ఆనందనిలయమునకు చేరువలో నున్న "అపూర్వ" కల్యాణ మండపమందు పుష్పమాలాలంకృతమై ధగధగకాంతులీను ఉన్నత వివాహ మండపముపై గోపురములవలె నాలుగు చిన్నమంట పములలో నలుగురు పురోహితులు, పదిమంది వేదపండితుల మధ్య నాలుగు కుటుంబముల వారు నిలిచి యుండిరి. పవిత్ర మాఘ మాసమున మాంగళ్య బంధముతో ఒక్కటైన జంటలు తలంబ్రాలు , అక్షింతలు, మంచి గంధము కర్పూర సువాసనలు వెదజల్లుచుండగా బంతి చామంతులవలె ప్రక్క ప్రక్కన నిలిచిరి.
రాత్రి 8.00 గంటలగుసరికి పెళ్లిళ్లు ముగిసినవి. రాత్రి భోజనములు సమయమ గుచుండుటతో పెక్కు మంది ఆహ్వాని తులు వివాహ విందుకు పోయినారు. కొలదిమంది ఆహ్వానితులు పెద్దలు మాత్రమే ఉండుటతో మండపం గది అంత యూ ఖాళీగా కనిపించుచుండెను. సంగీత కచేరివారు కూడా తమ తమ సాధనములను తీసుకొని వెడలుచుండిరి కేశవుడు వారిని భోజనములు హాలు లోకి తీసుకు పోవుచుండెను.
సందీపుడు మంజూషను తీసుకొని తన తల్లి తండ్రులతో సబ్బవరం పోవలెనని యోచించుచుండగా మాలినిగారు " పిల్ల ఇంటనే శోభనం వేడుక జరిపించవలెను. అది ఆనవాయితీ" అని ఎంత చెప్పిననూ సందీపుడు శోభన వేడుకలకు అంగీ కరించకపోవుటచే వర్షుడు కూడా సందీపుని అభ్యర్ధించగా సందీపుడు వర్షునితో " నేను నేరుగా బెంగళూరు పోవలెను నా సంస్థ చూచుకొనుటకు ఇప్పుడు అచ్చట నా అనువారు ఎవ్వరునూ లేరు , నన్నర్ధము చేసుకొనవలెన"ని వర్షుని చేతిలో చేయి వేసి చెప్పెను.
పెంచలయ్యగారు వర్షునితో "త్వరలో మాఇంట మానందిని కి పెండ్లి చూపులకు వత్తురు ఇప్పటికి పోనివ్వవలెన"ని అనగా నందిని " అవును మానాన్నకు పెండ్లిచూపులు జరుగును మీ రందరూ రావలెన"ని చమత్కరించెను. మాలిని గారు మంజూషను వియ్యపురాలి చేతిలో పెట్టుచూ మాటలు కరువయ్యి ఏమి చెప్పుటకూ తోచక గుండెలు బరువ య్యి కొద్ది క్షణములు అట్లే నిలిచి ఎట్టకేలకు మంజూష తో " నీకు తల్లి గురువు ఈమే , అల్లుడు నీ అమ్మవలె వలె నీవాడమన్నట్లు ఆడువాడు కాదు, అన్న వలె మృదువుగా నుండకున్ననూ ,దెబ్బలాడిననూ అణుకువతో ప్రేమతో నుండవలెను. పుట్టింట సాగినట్లు అత్తింట అలకలు సాగవని గుర్తుంచుకొనుము. భర్తవద్ద బెంగుళూరులో ఎట్లుందువో అని వ్యాకులతతో సాందీపుని చేయందుకొని మంజూష చేతిని అతడికి అందించుచుండగా మీనాక్షి" బెంగుళూరులో నేను ఉండగా నీవు ఇంత విచారపడవలదు.” అని మాలినిని ఓదార్చెను.
