Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, February 7, 2021

సుందరి కల్యాణం -128

 కిమ్స్ ఆసుపత్రిలో అగస్త్యుడు మంచముపై పడుకొని యుండగా, మీనాక్షి ప్రక్కనే కూర్చొని అతడి తలకి కట్టిన కట్లను చూచుచూ అతడిని ప్రేమతో నిమురుచుండెను. బుచ్చెమ్మగారు  “నలుగురు రౌడీలు కర్రలతో మీద పడిన ఒక్క పసివా డేమి చేయును ? వాళ్ళ చేతులు పడిపోను బసవడు వెంట వెళ్లిన కొంత మేలు జరిగెడిది. ఆ వర్షుడు అగస్త్యుడు ఒక్కడే  వెళ్లవలెనని  చెప్పినాడట.” 

 అన్నయ్య (వర్షుడు) అట్లు చెప్పిననూ అగస్త్య అన్నయ్య ఆలోచన ఏమాయెను? నీ ఆలోచన ఏమాయెను? అని చందన బసవడిని నిగ్గదీసెను. 

బుడంకాయవలె తడుముకొనక మాట్లాడుచున్నావే నీవు కూడా పోయియుండినచో నీకు నూ రెండు కట్లు కట్టి పడుకోబెట్టి యుండెడివారు , మాకీ ప్రశ్నలు యుండెడివి కావు అని బసవడు చెల్లిని కసురుకొనెను

యమున: నీవు పోకుండా చిన్న దానిని పొమ్మనుచున్నావే సిగ్గులేదు? పైగా దానికి దెబ్బలు తగలవలెనని కోరుకొనుచున్నావా ?  ఇట్లు వాదనలు పెరుగుచుండగా 

అగస్త్యుడు : అబ్బబ్బ, జరిగిపోయిన దానిగూర్చి చర్చలు, వాదులాటలతో నా తల వ్రక్కలగుచున్నది.

మీనాక్షి : అయ్యో  తలా నొప్పిగా యున్నదా డాక్టర్ గారిని పిలుచుకుని వచ్చెదను. 

బసవడు : ఆ  పని చేయుటకు నీ వెందుకమ్మా నేనుపోలేనా , వాడికి ఏ తలనొప్పి లేదు

అగస్త్యుని ఉద్దేశ్యమేమనగా జరగవలసింది ఆలోచించమనుచున్నాడు. మీనాక్షి డాక్టర్ కొరకు బయటకు వెడలెను.  

 బుచ్చెమ్మ : జరగ వలసినది వైద్యమేకదా , అది జరుచున్నది కదా 

బసవడు : అది ఎప్పుడో జరిగి పోయినది , జరగ వలసినది   వివాహము, అదికూడా మంజూష వివాహముతో పాటుగా   జరగవలెను. 

మీనాక్షి :  అగస్త్యను చూచుచున్న డాక్టర్ దయాకర్ గారు ఇంకనూ రాలేదట.  ఇట్లు రోగిని వదిలిపెట్టుటయేనా ఇంకేమి దయ ? అని ఏడ్చుచుండెను 

బసవడు : కాదు, కాదు ఆయన సార్థక నామధేయుడే , దయగలవాడే !

అగస్త్యుడు : అబ్బా , అమ్మా !!! 

మీనాక్షి : అయ్యో పిల్లవాడికి వొళ్ళు నొప్పులు గానున్నదేమో 

బసవడు : అది వొళ్ళు నొప్పులు కాదు,  పెళ్లి నొప్పులు. 

బుచ్చెమ్మ : ఇప్పటికిప్పుడు పిల్ల ఎక్కడ దొరుకును  సమ్మందము ఎట్లు  కుదురును?  

బసవడు : పిల్ల సిద్ధముగా నున్నది -  సుందరి  కానీ సమ్మందం కుదర్చవలెను. 

మీనాక్షి : ముందు వైద్యమునకు ఏర్పాట్లు చేయవలెను. ఆ వర్షుడచ్చటికి పోయినాడు. ఆ పిల్లని కాళ్ళో కడుపో పట్టు కొని నేను బ్రతిమాలెదను , ఆమె తల్లిని ఆ తులశమ్మని కూడా వేడు కొందును.   అట్లు మీనాక్షి అనుచుండగా తులసమ్మ , సుందరి ఆ గదిలోకి ప్రవేశించి నారు.  తులసి మీనాక్షి వద్దకు వచ్చి ఆమె కన్నీరు తుడిచి " నీవు నన్ను వేడ వలసిన పనియేమున్నది  మా సుందరిని కోడలుగా చేసుకొందువా నేనే అడుగుచున్నాను " అని తులసి అనుచుండగా మీనాక్షి ఆనందాతిశయముతో " నా బిడ్డకి అది కోరిక , కానీ అది నా కల సుందరి ఉత్తమురాలు , నా బిడ్డ తప్పు చేసినందుకు నేను తలా దించుకొనుచున్నాను." అను చుండగా అగస్త్యుడు " అమ్మా !" అని మూల్గుచుండెను.  సుందరి విసవిసా బైటకి పోయి  నర్సుని కలసి  డాక్టర్ కి ఇంతైననూ భాద్యత లేదా ? అని  అగస్త్యుని  విషయము అడగగా  నర్సు  " ఆ గదిలో పేషేంట్  కి తలకి కుట్లు పడినవి , వైద్యమంతయూ పూర్తి అయినది.  ఇచ్చట ఉండవలసిన పని లేదు పొమ్మని  నిన్ననే చెప్పిననూ ఇంకొక్కరోజు ఉండుటకు బ్రతిమాల గా డాక్టరుగారు సరే అనిరి అని చెప్పగా సుందరి అవాక్కయ్యి  అగస్త్యుని గదిలోకి పోయెను. 

