Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, February 9, 2021

పాఠకుల తో పెళ్లి సందడి

పాఠకుల తో పెళ్లి సందడి - ఒక డిబేట్  -వచ్చే శుక్రవారం వరకూ చర్చ కొన సాగుతుంది పాత్రల మీద కథ మీద, వారి  పెళ్లిళ్ల మీద మీ భావాలు వ్రాయండి.

Pic taken on 7th Feb Sunday at Kankipadu

మనసులో లోతుల్లో పాతుకుపోయి,  హృదయాన్ని హత్తుకుపోయి, మనిషిని మురిపించేది, మైమరిపించేది సాహిత్యం. మనుషులని కలిపేది పెళ్లి అయితే , మనసులని కలిపేది సాహిత్యం. భౌతికంగా కనిపించే మనిషిని నడిపించేది అభౌతికమైన మనసే. మనసులు కలవని పెళ్లి అభూతకల్పనలా మిగిలి పోతుంది. 

ఆడ మగ శరీరాలు కలయికవల్ల మాత్రమే కుటుంబం  ఏర్పడుతుంది అనుకోకూడదు,  మనసులు కలిసినప్పుడు కూడా  కుటుంబం ఏర్పడుతుంది.  అటువంటి కుటుంబమే ఈ భారతవర్ష  కుటుంబం. అందులో మీరు నేను కూడా ఉన్నాము. ఈ కుటుంబంలో జరుగుతున్న పెళ్లి సందడిలో పాల్గొని మీ ఆనందాన్ని పంచుకోండి. 

ఆడపెళ్ళి వారి తరపున కానీ , మగపెళ్ళివారి తరుపున కానీ మీరు పెళ్ళికి రావచ్చు నేను  ఆడపెళ్ళి వారి తరపున పెళ్ళిలో పాల్గొంటున్నాను . ఇంకా చెప్పాలంటే మా అమ్మాయిలకి పెళ్లి చేస్తున్నాననే భావన లో ఉన్నాను. పిల్లల మంచిచెడల గురించి మాట్లాడితే ఆనందం కలుగుతుంది కదా ? అందుకే ఈ చర్చ. ఇదిగోమనఅమ్మాయిలుకుడివైపు ఉన్నవారు నలుగురూ వధువులు.    

క్రిందన కామెంట్స్లో ఇచ్చిన ప్రశ్నలు, సమాధానాలు చూస్తూ చర్చలో పాల్గొనండి. మీరు ప్రశ్నలు కూడా అడగొచ్చు. సమాధానాలమీద మీ అభిప్రాయం వ్రాయచ్చు.   


22 comments:

  1. మీరు కొత్తబట్టలు కొనుక్కొని యమా ఉత్సాహంగా పెళ్ళిళ్లలో సీన్స్ రాస్తుంటే భావుకత బాగానే ఉంది గానీ
    లాజిక్ మిస్ ఐయ్యింది. మీరు ఆడపెళ్ళి వారని మర్చి పోకండి. ఆడపెళ్లి వారికి అంత సోకవసరం లేదు. అది తెలుసు కొండి. మేము మగ పెళ్లి వాళ్ళం , కొత్త బట్టలు కట్టుకుని కూర్చో వలసింది మేము. మాకు సేవలు చేయవలసింది మీరు. అది తెలుసుకోండి. మీ ఆడ పిల్లలందరూ మీలాగే అల్లరి.మా మగ పిల్లలు చుడండి ఎంత కార్య దక్షులో .
    మాపిల్ల మీ కాబోయే కోడలు విదిష ఎంత పనిమంతురాలో .
    సుందరి గోడలెక్కి సైకిల్ నడుపుతోంది
    నందిని ప్రతీదానికి తుర్రు మంటూ కారు తీసి మా అబ్బాయి వర్షతో తయారు
    మంజూష అవ్వ!!!! ఏమి గడుగ్గాయమ్మా
    లకుమ మనసులో మా అబ్బాయి వివేక్ ని పెట్టుకొని నయగారాలా
    అందరిలోకి కాస్త పురెక్కి పూలాపట్టా తిప్పే బుద్ధిమంతురాలు పార్వతి

    ReplyDelete
    Replies
    1. ఆడ పిల్లలందరూ మంచివాళ్ళేనమ్మా , ఎవ్వరినీ ముంచే వాళ్ళు కాదు. పెద్దపిల్ల లకుమ - పాడో బాగో ఏంచేసుకున్నఅది దాని జీవితాన్నే కదా ! తల్లి ప్రథమ గురువు , ఆమె చెపితే వినలేదు , జీవితం నేర్పిన పాఠం నేర్చుకుంది. అందమే కాదండీ , ప్రేమించే గుణం కూడా ఉంది. ఇంకా సుందరి విషయానికొస్తే , ఆమె విమానం నడిపే పిల్లండీ , విమానం ఇచ్చి చూడండి పిచ్చెక్కిస్తుంది. గోడెక్కిందని కంప్లైంటా ? నందిని వాళ్ళ నాన్న ఎం ఎల్ ఏ పైగా పట్టుదల గల మనిషి, కవయిత్రి కూడా కదా , కష్టపడి పెంచిన పిల్లలకి మీరు వంకలు పెడితే ఎలా ? మంజూష అల్లరి పిల్ల అంటే ఒప్పుకుంటాను దానంతటికీ కారణం దామిని. పార్వతి చిన్న పిల్ల అమాయకురాలండీ, దాన్నేమీ అనొద్దు. అందరు అల్లరి చేస్తే అదీ అల్లరి చేసింది , దాని తప్పేం లేదండీ. చివరిగా నేను చెప్పేదేంటంటే మా ఆడ పిల్లలంతా ఆణి ముత్యాలు

      Delete
  2. హలో సార్.మీరు పెళ్ళి పెద్దలా లేరు. పెళ్ళి కొడుకులా ఉన్నారు.ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు కుదిర్చి బాధ్యత దించేసుకుని మీరు పిల్లవాడు అయిపోతున్నారు.

