Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, February 20, 2021

Bharatavarsha - 133

చిన్న విద్యుత్ దీపపు సన్న కాంతిలో మండువాగదిలో కొలది మంది అతిథులు నేలపై నిద్రించుచుండిరి. పట్టి మంచముపై అగస్త్యుడు, సోఫాలో వర్షుడు పడుకొనియుండిరి. అర్ధరాత్రి దాటుచున్నది. ఎంత ప్రయత్నించుచున్ననూ అగస్త్యునికి నిదుర రాకున్నది. సోఫాలో ఆదమరచి నిదురించుచున్న వర్షుని చూచి అగస్త్యుడు మంచము దిగి సోఫా వద్దకు పోయి మసక కాంతిలో వర్షుని మొఖము చూచెను. అతడి ప్రశాంత వదనముపై చిరునవ్వు విరియుచుండెను. ఏ స్వప్న లోకమున విహరించుచుండెనో కదా!  అగస్త్యునికి సుందరి తలుపుకు వచ్చెను.  ఆహా సుందరి నీ వాలు చూపులు నన్ను వెంటాడుచున్నవి. 

రాత్రి రాతిబండవలె నేలపై  నిదురించుచున్న నలుగురు అతిధులు దుంగలవలె నగుపించగా. జాగ్రత్తగా వారిని దాటుకొని బైటకు పోవుచుండగా తలుపులు మూసి ఉన్న తారగది నుండి అలికిడి వినిపించెను.  విరహము వలన వలపు వృద్ధి పొందును కదా!  అనుకొనుచూ అగస్త్యుడు తలతిప్పి తలుపులు తెరచి యున్న మాలినిగారి గదివైపు చూచెను. మాలినిగారి వద్ద మంజూష లకుమలు చంటి బిడ్డలవలె చలనము లేక నిద్రించు చుండిరి.  అగస్త్యుడు వర్షుని గది వైపు చూచెను. బల్లపై పుస్తకములు, ప్రక్కనే ఒక మూలగా ఉంచిన  వీణ కనిపించినవి. ఛీ! ఈ పుస్తకముల పురుగుతో వదినగారు ఎట్లు కాపురము చేతురో అనుకొంటిని  కానీ వర్షుడు రసికుడని తేలెను.  ఎంత రసికుడయిననూ సమయము కొరకు వేచి చూడక తప్పదుకదా.

అగస్త్యుడు వర్షుని గదిలోకి ప్రవేశించి విద్యుత్ దీపము వెలిగించి కాంతి ఇతరులకు నిద్రాభంగము కలిగించకుండుటకు తలుపు మూసి కుర్చీలో కూర్చొని వర్షుడి కొత్త పుస్తకముల దొంతరనుండి రీ ఇంకార్నేషన్ అఫ్ సూపర్ వుమన్ ఒక పుస్తకమును తీసి “రీ ఇంకార్నేషన్ అనగా పునర్జన్మ , పునర్జన్మలగూర్చి ఇతడికేల , ఎదో కవిత్వము వ్రాసుకొనక” అనుకొనుచూ చదవనారంభించెను.

                                                               ***

 నిద్రించుచున్న వర్షుడి తలపై మెత్తని హస్తమొకటి మెల్లగా తాకెను. వర్షుడి మదిపులకరించెను. వొళ్ళు జల్లన, మెల్లన కళ్ళు తెరిచి చూచెను.  కలువ కన్నుల,  ఘనస్తనముల భామ   ముత్యముల వంటి పళ్ళు మెరియుచుండ మందహాసము చేసెను. మసకవెలుతురునందు ఆమె ముఖము స్పష్టముగా కనిపించకుండెను. ఇంతలో ఆ  గజగామిని మందగమనమున ఆనందానిలయ  ప్రాంగణములోనికి ప్రవేశించెను. సాహితీ వేదిక నధిరోహించి వర్షుని రమ్మనెను, వర్షుడు వేదిక నధిరోహించుటకు ప్రయత్నించుచుండగా కాలు జారి  పడిపోవుచుండగా ఆమె తన చేతినిచ్చి పైకి లాగెను. వర్షుడు చంద్ర బింబము వంటి ఆమె మొఖంలోకి చూచెను. ఆమె చిరునవ్వు నవ్వెను , ఆమె నోటివెంట ముత్యాలు రాలుచుండెను. 

