Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, March 1, 2021

Bharatavarsha -136

తూరుపు సిందూరపు వన్నెలతో ఉదయరాగము పాడుచుండెను. నగములు మేలిముసుగు దాల్చిన ముత్తయిదువులవలె నిలిచి యున్నవి. అగములు (వృక్షములు) మంచు మాలలు ధరించిన వధూవరులవలె నగుపించుచున్నవి. తూరుపు ఎర్రబారుచూ సిగ్గిల్లిన నవవధువు వదనము వలె నున్నది.

 కారు లో ఆనందనిలయమునకు పోవుచూ నాదము నంది  వందితమగు  నంద నందుని  వందనము జేసి నందము నందుచు నందిని “అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ భూలోక సువర్లోక , యక్షలోక, గంధర్వ లోక ములందు ఎందున్నావయ్యా, నంద నందనా, దేవభాషయందు నిన్ను నుతించి  పాదాభివందనము చెయుచున్నాను,  నా మనోవాంచ నీడేర్చ వయ్యా గోపకిశోర!”  అని గోపాలుని గానము చేయుచూ ఆనందనిలయమును చేరి మరువపు ద్వారము ముందు కారును నిలిపెను. ఎర్రని  పరికిణీ పై తెల్లని పైట దాల్చి  చరణ కింకిణిలు కణకణ మ్రోగుచుండ కారు దిగి మరువపు ద్వారము దాటి రాధామనోహర పుషములల్లిన  ప్రవేశ ద్వారమును దాటుచున్న ఆమె ఆ పుష్పములందొక పుష్పము వలే కనిపించుచుండెను.

ఆనందనిలయములోనికి అడుగు పెట్టి నందిని చుట్టూ కలయజూడగా అప్పటికే నేలపై పరిచిన ఎఱాతివాచీలను తొలగించబడినవి. కొందరు పనివారు గుడారములను విప్పి ఒక్కొక్కటిగా వాహనమెక్కించుచుండిరి.  ఏడు గంటలగుచున్నది ఇంకనూ ఆనంద నిలయము నిద్ర మత్తులో జోగుచున్నది అనుకొనుచూ నందిని మండువా గదిలోకి ప్రవేశించెను. 

మండువాగదిలో అలంకరణలు అట్లే ఉన్నవి.  వర్షుడొక్కడే సోఫాలో నిద్రించుచున్నాడు. " ఆజానబాహుడు అరవింద నేత్రుడు నాలో రాగలవీణను మీటిన రసికేశ్వరుడు వర్షుడు నా వాడెప్పుడగునో" అని అతడి ప్రక్కన కూర్చొని నందిని అతడి ప్రశాంత వదనములోకి చూచుచుండెను. ఇంతలో విదిష మండువా గది లోకి ప్రవేసించుచూ ఆదృశ్యమును చూచి కాలుకదలక ద్వారము వద్ద నక్కి చూచుచుండెను. నందిని వర్షుని ఫాలభాగమును ముద్దిడవలెనని వంగి ఏదో అలికిడి బ్రాంతిని పొంది, విరమించుకొని పోయి మాలిని గారి గది తలుపు నెట్టగా తలుపు తెరుచుకొనెను. విదిష నిట్టూర్చి మండువా గదిలో ప్రవేసించెను.   

నిత్యమూ 6 గంటలకు వాకిలిలో కళ్ళాపి జల్లి ముగ్గులు పెట్టవలెనని ప్రవచించు అత్త కూడా ఇంకనూ మేలుకొనలేదు. ఇంక శోభనపు పెండ్లి కూతురులు లేతురా అనుకొనుచూ భిన్న  పుష్పాలంకృత సుందర శయన మందిరములను చూచి అబ్బురపడి స్వర్గతుల్య మగు వారి సంసర్గమునూ హించుకొ నుచు నందిని సయన మందిర  ద్వారములవద్దకు పోయి సుమపరిమళములను మూర్కొని తలుపులు నెట్టి చూచుచుండగా విదిష వర్షుని గదిలోకి పోయి ఆమెను చూచుచుండెను.   నందిని  సయన మందిరములకు గడియలు పెట్టియుండెనని గ్రహించి,

