Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, March 6, 2021

Bharatavarsha 139

విశాఖపట్నం: జిల్లా న్యాయమూర్తి గారి కచేరి

దక్షిణమూర్తి బోను వద్ద ఒక కుర్చీ లో కూర్చొ నెను.  సుందరి అతని ప్రక్కన కూర్చొని త్రాగు నీరు సీసాతో అందించుచుండెను. ఆమె ప్రక్కన అగస్త్యుడు, బసవడు పార్వతి లకుమ వివేకులు కూర్చొని యుండగా మరొక కోణమందు శ్యామ్, గ్రేస్, సుందర్, సంస్థ ఆడిటరు కూర్చొని యుండిరి. న్యాయమూర్తిగారు లోనికి వచ్చిన పిదప  అందరూ లేచి నిలచినారు.  న్యాయమూర్తిగారు న్యాయ పీఠము నధిష్టించి కూర్చొనిరి అందరినీ కూర్చొన వలసినదిగా సైగ చేయగా అందరూ కూర్చొనిరి.  

వాది (ప్రోసెక్యూటర్): యువరానర్  దక్షిణామూర్తి అను ముద్దాయి మీనాక్షీ ఫిషరీస్  లిమిటెడ్  వ్యవస్తాపకుడుడైరెక్టర్స్ బోర్డ్ చైర్మన్, సెక్యూరిటీస్ కుంభకోణలో అరస్టయిన నిందుతుడు.  400 కోట్ల  సంస్థ  నిధులను  సొంతానికి వాడుకొని పెట్టుబడి దారులను మోసం చేయడమే కాకుండా  కుట్ర పూరితమైన ఆలోచనలతో  డైరక్టర్లు, సంస్థ సిబ్బిందిని ఇరికించాలని చూస్తున్న నేరస్తుణ్ణి 2013 కంపెనీ చట్టం  సెక్షన్ 447  ననుసరించి కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను.   

అబ్జెక్షన్ యువరానర్ మొదట నిందుతుడని తరువాత నేరస్తుడని  ప్రోసెక్యూటర్ (వాది) విచారణ మొదలవ్వకముందే నిర్ణయించేసారు. న్యాయమూర్తిఅబ్జక్షన్ సస్టైండ్!”

వాది : సారీ యువరానర్, కుట్ర పూరితమైన దురాలోచనలు కలిగిన పచ్చి మొసగాడని అతడి  మొహం చూసిచెప్పొచ్చు

ప్రతివాది: ప్రోసెక్యూటర్ గారికి ఫేస్ రీడింగ్ వచ్చినట్లైతే కోర్ట్ వచ్చే బదులు రామకృష్ణా  బీచ్కి వెళ్ళీతే మంచిదివిచారించకుండా ఇంత తీవ్రాఅరోపణలు ఎలాచేస్తున్నారో నాకర్ధంకావటం లేదు ! మీకేమైనా అర్ధమవుతొందా యువరానర్?

న్యాయమూర్తి: మీరు మీరు చూసుకోండి నన్ను లాక్కండి.

వాది: తాళి కట్టిన భార్యనే మోసగించి రోడ్డు మీద కొదిలే సాడు యువరానర్.         దక్షిణ మూర్తి మోసగాడని చెప్పడానికి ఇంతకంటే ఏంకావాలి యువరానర్గ్రేస్ , శ్యామ్ , సుందర్ అనే అమయాకులని, నిజాయతీ పరులని  ఇరికించి తప్పించుకొవాలనే  ఇతడు ముమ్మాటికీ కుట్ర దారుదడే యువరానర్.

ప్రతివాదిగ్రేస్ , శ్యామ్ , సుందర్ లని అమాయకులని , నిజాయతీపరులని, ఒక వెర్రి లేదా పిచ్చివాడు మాత్రమే అను కుంటాడు యువరానర్. సర్క్యూట్ హౌస్ దగ్గర  గ్రేస్ విల్లా అనే 30 కోట్లు ఖరీదు చేసే విలాసవంతమైన భవనం, ఇంకా డాబాగార్డెన్స్ లో  50 గదుల 3 నక్షత్రాల హోటల్  నిజాయతీ పరురాలైన గ్రేస్ కి ఎక్కడి నుంచి వచ్చయో వాది కోర్ట్ వారికి చెప్పాలి. ఆవిడకి అంత ఆదాయం ఎక్కడినుంచి వచ్చింది

వాది: మిలార్డ్ పది కోట్లు కూడా చేయని రెండు ఆస్తుల విలువ వందకోట్లు చేస్తుందన్నట్టు మట్లాడుతున్నారు. లేర్నెడ్డిఫెన్స్ లాయర్  కేసుని ప్రక్క త్రోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కేసు, కంపెనీ చట్టాలని అతిక్రమించి పెట్టుబడిదార్లను మోసగించి వారి డబ్బును అక్రమంగా మింగేసిన ఆర్దిక నేరం. డిఫెన్స్ లాయర్  డిస్ప్రపోషనేట్ ఏసట్స్ అంశాన్ని లేవనెత్తి కోర్ట్ వారి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులకి కేసుకి ఏంటి సమ్మందం యువరానర్?