అగస్త్యుడు ఇంకనూ మూల్గు చుండెను, అతడి వైపు సుందరి తీవ్రముగా చూచి పిదప మీనాక్షి కడకు పోయి " అత్తయ్యా, మీ అబ్బాయి ని నేను చూసుకొందును మీరు వెళ్లి విశ్రాంతి తీసికొనవలెను " అని చేతిలో మీనాక్షి  చెయ్యి వేసి చెప్పెను. 

మీనాక్షి ఆశ్చర్యమునకు, ఆనందమునకు అవధులు లేకుండెను, మరొక్కసారి ఆ పిలుపు కొరకు ఎదురు చూచుచున్న ఆమీ మనసు అర్థము చేసుకొని , అత్తయ్యా మీరంతా ఒక్కసారి బైటకు వెళ్ళినచో మీ అబ్బాయికి  కొంచము వైద్యము చేయవలెను అని అందరినీ బైటకు నెట్టి తలుపు వేసెను.  

                                                                             ***

తలుపు మూసిన సుందరి నిశ్చయముగా గంభీరముగా అడుగులు వేయుచూ అగస్త్యుని  వైపు కదులు  చుండెను బైటకు పోయిన వారు తలుపు తట్టిననూ వారికి కిటికీ గుండా చూడవచ్చునని ఉపాయము తట్టుటచే కిటికీ వద్దకు చేరినారు. కిటికీ తెర అడ్డు ఉండుటచే లోపల ఉన్నవారికి వారు కనిపించు అవకాశము లేకుండెను. 

అ: తలుపెందుకు మూసినావు? 

సు: నొప్పి ఎచ్చటున్నది? ఎట్లున్నది ? 

అ: వొళ్ళంతయూ అదొక మాదిరిగా యున్నది

అయ్యో బాధగా యున్నదా ? 

అ: నీకొరకు అగ్గిని ఆలింగనము చేసుకొన్ననూ ఇంతవరకూ  ఆసుపత్రికి వచ్చి పలకరించలేదని  అంత కంటే ఎక్కువ బాధగా యున్నది. 

 సు: రెండు రోజుల కే  ఇంత  విలవిలా లాడుచున్నావే , నీవు చేసిన పనికి ఇంత కాలము నేనెంత విలవిలలాడినాను , మీ అమ్మ ఎంత విలవిలలాడెనో , నటించింది చాలు లెమ్ము!!  రెండురోజులకైననూ వచ్చినాను కదా ! అని అనవసర ముగా కనిపించుచున్న కట్లు  లాగివేసెను . 

అ: అన్ని విషయములు తెలుసుకొనే వచ్చితివన్నమాట 

సు: నీ అంత మొద్దును కాదు , ఆడపిల్ల ఇష్ట పడకున్న గదిలోకి ఎందుకువచ్చెనో తెలుసుకొనలేని మొద్దువు నీవు. అని తలుపు వద్దకు పోవుచున్న సుందరి పైటను పట్టి లాగెను. సుందరి పైట జారెను, అగస్త్యుడు ఆమెను చేయి పట్టి లోపలి లాగి గోడవద్దకి నెట్టెను.  ఆమె బ్రియోధ్వృత్తములెగసి పడుచుండగా అతడి కేసి చూచుచుండెను.  సుందరి " ఇట్లు చేసిన ఏ పిల్లైనా  నిన్ను పెళ్ళాడునా ?  అనగా అగస్త్యుడు వెనుకకు తగ్గెను. సుందరి అతడి చేతినందు కొని  వెనుకకు లాగెను . “మా  అమ్మ కొరకు నన్ను ఒప్పు కొంటివి అనుకున్నాను.” "నీకొరకే నిన్ను వొప్పుకొన్నాను"

తరువాత కారులో  తులసి మీనాక్షి మధ్యన సుందరిని కూర్చొండబెట్టుకొని అగస్త్యుని ముందు భాగములో కూర్చోండ బెట్టి ఇంటికి పోవుచున్నంతసేపూ  సుందరి జాణ తనము తలుచుకొని ముసి ముసి నవ్వులు నవ్వుచుండిరి. కోడలు పై మీనాక్షికి గల ఆపేక్షను చూసి తులసమ్మ మురిసిపోయెను

 


4 comments:

  1. మొత్తానికి అగస్త్యునికి మంచి భార్య దొరికింది.సుందరి అగస్త్యల కధ బాగా రక్తి కట్టించారు.

    ReplyDelete
    Replies
    1. కష్టములు కరిగి బంధములు మిగిలి న కమ్మని కలఒక గుండెను వెతుక్కుంటూ మరొక గుండె స్వప్నంగా మారి ఆస్వప్నానికి రెక్కలొచ్చి తన గుండెను వెతుక్కుంటూ గుడ్డిదైన కథ. గుడ్డి గుండె కథ బాగుందా?

      Delete
    2. మనస్సు పెట్టి‌ రాస్తున్న కథ, మనోరంజకంగా సాగుతున్న కథాగమనం. అక్షర ఖడ్గం ఈ భారత వర్ష. అక్షర
      అక్షరమున పొర్లుతున్న రచయిత మనస్సు, తేటతెల్లమవుతున్న
      కృషి. బాగాలేదను కఠిన హృదయులుందురా!

      Delete