 “అబ్బో జాగ్రత్త గలవారే!” అనుకొని మందగమనమున మండువాగది  దాటి వాకిలి లో అడుగిడి ఎర్రని పరికిణీ ని పైకి దోపి వాకిలి ఊడ్చసాగెను.  "ఈ నందిని లోపలకి వచ్చుట బైటకు పొవుట విడ్దూరముగా నున్నదే!  క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అనిన  ఇదియే కదా అని తలంచుచూ విదిష వర్షుని గదినుండి మండువా గదిద్వారమువద్దకువచ్చి పొంచి చూచుచుండెను. వాకిటనిలచిన నందినిపరిసరములను పరికించుచుండెను. గుడ్డ గుడారములన్నియూ తొలగించబడి ఆనందనిలయము పై నీలాకాశముకనిపించుచుడెను. చూచు చుండగానే  షామియానాలును మోసుకొని వేనుకదిలిపోయెను.  

నందిని కళ్ళాపి చల్లి ముగ్గు వేసి నలుదిక్కులా పరికించగా విరుల పలకరింత పులకరింతను కలుగజేయుచుండెను. రాత్రంతయూ  తుషారముతో అంటకాగిన  విరులు తమ రాసక్రీడ లకు గురుతుగా  రజోలిప్త దళములను చూపుచున్నవి. ఒక్కసారిగా నందినికి సుందరి లకుమలు గుర్తుకొచ్చి ఏమిచేయుచున్నారో చూడవలెనని ఆశక్తి కలిగెను. నందిని మండువాగదిలోకి ప్రవేశించెను. 

తలుపులకు తాళము దూరు రంధ్రము లున్నవి. నందిని వంగి రంధ్రము గుండా  చూచుచుండగా మాలినిగారు మేలుకొని పైకి వచ్చి నందినివెనుకనే నిలచి అట్లే చూచుచుండిరి. విదిష సిగ్గిల్లి విడిది గృహము నకు పొయెను. 

నందిని లోపల దృశ్యము గాంచి  పరిసరముల స్పృహ మరచి  ఊపిరి నిలిపి తన్మయత్వముతో అట్లే చూచుచుండెను. కొంత సేపు  చూచిన పిదప  వెనుకకు తిరిగి చూడక అట్లే మరియొక ద్వారము వద్దకు పోయి తలుపు రంధ్రము గుండా లోపలకు చూచుచుండగా మాలినిగారు ఆపిల్ల తెంపరితనమును  చూచి అచ్చెరువందిరి. ఇంతలో మీనాక్షి మేలుకొని తలుపు తీసి నందినిని చూచి పిదప మాలినిని చూచెను. ఒకరినొకరు చూచుకొని పెద్ద వారిరువురూ నోళ్లు నొక్కుకొనిరి. 

ఇంతలో వర్షుడు లేచి పరిస్థితిని గమనించి పరుగు పరుగున పోయి నందినిని జెబ్బ పట్టుకుని లాగుచు న్ననూ ఆమెకు చీమ కుట్టినట్టైననూ లేకుండెను. మాలిని మీనాక్షి ఆమె వద్దకు పోయి “ఏమి చేయుచున్నావే!” అని గద్దించిరి.  మీనాక్షి ఆమె  చెవి పట్టుకొని " ఏమే ఈ తుంటరి  పనులు ?  నాకొడుకు శోభనం గదిలోకి తొంగిచూచుటకు సిగ్గులేదూ ?" అని అడగగా నందిని   మా సబ్బవరమందు గదిలోకి ఇట్లే చూచెదరు. సలహాలు కూడా ఇచ్చెదరు. ఇది మన సంప్రదాయమే కదా!  మాలినిగారు “ఛీఛీ ఎట్లు చూతురో , ఏమి సలహాలు  చెప్పెదరో!”  అనుచుండగా అరుణ బయటకు వచ్చి ఈ ప్రాచీన సంప్రదాయము గూర్చి నేను వినియుంటిని. మా ఆడపడుచు నడిగినచో ఇట్టి విషయములను అనర్గళముగా చెప్పును. ఇంతకూ లోపలకు చూచినది ఎవరు ? అని మీనాక్షి మాలినిలను అడుగగా “ మేము కాదమ్మా ఈ నందినే ఇద్దరి గదులలోకి తొంగి చూచెను.” అని వారు చెప్పినారు. అప్పుడు అరుణ నందినితో" ఏమి చూసినావే ?" అని అడుగగా నందిని ఇట్లు చెప్పెను

