Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, March 30, 2021

వన శృంగారం - మొదటి భాగం

రాధ కృష్ణుల శృంగారం కలియుగంలో అత్యంత ఆదరణ పొందింది.“వనశృంగారం”అనే ఈ కావ్యంలో కలియుగ రాధకృష్ణుల వనశృంగారం హృద్యమైన కందపద్యాలతో, సరళమైన గద్యంతో అత్యంత శృంగారభరితంగా సాగుతుంది. ఇందులో నాయికి నాయకలు రాధా కృష్ణులు.  రాదాకృష్ణులను పోలిన జంటలు ఇంకా ఉన్నాయా? అంటే ప్రేమ ఆధ్యాత్మిక భావాల తో ఒకరికొకరు అంకితమైన జంటలు ఉన్నాయా?  


ఉన్నాయి,  నేను ఒక జంటను చూసాను. మీరు కూడా చూసే ఉంటారు. కృష్ణ స్ఫూర్తి నేటి యువకుల్లో ఎక్కువే.    కానీ రాధ స్ఫూర్తి అంత సులభం కాదు. రాధ అంటే భక్తి, ఆధ్యాత్మిక, శృంగార భావాల సమ్మేళనం. అటువంటి  రాధ  నేటికాలంలో ఉందా?  అసలు రాధ ఎవరు?


అసలు రాధ ఎవరో తెలిస్తే రాధ ఉందో లేదో తెలుస్తుంది.

రాధ లేదా రాధిక శ్రీకృష్ణుని ప్రియురాలు. కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు. భారతదేశంలో రాధాకృష్ణులకు చాలా దేవాలయాలు ఉన్నాయి. రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్నిశతాబ్ధాలుగా వర్ణిస్తూ, చిత్రీకరిస్తూనే వున్నారు.ఈమెకు రాధిక, రాధే, మాధవి, కేశవి, రాధేశ్వరి, కిషోరి,శ్యామా, రాధారాణి అని పేర్లు. ఆమె శ్రీకృష్ణుని శాశ్వత భార్య (అంటారు). శ్రీ కృష్ణుడిని రాధికా పతి అని రాధను యశోదానందన పత్ని అని పాటల్లో కూడా పాడతారు.

 రాధ వివాహం 12 ఏళ్లకు యశోద సోదరుడు ‘రాయన్-తో చేయబడిందని  బ్రహ్మవై వర్తక పురాణంలో చెప్పబడింది. శ్రీకృష్ణుడు యశోద నందనుడు అంటే కొడుకు.  నందనుడు తమ్ముడు ఎలా అవుతాడు? రాయనుడు శ్రీకృష్ణుని అర్ధవతారం అంటారు.  

శ్రీకృష్ణుడి అష్ట భార్యల పేర్లు చూస్తే (రుక్మిణి: శ్రీకృష్ణుడి మొదటి భార్య - విదర్భ యువరాణి, 2. సత్యభామ 3. జమ్వంతి 4. కాళింది 5. నాగ్రాజితి, కోసల యువరాణి 6. మిత్రవింద, ఉజ్జయిని యువరాణి  7. భద్ర, కేకేయ యువరాణి  8. లక్షన.) అందులో రాధ పేరు కనిపించదు.

కొంత మంది స్కాలర్స్ రాధ యోగమాయ చేత తన ఛాయని సృష్టించిందని  రాయనుడు ఆ ఛాయనే పెళ్లి చేసుకున్నాడని తదుపరి  బ్రహ్మదేవుడు బృందావనంలో రాధా కృష్ణుల వివాహం జరిపించాడని చెపుతున్నారు.

ఎక్కువమంది రాధాకృష్ణుల శృంగారం భౌతికమైనది కాదని వాంఛాతీతమైన ఆద్యాత్మికమైనదని చెపుతారు. జయదేవుడు గీత గోవిందంలో రాధను స్వాధీనపతికగా వర్ణించాడు. రాధమాధవుల రతిలో చెదిరిన తన అలంకరణను శ్రీకృష్ణునితో సరిచేయించుకుంటుంది. గీత గోవిందం భక్తి కావ్యం అనుకుంటారు    

గీత గోవిందం రాధా కృష్ణుల శృంగార కావ్యము. జయదేవుని గీతగోవిందంలో మొత్తం 83 గీతాలున్నాయి. ఇవి రాధాకృష్ణుల మధ్య ప్రేమను, విరహ వేదనను వర్ణిస్తాయి.

