Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, March 9, 2021

Bharatavarsha - 142

 విశాఖ సాగర గర్భమునుండి  హిరణ్యగర్భుఁడు క్రమముగా అభ్యుత్తానమగుచుండెను. కిరణమాలి బంగారు కిరణము లతో బంగాళా ఖాత మెల్లయూ తళ తళ లాడుచుండెను.  భారతవర్ష సూర్య నమస్కారములు ముగించి సాగరతీరమున తెల్లని ధోతిలో  ఇసుకలో మందగమనమున సాగుచుండెను.  ప్రాణాయామము  చేయుచున్న యువకుల సమూహ మందొకడు “ఇతడు సినిమా నటుడివలెనున్నాడు” అనగా మరొకడు “కొత్త కలెక్టర్ రా అదిగో చూడుము రహదారిపై అతడి వాహనము నిలిచియున్నది.” అనెను. వర్షుడు వాహనమును చేరగా చాలకుడు వాహనమును ప్రారంభించెను. కలక్టర్ వాహనము ప్రభుత్వ ఆసుపత్రి కి చేరెను. 

Krishna Bhaskar IAS Siricilla Collector who wears Dhoti


విశాఖపట్నం ఆనందనిలయం:   మొదటి రోజు వర్షుని కార్యాలయమునందు చూడవలెనని  వర్షుని కన్న తల్లికి ఆరాటముగా యుండెను. వర్షునికి ఒక ఆకస్మికానందము కలిగించుటకై  డిల్లీ నుండి ఆమె వచ్చుచున్న విషయము వర్షునికి తెలపలేదు.  ఆమెకు ఆకస్మికానందము కలిగించుటకై   మంజూష సందీపులు కలిసి ఒకటైన విషయము  ఆమెకెవరూ తెలపలేదు 

ఆనందనిలయములో ఆ పిచ్చితల్లి బసవడు పార్వతి కొరకు ఎదురుచూచుచుండ గా బసవడు పార్వతి మంజూషను వెంటపెట్టుకొని వచ్చుచున్నట్లు చూచెను. ఆమె చూచుచుండగా సందీపుడు ఆమె చేతినందుకొని లోనికి ప్రవేశించెను. ఆ జంట చూసిన ఆమె అవాక్కయ్యెను.

అత్తగారూ కాఫీ సందీపుడు చిన్నగా అరిచెను. మాలినిగారి సంబరము అంబరమంటినది.

మంజూష వంతగదిలో కి వెడలెను పార్వతి ఆమెన నుసరించెను. “నిన్న రాత్రి బసవడి ఇంటిలోనే ఉన్నాము  మంజూష ఎంత మారిపోయినది ఎంత మంచి పిల్ల అనుచూ అల్లుడు తన పెళ్ళాం గొప్పలు చెప్పు చుండగా మాలినిగారికి నవ్వు సిగ్గు ముంచు కొచ్చుచుండెను.

ఇంతలో అగస్త్యుడు సుందరి తులసిగారు వివే కుడు లకుమలు కూడా వచ్చిరి. 

వారిని చూచైననూ సందీపుడు  సిగ్గుపడక “అత్తగారూ అసలు మంజూష సమయస్పూర్తి గూర్చి చెప్పినచో మీరు నోరు వెళ్ళబెట్టవల సినదే.” ఆమాటలువిని వివేకుడు నవ్వుచుండగా బసవడు “నువ్వు నోరు ముయ్యరా అక్కు పక్షి అమ్మ పుట్టింటి గొప్పలు మేనమామ వద్ద చెప్పినట్టు కూతురి గొప్పలు తల్లికి చెప్పుచున్నావు.” అనెను. తులసిగారు మాలినిగారు నవ్వుకొనిరి.

సుందరి తల్లి కాబోతున్నదన్న శుభవార్త విన్న మాలినిగారు పిచ్చి సంతోషమునకు గురి అయ్యి ఉబ్బి తబ్బిబగుచుండగా మంజూష అందరికీ కాఫీ లందించెను. 