ముందు లకుమ గదిలోకి చూచితిని వారిరువరూ అలసి ఒకే ఆకుపై విశ్రాంతి నొందుచున్న సీతాకోకచిలుకలవలె 

అరుణీకృత కుచగండ మండలావృత అకీర్ణ కేశ కలాపి జాల మున్

 ప్రపత  పటవాసమున్ సయనాస్త్రాణ న్యాస్త ముక్త   భూషణాదులన్

 ప్రోస్థిత తిలకమున్  గంబూర శుక్ర గన్ధావర్తన  సయనావాసమున్

 చూచితి శ్రాంత  చిత్రపతంగికల భంగిమల్ ద్వారద్రక పరివేక్షణన్

అరుణీకృత = ఎర్రబారిన (ముద్దులాడుటవలన కావచ్చు); కుచగండ మండలావృత  = స్తనములు  బుగ్గల నావరించిన; అకీర్ణ కేశ కలాపి జాల మున్ = చెల్లాచెదురు గా పడిన కేశములు; ప్రపత  పటవాసమున్ = జారిన లంగా ; సయనాస్త్రాణ న్యాస్త  = పక్క దుప్పటి పై పడియున్న ; ముక్త   భూషణాదులన్ = సడలిన ఆభరణములు; ప్రోస్థిత తిలకమున్  = చెదిరిన తిలకము; గంబూర శుక్ర గన్ధావర్తన  సయనావాసమున్ = శుక్ర  కర్పూర మిళిత గంధమలిమిన శయన గృహము; చూచితి శ్రాంత  చిత్రపతంగికల భంగిమల్ ద్వారద్రక పరివేక్షణన్ = అలసిన ఆకుపై వాలిన రెండు సీతాకోక చిలుకలు చూచితిని. తరువాత అగస్త్యుని గదిలోకి చూడగా:

 భ్రంశిత సిత చేలము న్ విగలిత పరిచేలమున్

 చలిత కుచ కుంభ నితంబ విలోలమున్

 మదన కుతూహల తురగ  విహారమున్

 అభంగ శృంగారాంబర నిరంబర సంసర్గమున్

భ్రంశిత సిత చేలమున్ = కదలిన తెల్లని చీర ; విగలిత పరిచేలమున్ = జారిన పైట

చలిత కుచ కుంభ = కదులుఘన స్తనములు ;  నితంబ విలోలమున్ ఊగు పిరుదులు

మదన కుతూహల = కాంక్ష తో;   తురగ  విహారమున్ =గుర్రపు స్వారీ; శృంగారాంబర =

శృంగారాకాశ మందు ; నిరంబర =నగ్న;  అభంగ సంసర్గమున్= అడ్డులేని సంయోగము  

అరుణతార "నీవిట్టి జటిల సంస్కృతమునందు పద్య రూపమున చెప్పినచో నాకెట్లు అర్ధమగును అనగా "నందిని  చిరు కోపము నటించుచూ  "ఉన్నాడు కదా నీ ముద్దుల కొడుకునడిగి తెలుసుకొనుము.” అనెను.  వర్షుడు  నీళ్లు నములు చుండగా నందిని మాలినితో “అత్తా నీవే చూచినావు కదా నీకొడుకు  నిన్న సంస్కృత శ్లోకములు చెప్పి  అర్థము వివరించినచో  బంగారు గాజులు బహుమతినిత్తునని ప్రకటించెను. మరి  ఇప్పుడు నేనేమి  ప్రకటించవలెను?” అనెను.