 అన్నమయ్య వ్రాసిన శ్లోకాల్లో కూడా ఆధ్యాత్మిక  శృంగార కోవలకు చెందిన  శ్లోకాలున్నాయి. అన్నమయ్య తాను పూజించే దేవుడిపై  శృంగారం వ్రాసాడు. జయ దేవుడు కూడా తానూ పూజించే కృష్ణుడిపై శృంగార కావ్యం వ్రాసాడు.

వనశృంగారం కూడా అటువంటిదే. 60 కంద ఉత్పలమాల పద్యాల సమాహారంవనశృంగారం విరహ,శృంగార గీతమాల.  

 భరతముని రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొనిన ఎనిమిది రకాల నాయికలను అష్టవిధ నాయికలు అంటారు. వారు 1.స్వాధీనపతిక 2. వాసకసజ్జ.   3. విరహోత్కంఠిత  4. విప్రలబ్ధ,   5. ఖండిత   6. కలహాంతరిత  7.  ప్రోషిత భర్తృక        8. అభిసారిక. ఈ ఎనిమిది రకాల నాయికలు ఎనిమిది వివిధములైన మానసిక అవస్థలను సూచిస్తారు.

 “స్వాధీన పతిక..స్వాధీనుడగు భర్త గల నాయిక" ఈమెలోని ప్రగాఢమైన ప్రేమ, సుగుణాలకు భర్త పూర్తిగా ఆధీనుడౌతాడు. ఈ నాయిక నాయకునితో పాదాలకు పారాణిని గాని లేదా నుదుట తిలకం దిద్దుతున్నట్లుగా చూపిస్తారు. ప్రోషితము అనగా లేకుండుట. భర్త దూరదేశాల ఉన్నస్త్రీ ప్రోషిత భర్తృక. అష్టవిధ నాయికల్లో ఈమె కూడా​ ఒక కథా నాయిక. యశోద తమ్ముడు  అయనునితో వివాహమైన రాధ,  ప్రోషిత భర్తృక ద్వాపరమున కృష్ణునితో నెరిపిన శృంగార విహారములు వన శృంగారమునకాలంబన.

 రాధ వంటి భక్తి ఉన్న ఏ స్త్రీ అయినా రాధే. రాధ ఒక శక్తి , చైతన్య స్వరూపిణి.   ఈ కావ్యానికి స్ఫూర్తి రాధ.  రాధ వంటి ప్రోషిత భర్తృకలు కలియుగంలో చాలామంది ఉన్నారుఅందులో ఒకానొక రాధ కథ ఈ వన శృంగారం.

                                                          


అది సుందర కందరము  అచ్చటొక  వనము.  ఆహా !  ఏమీ వనము!   ఇది వనమా శృంగార సదనమా!     ప్రణయ భావనలకు  రూపమా    శృంగార దీపమా.  చింతా విదూర మంత్రమా. ప్రణయ జంత్రమా !   మానవ సృజనకు ఉత్కృష్ట రూపము వలె విలాస విహార  వినోద భావనలకు ప్రతిరూపము వలె  నున్న  ఈ  ఉద్యానము  మరో బృందావనము వలెనున్నది.  విస్తృత   పుష్ప పల్లవ  తృణ   నికుజ్జ  ద్వార  వృతిద్వార  స్త్రోత ,  దౌత, దాన ,  శిల్ప సౌందర్య కళా ఖండము వలె శోభిల్లుచున్నది 

సంధ్యాసమయమగుచుండెను. మలయానిలము తాకి మేను  పులకించుచుడెను. పికము తియ్యగా పాడుచుండెను బృందావనమునొక బంగారు చేలములు ధరించిన రాధ సంచరించుచుండెను.  స్వర్ణ భూషణములతో ఆమె బాహ్య సౌందర్యము వెలుగుచుండ  ఆద్యాత్మిక  సాహిత్య ఙ్ఞాన పరిపక్వతతో ఆమె అంతఃసౌందర్యము వెలుగు చుండెను. 

విరహోత్కంఠిత రాధా చైతన్యము పొంది ఉద్యాన వనమున  తన ప్రియుని కొరకు పొదరింట ఎదురుచూచు చున్నది. నా ప్రియుడు నను చేకొనగలడో లేడో యను ఆలోచనలు ఆమెను తట్టుచుండగా ఆ అలలపై తెప్పవలె తేలుచూ  వసుదేవసుతుడామె  మదిలో మెదిలెను.   