సందీపుడు మంజూషలు మాలినిగారికి ప్రణామము చేసిన పిదప సందీపుడు మంజూషను వర్షునివద్దకు కొనిపోయెను. వర్షుడు ఆశీర్వదించి సందీపుని గుండెలకు హత్తుకొనెను. పిదప అతడి రెండు చేతులు పట్టుకొని చిన్ననాటి స్నేహితు లమన్న దయ ఉంచుము. అని వర్షుడు అనుచుండగా సందీపుని కన్నులు తడిఅయ్యెను. ఆడపిల్ల నేకపోతే ఇల్లంతా ఎలితి , ఏటి సేత్తాము పల్లకో నాయినా అని పైడమ్మ గారు వర్షునికి ఓదార్పుచెప్పుచుండగా " నందిని " ఓలి పైడి! నువ్వు పల్లకోయే , మంజూస ఎల్లిపోతే , నాను లేనేటి ?! వర్సని నా నొగ్గుతాననుకొంతన్నావేటి !" అని గ్రామీణ భాషలో మాట్లాడుటతో అందరూ చకితులయ్యి మనసారా నవ్వుకొనిరి. ఆది, దాసు, మరీదు పెంచలయ్య పైడమ్మ లను కూడి నందిని మంజూష సందీపుడు చిన్న బస్సులో సబ్బవరం బయలుదేరినారు.
చంద్రమతి పార్వతిని బుచ్చెమ్మగారికి అప్ప గింతలు పెట్టుచూ పార్వతి తల్లి చారుమతి పేరు తలఁచి కన్నీరు పెట్టి కేశవుని పై వాలి “నీ డబ్బు నేను అన్యాయముగా అట్టే బెట్టుకొంటినని” విలపించి రెండు దస్తావేజు కాగితములను తన సంచిలోనుంచి తీసి ఒకటి కేశవునకి మరొకటి పార్వతికి ఇచ్చి బుచ్చెమ్మ గారితో “కేశవునకు తన తల్లి ఆస్తి పది ఎకర ముల పొలము అప్పగించితిని. పార్వతికి నాఆస్తిలో నా పిల్లలతో సమముగా వాటా ఇచ్చితిని జాగ్రత్తగా చూడవలెను. అని చీర కొంగుతో కళ్ళు త్తుకొనుచూ అరుణ తారవైపు చూచుచూ “మా కుటుంబమునకు పెద్ద దిక్కు నీవే, అరుణా అంతా చూచుచున్నావు కదా!” అని సుకన్యను తీసుకొని బయలుదేరెను. “ఈమె పెండ్లికూతురిని అప్పగింతలు పెట్టినదా లేక ఆస్తి అప్పగింతలు పెట్టినదా?” అని బుచ్చెమ్మ తుచ్చ ప్రశ్నను సంధించగా అందరూ ఘొల్లుమనిరి. పార్వతి చేయందుకొని బసవడు కేశవుని రంజిని గారిని తీసుకొని బయలుదేరెను.
తక్కిన రెండు జంటలకు శోభనములు మా ఇంట జరుపవలెనని అనుకొనుచున్నాము అని మాలిని మీనాక్షితో అనుచుండగా యమున మీనాక్షి చెవులో ఎదో గుసగుసలాడుచుండెను విదిష ఆమెను జబ్బ పట్టి వెనుకకు లాగి ఏమా గుసగుసలు రహస్యములు అని కసిరి ఏమనుచున్నది ఈ బుడత అని అడుగగా మీనాక్షి నవ్వుచూ “సుందరిని బెంగుళూరు తీసుకొని పోవలెనని కార్యము అచ్చట జరపవలెనని అను చున్నది.” అని చెప్పెను. ఈ రాత్రికి ఇచ్చట నిద్ర చేయవలసినదే పిల్లలు ఆడి ఆడి అలసినారు. అని మాలిని గారు అనుచుండగా అగస్త్యుడు తల్లి చెవి కొరుకు చుండెను. ఏమో నాకేమియో తెలియదు కోడలు ఎట్లు కోరుకొనునో అనుచుండగా అరుణ “ఏమి కావలెనయ్యా కొత్త పెళ్లికొడకా!” అని బుజ్జగించగా అగస్త్యుడు సిగ్గుపడుచుండెను. “ఫైవ్ స్టార్ హోటల్ లో కావలెనట” అని సుందరి అరుణ చెవిలో చెప్పెను. అరుణ నిట్టూర్చెను. “నీ కోరిక?” అని సుందరి వైపు చూసెను “అన్నయ్య ఇంటికి పోయెదము” అని మెత్తని స్వరమున తెలిపెను. ఆమె సుందరిని బుగ్గలు నిమిరి మెచ్చుకొనెను. లకుమ కూడా అన్నయ్య ఇంటికి పోవలెనని చెప్పగా వర్షుడి మనసు సంతోషము తో ఉప్పొంగెను.
