మీనాక్షి " ఎంతో ఆశక్తికరముగానున్నది, మీరు ఆపక చెప్పవలెను అని సందేహించుచున్న పచాకోను ప్రోత్సహించిన పిదప ఇంకనూ నీళ్లు నములుచుండగా యమున, కృష్ణన్" ఆ కుర్రవాడిని చూడవలెనని ముచ్చట కలుగుచున్నది, అతడు ఎచ్చట నివసించుచుండును?" అని అడిగిరి. దూరవాణి మ్రోగుచుండగా పచాకో తీసి "సెక్రటరీ రూరల్ డవ లప్మెంట్ మినిస్టర్ అని చెప్పగా , అటునుండి డాటర్ ఆఫ్ రూరల్ డవలప్మెంట్ మినిస్టర్ అని స్వరము వినిపించెను. పచాకో " లకుమ ఈజ్ ఆన్ ది లైన్ అని చెప్పుచూ అరుణ తారకు దూరవాణి అందజేసెను.
అమ్మా నీవు చెప్పినదే నిజమైనది , నేను ఓడిపోయినాను , నన్నందరూ మోసము చేసినారు. నీ మాట విననందుకు తగిన శాస్తి జరిగినది. నీ ప్రేమను అర్ధము చేసుకొనుటకు ఇంత కాలము పట్టినది. అర్ధమయ్యే సరికి నా ప్రేమ చేజారినది. అని ఏడ్చుచూ పండిట్ గూర్చి చెప్పుచుండ అరుణకు కూడా కన్నీరు ఆగకుండెను, మీనాక్షి మాత్రము పరమానంద భరితముగా ఆ సంభాషణను ఆలకించుచుండెను.
చిత్రరంగమున నీవు కోల్పోయినది ఏమియునూ లేదు, మీనాక్షి అత్తయ్య ఇచ్చటనే కలదు ఆమెతో చెప్పి కన్నడ చిత్రరంగమందు ప్రయత్నించవచ్చు అని అరుణతార చెప్పుచుండగా మీనాక్షికి అరికాలి మంట నెత్తి కెక్కెను, మీనాక్షి విసవిసాపోయి దూరవాణిని లాక్కొని " అమ్మ లకుమ , నేను మీనాక్షి అత్తయ్యను నీవు వెంటనే ఇచ్చటికి రావలెను. ఈ అత్తయ్యను చూడవలెను. మనము విశాఖ పోయి నీ బాల్యమిత్రులను కలిసి మంజూష పెళ్లి చూడవలెను, నీకు రెండు శుభవార్తలు కలవు. ఆ రెండు శుభవార్తలు నీ జీవితమును మార్చి వేయును.
నాజీవితము మారదు. అత్తయ్యా, చిన్నపిల్లవలె నన్ను ఊరడించ ప్రయత్నించవలదు. విధివ్రాతను అంగీరకరించుట నేర్చుకొంటిని. నా జీవితము చేజారి పగిలినది. అది అతకదు. పండిట్ ను కొట్టి తప్పు చేసిన విషయమును తెలిపి, తప్పు దిద్దుకొనుటకు అవకాశము లేకుండెను, తప్పు చిరునామా ఇచ్చి అతడు ఎట్లు మోసగించెనో చెప్పి నాగూర్చి చింతించవలదు సంగీత స్వమ్రాజ్యమునేలుచున్న స్వరరాణిని కలవవలెనని ఉన్ననూ ఇంతవరకు కలువలేకపోతిని. మిమ్మల్ని కలుసుకొనుటకు తప్పక వచ్చెదను. అని
దూరవాణి సాధనమును పెట్టివేసి న మీనాక్షి ఖిన్నురాలైన తారవైపు తిరిగి "ఏయ్ మొద్దుబుర్ర ఇటురమ్ము , ఆ కుర్ర వాడు(పండిట్)ఇంకనూ ఇచ్చటనే ఎందుకు తచ్చాడుచున్నాడు ?" “అదియే అర్ధము కానున్నది. అవమానించినది కావున లకుమ వద్ద పని చేయజాలనని ఖరాఖండిగా చెప్పిన ఆసామి, డబ్బిచ్చిన నూ వలదన్నఆసామి, ఇచ్చటేల మీన మేషములు లెక్కించుచున్నాడు?”