  

1.గోపాలుని  స్మరించుట 

. మదనా   సుందర  వదనా                            

మదకర  కలికిని, వలచిన మగువను  పట్టే         

వదలక  అంటుకు పోయిన   

విదురా  వరవా  సుదేవ  వందన  మిదిగో  

మదనా  (మన్మథా), సుందర  వదనా,  మదకర  కలికిని,  వలచిన మగువను, మత్తెక్కించే  మనోజ్ఞురాలగు,  ప్రేమించిన స్త్రీని,  పట్టే వదలక  అంటుకు పోయిన   ( లేవదీసుకు పోయి ) విదుర (సర్వము తెలిసిన ) వర (శ్రేష్ఠ ) వాసుదేవా , వందనమిదిగో. సుందరాకారా గోపాలా నిను వలచిన రుక్మిణీ దేవి వర్తమానము పంపుటతో నీవు  విక్రమముతో(heroically) ఆమెను అంటుకు (లేవదీసుకు ) పోయినావు.  వసుదేవ కుమార నీకు వందనము.

  2.సంధ్యాకాల వర్ణన 

. చంద్రో దయవే  ళనింగి  

చంద్రిక  లుకళక   ళనవ్వె  జంత్రము మోగే         

మంత్రము  గారమ  ణిరగిలె      

ఇంద్ర  కీలము తగలగ  ఈడే  రగిలే  

చంద్రోదయవేళ నింగిన జాబిలి  కళకళ నవ్వెను.  దూరము నుండి జంత్రము (వాద్యపరికరం) మంద్రము గా మోగేను.  ఇంద్ర  కీలము (మెరుపు )తగలగ నరములంగారము  రగిలి  రమణి   రాజుకొనెను.  మదన బాణము  తగలగ తవ  విరహేయని  రాధ  వేగుచుండెను.  

3.చెలియుడి గుణరూప విశేషములు 

క. వేషము జూడగ మెరుపే   

రోషము తోమే షగతియె  రేగుపొ  టేలే     

పేషణ జేసెను  బాధను

శేషముఁ జేసెద నునేను జీవిత మంతా

తెల్లని వస్త్రములతో మాటిమాటికి మీసము దువ్వు  అతడి వేషము జూడగ మెరుపే అనిపించును. రోషముతో  మేషగతి(అగ్ని)వలే రేగువాడు. పొటేలే  పేషణ (చూర్ణము)జేసెను బాధను. శేషముఁ జేసెద(అర్పణము జేసెద) నునేను నా  శేష ( మిగిలిన )జీవితమంతా. 

4.చెలియుడి గుణరూప విశేషములు 

.ఆజా నుబాహు డుపసిడి 

సాజా  తముక ల్గిసార  సారస మొలికే         

రాజాం  కుడుసా  హసికుడు          

బాజాల తోనను పరిగొను భాసుర ముగన్    

ఆజానుబాహు = పొడుగరి ; పసిడి సాజాతము (పోలిక ) కల్గి  ;  సార (గొప్ప)  సారస మొలికే  (చంద్రకళ తొణికిసలాడు)  రాజాంకుడు (చంద్రుని గుర్తుగాగల శివుడు)  సాహసికుడు; "బాజాల తోనను పరిగొను భాసుర ముగన్." రాధ మనసులో ఆలోచనలు ఆమె అలలులా ఎగిసి పడుతున్నా యి 

5.చెలియునితో శృంగార తపన 

 ఆజాను బాహు మానస  

చోరుడు రసికడు సఖుడు, చతురుడు నన్నే 

లుమగఁడు  నావల కాడే ,

ఉక్కుఛా తిననను గొని  ఊపును మరుడే.

మానసచోరుడు -మనసు దోచిన వాడు;  రసికుడు సఖుడు -శృంగారమును గ్రహించు ప్రియుడు ; చతురుడు నన్నేలు మగఁడు- తెలివైన మగడు ; వలకాఁడు = కాముకుఁడు libidinous man; ఉక్కు ఛాతిన, ననుగొని =నన్ను పరుండ బెట్టుకొని;  ఊపును, మరుడే =మన్మథుడే

6.కలికి విశ్వాస సంశయము 

క. ఏమో ఆతడే మురారి

ఏమో నేగో పికనని ఇంపుగ ననగా 

ఏమో యతడిని  నమ్మితి                       

నమో   గురుడత  డిమాట  నాతిచ రామీ

ఏమో ఆతడే మురారి  ఏమో నే  గోపికనని ఇంపుగ (ముద్దుగా) ననగా , ఏమో యతడిని  నమ్మితి , నమో   గురుడు (నమస్కారములచే పెద్దవాడు)   అతడిమాట  "నాతిచ రామీ" నమ్మవలెను. అనగా మనసులో  తనప్రియుని కృష్ణుడే  యని భావించిన రాధకు  ప్రియుని  నాతిచ రామీ  మాటలు స్ఫురణకువచ్చెను. 