లకుమ సుందరి ఏక స్వరమున అన్నయ్య అల్ప సంతోషి, మా సుఖమును చూచి సంతొషించు మనసుగల అన్నయ్య మమ్ము ఆశీర్వదించి పంపువరకు మేము అన్నయ్య ఇంటనే ఉందుము, అని పలుకగా అది విని వర్షుడు ఉబ్బి తబ్బిబ్బయ్యెను. అది చూచి క్రిష్ణన్ “అరుణా నేను ఏమి కోల్పోయినానో ఇప్పుడు తెలిసినది అని కన్నీళ్ళ పర్యంత మయ్యెను. మీనాక్షి అగస్త్యునికి లకుమ సుందరి లను చూపి “ఆడపిల్లల ప్రేమ అట్లుండును అన్నయ్యకు ఎంత అనురాగము పంచుచున్నారో!” జానకి రఘువరన్ కూడా కళ్ళు వత్తుకొని “మీరెంతకాలమున్ననూ మీ ఇష్టము మేము మాత్రము రేపు కొచ్చిన్ పొవలెను.” అనుచుండగా వివేకుడు “మేడం రేపు నేను కూడా ఒక ఇన్వెస్టిగేషన్ పై శ్రీలంక పోవలెను” అని అరుణతారతో చెప్పగా ఇంకా అదే పాత పిలుపు ఎందుకు నాయినా అత్త గారు అని పిలువుము, నాకూతురిని సుఖపెట్టి కేసులు తరువాత చూచుకొనుము అని లకుమవైపు ప్రేమ నిండిన కనులతో చూచెను.
ల్యాండ్ రోవర్ ఆలలపై పడవవలె కదులుచుండెను. విదిష నడుపుచుండగా మీనాక్షి ప్రక్కన కూర్చొనెను. సుందరి అగస్త్యుడు వెనుక కూర్చొనిరి. అరుణ భర్త అల్లుడు కూతురు ఒక కారులో విదిష కారుని అనుసరించుచుండిరి. అంగ యారు కన్నె, శేషాచలముగారు, తులసి, మాలిని , నరేంద్ర పండిత్ మధుబాల మున్నగు వారిని వర్షుడు వేనెక్కించు కొని తార కారుని అనుసరించుచుండెను. ముందు మీనాక్షి కొడుకు కోడలు , పిదప అరుణ, కూతురు, అల్లుడు పిదప వర్షుడు, తల్లి ఆనందనిలయము కేసి సాగుచుండిరి.
సుందరి సిగ్గుతో మొఖం ప్రక్కకి త్రిప్పుకొని ఎడమవైపు దూరముగా కూర్చొనెను అగస్త్యుడు ఆమె చిటికన వేలు అందుకొన ప్రయత్నించుడగా విదిష అద్దమందు చూచి మీనాక్షి చెవిలో వేసెను. మీనాక్షి తన కళ్ళ కొలికిల నుండి వెనుకకు చూచి విదిషవైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుచుండెను.