                                                                 ***  

 నాలుగు పుటలు చదివినంతనే నవనాడు లు క్రుంగుచున్నవి 545 పుటల పుస్తకము ఎట్లు రచించినాడో అనుకొనుచూ అగస్త్యుడు తన చేతిలో నున్న పుస్తకమును బల్లపైనుంచి, దీపము తీసివేసి తలుపు తీసుకొని బైటకు పోవుటకు మండువా గదిలోకి వచ్చినిలిచెను. సోఫాలో పడుకొన్న వర్షుడు స్వప్నమందు ఎవరికో మహా నందభరితుడై నమస్కరించుచుండెను. స్వప్నమందు ఏ కవి పుంగవుడో కనిపించి యుండును, విరహమనిన ఇతడికేమితెలియును! ఇతడి పుస్తకము చదవగా సగము మతి పోయెను ఇచ్చట నిలిచి ఈ రాత్రి ఇతడి వాలకం చూచినచో నా మతి పోవుట ఖాయము అని మండువా గది  తలుపు తీసి యుండుట చూసి ఇదెట్లు సాధ్యము " ఇదివరకు మూసియున్నట్లు చూచితినిగదా అని ఆశ్చర్యముతో ప్రాంగణములోకి వెడలెను.   

భవంతి  ముందర ప్రాంగణములో నడచుచూ  గోడలపై వ్రేళ్ళాడు చూ  తారలవలె మెరియుచున్న చిరు విద్యుత్ దీపములను చూచి ముచ్చట పడి  ప్రవేశద్వారమువద్ద తలలూపుచు న్న రాధామనోహరములను చూచెను. అచ్చట వెలుపల రహదారిపై ఆగియున్న కారులోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించగా కారు బయలుదేరెను. ఒక యంత్ర ద్విచక్రిక ఆ కారుని అనుసరించెను.  

ఎవరో స్త్రీ కారుదిగి  వచ్చుట  చూచి అగస్త్యుడు ఆమె వైపు  తేరిపారిచూచెను.  ఈమెను ఎచ్చటచూచితిని అని అనుకొనుచుండగా ఆమె ఆనందానిలయములోనికి ప్రవేశించుచుండెను. ఆమె వద్దకు పోయి మాటలాడుచుండగా స్వప్నము చెదిరిన వర్షుడు లేచి బయటకు వచ్చి అగస్త్యుని చూచెను.

ఆమె అగస్త్యుని బుగ్గలు పిండుచుండ అగస్త్యుడు నవ్వుచూ ఆమె చేతిలో పెట్టె అందుకొని  ఆమెను ఐదు  అంతస్తులు గల విడిది భనము లోనికి కొనిపోయెను. వర్షుడు మెల్లగా అతడిని అనుసరించెను.   అగస్త్యుడు   ఆమెను కొనిపోయి రెండవ అంతస్తు లో జానకి రఘువరన్ ల    గదిప్రక్క నున్న గదిలో నుంచి కొలది సేపు ఏదో మాట్లాడి మాట్లాడు చుండెను. వర్షుడు ఆ కిటికీ వద్ద నిలిచి అతడేమి మాట్లాడుచున్నదో వినుటకు ప్రయత్నించెను కానీ ప్రక్కనే  ఉన్నవేరొక గది  గాజు కిటికీ నుండి దీపపు కాంతి కానవచ్చెను. ఎవరో ఒక ఆడగొంతు గొణ గొణ  వినిపించుచుండెను.   అర్ధరాత్రి ఇంకనూ పడుకొనక లొడ లొడ వాగుచున్నదెవ్వరీమె అని అచ్చెరువందెను ఆమె మాటలు అతడి చెవిన పడుచుండెను.