 7.చెలియని రూపమును కని తాపము పొందుట  

. చీకటి పడుచుం డపడుచు    

వాకిట  నేనిల చివేచె వచ్చిన వాడే     

మాకిడి చూడగ రమణికి  మానము పొంగే 

ఆకలి చూపుల కుసొబగు లప్పన జేసే  

చీకటి పడుచుండ  పడుచు   వాకిటనే నిలచి వేచెను,  తెల్లని పంచె కట్టులో తన ప్రియుడు రానే వచ్చెను. వచ్చిన వాడే మాకిడి (దిగ్భ్రమ చెంది) చూడగ రమణికి  మానము  (చిత్తౌన్నత్యము, గర్వము) పొంగెను, అతడి ఆకలి చూపులకు  రాధ తన సొబగులు అప్పన చేసెను .  

8. చెలియ విరహతాప  ప్రభావము  

క. చీకటి పడుచుం డపడుచు    

పాకము కారే  టిపాప  పసిడం  దాలే        

 కాకను  పెంచగ  కాగెను  

 వాకయు సలసల, రగిలెను వాయువు జ్వాలై   

 చీకటి పడుచుం డపడుచు పాకము కారే టి పాప  పసిడం  దాలే ; కాక( వేడి)ను  పెంచగ  కాగెను  వాక (ఏరు) యు సలసల, రగిలెను వాయువు జ్వాలై  . అతిశయోక్తి  ప్రయోగము : శృంగార ప్రభావాన  వనము దరినున్న వాక కూడా వేడెక్కి సలసల మరిగినట్టు , వాయువు కూడా రగిలినట్టు వర్ణించబడింది . చీకటి పడుచుండ పడుచు డంబమంతా వెలిగెను  రమణి  కాగెను సలసల భూరి శృంగార గంగ పొంగగ మదిలో 

9.పారవశ్య ఉపసంహరణ 

 క. మోహము  కలిగెను  యవ్వన 

దాహము సహజము గపుట్టె దానిని  చూచే  

రాహితు చేయకు అబలకు   

మోహము సాహస మనకుర  మోజున కొనరా 

 మోహము  కలిగెను  యవ్వన  దాహము సహజముగ పుట్టె దానిని  చూచే  రాహితు, పలుచన లేక చీప్, చేయకు.  అబలకు మోహము సాహస మనకుర. స్త్రీలకు  కోరికలుండుట సాహసము అనక , మోజున కొనరా,  ప్రీతితో చేపట్టు 

10. ప్రణయ కాంత ప్రియునకు ఆహ్వానము  

 క.నీరా కకొరకు వేచితి    

రారా   రాధా మనోహ   రారవి కుంగే      

భారా  క్రాంత  ప్రణయి 

నీరా ధపిలిచె  నురార  నిరుపమ  వీరా 

11. ప్రణయ కాంత ప్రియునకు ఆహ్వానము

 నీరా కకై మ నోహరా 

వేచే నేసంధ్య లోరవి మసక బారే 

నుకనులు  కాయలు కాచెను

 రారా  మధుప   మైనన్ను గ్రోలర  వీరా!

రాధ పుష్పము. తన ప్రియుడు మధుపము. రవి మసక బార ఆమె తన మకరందమును  ప్రియున కర్పించు చున్నది.

12. ప్రియునకు కాంత ఉపదేశము

  క. చారిక  కోరిక తీరదు  

 తీరిక  చాలదు  అనకుర  ధీరుడ రారా

 చారిక సలుపును తీర్చర 

 తీరిక  మారదు రలోక  తీరిక అంతే 

చారిక (చెలి లేదా చెలికత్తె ) యొక్క కోరిక తీరదు , తీరిక  చాలదు  అనకుర  ధీరుడ రారా  చారిక సలుపును తీర్చర,  తీరిక  మారదుర  లోకతీరిక అంతే. లోకం కోసం రిత్తగా సమయ వృధా చేయక చెలి కోరిక తీర్చమని కొమరాలి కోరిక తెలుపుచున్నది  

శృంగార కౌతుకమును తెలియబరుచు  గీతాలు 

చారిక  కోరిక తీర్చగ రారా  తీరిక  చాలదు  అనకుర  ధీరా 

 చొరకొని రారా సరసా, సరసము విరసము చేయకు సూరా 

 హద్దులు మీరక ముద్దులు తీర్చర,  లౌక్యము నేర్చి లోకము

 నోర్చర,  పోరిక ఆపర  అపర సారంగధర వర సుకుమారా !

