ముంబాయి - జుహు బీచ్ : స్టార్ ప్లాజా
ఆషా : రోహిత్నన్నవదులు. అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు అరిచి గోలచేసినచో నీపని ఏమగునో ఆలోచించుకొనుము.
రోహిత్: అమ్మాగారు ఇంక ఎప్పటికి ఇంట్లోనే ఉంటాది. షూటింగులు ఆగిపోయి చాలా కాలం అయ్యింది, నేనే డైరక్టర్ని పరిచయంచేసి ఉన్నడబ్బులన్నీ చిత్ర నిర్మాణమునకు ఖర్చు చేయించితిని. ఆ డైరెక్టర్ ఎంత వెధవ అంటే ఇంతవరకూ వాడు తీసిన ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. అది మత్తెక్కి పడుకుంది . అది నన్నేమి చేస్తుంది ?
లకుమ : "రోహిత్!" ఆ అరుపుకు ఇల్లంత యూ ఊగినది! పిదప రోహిత్ చెంప చెళ్లు మన్నది. రోహిత్ ను వంట గదిలో పెట్టి తలుపు వేసి ఏడ్చుచున్న ఆషని తీసుకొని తన గదిలోకి వెళ్లెను.
***
లకుమ: నేను తలపోసి చిత్రము పూర్తగుటకు ఇంకనూ ధనము వలయును, ఇంకనూ ధనము వలయుననుచూ దర్శకుడు నన్ను పూర్తిగా ముంచినాడు, రోహిత్ ఇంత విస్వాసఘాతకుడగునని కలనైననూ ఊహింపలేదు. నీవు ఒక్కర్తివే నిజాయతీగా నన్నుఅభిమానించి పనిచేసినావు.
ఆష :పొరపాటమ్మగారు పండిట్ కూడా నిజాయతీగా మిమ్మల్ని అభిమానించి పనిచేసెను. మీరు బాధతో తాగుచున్న ప్రతిదినమూ అతడి కంటతడి చూచితిని.
లకుమ: అయ్యో , అది నేను గ్రహించక, తారనన్న చిన్న అహంకారము తో అతడికి చేరువ కాలేక పోతిని, అతడికి కొన్ని విషయములు చెప్పక దూరముగా ఉంచితిని
ఆష :ఇల్లు ఆమ్ముట, అప్పుచేయుట, సొంత సినిమా నిర్మించుట. మీరు దాచినవి ఇవేకదా అతడికి అవన్నీతెలియును అతడు పెద్ద తలకాయమ్మా. ఆవులించిన పేగులు లెక్కెట్టు రకము. కానీ మీరంటే ఇష్టంతో తనకేమీ తెలియనట్టు మీవద్ద నటించినాడు. లకుమ కంట నీరు తిరుగుచుండెను.
లకుమ : నేనతడిని కలుసుకొనవలెను . అతడు ఎక్కడుండునో నీకు తెలియునా?
ఆష: జోపడిపట్టి (గుడిసెలుఉండుస్థలము)లోఒకచిన్నఇంటిలో ఉన్నట్టు చెప్పుచుండెడివాడు.
లకుమ: నాకునూ అట్లే చెప్పెడివాడు, ఇప్పుడు అచటికి పోయి వెతికెదను
ఆష: మీరొకతార అన్నవిషయము మరిచి అట్లాంటి ప్రదేశమునకుపోవలదు. నేను పోయి చూచివచ్చెదను
లకుమ: హు, సినీ తార నని ఎంత త్వరగా మరచిన అంత మంచిది. ఈ చిత్రరంగము కంటే దుర్గంధ మెచ్చట కలదు. దీని కంటే జోపడి పట్టి చాలామెరుగు. నేనే పోయెదను. అనుచుండగా పోలీసులు వచ్చి రోహిత్ ను కొనిపోయినారు.
***
పచాకో పండిట్ ను తీక్షణముగా చూచుచూ " ఇసుకనుంది తైలముతీయు, దేవాంతకుడు చచ్చిన దయ్యమును బ్రతికించు మాంత్రికుడు నేడేల మదన పడుచున్నాడు అని తలచు చుండగా పండిట్ పచాకోను చూచెను. పండిట్ నవ్వుచూ అతడి దగ్గరికి పోవుచుండగా వారిరువురిని మీనాక్షి కిటికీ నుండి చూచుచుండెను. డబ్బు ఇచ్చిన వద్దని తిరస్కరించుచున్నాడు , ఎదో చెప్పవలెనని చెప్పలేక మదనపడుచున్నాడు , ఇచ్చటనే తచ్చాడుచూ పోలేకున్నాడు. చల్లకొచ్చి ముంత దాచినట్టు న్నది ఇతడి వ్యవహారము. అరుణ ఇటు రావే అని మీనాక్షి అరుణను పిలవగా సోఫామీద సోలిన అరుణ మెల్లగా లేచి కిటికీవద్దకు పోయెను మీనాక్షి " ఆదృశ్యమును చూడుము , అది చూచినా నీకు ఏమి అర్ధమగుచున్నది ? " అని అడిగెను.