ప్రతివాదిసమ్మందం  ఉంది యువరానర్. డైరక్టర్లు  గ్రేస్ , శ్యామ్, సుందర్ డబ్బును దోచుకొని నమ్మక ద్రోహానికి పాల్పడ్డారుడిస్ప్రపోషనేట్ ఏసట్స్ అని నేను అన్నట్టు ప్రోసెక్యూటర్ నక్క తెలివితేటలు చూపిస్తునారు.

రాజకుమార్ హొల్ద్ యువర్ టంగ్ నక్క గిక్క అంటే నేను కూడా కుక్క తొక్క అనాల్సి ఉంటుంది

న్యాయమూర్తి : ఆడర్ ఆడర్ ( సుత్తితో బల్లపై కొడుతూ)

వాది: డిఫెన్స్ లాయర్ ని  గమర్యాద గా కోర్టు భాష మాట్లాడమనండి యువరానర్

ప్రతివాదినక్క విన యం, అన్నట్టుగా నక్క తెలివితేటలు అనేది తెలుగులో సామాన్యంగా వాడేమాటే. కి మార్ద్రకవణిజో వహిత్రచిన్తయా? అంటే  అల్లపువ్యాపారికి పడవల విచారణ ఎందులకు? అని అనిపించవచ్చు కానీ అల్లపు వ్యాపారానికి కూడా రవాణా కావాలి యువరానర్

న్యాయమూర్తి : మీరు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పండి

ప్రతివాదిడిస్ప్రపోషనేట్ ఏసట్స్ అని ముసుగువే సినా ఇది మనీ లాండరింగ్ కేసు. పదికోట్లు విలువ చేసే ఆస్తి అని చెపుతునే పొసెక్యూటర్ గారు నోరుజారి ఆస్తి యొక్క అసలు విలువ  వంద కోట్లని  చెప్పేసారు. నిజం దాచాలన్నా దాగదు యువరానర్. భై గదులున్న త్రీ స్టార్ హోటల్ కనీసవిలువ ఇండియాలో ఎక్కడైనా 50 కోట్లు పైమాటే అన్న విషయం తెలియకుండా కోర్ట్ వారిని ఏమార్చాలని చూస్తున్నారు వాది

వాది: ఏయ్ రాజ్ కుమార్, మనీ లాండరింగ్  అంటే ఎంటో  తెలుసుకుని మాట్లాడవయ్యా, విదేశాల్లో ఖాతాదార్ల వివరాలడగని బేంకుల్లో డబ్బు దాచి , లేని కంపెనీలు సృష్టించి నల్ల ధనాన్ని తెల్లధ నంగా చూపించడం.

ప్రతివాదిఅయ్యా గుప్తా గారు, తాతకి దగ్గులు నేర్పడానికి  ప్రయత్నించొద్దు. ప్లేస్ మెంట్ , మాస్కింగ్ , ఇంటిగ్రేషన్  అనేవి మనీ లాండరింగ్  లో మూడు దశలుహై వేల్యూ ఆస్తులని తక్కువధరకి చూపడంకూడా మనీ లాండరింగేయువరానర్అర్దిక నేరగాళ్ళు సీ బీ ఈడీ లకంటే  ఎప్పుడూ  మూడడుగులు ముందే ఉంటారు. కేసు లో  అంతకంటే ఎక్కువగా 30 అడుగుల ముందున్నారు. లండన్ లో గత 8 నెలల క్రితం 1962 ఫెరారి కారు 400 కోట్లకి వేలం వేయబడింది. నెల తిరక్కుండా కారు దొంగిలించ బడింది. ఆకారుకొనుక్కున్న హగ్ డాంసీ ఇచ్చిన పొలీస్ రిపోర్ట్ కాపీ ఇదిగో పరిశీలించండి, యువరానర్

అబ్జక్షన్ యువరానర్ , కారు దొంగతనమునకు కేసును ముడిపెట్టుట సరికాదు

ముడి  పెట్టుటకాదుయువరానర్ ముడి విప్పుచు న్నాను. దొంగిలించబడిన కారును  10 కోట్లకు కొని మొత్తాన్ని  400 కోట్లు పెట్టి దక్షిణమూర్తి కొన్నట్లు చూపి  ఓవర్ సబ్స్ క్రి ప్షన్ మొత్తమును పెట్టుబడిదార్లకు తిరిగి ఇవ్వకుండా చైర్మన్ వాడుకున్నట్టు నేరమును అతడి మెడకి చుట్టినది , అమాయకురాయలయిన గ్రేస్ అతడి భార్య. యువరానర్ దక్షిణమూర్తి భార్య నుండి విడాకులు తీసుకొని ఈమెను(గ్రేస్) చేసుకొనుట మోసమయనచో భర్త ఉంటుండగా ఇద్దరితో అని చెప్పుచూ ముగ్గురితో అక్రమసమ్మందము నెరుపు ఈమె ఎంత మోసగత్తె!

