Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, March 23, 2021

నిజమైన అదృష్టం

మల్లాది అనిల్ కుమార్ గారు , ఈయన మనందరికంటే  చాలా బిజీ  కానీ భారతవర్ష లాంటి వేయి పేజీల గ్రంధాన్ని ఆమూలాగ్రంగా చదవడమే కాకుండా  స్వచ్ఛమైన తెలుగులో అనర్గళంగా విశదీకరించారు. తడుముకోకుండా ఇంత  ధారాళంగా తెలుగు మాట్లాడడం ఒకఎత్తు, ఏమాత్రం ముందుగా అనుకోకుండా, అప్పటికప్పుడు మాట్లాడ్డం మరో ఎత్తు.   

నిజమైన , భాషా ప్రేమికుడు అన్న పదానికి నిలువెత్తు  ఉదాహరణ అనిల్ గారు. పురుషులందు పుణ్యపురుషులువేరయా! అన్నట్టు  స్నేహమందు  స్వచ్ఛస్నేహమువేరయా  చెప్పచ్చు.   స్నేహశీలులయందు  నిస్సహాయ( helpless) స్నేహశీలులు ఎక్కువకనిపిస్తూ ఉంటారు.   క్రియాశీలక ( practical) స్నేహశీలికి  మంచి ఉదాహరణ అనిల్ గారు.   భారతవర్ష చదవమని ఒక్కసారి ఆడిగేను.  అంతే  అనిల్ గారు బ్లాగ్ లింక్స్  అనుసరిస్తూ రోజుకి పది కంటే ఎక్కువ ఎపిసోడ్స్ చదివి నన్ను ఆశ్చర్య పరిచారు. (రోజుకి పదిసార్లు ఫోన్ చేసిన ఒక్క ఎపిసోడ్ చదవనివారు ఉన్నారు. 99 శాతం ఇలాటివాళ్లే ఉన్నారు నేడు) ఇలా చదవగలగడం  చదివినది అంతా , గుర్తుంచుకొని అనర్గళంగా మాట్లాడగలగడం,  ఈర్ష్య లేకుండా  ఉదారంగా ఉండడం అరుదే కాక అద్భుతం . ఇలాంటి వారు ఉండడం  తెలుగు భాష, నేను  చేసుకున్న అదృష్టం.  

అనిల్ గారు ఏం చెప్పారో  ఈ లింక్ చూడండి   https://youtu.be/-P27VvQs6JM 

 ఇంతకంటే ఎక్కువ స్నేహంగా మెలిగే వారు ఉన్నారు. వారంటే అభిమానం కొద్దీ వారు ఈ కావ్యం చదవాలని ఎన్నో సార్లు  బ్రతిమాలెను. కనీసం 20 నుంచి 30 సార్లు  అడిగాను. అయినా ప్రయోజనం లేకపోయింది. వాళ్ళు చెడ్డ వాళ్ళు కాదు , చదవడం  విషయంలో  చేఁతక్కనివాళ్ళు అంతే. ఆవిషయం నేను అనడం లేదు వాళ్లే  అన్నారు. వారి మంచి మనసుకి, వారికి నా నమస్సుమాంజలి. 

నాకు తెలియకుండాచదివినవాళ్ళు కూడా ఉంటారు.   ఈర్ష్యతో వారేమీ చెప్పలేకపోతున్నారు.   కవి చావాలి భాష బ్రతకాలి అంటే ఎలా ?  వృక్షాలులేక ఫలాలు లేవు, కవులు లేక కావ్యాలు లేవు. తెలుగు భాష కి ఏదైనా చేయాలంటే కవికి రచయితకి సాయం చేయాలి. ( అంటే మీరు ఈ లింక్ షేర్ చేసుకుంటే చాలండి )

కొంతమంది అభిమానించేవారు , నాకు ప్రేరణ కలిగించినవారు, జీవితంలో భాగమైన వారు  కూడా  ఉన్నారు.  వారు లింక్ షేర్ చేయక్కరలేదు. అయినా  వారెప్పుడూ అమరులే.     