పండిట్ ఒక అపరాధ పరిశోధకుడు కేవలము ధనము నే ఆశించక నాకూతురి ని ఇంతవరకూ కాచిన యోగ్యుడు, యితడు ఇట్టి క్లిష్ట పరిస్థితితులలో నాకూతురిని వదిలి పోయినచో వేరొకరు నాకెచ్చట దొరుకును.
పండిట్ తనవిషయమును మెల్లగా పచాకో చెవిన వేసిన పిదప " నీ విషయమంతయూ నాకు చెప్పితివి , మరి అట్లే అరుణ తారగారికి చెప్పుటకేల సందేహించుచున్నావు. పండిట్ జాలిగొలుపు మొఖముతో నిలిచి అట్లే యుండెను. “మాదకద్రవ్యముల ముఠా పట్టించినవాడికి మంత్రిగారితో మాట్లాడవలెనన్నసందేహమెందులకో” “మంత్రి గారికి కోపమొచ్చినచో నేరుగా కటకటాలవెనుకకు పోయెదను నీవు కాదన్నచో వెడలెదను” అని పండిట్ అనగా “మంత్రి గారితో మధ్యవర్తిత్వము నెరపవలెను, సరే కానిమ్ము , అటులనే చేసెదను మరి ఇందాక వ్యక్తిగత విషయమని నన్ను బయటకు పంపినావు కదా” అని పండిట్ ను ఆట పట్టించుచుండగా “అయ్యా! మీరదింకనూ మనసులో పెట్టుకొంటిరా!” అని పండిట్ బ్రతిమాలుకొను చుండెను.
ఆ సంభాషణ లో మాటలు మీనాక్షి అర్థము కాకున్ననూ భావమును మాత్రము ఆమె గ్రహిం చినది. పచాకో అరుణతార గదిలోకి వచ్చి అరుణ తారతో " మీతో పండిట్ గూర్చి కొన్ని ముఖ్య మైన విషయములు చెప్పవలెను అనెను . అరుణతార " అందుకిదా ఇదా సమయము, నీ బుద్ధి మందగించిందా, ఇప్పుడు అతడి గూర్చి తెలుసుకొని నేనేమి చేయవలెను ? అని కోపగించుకొనుచుండగా మీనాక్షి " అట్లు తీసి పారేయక విన్నచో ఏమి చెప్పునో చూచెదము అనెను " అంత వినవలెనన్న కోరికున్నచో నీవు వినుము " అని తార మొఖం త్రిప్పుకొనెను. కృష్ణన్, యమున వచ్చి చేరినారు. పచాకో చెప్పుట ప్రారంభించెను.
ఇతడి తాత ముత్తాత లు కాశీ లో పండితులు. వీరిది పండిత వంశము. అతడి తల్లి ఉపాధ్యాయురాలు తండ్రి నరేంద్ర పండిట్ రైల్వే లో ఉన్నతాధికారి. ఉద్యోగ రీత్యా బదిలీలగు చుండుటచే యితడు చిన్నప్పటినుండి వివిధ ప్రదేశములలో విద్యనభ్యసించెను. ఇతడి బాల్యము ఎక్కువ పూణేలో గడిచినది. చిన్నప్పుడే పాఠశాలలో తన తోటివిద్యార్ధిని అబ్బాయిలతో తిరుగుచుండగా ఆమెను వారు ఒక ముఠా కు అమ్మివేయుటకు పథకం వేయుచుండగా పండిట్ అది కనిపెట్టి తల్లితండ్రులకు పిర్యాదు చేసెను. కానీ వారు నమ్మకపోవుటచే ఛాయా చిత్రములతో రుజువుచేసి వారిని వప్పించెను. అట్లు అతడు ఆమెను వారి నుండి కాపాడిన పిదప అతడు అనేక , సైకిల్ , మోటార్ సైకిల్ , గృహ చౌరులను కనిపెట్టి పట్టించెను. పూణే ఫెర్గుసన్ చారిత్రా త్మక కాలేజీలో , రసాయన శాస్త్రము చదువుచున్ననూ హత్యోదంతములపై దృష్టి సారించి నేరస్తులను పట్టించి , మంచి పేరు తెచ్చుకొనుటయే కాక అనేక అవార్డులు పొందెను. దూరదర్శన్ లో వచ్చు డిటెక్టివ్ సీరియల్ పండిట్ జీవిత కథ ఆధారముగా నిర్మించబడినదే అని చెప్పుచుండగా అరుణతార తల నొక్కుకొని " అబ్బబ్బ ఎందుకయ్యా అతడి జీవిత చరిత్ర చెప్పుచున్నావు ?" అని కోప్పడుచుండగా మీనాక్షి " ఎంతో ఆసక్తికరముగానున్నది , మంత్రిగారు అట్లేఅనుచుందురు మీరు ఆపక ఇట్లే వివరముగా చెప్పవలెను అనెను.
***
125
పండిట్ పాత్ర ఇంత ప్రాధాన్యత కలది అనుకో లేదు. లకుమ దయనీయ పరిస్థితిని, పండిట్ కోసం ఆమె పడుతున్న ఆరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.లకుమను, అగస్త్యుని వారి తల్లుల వద్దకు చేర్చవలెను.very pity lakuma😢
ReplyDelete