 హిరణ్య ధరుణ విరహిణి చరణ కింకిణులు నిను పలకరించగా   

 వసంత రాత్రి  రేరాణి పారాణి  నీపై విరితేనియలు చిలకరించగా 

చంద్రికలల్లిన చల్లనివేళ  మల్లె  పొదలలో అల్లరి చేయగ రారా  

మత్త జఘన యుగళాంతరమాద్రమయ్యె రా. మనోహర రారా 

స్వర్ణ వర్ణ శీర్ణ వలగ్నము శీఘ్రము గొన లగ్నమేలరా 

నరజాతికందిన సురసుఖమిది గొనరా ఇహపరమేలరా !!

 అర్థాలు : స్వర్ణ వర్ణ ( బంగారు రంగు ) శీర్ణ ( చిక్కిన) వలగ్నము ( నడుము) 

13.వరుని  శృంగార  చాతుర్యము 

క. వాగువ లెవరుని మాటలు     

సాగెను   రూపునె  లవంక సామజ  ఠీవిన్

సాగెను   డకఘా  టుకనుల     

లాగెను  పయ్యెద తలంత  లాహిరి  గమ్మెన్   

వాగు (సెలయేరు )వలె  వరుని మాటలు సాగెను . అతడి రూపు చూచిన నెలవంక (బాలచంద్రుడు)వలే నగుపించు ను.  సామజ ( ఏనుగు వంటి ) ఠీవితో అతడి నడక సాగెను. అతడి ఘాటుకనుల (ఎప్పుడు నా పయ్యెద పైనే యుం డును) నా పయ్యెదను లాగెను. నా తలంతాలాహిరి ( ప్రేమమైకము) గమ్ముకొనెను. 

14. వధువు సిగ్గిల్లి మోము దాచుకొనుట  (రాస క్రీడా విలాస ప్రారంభము)

  రూపసి యగుపతి నికాంచ 

 బుగ్గలు ఎర్రని గులాబి మొగ్గలు కాగా

 సిగ్గరి దాచెను మోమును  

 ఘాటుగ నాటిడు కనులకు చిక్కక రమణీ.

  ప్రియుని కంక్షా పూరిత నేత్రములు  చూచుచుండగా ఆమె సిగ్గిల్లి తన మోమును దోసిట దాచు కొనెను. 

15.   రాస క్రీడా విలాసము  వరుడు వధువును తాకుట 

క. అల్లన వీచుచు తెమ్మెర

మల్లెల  తావుల  నుతె చ్చి మోహము రేపెన్     

నుల్లము నూపగ రూపసి    

నల్లన  తీండ్ర  తొగాంచి నాభిక  మీటెన్ 

అల్లన వీచుచు తెమ్మెర ( మెల్లగా వీచుచున్న పిల్లగాలి) మల్లెల  తావుల  నుతె చ్చి మోహము రేపెన్  (మల్లెపూల సువాససనను తెచ్చి మోహమును రేపెను ) నుల్లము నూపగ ( మనసును ఊపగా )రూపసి +నల్లన (రూపశినల్లన ) అందగత్తెను మెల్లగా, తీండ్ర  తొగాంచి (కోరికతో చూసి) నాభిక  మీటెన్.  మల్లెల సువాసన మత్తె క్కించు  చుండగా ఆమె వంపుసొంపులను శృంగారేఛ్చతో కాంచి ఆమె నాభిని తాకెను.

16.   రాస క్రీడా విలాసము  వరుడు వధువును తాకుట 

క. అల్లన కురిసెను వెన్నెల 

చల్లగ  తనువం తతాక  జ్వాలలు రేగే       

జిల్లను చల్లని వేళన 

పిల్లను తీండ్ర  తొగాంచి పిరుదులు తాకెన్  

17. రాస క్రీడా విలాసము  వరుడు వధువును తాకుట 

క.నడుమును మీటుచు  నిలచెను

 నిడివిన  వెనుకగ మరుడై  నితంబి  నదిమెన్    

 అడుచుచు  అనుభవ  మందెను      

 కుడుచుచు  భోగము లనంద  కూతలు కూసే                                 

 నడుమును మీటుచు  నిలచెను.  నిడివిన ( నిలువుగా)  వెనుకగ మరుడై  నితంబి (పెద్ద పిరుదులు గల స్త్రీ) నదిమెన్  ( హత్తుకొనెను ) అడుచుచు  అనుభవ  మందెను.   కుడుచుచు  భోగము లనంద  కూతలు (రతికూజములు )కూసే. 

