3, కృష్ణ మీనన్ మార్గము - న్యూఢిల్లీ : అరుణ , మీనాక్షి , యమున విశాలమైన గదిలో సోఫా పై కూర్చొని కాఫీ సేవించుచూ యుండగా గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయమంత్రి అనురాగ ఠాకూర్ , సెక్రటరీ సంజీవ్ బాత్రా ( ఐ ఏ ఎస్ ) వచ్చి అరుణతార గదిలో వేచియున్నారని పచాకో వ్యక్తిగత కార్య దర్శి తెలియజేసెను. వారిరువురిని లోపలి తీసుకురమ్మని అతడికి చెప్పి కాఫీ తెమ్మని పనివారికి చెప్పెను. మీనాక్షికి సుందరి గుర్తువచ్చినంతనే దిగులు పెరిగి రక్త పోటు పెరుగుచుండెను. కొలది సేపటికి మాటలలో పడి మరిచి మామూలుగుచున్ననూ ఆమె మనసునందు దిగులు మూటకట్టుకొని యున్నది. యమునకు ఆవాతావరణము అంతయూ అత్యంత ఆహ్లాదకరంగా నొప్పుచుండగా "అబ్బా ఇట్లు ఢిల్లీ లో కేంద్ర మంత్రి గృహమునందు బసచేసెదనని నేను కలనైననూ ఊహించకుంటిని , వీరందరితోనూ ఒక ఛాయాచిత్రమును తీసికొనవలెను." అని మీనాక్షి చెవిలో చెప్పుచుండగా అరుణ గ్రహించి " నీవిచ్చటనే కొన్నాళ్ళున్నచో పార్లమెంట్ రాష్ట్రపతి భవనమును కూడా చూబించెదను." అనెను.
యమున " మరి అమ్మ కూడా నావద్ద యుండునా " మీనాక్షి " అమ్మ ఎందుకు ? నీవుండుము నేను బెంగుళూరు పోవలెను " యమున " అమ్మని వదిలి నేనుండజాలను "అనగా అరుణతార " ఎల్లకాలమూ అమ్మ వద్దే వుందువా ? పెళ్లి చేసుకొన్న పిదప అయిననూ అమ్మను వదలవలెను కదా. జీవితములో ఇంకా చాలా ఆనందములున్నవి ?" అనెను . యమున " అవన్నియూ అమ్మ తరువాతే, అయిననూ , నాకు పెళ్లి వలదు " అనెను. “ఇప్పుడిట్లే అందురు పెళ్లిచేసి మొగుడు వద్దకు పంపినచో అతడిని వదిలి వచ్చుట కష్టమందురు, ఆ అనుభవమైన పిదప చెప్పుము ఈ మాటలు "అని అరుణతార హాస్య మాడెను. మీనాక్షి నవ్వుచూ “దాని మాటకేమి గానీ, 9. 00 గంటలు అగుచున్ననూ ఆయన నిద్ర లేవలేదు, రాత్రి పడుకొంటిరా లేక జాగరముచేసినారా? నీ కనులు కూడా నిద్రలేక ఎరుపెక్కినవి!” అరుణతార బుగ్గలు ఎరుపెక్కినవి " ఛీ ఛీ చిన్న పిల్లలముందు ఇట్టి మాటలు నేను మాట్లాడజాలను బాబూ! అనుచుండగా” ఓహో నేను లేనిచో ఇట్టి మాటలు మాట్లాడుకొందురన్నమాట” అని యమున కవ్వించెను.
అప్పుడే సహాయమంత్రి, సెక్రటరీ వచ్చినారు, అరుణ వారిని కూర్చొండబెట్టి కాఫీలు అందజేసెను. మీనాక్షి యమునలను వారికి పరిచయము చేసెను.
అరుణతార : మిస్టర్ బాత్రా, నేను నాలుగు రోజులుండుటకు విశాఖపట్నం పోవుచున్నాను. ప్రపంచ గ్రామీణా భివృద్ధి సమావేశములకు భారత ప్రభుత్వము తరుపున ప్రాతినిధ్యమునకు ఏర్పాట్లు జరుగుచున్నావా ?
సెక్రట్రీ: వచ్చే వారము బ్యాంకాక్ లో జరుగబోవుచున్న ప్రపంచ స్థాయి సమావేశములకు ఈటాస్ లుంఫీని హోటల్ నందు విడిచి ఖరారైనది. మీరు విశాఖపట్నము నుండి వచ్చుసరికి గత ఐదు సంవత్సరముల గణాంకములతో భారత ప్రభుత్వము తరుపున మన ప్రజెంటేషన్ ను సిద్దము చేసెదను.
అరుణ: మన స్ట్రేటజీస్, పాలసీస్, రీసర్చ్ , పెట్టుబడి , గ్రామీణ పేదరిక నిర్మూలనా పథకములు , మరియు గత 20 సంవత్సరములనుండి భూ సంస్కరణల తో కూడిన ప్రజంటేషన్ నిన్న రాత్రే తయారు చేసి మీకు అందజేయుచున్నాను.