“ఊ!జిత్తులమారి వి కూడా అయినావన్నమాట. అమ్మతో నేనెట్లు చెప్పగలను” అని వర్షుడు అచ్చట నుండి నిష్క్రమించెను. “దెబ్బకి దెబ్బ చెల్లు, వాడు వెడలినాడు ఇక నీవు అర్థమును వివరింపుము అని ప్రౌఢలు ముగ్గురూ పడుచుని బుగ్గలు పొడిచినారు.  నందిని ఆ ముగ్గురి భామల చెవులలో తాను చూచిన విషయములను గుసగుసలాడెను. 

సమయము 9 గంటలు:  అంగయార్ కన్నె యమున ఇడ్లీలు వడలు చేసి  కమ్మటి సాంబారు కాచి మీనాక్షి, మాలిని, తార  నందిని, లకుమ, సుందరి, వర్షుడు సోఫాలలొ కూర్చొనగా వారికి అందించు చున్నారు. ఆహా సాంబారన్నచో మద్రాసు వారిదే సుమీ! అని వర్షుడు అనగా, అందుకే వారిని ఇడ్లీ సాంబారు అందురు అని అగస్త్యుడు అనెను. 

తమిళులను వేళాకొళమాడుచున్నావా! మీ అమ్మ కూడా ఇడ్లీ సాంబారే నాయినా, అనగా అందరూ మీనాక్షి వైపు చూసి నవ్వినారు.  మీనాక్షి " మీ ఆయన ఎచ్చటికి పోయెను?”  “ఆయన వ్యాపార  పని మీద  శ్రీలంక పోయెను.”  అటు ఇటు తిరుగుట ఎందులకు మీరిరువరూ ఒక హోటల్ ప్రారం బించినచో అద్భుతముగా నుండును కదా! అని అగస్త్యుడు అనగా అందరూ అగస్త్యుని వైపు చూచి శోభనపు పెళ్ళికొడుకు మంచి హుషారు గా ఉన్నడే! అనగా ఈ కుర్రవాడు నాకు మద్రాసులో నుండి పరిచయము అని కన్నె వారికి పాత రోజులు గుర్తుచేసెను.

 క్రిష్నన్ గారు అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చుచూ పిల్లలు తనకంటే ముందే నిద్రలేచి స్నానా దులు గావించినారని చూచి “లకుమ, సుందరి మీరిరువురూ అప్పుడే లేచి  స్నానములు కూడా పూర్తి చేసినవారే! నాదే ఆలస్యము” అనెను అంగయారు కన్నె “అలంకరణలు కూడా పూర్తి అయినవి.” అనెను.

అప్పుడే మేలుకొని బయటకు వచ్చుట కు సిగ్గుపడుచు చున్న వివేకుని చూచి  మీనాక్షి “మీ అల్లుడు ఇప్పుడే లేచి.  కొత్త పెండ్లి కుమారుడు కంటే మీరు కొద్ది క్షణములు ముందే లేచినారు” అని హాస్యమాగడగా, యమున అప్పుడే ఇడ్లీలలో సాంబారు వడ్దించుచూ “ పాత పెళ్ళికొడుకు కదా కొంచెము ముందుగా లేచెను!” అని చమత్కరించెను.  

కృష్ణన్ నవ్వుచూ “నాకంతయూ కొత్తగానే యున్నది” అని బదులుపలకగా మండువాగదిలో పెద్ద కలకలమురేగెనుమీనాక్షి మాలిని యమున కన్నె అరుణ వైపు చూచినవ్వుచూ అరుణ కెట్లున్నదో? ఆమెకి కూడా కొత్తగానే ఉన్నదేమో పాపము! అనుచుండగా అరుణ ఒక్క ఉదుటున లేచి మొగుడి జబ్బపై గట్టిగా గిచ్చి “ ఛీఛీ!! సిగ్గులేని మనిషి” అని అచ్చటినుండి వర్షుని గదిలోకి పరుగు పరుగున పోయెను. అందరూ నవ్వుచుండగా కూడా కృష్ణన్స్త్నానమునకు పోయెను. వర్షుడు పోయి అమ్మను బుజ్జగించి మరల మండువా గదిలోకి తీసుకువచ్చెను. పెద్దవారే ఇంత తెగించి కూర్చొనగా మీకెందులకయ్యా సిగ్గు అని జంకుతున్న కొత్త పెళ్ళి కొడుకును వర్షుడు బైటకు రప్పించెను. 