18. రాస క్రీడ పతాక స్థాయికి చేరుట 

 ఊయల  లూగెను అంగన

ఊయల లూగగ సువదన ఉరసిజ  మూగే

ఊపులు చూచిన వేడుక

కూకూ యంచూ సుఖముగ కూసెను పికమే

సైకత జఘనమును చూచి ఘాతమును పొంది ఆకర్షితుడైన ప్రియుడు ఆమెను వెనుకనుండి వాటేసు కొనెను.  అట్లు ఊయలలూగు చున్న రాధ స్తనములు లూగుచుండెను. ఆ ఊపులు చూచిన కోయిల వేడుకతో  కూసెను.  

19. రాస క్రీడ పతాక స్థాయికి చేరుట 

క. ఊయల  లూగగ మగనితొ 

కోయల  తియ్యం గకూసె కాంతుడు రేగే 

ప్రాయము   రతికూ జితములు  

కూయగ  తాపము నజాణ  కోకిల జారే

అట్టి చంద్రిక లలిమిన చల్లిని ఉద్యానవనమున ఒక చెంప పూపరిమళములు  మత్తెకిచుచుండగా మరొక చెంప ప్రేయసి అందములు మరులు గొలుపుచుండగా ప్రియునికి ఉత్తుంగ శృంగచలనము కలిగెను. వారి ఆలింగనములో విస్ఫులింగములు రేగి రతి కూజితములు వెలువడినవి. అదివిని కలతచెందిన  కోకిల  ఎగిరిపోయెను

20. శృంగార క్రీడకు కోకిల స్పందన 

 కోకిల జాణే నేమో

ఇంకను నిలచిన వలువలు  ఏమగు నేమో   

 కోకిల రేపగ  వరుడే

 రేకను కోరుచు  మరుడై రేగును ఏమో 

కోకిల జాణే నేమో? నిస్సందేహముగా కోకిల జాణే, అనగా నేర్పరి  అని అర్థం. ఏకాంతమునున్న ఏకాంతనూ కాంతుడు వీడడు అని సత్యమును గ్రహించి జరగబోవు శృంగారమును ఊహించి మనుజుల వలె మూర్ఖముగా నుండ పని ఏమని కోకిల తన ప్రియునికడకు ఎగిరిపోయెను.  

21.శృంగార క్రీడకు ప్రకృతి  ఆలంబన 

 క. తొలగెను కందము  నింగిన 

 వెలిగెను జాబిలి వరాల వెలుగే పరిచెన్ 

 నిలచెను  నెచ్చెలి చెక్కిట  

 కళకళ  బుగ్గల నుజూడ  కన్నులు  నిండే 

ఆకాశమున కందము అనగా మేఘము తొలగిపోగా జాబిలి  నిండుగా వెలిగెను . ఆ నిడుపున్నమి వెన్నెలలో ప్రేయసి నున్నని చెక్కిలి వెలిగెను. చక్కని చుక్క  అందమును వెన్నెలలో చూచుటనిన  ముఖమల్  గుడ్డపై ముత్యాలు పోసినట్టే  కదా !

22.శృంగార క్రీడలో వరుని కళ్లతో కవ్వించుట 

క. గిలిగిం  తలిడతాకి   సఖుడు   

 చెలిమే  నంతపు  లకించె చెలగకు  చములే 

 పిలిచిమ   దిరాక్షి  జూపెను 

 సలుపం   తకనుల సఖుడు సవరించె కానే  

గిలిగింతలిడెను ( రాధకు)   తాకగ   సఖుడు.    చెలి మేనంత  పులకించె చెలగ (ఉత్సహించు ) కుచములే.  పిలిచి మదిరాక్షి  జూపెను (ప్రియునకు)  సలుపంత కనుల ( కనులలో ).  సఖుడు సవరించె కానే ( కాను - నడుము ) అనగా అతడు నడుము తాకి ఆమె తాపము తీర్చెను.

23.శృంగార క్రీడలో వరునికి చిక్కక  మురిపించుట 

కలిగెను   ఎన్నడు  దెలియని 

గిలిగిం  తచెలువు  డుతాక గెలివిడి  హెచ్చెన్ 

వలపుగొ  నిపరుగు  లిడుచు     

చెలిరం  భోరువు  లుగుద్ద చెదిరే నంచల్  

గిలిగింత పడుచు , పడుచు పరిగెడుచున్నది. ఇట్లు  ప్రియునికి దొరకక పరిగెత్తుట శృంగార క్రీడా విశేషము. అట్లు వలపుగొని మోహముతో పరిగెత్తుచున్న రాధ వెన్నెలలో విహరించుచున్న ఒక రాయంచలను ఊరువులతో గుద్దుకొనగా రాయంచలు చెదిరినవి.   శృంగారమందు వారి దూకుడట్లున్నది  