సహాయమంత్రి: ఇదంతా అధికారులు చూచుకొందురు కదా మీరెందుకు శ్రమ తీసికొనవలెను? బేంకాక్ చాలా రొమాంటిక్గా యుండును మీరు అచ్చట అన్నీ సందర్శించుటకు కూడా ఏర్పాట్లు చేయుచున్నాము. అని సెలవివ్వగా సెక్రటరీ గారు “ఎస్ ఇట్ ఐస్ వెరీ రొమాంటిక్” అని వంత పాడిరి.
There is nothing romantic about underdevelopment. Land is integrally linked to our way of life and, without it, our people are destined to live in undesirable conditions. Land and the means of production, are the basic necessities to ensuring that we find effective means of developing our rural communities.
ఆమె అంకితభావం, దృఢ నిశ్చయము కని సహాయమంత్రి, సెక్రెటరీలు ఖంగు తినగా మీనాక్షి మరియు యమునలు అచ్చెరువందిరి. ఇంతలో ప్రధానమంత్రిగారి నుండి దూరవాణి వచ్చుటచే వారిరువురూ సెలవు తీసుకొని బయలుదేరినారు. అరుణ ప్రక్కగదిలోకి పోయి దూరవాణి మాటలాడుచుండెను.
గ్రామీణ అభివృద్ధి ని ఇంత లోతుగా అధ్యయనము చేసి మనసుకు పట్టించుకొన్నది. ఎంత చక్కగా నిర్వచించినది. ఇంత నిజాయతీగా పనిచేయు మంత్రి అని ఊహించలేకపోతిని.
ఏమనుకొంటివి ? ప్రధానమంత్రిగారు ఊరకనే పిలిచి పదవి ఇత్తురా?
“అరుణమ్మని చూసినచో ఒక వంక గర్వంగా నున్నది మరొక వంక జాలిగానున్నది” అని యమున అనుచుండగా కొత్తపెళ్ళికొడుకువలె తయారయిన కృష్ణన్ వచ్చి వారి వద్ద కూర్చొ ని " ఏవమ్మా యమునా, నేను కూడా ఎంతో శ్రమ పడుచున్నాను. జాలి అరుణ పైనేనా నాపై కలుగలేదా ? అని అడిగెను.
ఇంతలో పచాకో లోపలి వచ్చి మీరు అల్పాహారం శ్వీకరించవలెనని ఎవరో బొంబాయినుండి వచ్చిన అతిథితో మాట్లాడుటవలన తనకు ఆలస్య మగునని తెలిపామన్నారు. అని చెప్పి వెడలినాడు.
కృష్ణన్ యమునను ఆట పట్టించుటకు వెంటనే అల్పాహారం తినుటకు సిద్దపడెను. యమున మీనాక్షిలు రాకుండుటచే "మీరు రానిచో నేను తినను కానీ ఈ మంత్రులతో రాజకీయనాయకులతో పెట్టుకొన్నచో మన పొట్టలు మాడును."
యమున : అమ్మ రాత్రాంతాయో నిద్రలేక పని చేసినదని బాధ కలుగుచున్నది. మీ పై జాలి ఎలా కలుగవలెను?
కృష్ణన్ : అవునవును నాపై ఏల జాలి కలుగవలెను , నేను హాయిగా నిద్రించినాను.
అయిననూ, ఆమె ఊరకనే పని చేయుచున్నదా? పెద్ద జీతమిచ్చుచున్నారు అన్ని వసతులు సమకూర్చుచున్నారు. పనిచేయుచున్నది కనుకనే హాయిగా అనుభవించుచున్నది.
యమున: మరి మీరు పని చేయకనే హాయిగా అనుభవించుచున్నారు కదా!
కృష్ణన్: అది నా అదృష్టము, నాభార్య సంపాదించుచున్నది నేను అనుభవించుచున్నాను అని బల్లపై చేతితో మద్దెలవలె వాయించుచూ యమున వైపు చూచుచుండెను. యమునికి అతడిపై అగ్గి రేగుచుండెను. మీనాక్షి అతడు ఆటపట్టించుటకు అట్లు చేయుచున్నాడని
మీనాక్షి : బొంబాయి నుండి వచ్చిన అతిథి ఎవరో విచారించక ఈ వాదులాట లెందులకు? లకుమ వచ్చినదేమో!
కృష్ణన్: బొంబాయి నుండి వచ్చు అతిధులు ఎవరు కలరు? లకుమ వచ్చిన చో తార ఇచ్చటికి తీసుకు వచ్చును కదా! మీరు వాదులాడుకొనుచూ కూర్చొనుడు అని మీనాక్షి అరుణ తార గదిలోనికి వెడలెను.
లకుమ పరిస్థితి ఇంత దయనీయంగా తయారవ్వడం చాలా బాధాకరం.
ReplyDelete