 

గ్రేస్ కన్నీళ్ళ తో ఇచ్చటేమి జరుగుచున్నది పెద్దగా ఆక్రోశించుచూ శీలపరీక్ష చేయుచున్నారా అని రాజ్ కుమార్ తో వాదనకు దిగగా, అగస్త్యుడు కూడా లేచి గొంతు పెంచుటతో   న్యాయస్తానమందు పెద్ద గలాభా మెదల యినది. వివేకుడు సుందరి ఎంత వెనుకను లాగుచు న్ననూ అగస్త్యుడు శాంతించకుండుటచే వాగ్యుద్దముల వల్ల  పెద్ద గోల నెలకొనెను.

న్యాయమూర్తిగారు ; ఆడర్ ఆడర్ అని పలుమార్లు సుత్తితో కొట్తి కమ్ టు పొయింట్ అండ్ స్టిక్ టు కేస్ అని ప్రతివాది (డిఫెన్స్ లాయర్)ని మందలించినారు

ప్రతివాది : సారీ! యువరానర్

వాది : లండన్ పోలీసుల కళ్ళు కప్పి  దొంగిలించబడిన కారుని తీసుకెళ్ళడం అసంభవం అది కారు అగ్గిపెట్టి కాదు జేబులొ పెట్టి తీసుకెళ్ళడానికి.

ప్రతివాది : ప్రతి యేడు లండన్ నుంచి వందలాది కార్లు దొంగిలించబడి షిప్ కంటైనర్ లలో  ఫ్రాన్స్దక్షిణ ఆఫ్రికా- ఉగండా వంటి దేశాలు చేరుకుంటాయి. సంవత్సరం ఇంతవరకు లండన్ నుంచి మొత్తం 34 హై వేల్యూ కార్లు దొంగిలించబడ్డ ట్టు స్కాట్లాండ్ యార్డ్  రెపోర్ట్ పరిసీలించవలసింది గా కొరుతున్నాను.  8 దేశముల మీదుగా కారు భారత దేశము చేరుకొన్నది.  

వాది : ఇది యొక కట్టుకథ వలెనున్నది పూర్తివివరములున్నచో ఆధారములు చూపవలెను

ప్రతివాదిఆధారములను పరిశీలించండి  మొత్తము ప్రయాణ జాడను కనుగొన్నది భారత దేశపు  ప్రఖ్యాత డిటెక్టివ్. అతడు ఇక్కడే ఉన్నాడు.

వాది : అతడిని ప్రశ్నించుటకు అనుమతి ఇవ్వవలెను. అనుమతి ఇవ్వబడెను.

వివేక్ బోను ఎక్కి న్యాయమూర్తికి నమస్కరించెను

వాది : మీపేరు  -  వివేక్ పండిత్ - శాస్త్ర పండితులు మీరు

మా పూర్వీకులు సంస్కృత జ్యోతిష శాస్త్రములందు పండితులు

మీరు కూడా జ్యోతిష శాస్త్రములందు పండితులు వలెనున్నారే  జాతకములు చెప్పుచుందురా?

వివేకుడు లకుమవైపు చూసెను లకుమ ముఖము ఎర్రబారెను. వివేకుడు అవునండీ మీరు సరిగా పట్టేసినారు నేను మీవంటి ప్రాసిక్యూటర్ల జాతకములు చెప్పుచుందును. ప్రతి శనివారము మీరు గుడికి పొవుచున్నా నని మీ భార్యకు చెప్పి యల్లమ్మ తోట మూడవ వీధిలోగల రెండవ మేడ ఇంటికి పోవుచుందురు. ఇంక ఆదివారము మీరు... అని వివేకుడనుచుండగాఆపవయ్యా జాతకముల గూర్చి ఇప్పుడేల

లండన్ నుండి దొంగిలించబడిన ఒక  కారుని తీసుకొ ని పొవుట అంత సులభమా!