(నేటి కాలమున యువతీ యువకులు శృంగారమనిన మైధునమనుకొనుచున్నారు. శృంగారము  మైధునము వేరు వేరు. Sex and Romance are different. శృంగారానికి పరాకాష్ఠ గిలిగింత. మైధునమునకు పరాకాష్ఠ  భావప్రాప్తి.   చూబించుట , చుంబించుట , తాకుట,  కౌగిలించుకొనుట ఇట్లు వలపును  తెలుపు చేష్ట లన్నియూ శృంగారమే. శృంగారము లలితము.  మైధునము విశృంఖలము పాశవికము.  స్త్రీ పురుషుల అంగములు వారిని నిలువనీయక పాశవికంగా మార్చును. దానికి పరాకాష్ఠ మైధునము.)

24.కవ్విం  చుకనుల   రాధను

 రాయం చలుచు  ట్టముప్పి  రిగొనిము రారే 

జారిన పయ్యెద గప్పుచు

వాలుగ చూచిన సుజాత ముంగిట నిలిచే" 

 రాధ తన జారిన పైటను కప్పుకొనుచూ వాలుకనులతో ప్రియుని కవ్వించుచున్నది  రాయంచలు ఆమెను చుట్టి  రక్షకవలయము వలే నిలచినవి, ఆదృశ్యము చూచినమురారిముప్పిరి గొనెను. సుజాత-మంచి వంశములో పుట్టిన స్త్రీ 

25.రాయంచల కూడి  వన శృంగార కేళి 

క. ముసిరిన మరాళ ములేకని    

కసిరిన  మురారి నిజూచి కాంతయు జడనే  

విసరుచు ముద్దుగ చూచుచు    

ముసిముసి  నవ్వున మురారి ముఖమును  కనెనే 

26.రాయంచల కూడి  వన శృంగార కేళి 

 ముసిరిన మరాళ ములుము 

 ద్దుగలగ మురారి నుఱుముచు నిలిచే 

మురిసిన మురారి విసిరిన 

వాల్చూ  పులువిరి  సినఎద  వీణను మీటే

ముసిరిన మరాళములు ముద్దుగలగ మురారి నుఱుముచు నిలిచే మురిసిన మురారి విసిరిన  వాల్చూపులు  విరిసిన   (అనఁగా  fully developed) ఎద వీణను మీటే. శబ్దాలంకారములు గ్రహించుటకు యధాతధంగా ప్రస్తుతించబడినది.

26. వన శృంగార చెలగాటము 

క. వనమున  పిట్టా పులుగులు 

మనమున రాధకు సఖులు మదనుని కెరుకే  

గునుపును చూడగ వేడుక  

తనువున   కలిగెత రితీపు తరుణిక నవ్వే 

వనమున  పిట్టా పులుగులు మనమున రాధకు సఖులు (అది)  మదనుని కెరుకే. అయిననూ అతడిని అడ్డగించిన  రాయంచల పై అలుకవహించెను.  అతడి గునుపు ( క్రీడా విలాసము, అలుక నటించుట)ను  చూడగ వేడుక.   అది వేడుక క్రీడే.  అది  చూచిన రాధకు  తనువున  కలిగె తరితీపు ( కోరిక  సలుపు ) తరుణిక నవ్వే అనగా అతడి అలుకను  చూచి  అంగన చక్కటి శరీర సౌష్టవం గల  రాధ  నవ్వుచుండెను. 

29. వన శృంగార చెలగాటము 

అంతట  మురళీ ధరుడా  

మెపిరుదు లపైచ రిచేను మెల్లగ ఊగే 

నుఉల్ల  ముచల్ల గపఱుగి

డెరమణి పిరుదుకొ  నుచుమరు  డామెను తరిమే   

అంతట  మురళీ ధరుడామె పిరుదులపై  చరిచేను.  మెల్లగ ఊగేను ఆమె ఉల్లము. చల్లగపఱుగిడె రమణి పిరుదుకొనుచు ( వెంటబడుచు )మరుడామెను తరిమే.

30.శృంగార చెలగాటమున  ప్రియురాలిని పిరుదుకొనుట 

 క. బ్రమరి పారరి ఇరువురు  

క్రమము గవెలిగె  నువనము  కౌముది హెచ్చే 

ద్రుమము లుగుప్పె   తావులు        

బ్రమర  ములాయి రివారు  బ్రామిక పెరిగే 

31. శృంగార చెలగాట హేలి 

 బ్రమరి పారగ  కొమరా 

లందెల ఘల్లన రవళిలు అంతట పాకే 

తుంటరి తుమ్మెద  తేనే 

కోరుచు  వంటరి రమణిని కొసరుచు సాగే 

బ్రమరి పారగ (చుట్టూ తిరుగగ) కొమరాలందెల ఘల్లన రవళిలు అంతట పాకే. వెన్నెల నిండిన వనమంతా ఆమె అందెల మోత అల్లుకొనెను. తుంటరి తుమ్మెద(రాధ ప్రియుడు, కాబోవు మగడు)తేనే కోరుచువంటరి రమణిని కొసరుచు సాగే.


