోతోంది. అప్పుడు కూడా దురాక్రమణ కి వ్యతిరేకంగానే గళం విప్పుతాం. ఆక్రమించం ఆక్రమణలని ప్రోత్సహించం.
భారత్ స్పేస్ సూపర్ పవర్ కాబోతోంది. అప్పుడు కూడా దురాక్రమణ కి వ్యతిరేకంగానే గళం విప్పుతాం. ఆక్రమించం ఆక్రమణలని ప్రోత్సహించం.