ఇంతలో లేండ్ రోవర్ ఆనందనిలయము ముంగిటనిలిచెను  విదిష , నందిని కలిసి వచ్చు చుండగా అది చూసి మాలిని గారి ముఖము కళ తప్పినది. అందరూ మాలినిగారిని చూసి ఘొల్లుమని నవ్వుచుండగా విదిష నందినిలు ఒకరి భుజముపై ఒకరు చేతులు వేసుకొని లోపలికి వచ్చిరి. పార్వతి ఇంకనూ నవ్వు చుండగా చాల్లే సంబడం అని విదిష ఆమెను కసిరెను. నందిని దూరదర్శనము ను ప్రారంభించి మెడపై వాలి అత్తను అల్లుకొనెను. 

విశాఖ కలెక్టర్ గా విధులలో చేరిన  భారతవర్ష మొదటిరోజే  ప్రభుత్వ ఆసుపత్రిలో  ఆకస్మిక తనిఖీ నిర్వహించెను. ఈ ఆకస్మిక తనిఖీ ఆసుపత్రిలో కలకల మునురేపెను. ఆసుపత్రి సూపరింటెండెంట్ హుటహుటిన వచ్చి అతడిని కలుసు కొనెను.  ఈ తనిఖీ సాగుచుండగా టీవీ ఛానెల్స్ మరియు వార్తాపత్రికలు చుట్టుముట్టినవి.  ఒక గంట సేపు సాగిన తనిఖీ అనంతరం  జిల్లా కలెక్టర్ ఆసుపత్రి నిర్వహణ పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచి  వైద్యులందరూ 9 గంటలనుండి 2 గంటల వరకు విధులకు హాజరు కావలసిందని,  ఐ సీ యు లో పి జీ విద్యార్ధులకు షిఫ్ట్ డ్యూటీస్  వేయవలసినదని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు స్పష్టముగా తెలియబరచి  వారు విధులను సక్రమంగా నిర్వహించనిచో జీతాలు  చెల్లించరాదని…. మంజూష లేచి వంట గదిలో పోవుచుండగా మాలిని గారు " ఏమే ఎక్కడికి పోవుచున్నావు? జిల్లా కలక్టర్ కార్యక్రమము వచ్చు చుండగా” అని అరిచెను. 

నామొగుడికి ఆకలి వేయుచున్నది అల్పాహారము కొరకు అట్లు వేయవలెను.  నీకొడుకు గొప్పలు నావద్ద చెప్పుచు న్నావు! వేరెవరికైనా చెప్పుకొనుము. అనందనిలయములోకి స్వర్గము దిగివచ్చెనా?

                                                                            ***

ఇన్నోవా కలక్టరేట్ కు సాగుచుండెను. అమ్మ చెల్లి గుర్తుకు వచ్చి వర్షుని మనసు భారమాయెను. అమ్మ డిల్లీ లో ఉన్నది ,చెల్లి రాకి ఇంట ఉన్నది. రాకి ఏమిచెసినాడో! మంజూష కాపురము ఏమగునో! తను సాగుచున్న ఇన్నోవా,  నా అను వారు లేని జీవితము వలె నడి సంద్రములో నావవలె తోచెను.  వాహనమందు కార్యాలయమునకు చేరెను. 


9.00 గంటలాయెను. రక్షణ సిబ్బంది వెంట నడుచుచుండగా  వర్షుడు వాహనము దిగి నడవసాగెను. తెల్లని ధోతిలో ముఖమున పండిత ప్రభ అధికార తేజముతో అతడు అపర ఆదిత్యుని వలె తోచుచుండెను.


తిమిరరిపుడు చరాచరమును చెఱలుగొన్న తిమిరమును ఛేదించి సప్తాశ్వరథారూఢుడై గగన మున తళుకు లీనుచుండెను. కిరణమాలి లేత కిరణ స్పర్శ తో తమ్మిపూదూం డ్లు నవ్వుచున్నట్లు , లేత చిగురుటాకులు పులక రించునట్లు, ధవళ వస్త్రముల కాంతులీనుచున్న వర్షుని చూసి నడవలో కూర్చొన్న మాలినిగారి మొఖము పద్మమువలె వికసించెను. ఆనంద బంధుజన హ్రుదయములు చిగురుటాకులవలె  పులకించుచున్నవి.