పిదప స్త్నానములు చేసి వచ్చి వివేకుడు అల్పాహారము తినుచూ " నేనీరోజు కంపనీలా క్షుణ్ణముగా తెలిసిన న్యాయవాదిని కలువవలెను” అనగా అగస్త్యుడు” నేనుకూడా మీ వెంట వచ్చెదను.” అట్లు మొదలయిన సంభాషణ షేర్ల కొనుగోలు ద్రువ పత్రము ఆనందనిలయము నుండి దొంగిలించబడుట, జే మరణము చర్చకు వచ్చుటతో తీవ్ర గంభీరతను సంతరించుకొనెను. వివాహ ముచ్చట్లలోవిషాద స్వరము ప్రవేశించెను. 

మాలిని గారు భయము కోపము ముప్పిరిగొన వివాహము ముందురొజు జరిగినచో మాకు చెప్పవలెను కదా అని వర్షుని మందలించి “మా ముక్కు క్రింద ఏమి జరిగిననూ తెలుపక ఇట్లు మోసము చేతురా అని శోకించ సాగెను. వర్షుడు తలపెట్టుకొని  కూర్చొనెను.

 అగస్త్యుడు “నాటి రాత్రి నిద్ర పట్టక తిరుగుచుండగా అత్త (అంగయార్ కన్నె)వచ్చు సమయమునకు ఒక కారు మన ఇంటివద్ద నిలిచియుండెను ఆ కారు లో వచ్చినవాడి మనుషులు మన ఇంటనే అథిదులవలె నిద్రించిరి. అగస్త్యుడు చెప్పుచుండగా మాలినిగారికి వొళ్ళు జలదరించెను. వారే ఆ పత్రమును దొంగిలించిరి. 

“దొంగలైనచో వారిసంగతి పొలీసులు చూచుకొందురు. ఆ సంగతి నేను చూచుకొందును. పోలీసు అధికారులను పిలిపించి మాటలాడెదను.” అని అరుణతార ఆవేశపడుచుండగా వివేకుడు ఇది ఒక్క దొంగతనము మాత్రమే కాదు, చట్టబద్ధముగా  సాగించిన దోపిడీ కంపెనీ చట్టమును అనుసరించి సాగించుచున్న ఒక పెద్ద కుట్ర అగస్త్యుని మొత్తము చెప్పనిమ్ము అత్తా” అనెను

అగస్త్యుడు “నేను అత్తను విడిది గృహమునకు తీసుకొని పోవుచుండగా వర్షుడు నన్ననుసరించెను. అదే సమమ్యములో ఆ దొంగలు ద్రువపత్రమున పహరించిరి. జే వారిని రహస్యముగా అనుసరిం చుచుండగా  అదే రాత్రి అతడిని హతమార్చిరి. …. ఒక విరామము అంతా నిశ్శబ్దం.  విస్పష్టముగా అందరి మొఖములలో భయము తొంగి చూచెను. 

అగస్త్యుడు విరామము తరువాత మెల్లగా “శ్యామ్ ..బుడగనుండి గాలి తీసినంత సులభముగా ప్రాణములను తీయును అని అగస్త్యుడు  ముగించెను. వివేకుడు కోపముతో రగులుచూ " వాడి ఆట ఎట్లు కట్టించవలెనో నాకు తెలియును, కానీ మన వద్దనే ఒక చిన్న సమస్య కలదు అదియునూ చేదించెదను. ఇంతకంటే పెద్ద నేరగాళ్లనే పట్టించితిని అని చాలా వ్యక్తిగతముగా తీసుకొని రేగుచుండగా అగస్త్యుడు “అవును మా అమ్మ పేరున ఉన్న సంస్థను ఎట్లైననూ నిలపవలెను. ఆ సంస్థను మా అమ్మకు బహుమతిగా ఇవ్వవలెను” అనుచుండగా మీనాక్షి భీతిల్లి “  తన కోడలు దగ్గరకి తీసుకొని అయ్యో ప్రాణములకు ముప్పు కలదా?! అని తల్లడిల్లుచూ  నాబిడ్డలిరువరినీ నేను నాతో పాటుగా బెంగళూరు కొనిపోయి నావద్దనే ఉంచుకొందును. నాకు సంస్థలు ఆస్తులు ఏవియునూ  వలదు మీ ఇద్దరూ కలిసి నాకొక బిడ్డని బహుమతిగా ఇవ్వవలెను. నాకు కావలసిన బహుమతి అదియే.  అని మీనాక్షి అనగా  “మీ నాన్న ఆస్తి ఎవరికీ కావలెనయ్యా మీ అమ్మ కోరిక తీర్చవలెను తీర్చెదవా ?” అని యమున అగస్త్యుని ప్రశ్నించెను అగస్త్యుడు “ఆ ఆస్తి లో ప్రతి పైసా మా అమ్మది  ఆ సంస్థ మొత్తము మా అమ్మ ఆస్తి. అది సాధించవలెను” మీనాక్షి తల పట్టుకొనెను. 