లకుమ వివేకులు ఒకరినొకరు చూచుకొని మైమరచి పరిశరములను మరిచి కొన్నిలిప్తలు ఇనుము సూదంటు రాయి వలె ఒకరినొకరు అతుకుకొని విడిపోవుట చూసి క్రిష్ణ గారు అరుణతార చేతిని గిల్లగా అది వివేకుడి కంట పడెను. వర్షుడు మనసంతయూ బాల్యజ్ఞాపకాలు చుట్టినవి. అతడు తల్లి వొడిలో తలపెట్టుకొని అమ్మా అని పిలిచెను మాలినిగారు కొడుకు తలలోకి వేళ్ళు పొనిచ్చి నిమురుచూ “బరువులు భాధలు భాద్యతలు అన్ని బ కారములు ముగిసినవి అని అనుచుండగా “బాల్యము కూడా ముగిసినదికానీ భవిష్యత్ మాత్రము మిగిలి యున్నది. అనెను.
***
హిమకరుడు చంద్రికలను పరచి ఆనందనిలయమును అలరించుచుండెను. తెరచిన భోషాణము వలె పై కప్పు ఆచ్చాదనలేని మండువా గదిలో నేలంతయూ వెండిపూత పూసినట్లున్నది. చల్లగాలికి చలించుచున్న చెట్టుకొమ్మ లుచంద్రికల కవరోధము కలిగించుచూ చాయలు ఏర్పరచు చుండెను. మండువాగదిలో చలించు వాటి ఛాయలు చూచువారికి చెవుల పిల్లు లాడుచున్నట్లు నయనానందమును కలిగించు చుండెను. గడప గడపకూ వ్రేళ్ళాడు బంతిపూదండల పరిమళములు నాసికలు తాకి మత్తెక్కించుచుండెను. వివాహ మేళతాళములింకనూ అందరి చెవులయందు మారుమ్రోగుచున్నవి.
స్త్నానములు చేసి నూతనవస్త్రములు దాల్చి వచ్చిన నూతన వధూవరులు సైకత శిల్పములవలె నిలచి యుండి ఆనందపారవశ్యమునందుచుండగా, తార మీన తులసి మధుబాలల కళ్ళు మెరియుచుండెను. చుట్టూ ఉన్న ఆరు గదులు ఒక్కొక్క గది ఒక్కొక్క జాతి పుష్పములతో అలంకరించబడెను. రెండు జంటలే కదా ఆరుగదులకు అలంకరణ ఏలనో అని తార మీనాక్షిలు భావించిననూ మాలిని గారు తలుపు తీసి చూపుచుండగా పుష్ప పరిమళ సొభితమై పానుపులు శృంగారభావములను మోల్కొలుపుచున్నవి. లకుమ వివేకులు సుందరి అగస్త్యులు ఆనందపు అంచులలో విహరించిరి. కాముడు ఆ రాత్రి పిల్లలనూ పెద్దలనూ ఒక్కవిధముగా అలరించెను.
వివాహానంతర దృశ్యమును ఎంత చక్కగా వర్ణించారు.చదువుతుంటే మనస్సుకి హాయిగా ఉంది.
ReplyDeleteHow are the human relations depicted? Have you felt the love and affection of characters? Is Bharatavarsha going to be memorable?
ReplyDeleteThis comment has been removed by the author.
DeleteThere will be blood chilling twists. please ...
ReplyDeleteమీ మనసు చల్లగా ఉండాలని దేవుడిని ప్రార్ధిస్తాను . మీకు ప్రణామములు.