 కార్యాలయమునందు చూచుటకు కొద్ది  సహృదయులు , కవి పండితులు , పౌరాణిక నాటక ప్రియులు వేంచేసినారు. వారందరితో  కొలది సేపు మాటలాడి పంపిన  పిదప సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మరియు  రెవెన్యూ పొలీస్ అధికా రులు అతడిని కలుసుకొనుటకు వచ్చినారు వారందరినీ పంపుటకు గంట సమయము పట్టెను. పిదప వర్షుడు బంధుమిత్ర సమూహమును గాంచి లేచి బయటకు వచ్చుచుండగా బసవడు అగస్త్యుడు లోనికి పొయి అతడిని కుర్చీలో ఉండగానే పెద్దపూల వేసి అతడి కంఠమును అలం కరించగా,  విదిష నందినిలు చెరొక పుష్ప గుచ్ఛముతో శుభాకాంక్షలు తెలిపినారు. లకుమ వివేకులు , మాలిని తులసి సుందరిలు వచ్చి శుభాకాంక్షలు తెలిపినారు. వర్షుని కనులు  ఎవరి కోరుకో వెతుకుచున్నవి వర్షుడు మొఖం చిన్న బోయెను. అప్పుడు మంజూష సందీపులు ప్రవేశించి నారు. మంజూష అన్న కాళ్లకు నమస్కరించి తనను మన్నించ వలసినదిగా కోరెను. అందరూ బయలు దేరుచుండగా భారతవర్ష “ అమ్మా” అని ఒక్క సారి లోపలకి రమ్మని పిలచి మళ్ళీ నీకొడుకుగా పుట్టు అవకాశము కలు గునట్లు ఆశీర్వదింపుమమ్మా అని ఆమె పదములంటెను

                                                                          ***
విధ్యుక్తము గా లోక సంక్షేమ మునకు తప్ప రాగ ద్వేషములకు తావివ్వక ధర్మ పథమున సాగుచున్ననూ పాలనాధి కారి పదవి ఎంత సంక్లిష్టమో వర్షునకు తెలియ వచ్చెను. వృత్తితో బాటు ప్రవృత్తిని కూడా కొనసా గించుచూ చక్కటి  ఇతి వృత్తము గల రచనలు మాత్రమే సమాజవికాస మునకు తోడ్పడునని ఆ పని చేయుచున్న నందినిని అభినందించు చుండెను. నందిని విదిషలు ఒకటగుటచే మాలిని గారి ప్రాణము కుదుట పడినది. 

                                                                  ***
అగస్త్యుని వివేకుడు  మ రుసటి వాయిదాకు ఒక వారము సమయమున్నందువల్ల భార్యను తీసుకొని శృంగార యాత్రకి పోవలెనని సూచించెను. బసవడు పార్వతి దక్షిణమూర్తిగారిని మేము చూచుకొందుమని వొప్పించగా అగస్త్య సుందరిలు అంగీకరించిననూ పాపము అగస్త్యుని వద్ద ధనము లేకుండుటచే హానీమూన్కి బెంగుళూరు పోవలెనని నిర్ణయించుకొని భార్యతో కలసి రైలులో బెంగుళూరు బయలుదేరెను. పార్వతి ఈ విషయము మీనాక్షికి తెలుపగా మీనాక్షి మిక్కిలి వ్యధ చెంది రైలు నిలయమునకు పోయి కోడలిని కొడుకుని అక్కున చేర్చుకొని. ఇంటికి తీసుకుపొయెను. అత్త ఇంటిని స్టూడియూను చూచి సుందరి అవాక్కయ్యెను. సుందరి అగస్త్యుడు తన కళ్లముందు కళకళలా తూ తిరుగుతుండగా మీనాక్షి సుందరి గర్భవతి అన్న విషయమును యమున ద్వారా తెలుసుకొని ఆమెకు మీనాక్షి ఫిషరీస్ ను బహుమతిగా ఇవ్వవలెనని వర్షుని సాయము  కొరగా " అమ్మ అడగరాదు, ఆగ్నాపించపవలెను" అనిచెప్పి గ్రేస్ శ్యామ్ సుందర్లను పిలిపించి  వాటాలన్నియూ అమ్మివేయుట ఎంత ఉత్తమమో  వారికి ఎంతో చాకచక్యముగా  వివరించుచూ  ఈ షేర్లకొరకే  గ్రేస్ తో స్నేహము నటించితిని,  కొన్ని షేర్లు అమ్మినచో  ఆమె స్నేహమును వదులుకొందునని  శ్యామ్ను వప్పించి   కొన్ని షేర్లు కొనుగోలుచేసితిని  ఆమెతో హద్దు మీరలేదని  చెప్పుచుండగా  గ్రేస్ అంగీకరించెను. ఇదంతయూ నాకు అప్రస్తుతమన్నట్లు  శ్యామ్ అసహనముగా   “కథ ముగియుచుండగా ఇప్పుడవన్నీ ఎందులకు? చచ్చినవాడి పెళ్ళికి వచ్చినదే సంభావన, మాకు ఎంత ఇవ్వరగలరో?” తేల్చవలెను. అని పట్టుబట్టెను వర్షుడు టోకున ముగ్గురి వాటాలను బేరమాడగా,   వలసిన  మొత్తమును చల్లించి మీనాక్షి వాటాలన్నీ కొనుగోలు చేసెను. అధిక వాటాలు కలిగిన అధ్యక్షురాలు అయ్యెను. 