నిజమేనండీ ఒక్క కారుని తీసుకొని పోవుట కష్టమే అందుకే 4 కార్లను తీసుకు పోయినారు

ఫెరారి కారు తో పాటుగా మరొమూడు కార్లు ఒకే కంటైనర్ లో  ఫ్రాన్స్ చేరినవి. నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ప్రకారం ఇది వ్యవ స్తీకృత నేరము. ముఠా అవినీతిపరులైన పోర్ట్ అధికారుల ఆసరాతో కార్లను  ఖండాతరము తరలించుకు పోవుచూ వివిధ దేశాలలో ఏకరీతిగాలేని బలహీనమైన చట్టములను ఉపయోగించుకొనుచుండును. కన్యాలో దొంగిలించబడిన కారు కొనుక్కున్న వారే పత్రములను సరిచూచుకొనవలెను ప్రభుత్వము అచ్చట భాద్యతను తీసుకొనదు. అందుచే ఫెరారీ కారు ఉగండా వరకు సిమెంట్ మిక్సర్, హొటల్ టేబుళ్ళు గోనిసంచీ లు వంటి సాధారణ సరుకులతో కొనిపోయి, మొంబాసా పోర్ట్ చేర్చినారు

ఇది నీ ఊక దంపుడేనా లేక నీవేపోయి ఆధారారాలు సాధించి తెచ్చినావా?

మీరు సరిగ్గా పట్టేసారు. నేనే పొయి అన్నిపొర్టులనుండి ద్రువపత్రములను తెచ్చికోర్టు వారికి సమర్పించినాను

పోర్ట్ బాండ్ గిడ్డంగిలలో నిల్వ చేసినచో  గిడ్డంగి సుంకము చెల్లించి యజమాని వచ్చి విడిపించవలెను కదా వారి వివరములు అక్కడనమోదు చేయబడి యుండును. లండన్ పోలీసులూరకుందురా

మీరు సరిగ్గా పట్టేసారు. కారులో ట్రాకింగ్ దివైజ్ ఆధారముగా లండన్ పోలీసులు బాండ్ గిడ్డంగుల వద్ద కాపు కాయగా, గిడ్డంగి సుంకము చెల్లించునప్పుడు కారు యజమాని కాక కొనుగోలు చేసిన వారు  వచ్చి విడిపించుకొనెడివారు. అట్లయినచో వారినే పట్టుకొని నాలుగు తగిలించిన నిజము బయటకు వచ్చును కదా

వివేకుడు: లండన్ పోలీసులకు తగిలించు ఆచారము లేకుండుటవల్ల అయ్యి ఉండవచ్చు లేదా వారికి విదేశములలో శిక్షించు అధికారము లేకుండుటచే కావచ్చు

వాది : ఇదంతయూ వట్టి కట్టుకథ 

ప్రతివాది : మరి ద్రువ పత్రములు రసీదులు?

వాది :అంత అవినీతి దేశములందు రశీదులు పుట్టించుట కష్టమా రూపాయికొకటి.

న్యాయమూర్తి: దిస్ కేస్ ఈజ్ అజర్న్డ్


5 comments:

 1. బాగా చెప్పారు.అగస్త్యుడు ఒంటరి పోరాటం చేయవలెనన్నది నిజము. ఒంటరి పోరాటం మనిషిని శక్తివంతుణ్ణి చేస్తుంది.కోర్టు సీన్ కళ్ళకు కట్టినట్టు చూపించారు. కానీ వాయిదా పడెనే! తర్వాత వాయిదా కోసం ఎదురు చూడాల్సిందే!

  ReplyDelete
 2. యమున కల చదువుతున్నప్పుడు ఎలా అనిపించిందిముందే కల అని తెలిసి పోయిందా కలలో మీనాక్షి ప్రవర్తన ఎబ్బెట్టుగా ఉందా ప్రేమగా అనిపించిందా

  ReplyDelete
  Replies
  1. కొడుకు పరిస్థితి తెలిసీ మీనాక్షి నిజంగానే సహాయం చేయుటకు వెళ్ళెను అనిపించెను.కల అనుకోలేదు.కలలో ఏం జరిగినా ఎబ్బెట్టుగా అనిపించదు.అదే నిజంగా జరిగి ఉంటే అగస్త్యుని పాత్ర బలహీనపడేది. అతను ఒంటరిగా పోరాడితేనే తనను తాను నిరూపించుకోగలడు.

   Delete
 3. కోర్టులో అంతర్జాతీయ కార్ల చోరీ ముఠా , లండన్ నుండి ఫెరారీ ప్రయాణం మీకు నచ్చాయా? మన వివేకుడు ఎంత పదునో చూసారా? ప్రాసెక్యూ టర్ జాతకాలు చెప్తారా అని అడిగాడు అపరాధ పరిశోధకులుల వద్ద కూడా జాతకాలు వుంటాయి, కదా? వివేకుడు అందించిన హాస్యం బాగుందా? లకుమ ఎంత మారి పోయిందో చూసారా మంచి భర్తని ఎంచుకుందికదా?

  ReplyDelete
 4. ఫెరారి కారు వెనుక ఇంత కథ ఉందని అస్సలు ఊహించలేదు.వివేక్ మామూలోడు కాదుగా😄😄😄.

  ReplyDelete