Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, February 27, 2021

కొత్త రంగులు

 మీనాక్షి అరుణతార పాత్రలు ఇంత  ఉన్నతమైన పాత్రలవుతాయని మొదట తెలియదు. 1 నుండి 20 ఎపిసోడ్స్ లో మీనాక్షి అరుణ తార పాత్రల ప్రారంభ దశ ఇమిడి ఉంది. మన ఇద్దరికే తెలిసిన విషయాలు ఇక బాహ్య ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాయి.  ఇంత  ఉన్నత పాత్రల ఔచిత్యం  దెబ్బతినకుండా   ఈ 20 ఎపిసోడ్స్ లో పాత్రల కు చిన్నచిన్న మౌలిక మార్పులతో   ఔన్నత్యం  పెంచి భారత వర్షను ముద్రణకు సిద్ధం చేస్తున్నాను. అప్పుడే అది కలకాలం నిలిచే కావ్యం గా నిలిచిపోతుంది 

నిన్నరాత్రి 20 ఎపిసోడ్స్ కి రంగులద్ది 12 పాటలు వ్రాసాను.  మెదడు హ్రదయంలోకి  గళం కలలోకి ఇంకిన రాత్రి,  నిన్నరాత్రి. సహృదయులైన పాఠకులు చదవగానే ఈ ఎపిసోడ్, 20 ఎపిసోడ్స్ లో పేరా గ్రాఫ్స్ కి  ఉన్న  రంగులు మాయమవుతాయి.

భారత వర్ష ఒక వీణ  నీవొక ఒక తీగ నేనొక తీగ 

నీవొక రాగం నేనొక రాగం రెండు తీగల తీయనిరాగం , కుసుమ పరాగం 

భారత వర్ష ఒక తీగ నీవొక కుసుమం  నేనొక భ్రమరం 

తేనెలు చిలికే అమృత కుసుమం అలుపే ఎరగని తుంటరి భ్రమరం 

వంటరి పయనం  ఎగసిన కెరటం ఇరుహృదయాల సాహిత్య మథనం 

అతిథి కిచ్చే ఫలమైనా అంకితమిచ్చే కావ్యమైనా ప్రక్షాళన చేసే కదా ఇస్తాము  - రచయిత   


4 comments:

  1. No words sir. Song is superb. I am very happy to hear that you are going to publish this book.

    ReplyDelete
  2. అయ్యో, గురువుగారు పబ్లిష్ చేయనని ఎందుకనుకున్నారు ? ఆన్లైన్ పబ్లిషర్స్ కి కూడా ఇవ్వాదలిచాను. విజయవాడలో గ్రాండ్ బుక్ రిలీజ్ కూడా ఏర్పాటు చేస్తున్నాను. బుక్ రిలీజ్ తో పాటుగా వేదికపై సంగీత కచేరి , కీబోర్డ్, తబలా వాద్యసంగీతంతో పాటుగా జాతీయ స్థాయి కర్ణాటక సంగీత విద్వాన్సు లతో కావ్యంలో ఉండే 6 పాటలు పాడిస్తున్నాను. 10 పాటలతో మ్యూజిక్ ట్రాక్ ఆల్బమ్ రిలీజ్ చేస్తున్నాను. మీరు మెచ్చిన టైటిల్ సాంగ్ సినీ సింగర్ (సునీత గారి) తో పాడించే ప్రయత్నంలో ఉన్నాను. చెప్పడానికి సిగ్గేస్తోంది కానీ మీ దయవల్ల సంగీత స్వరకల్పన కూడా అబ్బింది. అన్నట్టు చెప్పడం మరిచాను బల్లిపాడు మదన గోపాలస్వామి పై భారతవర్ష వ్రాసిన పద్యకావ్యం " మదనగోపాల మహిమ " నిజమే. ఈ చిన్న పద్య కావ్యాన్ని స్వామివారికి అక్కడికెళ్లి అంకితం ఇస్తాను. అయితే పెద్ద కావ్యాన్ని అంకితం ఇవ్వడానికి ఎక్కడికీ వెళ్ళక్కరలేదు.

    ReplyDelete
  3. 1 భారత వర్షం ఆనందసాగరం - టైటిల్ సాంగ్
    2.అతులిత స్వరరాణి -వీణాపాణి
    3.జగదానంద కారకం - నీజననం
    4.అప్సర పుత్ర అగస్త్య - కుంభ సంభవ అగస్త్య
    5.నీరంధ్ర కురులతో నిలిచె మా లక్ష్మి
    6.భారతవర్షం సారంగం పద తారంగం closing song

    ReplyDelete
  4. My Interaction with Venkat sir started very recently . One thing I would like to say as , whenever we discuss, I use to carry a new concept or things at the end of conversation .

    Bharata varsha , It's a unique book which has values and principle. I hope once we start reading this, for sure we will get addict to complete it.

    Venkat Garu, thanks for your time for writing Bharata varsha , specially in Telugu. I wish all the very best for all your endorsements.

    ReplyDelete