“ ఆలాంటి బలిసిన బంగినిపల్లి ఇంట్లో పనికిరాని ములంకాడ ఉంటె పరాయి సొరకాయిని కోరుకోవడం సహజం. రంకు కి ప్రాచీన హొదా ఉంది. కొన్ని వెసులుబాటు క్లాజులు కూడా ఉన్నాయండో భర్త అభీష్టం తో పరాయి పురుషుడితో సంపర్కం తప్పు కాదు. కొన్ని గిరిజన తెగలలో స్త్రీ కొన్ని పండుగ దినములలో  నచ్చిన మగాడితో రమించవచ్చు. నాయర్ లలో అతిధి విచేసినపుడు ఆ గృహిణి విందు తో పాటు కోరుకుంటే పొందు కుడా ఇవ్వాలి అని విన్నాను. నా చిన్నపుడు మా ఇంటి పక్కన ఉన్న మా నాన్నగారి స్నేహితుడు వాళ్ళ బార్య అనారోగ్యంతో ఉన్నపుడు కాస్త వాడికి సహాయం చేయ్యు అన్న మా నాన్నగారి మాటని అమ్మ ఆయనకు బార్య అందుబాటులో లెదు అన్న మాటని కుడా మరిపించింది .ఇంట్లో సుఖం లేని ఆడది ఆ సుఖం కోసం చాటు మాటు వ్యవహారాలు నడపడం తప్పు కాదు.” ఆ స్త్రీ ఇంకనూ మాట్లాడు చుండెను. ఇది తెలిసిన గొంతువలె నున్నది అని వర్షుడు మెల్లగా కిటికీ రెక్క తెరచి చూసెను వలతి తన స్నేహితురాండ్రతో పేకాట ఆడుచూ  “ షో ఎట్లున్నది  డాక్టర్ వలతి ఫిలాసఫీ అని  పేకముక్కలు క్రింద పడవేసెను. వర్షుడు కిటికీ తలుపు మూసి ప్రక్కకు చూడగా అగస్త్యుడు చక చక మెట్లు దిగి ఆనందనిలయములోకి వెడలుచుండెను. వర్షుడు అగస్త్యుడు  కొత్తగా తీసుకువచ్చిన స్త్రీ   గదిలోకి పోవలెననుకొన్ననూ, అది సరియైన  సమయము కాదని వెనుకకు మరలుచుండెను అదే సమయములో పండిట్ అతడిని అనుసరించెను  

                                       ***

ఆనందానిలాయ ప్రాంగణమందు అగస్త్యుని ఆపి “అగస్త్యా నిజము చెప్పగలిగినచో నాదొక ప్రశ్న కలదు” ప్రశ్న ముగియకముందే  “సుందరిని చూచుటకు పోయి వచ్చుచున్నాను” అనెను అగస్త్యా వర్షుడు గొంతు రెట్టించెను బావా నీవు నన్ను అనుసరించుట నేను చూచితిని నిన్ను 

 ఆటపట్టించుటకు హాస్యమాడితిని. ఆ వచ్చినది మా అమ్మ  నేస్తము అంగయారు కన్నె చెన్నపట్టణము నుండి వచ్చు రైలు ఆలస్యముగా వచ్చుటచే ఇప్పుడు ఊడిపడినది. విడిది గృహమునందు గది చూపి వచ్చుచున్నాను.” అనెను. అంత వర్షుడు  “పెండ్లి కొడుకువి నీకెలా ఈ తిప్పలు నాకు చెప్పినచో నేను చూచుకొనెడివాడను కదా! అయిననూ బావ అని కొత్తవరస పట్టి తివే!   అగస్త్యుడు నవ్వి  “ఆడ పిల్లలని చెల్లిళ్లవలె చూచుచూ గుండెలపై నడిపించుచున్న నీవు నాకే కాదు పెళ్లికొడుకులందరికీ బావవే  కదా!” అనుచుండగా “మీ బావ - మరుదుల  బంధములు పక్కన పెట్టి ప్రమాదమును గ్రహించవలెను.” అనుచూ పండిట్ వారిని చేరెను. ముగ్గురూ మండువా గది లోపలి పోయి చకితులయ్యిరి.      

ఇచ్చట పడుకొనియుండిన నలుగురు అతిథులు ఏమైనారు ? అని అగస్త్యుడు  అడుగుటతో "మన ఇంట అతిధులు ఎచ్చట  కలరు ? అందరికీ  ప్రక్కనే ఉన్న విడిదింట బసచేయుటకు ఏర్పాట్లు జరుగుట చూచితివి కదా!"  అని వర్షుడు ఆశ్చర్యమును ప్రకటించెను.  వర్షునికి కాళ్ళ క్రింద భూమి కంపించెను. వారు అతిథులు కారు చోరులు. వారు వచ్చినది చౌర్యము కొరకు. నీ వద్ద ఉన్న స్టాక్ సర్టిఫికెట్ ఎచ్చట ఉన్నది ? అని వివేకుడు అడిగెను క్షణ కాలము వర్షుడు నివ్వెరపోయెను. సుడిగాలివలె  తన గదిలో కి పరుగు తీసెను. వివేకుడు అగస్త్యుడు అతడిననుసరించిరి. వారు  తాళము వేయబడిన సొరుగు పగలగొట్టబడి యుండుట చూసిరి.    నేను వాటాలు (షేర్స్ ) కొనుగోలు చేసినట్టు మీ కెట్లు తెలియును అని వివేక్ ను అడుగగా " అదేమీ పిచ్చి ప్రశ్న అని అగస్త్యుడు అనుచుండగా " శ్యామ్   మీకు అమ్మె  నని కూడా తెలియును , మీకు ఆయనకు మధ్య జరిగిన ఒప్పందం కూడా తెలియును." వివేకుడు ముగించగానే వర్షుని కళ్ళు తిరుగుచుండెను.    ఇప్పుడు అర్థమైనది ఇందాక కారు లోవచ్చినది శ్యామ్ అని అగస్త్యుడు గొంతు పెంచుచుండ వర్షుడు " ఉష్ అరచి గోలచేసి ఏమి ప్రయోజనము , అందరూ లేచి కలత చెందెదరు. 