 నేను కవిని  అంటే చాలామందికి  వినడానికి ఎబ్బెట్టుగా ఉందట.   ఈరోజు ఎబ్బెట్టుగా ఉండచ్చు  కానీ నారచనలు పోనుపోను మీరే చూస్తారు. ఎవరు చూడకున్నా పుష్పం వికసించక మానదు. చిన్న ఉదాహరణ చూడండి 

 245 పేజీల మొల్ల రామాయణం పూర్తిగా చదివాను. 218 తెలుగు పద్యాల ఇతిహాసం (రాముని కథని) రచించారు కవ యిత్రి మొల్ల. ఆవిడ వ్రాసిన కావ్యం  సీసం కందం , తేటగీతి  ఆట వెలది,   ఉత్పలమాల చంపకమాల పద్యాల మిశ్రమం.  ఈ పద్యాలన్నీభారతవర్షలో నేను వ్రాసినవే. మొల్లకంటే ఎక్కువ పద్యాలతో నేను రామాయణం రెండు వారాల్లో రచిం చగలను. నేను రోజుకి రాయగలిగిన వృత్తపద్యాల సంఖ్య 20.  సనాతని దయ ఉంటే ఏదైనా సాద్యమే!

8 comments:

 1. నిజమే మనం చూడకున్నా పుష్పం వికసించక మానదు..... వికసించే పుష్పాలు చూసే అదృష్టం కొందరికే ఉంటుంది. మీ వంటి కవులు 21 శతాబ్దంలో ఉండటం....మాకు హితులుగా,సన్నిహితులుగా మరీ ముఖ్యంగా గురువులుగా ఉండటం మాకు సాహిత్యమ్మ అనుగ్రహం.

  ReplyDelete
 2. Roopa, నీ పరిచయం మధురాతి మధుర సాహిత్య బంధం వేఏళ్లు వర్థి ల్లవమ్మా కువలయాక్షి

  ReplyDelete
 3. సాహిత్యంమీద అభిరుచి తగ్గిపోతున్న ఈరోజుల్లోఇలాంటి వారు దొరకటం అరుదు

  ReplyDelete
 4. Thank you sir! Keep the Good work.i will try to complete this Novel.

  ReplyDelete
  Replies
  1. పరమేష్ గారు మీరు సాహిత్య పథంలో సూరిలా సాగిపోవాలి. ధన్యవాదాలు

   Delete
 5. మల్లాది అనిల్ గారు భారత వర్ష గురించి ‌‌‌చాలా బాగా విశ్లేషించారు.ఆయన ప్రతీ మాటలోనూ నిజాయితీ కనపడుతుంది.మిమ్మల్ని కవి కాదు అన్న వారు రాక్షస సంతతి అయ్యి ఉంటారు. కథ మొదటి భాగం నుంచి అనుసరించిన వ్యక్తిగా ఈ విషయం చెప్తున్నాను.కనులారా చూడకపోయినా కథ చదివి అర్థం చేసుకున్న ప్రతీ వ్యక్తికీ మీ శ్రమ, విజ్ణత అర్థం అవుతుంది.రాధా మనోహరం కన్ను మూసేంతవరకు కనులు ముందు సాదృశ్యం అవుతూనే ఉంటుంది. వేయి పడగలను మించి భారత వర్ష ఉంది.ఈ తరంలో భారత వర్షను మించిన కావ్యం ‌‌‌ఉధ్భవిస్తే మీ కలం నుండే ఉధ్భవించాలి తప్ప వేరొకరు రాయలేరు.

  ReplyDelete
 6. ఏదో ఒకరోజు నా కథ ముగిసేలోగా మీకు ఘన సన్మానం చేసేలోగా..కావ్య సన్మానం స్వీకరించండి అనామిక గారు.

  ReplyDelete
 7. Sir anil garu me gurinche meru rasina kavayamu gurinche enta baga cheparo danikana gopaga meru anil garu ki kruthaganthalu cheparu sir adi sir me gopathanamu .anevaliki emi telusu sir me krushi, kastamu, patudhala ,telugu basha patala sagithayamu patala me tapana mana chutu undea prapachamea adi sir okalu pike velthunaru antea 10 pandhi valanu patukoni kindaki lagali ani anukuntaru .melanti gopavalu ma jeevithamulo parichayamu avadamu andilonu ma guruvaru garu avadamu madi ento adrustamu sir telugu bratikinchadamu kosamu saraswathi thalli melanti valani putisthunadhi me dwara telugu basha ,sahityamu brathikisthunadhi anduku sada ha thalli ki kruthaganthalu.meru enka eno gopavi rayali ani manasupurthiga korukuntunanu sir

  ReplyDelete