ReplyDeleteBharata varsha is really a unique book. My journey with Bharata varsha is really unforgettable. All characters remained in my heart. Especially Bharata varsha. The stories of first generation women and the stories of second generation all are unique.The relations between characters and emotional scenes touched my heart.This book is nothing but heart of the writer I am waiting for the twists which are coming in future
Deleteఆస్వాదించే శక్తిని పొందటమే విద్య మనకిచ్చే వరం. అదే విద్యని కోరుకునే వారి అత్యుత్తమ లక్ష్యం కావాలి. మీ చక్కటి ఇంగ్లిష్ చూసి , మీ మొక్కవోని దీక్ష చూసి, చదువంటే కపటం లేని ప్రేమ చూసి ఒక గురువుగా నేను అమితానందాన్ని పొందాను. మిమ్మల్ని చూసి అనేక మంది ప్రేరణని పొందాలి. సంవత్సరాలు నాతొ కలిసి ఉండి , ఇంగ్లిష్ నేర్చుకోమని నేను అడిగి ప్రోత్సహించినా నేర్చుకోకుండా ఒక కంపెనీ వాళ్ళు ఇంగ్లిష్ ఉంటె కానీ కుదరదు అన్నారని ఒక నెల్లాళ్ళలో ఇంగ్లిష్ నేర్చుకుందామని ప్రయత్నం చేస్తున్న 36 సంవత్సరాల సాఫ్ట్వేర్ గురు నిత్యం తన పనులలో మునిగితేలుతూ అప్పుడప్పుడూ ఇంగ్లిష్ క్లాసులకు వస్తూ ఇంగ్లిష్ ని వీలుచిక్కినప్పుడు ప్రేమిస్తూ సమస్యలని వ్యాపకాలని పక్కకి పెట్టలేక నేర్చుకోలేకపోతున్న 37 సంవత్సరాల లేడి లాయర్ కి మీ సమస్యల గురించి తెలుసుకుంటే, ఆ సమస్యల ని నెట్టి మీరు ఎలా చదువుకోగలిగారో తెలుసుకుంటే వాళ్ళ మానసిక స్థితి వాళ్లకి అర్థమవుతుంది. రాత్రి పన్నెండు గంటలప్రాంతంలో ప్రతినిత్యము మీరు భారతవర్ష చదివి ఫీడ్బ్యాక్ పోస్ట్ చేస్తున్నవిషయం వారికి తెలిస్తే కొంచెం మార్పు వస్తుందోమో? ! 10 సంవత్సరాలు విద్యాబోధనలో ఉన్న ఒక పామర్రు టీచర్ నాకు మంచి మిత్రుడుని అని చెప్పే ఒక వ్యక్తి , పోచికోలు కబుర్లకి ఎంతసేపైనా వెచ్చించగలడు కానీ రోజుకి ఒక్క పేజీ కూడా చదవలేడు ఆ విషయం అతడే స్వయంగా ఒప్పుకున్నాడు ఆయన నిజాయతీకి నమస్కారం. ఇలా వేలాది మందిని చూసిన నాకు మీలో చదువు పట్ల నిజాయతీ ప్రేమ సరస్వతి లా సాక్షాత్కరించాయి. అందుకే నేను మీకు మోకరిల్లేది . మీరు లేక పొతే ఈ నవల లేనే లేదు. ఈ నవల మీకే అంకితం .
ReplyDeleteధన్యవాదములు గురువు గారు.మీ శిష్యరికంలో నేను భాషను మాత్రమే కాదు జీవితాన్ని కూడా ప్రేమించడం నేర్చుకున్నాను. భాషను ప్రేమిస్తే భాష మనల్ని వరిస్తుంది.సమస్యలను కాలానికి వదిలి జీవితాన్ని ప్రేమించడం మొదలు పెడితే కాలమే సమస్యలకు పరిష్కారం మార్గం చూపి మనల్ని లక్ష్య సాధన వైపు నడిపిస్తుంది.ఇది నా స్వానుభవం.
DeleteGreat going sir
ReplyDeleteFeedback of Bharatavarsha 135:
ReplyDeleteThank you, Sir, once again we recollected the importance and beauty of our marriage custom. In essence of the unique spirit of 'INDIAN WEDDING'. You clearly mention the mother feelings, beautiful relation between brother and sister and the happiness of some beautiful feelings for a newly married couple.
While reading this chapter, you are articulating splendors to take us to trance of marriage.