 "ప్రాప్తమున్నచో పోయిన  షేర్స్ తిరిగి వచ్చును.  రేపు పెళ్లిళ్లు సవ్యముగా జరగిన చాలును. ఆ షేర్స్ దొరికినచో అగస్త్యుని సంస్థను అతడి చేతికి అప్పగించు అవకాశము కలుగును." అని వర్షుడు అనెను. షేర్స్ దొంగిలించిన మరల సర్టిఫికెట్ పొందవచ్చు. 1995 నుండి  ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ద్వారా షేర్స్ అమ్ము పద్దతి ప్రవేశపెట్టబడెను. అని పండిట్ అనుచుండగా  అగస్త్యుడు " డి మేట్ అకౌంట్ ద్వారా ఇప్పటికీ  మామూలు (మాన్యువల్)గా అమ్ము పద్దితి కూడా కలదు. వర్షుడు " షేర్స్ పోయినచో  ముందు మనము చేయవలసినపని ఏమి ?"  అని వర్షుడు అడిగెను " కంపెనీ డైరెక్టర్లకు తెలపవలెను."అని పండిట్ అనగా , అగస్త్యుడు పక పక నవ్వసాగెను .

 వర్షుడు వివేకుడు కోపముగా అతడి వైపు చూడగా మూతికి చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వు ఆపుకొని అగస్త్యుడు " డైరెక్టర్లే  చోరులయినప్పుడు, వారికి చెప్పి ప్రయోజనమేమి?!" అనెను.  "అయిననూ పద్దతి ననుసరించక తప్పదు. రేపు నేను  న్యాయ నిపుణుడిని సంప్రదించి విషయము తేల్చెదను. ఈ లోగా మన జె షేర్ సర్టిఫికెట్ని, దొంగలను తప్పక పట్టుకొనును." అని వివేకుడు అనుచుండగా  పోలీస్జీప్ వచ్చి  ఆనందనిలయము ముందు నిలిచెను. ఇన్స్పెక్టర్  వివేకునితో   " మీ ఎయిడ్  జె  ని లారీ ఢీ  కొనుటచే మరణించెను, అతడి సెల్ఫోన్ లో ఆఖరి కాల్ మీకే చేసినాడు. అని తెలిపెను. జే మరణ వార్త తో పండితునికి పిడుగుపాటు కలిగెను. వివేకుడు ఇన్స్పెక్టర్తో మాటలాడుచుండగా వర్షుడు "బావగారు ఈ విషయము పెద్దలకు  స్త్రీలకు  తెలిసిన వారు కలత చెందెదరు కావున పెళ్లి ళ్లు జరుగువరకూ ఈ విషయములు చర్చించరాదు." అని వివేకుని అర్ధించగా వివేకుడు అంగీకరించి "నేను తెల్లవారాక మునుపే ఇచ్చట ఉందును." అని వివేకుడు ఇన్స్పెక్టర్ తో కలిసి ప్రమాదస్థలికి బయలుదేరెను.     

4 comments:

  1. ఆనంద నిలయంలో అర్థరాత్రి యువకుల హంగామా బాగుంది.ఈ భాగం విభిన్నంగా ఉంది.వర్షుడు రాసిన పుస్తకంలో సంఘటన విభిన్నంగా ఉంది.అగస్త్యుడు తన తండ్రినీ, కంపెనీని ఎట్లు కాపాడుకొనునో

    ReplyDelete
  2. వర్షునకు కలలో కనిపించినది ఎవరు?

    ReplyDelete
    Replies
    1. విదిష గత జన్మ రూపం కావచ్చు

      Delete