చెళ్ళిళ్ళ కళ్ళలో ఆనందముచూడవలె ననుకొన్న వర్షుడి ఆశ నిరాస కాగా అతడు అచ్చట నుండి నిష్క్ర మించెను. “ఇంతకూ మనవద్ద ఒక సమస్య కలదని అన్నారు కదా అది ఏమి?” అని అగస్త్యుడు వివేకుని అడిగెను. అదే సమయమునకు బసవడు పార్వతి ప్రవేశించిరి. బసవడు ఈ రోజు ఇడ్లీలు సాంబారు చేసినట్లు అనిపించుచున్నది అనెను. “రామాయణములో పిడకలవేటవలె మధ్యలో తిండి గోల ఎందులకు? ఆ సమస్య ఏమో చెప్పవలెనని అరుణ అడగగా ఆ సమస్య వర్షుడే వర్షునకు శ్యామ్ కు సంబంధము కలదు. జిలేబిని కూడా వర్షుడు పలు మార్లు బార్లలో కలిసెను అని  వివేకుడు చెప్పుచుండగా  జిలేబి ఎవరు అని మీనాక్షి అడిగి తెలుసుకొని నివ్వెరపోయెను. "నా జీవితమును ఇట్లు చేసిన వ్యక్తి నీలి నీడలు నాబిడ్డలను కూడా వెంటాడుచున్నవి." అని మీనాక్షి దుఖించుచుండగా, ఈ వార్త మాలిని, అరుణలను విస్మయమునకు గురిచేసెను. 

"ఇది నేను నమ్మ జాలను వర్షుని పై ఇట్తి అభాండములు" అని నందిని ముగించక ముందే వివేకుడు తన వద్ద ఉన్న ఫొటోలను ఎదురుగానున్న  చిన్న గాజు బల్లపై నుంచెను “ సముద్రకన్య చేలమందు అర్ధ నగ్నముగా నున్న జిలేబీతో వర్షుడు బారులో నున్న ఫొటో క్షణ క్షణమునకూ పెరుగుచున్నట్లు వారికి కనిపించసాగెను. 

3 comments:

  1. సరదాగా మొదలు పెట్టి ఉత్కంఠను పెంచారు.వర్షునిపై అభాండమా🤔 అతను ఏమి చేసినా అగస్త్యునికి సహాయము చేయుటకే చేసి ఉండును అని మనస్సుకి అనిపిస్తుంది.

    ReplyDelete
  2. you are correct but people who believe photos misunderstand Varsha. How are the poems? too much romance? when I write for Nandini my mind automatically longs on to Sanskrit. When I write for Varsha the meter is always either Sardhula or Matebha. When I write for Kesava either it is utpalamala or champakamala. When I talk you I have a different meter. Thank you very much

    ReplyDelete
  3. Poems are nice sir. సన్నివేశము ఏదైనను మీ కలమునకు చిక్కాక కళ రాకుండా ఉండునా.మీరు పాత్రలకు అంకితమైనది కాక పాఠకులను కూడా వారి గురించి ఆలోచించేలా చేస్తున్నారు

    ReplyDelete