                                                                           ***

దక్షిణమూర్తి రోగము ముదురుటచే  వైద్యులు అతడి కొలది రొజులే వ్యవధి కలదని చెప్పగా సుందరి అతడిని ఇంటికి తరలించి చంటిబిడ్డవలె సాకుచుండెను.  అగస్త్యుడు “సుందరీ, నేడు జనరల్ బాడీ సమావేసమునకు హాజరు కావలసి యున్నది. నీవునూ రావలెన”ని చెప్పగా సుందరి మావగారిని చూచుటకు పార్వతిని పిలిపించి మగనితో సంస్థ సమావేసమునకు పోయెను. అప్పటికే సమావేసమందిరము అంతయూ  వాటాదారులతో నిండిపోయెను.  వాటాదారులలో “ఎవరో ఒక స్త్రీ  అధిక వాటాలను కొనుగోలు చేసెనట”   “ చైర్పర్సన్ వచ్చుచున్నారు వచ్చుచున్నారు” అధికులు  గుసగుసలా కొనుచుండిరి. అందరూ లేచి నిలబడగా అగస్త్యుడు సుందరిలేచి నిలబడి యమునతో వచ్చుచున్న మీనాక్షిని చూచి అవాక్కయినారు. సమావేశము ప్రారంభమయ్యెను. కంపనీ కార్యకలాపాలను లాభన ష్టాలను ప్రణాళికలను చర్చించి సమావేశము ముగియుచుండగా “గ్రేస్,శ్యామ్, సుందర్ల అక్రమములను ఎండగట్టి  తొలగించి, రక్షక సిబ్బంది చే సంస్థ గేటు బైట వరకూ సాగనం పెను.  సంస్థ సమావేశము ముగిసి వాటాదారులందరూ  బయటకు పోయిన పిదప “మీరే చైర్ పర్సన్ అని నాకెందుకు చెప్పలేదు. నావద్ద ఇంత ముఖ్య మైన విషయమును ఎందుకు దాచినారన”ని సుందరి మీనాక్షి పై అలిగెను.  మీనాక్షి కోడలివద్దకు పోయి “అమ్మో మా కొడలికి అలుగుటకూడా వచ్చునే!” అని లాలించి బుజ్జగించి “నీవు నావద్ద ఇంత కంతే ముఖ్య మైన విషయమును దాచినావు అది చెప్పినచో నేను ఇంకొక ముఖ్య విషయమును చెప్పెదను.” అనెను . సుందరి కొలది సేపు ఆగి అగస్త్యుని వైపు చూచెను.  అగస్త్యుడు  ఆ శుభవార్త చెప్పుటకు “అమ్మా!” అని అనుచుండగా నా కోడలి నోటినుండి వినవలెన ని పట్టు బట్టెను.  సుందరి అత్త చెవిలో “అత్తమ్మా నీవు నానమ్మవు కాబోతు న్నావు.” అని  చెప్పగా మరల మరల చెప్పించుకొని విని ఉప్పొంగెను. అగస్త్యుడు “అమ్మా నీవు ఒక ముఖ్యమైన విషయమును చెప్పెదనంటివి కదా అది చెప్పమ”నెను. “ఈ సంస్థ కి ఇకపై  చైర్ పర్సన్ నా బంగారు తల్లి  సుందరి,  ”అగస్త్యుడు నెత్తిన పిడుగుపడ్డట్టు చూచు చుండగా మీనాక్షి నవ్వుచూ “కోడలు ని అడిగి ఆమె ఏదైనా ఉద్యోగము ఇచ్చిన పుచ్చుకొనుము.” 