డబ్బు వలదనినచో ఇంకేమైననూ వలయునేమో? డబ్బుకంటే విలువైనవి నీవద్దనేమున్నవో యోచింపుము" ! అని మీనాక్షి అనగా అరుణతార తెల్ల మొఖం వేసెను. "అందుచే నిన్ను మొద్దుబుర్ర అన్నది, వాడే నీ అల్లుడు పోయి అల్పా హారము తినుటకు తీసుకురమ్ము " అనెను.
మనసు కథలో లీలమైపోతోంది, కథ కళ్ళముందు సాదృశ్యమౌ తోంది. పాత్రలు కుటుంబ సభ్యులలా అనిపిస్తుండడంతో వారి కష్టాలను చూసి మనసు చలిస్తోంది. పిల్లలు మన పిల్లల్లా , మనసుని అల్లుకుపోడంతో వారి తప్పులు ఎత్తి చూపాలని అనిపించడం లేదు.
ReplyDeleteలకుమ సుందరి పాత్రలమధ్య చాలా వ్యత్యాసం ఉంది. లకుమ విలాస జీవితాన్ని కోరుకుంది, అహంకారమే తప్ప ఆమెకు నియంత్రణలేదు. విచ్చలవిడి తనాన్ని స్వేచ్ఛ అనుకుంది. కానీ ఆమెలో మానవీయ గుణాలు చాలాఉన్నాయి. తాను కష్టాల్లో ఉన్నా పనివారిని బాగా చూసుకోడం వంటివి , చేసిన తప్పును దిద్దుకోడానికి ఆమె పడిన యాతన మనసును కరిగించింది. సుందరి మొదటి నుంచి క్రమ శిక్షణ కనబరిచింది . తండ్రి కోసం సినిమా గడప తొక్కింది , తన నాట్య కళతో తండ్రి ప్రాణం నిలుపుకోవాలనుకుంది. అరుణతార సహాయాన్ని అర్హురాలని నిరూపించుకుంది. అగస్త్యుడు బలవంతం చేసినప్పుడు ప్రత్యుపకారం అనుకుంది కానీ పరువు తీయాలనుకోలేదు. కృతఙ్ఞాతాభావం , పెద్దలపట్ల గౌరవం కలిగి సుందరి , నాదృష్టిలో అందరికంటే గొప్పది. ఇంక విదిష నందిని పాత్రలను గమనిస్తే నిగూఢ, అవ్యక్త గుణ గణాలు కనిపిస్తాయి అందరూ నందిని అల్లరి పిల్ల, మొండి పిల్ల అనుకుంటారు , కానీ నిజానికి జాగా మొండి , పట్టుదల పట్టి నెగ్గించుకోడంలో దిట్ట విదిష చాలా అల్లరి పిల్ల అయినప్పటికీ రచయిత ఆమెనొక సూపర్ నేచురల్ స్పిరిట్స్ తో డీల్ చేసే స్పిరిట్యువల్ పవర్ , లేదా దేవత గా తీర్చి దిద్దేడు. చివరికి ఏమౌతుందో చూడాలి. మొత్తానికి విదిష అంటే మొక్కవోని దీక్ష అనిపిస్తుంది.
లకుమను తల్లి వద్దకు చేరుస్తున్నారు.ఆమెను బాగా అర్థం చేసుకున్న మనిషితో వివాహం జరిపిస్తున్నారు.ఏ పాత్రను బాధ పడనివ్వరు.తక్కువ చెయ్యరు.పాత్రలన్నింటినీ గమ్యం చేరుస్తున్నారు.లోక కళ్యాణమే రచయిత లక్ష్యం.కథను చదువుతుంటే చలన చిత్రమును చూస్తున్న తలుపు కలుగుతుంది.జనుల మంచి కోరే రచయితకు మనోవాంఛ ఫలసిధ్ధిరస్తు.
ReplyDeleteఅదే జరిగితే నిత్యం మీకు క్షీరాభిషేకం చేసుకుంటాడు రచయిత
Delete