32.శృంగారము పతాక స్థాయికి చేరి ముద్దుతో ముగియుట 

జవ్వని   చేరెను  కొలనుకు 

 మువ్వల మోతలు ముదముగ మురిపిం చంగా

సవ్వడి చేయక చల్లగ     

నవ్వుచు మురారి పిరుదుకొ నామెను  అందెన్   

33.చివరకు చేరెను  చిలుకలు  

కలువల కొలనును పెదాలు  కలుపగ పిలిచే 

వీణను మీటుచు గోపిక 

విభునకు ముద్దొక టొసగుచు వలపును తెలిపే   

జవ్వని   చేరెను  కొలనుకు మువ్వల మోతలు ముదముగ మురిపించంగా,  సవ్వడి చేయక చల్లగ  నవ్వుచు మురారి పిరుదుకొని  (వెంటపడి ) ఆమెను   అందెన్ ( పట్టుకొనెను) చివరకు  చిలుకలు  కలువల కొలనును చేరినవి   గోపిక వీణను మీటుచు పెదాలు కలుపగ పిలిచి.  విభునకు ముద్దొక టొసగుచు వలపును తెలిపే.  ఇట్లు వలపును తెలుపు చర్యలన్నియు శృంగారమనబడును. రాధాకృష్ణుల తమ వలపును  శృంగారమట్లు  ముగిసిన పిదప  రాధ తన మానసమును విశిదపరిచెను.   


34  సీ.  కోరికి లొలికించు  కన్నులు కన్నులు 

మురిపించి ఇచ్చేటి ముద్దు ముద్దు 

సరసమా డునపుడు  సమయము సమయము 

వలకాని  పలుకుల వలపు వలపు

ప్రేయసి  నిముద్దిడు  పెదవులు పెదవులు 

జతగాడు  చూపించు  జగము జగము 

అభికుని సరసన   హాసము హాసము 

పరిణేత  తోడిదే బతుకు బతుకు

   

                                                            Romance is so delicate. 

10 comments:

  1. It is a story in poems, can you read and give me a feedback tomorrow also?

    ReplyDelete
  2. O my god.No words.Really you wrote a beautiful story

    ReplyDelete
  3. అనితరం.అసాధ్యం.అలవోకగా వ్రాసెదరు తమరు.కానీ సమయం పట్టునే మాకు అర్థం చేసుకొనుటకు

    ReplyDelete
  4. పద్యమంటే ఉప్పుకప్పురంబు అనే మా చిట్టి బుర్రలకి ఊహాలోక విహారంలో ఉబ్బితబ్బిబ్బయ్యే పద్యాలూ నేర్పిస్తున్నారు గురువుగారు.....ధన్యోస్మి

    ReplyDelete
  5. కావ్యం మొత్తం కంద పద్యములతోనే రాయదలిచితిరా!

    ReplyDelete
  6. Sir,Really the romance is awesome. As you said romance is so delicate. It happens only when two hearts can sing together. Whether the couple may be married, or may not be married to each other if their souls mingle with each other they can lead beautiful romantic life. As usual you used beautiful language to describe beautiful romance.As you said ruffians can't do romance. Coz they
    can do sex with deadbodies also.Those who knows the value of romance couldn't not attempt rapes

    ReplyDelete
  7. Unknown garu తపస్సు భంగం చేసే అప్సరసల గురించిమీరు విన్నారు. తపస్సుని ప్రోత్సహించే అప్సరస గురించి విన్నారా? అటువంటి అప్సరస గురించి ఒక పద్య కావ్యం వ్రాస్తాను.

    ReplyDelete
  8. వెంకట కవి గారికి జయమగు గాక!

    ReplyDelete
  9. చాలా చక్కగా రాశారు మాస్టారు. ఇన్ని భాషలలో పట్టుత్వం సంపాదించారు. మీ శిష్యుడు గా ఉన్నందున చాలా గర్వంగా ఉంది నాకు.

    ReplyDelete
  10. స్వర్ణ వర్ణ శీర్ణ వలగ్నము శీఘ్రము గొన లగ్నమేలరా ..chala bagundi andi pada prayogam🙏

    ReplyDelete