                                                                         ***


అదేరోజు నిండా కిక్కిరిసిన న్యాయస్తానమందు మీనాక్షి, యమున అగస్త్యుడు, సుందరి , మాలినిగారు కూర్చొని ఉండిరి. విచారణ  ప్రారంభమయ్యెను. వివేకుడు ప్రపంచప ప్రఖ్యాత అపరాధ పరిశోధకుని నీల్ జెఫ్ అను లండను విశ్రాంత పోలీసు అధికారిని  న్యాయస్తా నమందు ప్రవేశపెట్టెను. న్యాయస్తానమందు  “ఆటోకార్.కార్. యుకే న్యాయమూర్తిగారికి చూపి(మీరు కూడా చూడవచ్చు)  ప్రపంచమందు అనెక దేశముల అద్యక్షులు వాడు,  కారునుండి విడదీయుటకు సాధ్యపడని , కనిపెట్ట సాధ్యముకాని , ఉపగ్రహ ఆధారిత ట్రాకింగ్ దివైజ్ ను ప్రదర్శించి చూపి  ద్రువీకరించుటతో , న్యాయమూర్తిగారు అతడి సాక్ష్య మును విశ్వసించినారు. సుందర్ అప్రూవర్ గా మారి నిజము నొప్పుకొ టతో  న్యాయమూర్తి తన  తీర్పును వినిపిం చినారు.  శ్యామ్ మరియు గ్రేస్ లు జంటగా జైలుకి పోయి విశ్రాంతి తీసుకొనుచున్నారు. 

                                                                           ***

న్యాయము జరిగిన పిదప హ్రుదయములు తేలిక పడినవి. మావగారు గుర్తుకొచ్చుటతో సుందరి హ్రుదయ ము బరువెక్కెను. ఒక్కసారి మీ అత్తగారిని చూదవలెనని  ఉన్నది  అని ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన తరువాత పలుమార్లడిగియుండెను. సుందరి అత్తగారిని బ్రతిమాలి ఎట్లో ఒప్పించి కలువుప్పాడ ఇంటికి మీనాక్షిని తీసుకు పోయెను.  దక్షుడు గదిలో మంచము పై పడుకొని  యుండెను  పార్వతి దక్షుని మంచము ప్రక్కన నుండి అతడికి సేవలు చేయుచుండెను. ఆమె వంగి దక్షుని చెవిలో మీనాక్షి వచ్చి న విషయమును తెలపగా అతడు కళ్ళు తెరచి మీనాక్షిని చూచి బలహీనముగా నవ్వెను ఆ నవ్వులొ జీవము లేదు ఆ నవ్వు అతడి కొక శాపము వలె నున్నది. తన చివరికోర్కె మన్నించినదుకు అతడు భార్యకు చేతులు జోడించెను. కనులనిండుగానున్న ఆమె రూపమును చూచుచూ సుందరిని పిలచి పాపాత్ములని కరుణిచు దేవత ఇదిగో అని చెప్పుచూ  "తల్లీ  ఆ పాట" అనెను. సుందరి మావగారికి ఎక్కువగా నచ్చిన పాట పెట్టెను.” సాధనము పాడుచుండెను. “అతులిత స్వరరాణి.. వీణాపాణీ....” ఆపాట దక్షిణమూర్తి హ్రుదయగరాగమువలె, స్వరార్చనవలె నున్నది. తన అతులిత స్వరరాణి వైపు రెప్పవేయక చూచుచూ దక్షుడు పరవసించుచుండెను. పాటముగిసిన పిదప "అతులిత స్వరరాణి" అన మాటలను ఉచ్చరించు చుండగా అతడి మాట నిలచిపోయెను ఊపిరి ఉడిగిపోయెను. 


2 comments:

  1. నిజంగా అద్భుతం!!!
    ప్రతి సీను కళ్ళముందు దృశ్య పూర్వకంగా విందు చేసింది. దక్షిణా మూర్తి మరణం కూడా మరపురాని విషయంగా చూపించి పాఠకుల మనస్సులు దోచేసుకున్నారు మీ ఈ వెయ్యి పుటల నవలా రాజము తెలుగు భాషకి తలా మాణిక్యం అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను

    ReplyDelete