    ReplyDelete
    Replies
    1. ఆడపిల్లల పెళ్లిళ్లు అయిపోతే నేను ఫ్రీ కొంత వరకే అవుతాను , ఈ కావ్య జనని (కావ్యానికి జన్మనిచ్చిన తల్లి) కి నేనెప్పుడూ బద్ధుడనే. మరో కావ్యం వ్రాయాలంటే ఆ తల్లి ప్రోత్సాహం కావాలి

      Delete
  3. నేను కూడా ఆడపిల్ల వారి తరపునే‌ వివాహానికి హాజరవుతున్నాను

    ReplyDelete
  4. స్వాగతం , బంధుమిత్ర సపరివారంగా విచ్చేయండి. మా పిల్లలని ఆశీర్వదించింది మీలాటి పెద్దలేకదా. ఈ పెళ్లిళ్లు ఇలా కుదరి కథ సుఖాంతం అవ్వడానికి మీలాటి మంచి మనసున్నవాళ్ళే కారణం . కానీ మా ఆడ పిల్లలని అల్లరి పిల్లలని కొంత మంది అంటున్నారు. వారంని గారాబంగా పెంచాము అంతే నండి. తల్లి దగ్గర పిల్లలు అల్లరి చేయరా చెప్పండి ?

    ReplyDelete
  5. ఈ ఆడపిల్లల అల్లరి నచ్చే కదా అబ్బాయిలు వాళ్ళ కొంగులు పట్టుకున్నారు.పిల్లలు ఒక్కటయిపోయినప్పుడు మనకెందుకీ వాదన🤔 సరదాగా పెళ్ళిళ్ళు చేసేస్తే పోలా!

    ReplyDelete
  6. మీ ఆడపిల్లలు ఆణిముత్యాలయితే మా మగపిల్లలు రత్న మాణిక్యాలు , అందుకే గా ఏరి కోరి పెళ్లి చేసుకుంటున్నారు. మా లకుమకి కత్తిలాంటి కుర్రోడు దొరికేడని అరుణ తార పెళ్ళిలో అందరికీ చెప్పుకుంటుండగా నేను విన్నాను.

    ReplyDelete
    Replies
    1. పోండి! మీ అగస్త్యకి మా సుందరిని ఇవ్వడమే చాలాగొప్ప!!!

      Delete
  7. సుందరి, లకుమ , పార్వతి, ఎవరి పెళ్లి వెనుక కథ బాగుంది ?

    ReplyDelete
  8. అందరి కథలు బాగున్నవి.తెలిసో తెలియకో ముళ్ళబాట పట్టిన లకుమ జీవితానికి పూలబాట వేసిన ఘనుడు పండిట్.చేసిన తప్పుకు పశ్చాత్తాప పడి సుందరి చేయి అందుకున్న వాడు అగస్త్యుడు.బసవడు, అగస్త్యుడు ఇద్దరు ప్రతినాయకుడు తో పోరాడి ప్రేమను దక్కించుకున్నారు

    ReplyDelete
  9. మనసులు కలయిక మాట పక్కనపెట్టి , గుణ గణాల కలయిక చూసినట్లయితే సుందరి వేగం , నైపుణ్యం పండిట్ కి బాగా సరిపోతుంది అంటున్నారు కొంతమంది అలాగే వర్షుడు కవితా పాడిత్యం అకాడెమీ అవార్డు కి , అసాధారణ ధారణా శక్తి ఐ ఏ ఎస్ అవ్వడానికి పనికొస్తాయి కానీ విదిష దైవ శక్తి ముందు అవి ఏపాటి ? కాబట్టి విదిష కి వర్షుడు తగడు అని కొంత మంది అంటున్నారు . మరి విదిష మనసులో ఏముందో ఊహించి వ్రాయగలరా ? నవల ముగింపు దీనిమీద ఆధారపడి ఉంటుంది.

    ReplyDelete
  10. రంజిని కేశవుల కథ మిస్టరీ, షాక్ ఊహించగలరా ? అంతెందుకు 131 వ భాగం లో భోజనాలు అవుతుండగా పండిట్ ఇచ్చే షాక్ కి భారతవర్ష తో సహా అందరూ కుప్ప కూలి పోతారు , పరుగులు తీస్తారు పండిట్ ఇచ్చే షాక్ ఊహించగలరా ?

    ReplyDelete
  11. విదిష దైవజ్ఞ రాలు. వారసత్వం వల్ల వచ్చిన విద్య వల్ల, తండ్రి ప్రోద్బలంతో ఆమె దైవజ్ఞురాలుగా కొనసాగుతుంది.ఆమెకు లోకజ్ఞానం తక్కువ.వర్షుడే ఆమె లోకం.వర్షునికన్నా తాను గొప్ప దాన్ని అని విదిష ఎప్పుడూ అనుకోలేదు.అనుకోదు కూడా.

    ReplyDelete
    Replies
    1. విదిష మనసు లో సవ్వడి బాగా తెలియజేసారు. సంతోషం. పండిట్ ఇచ్చే షాక్ ఊహించగలరా ?

      Delete
    2. అస్సలు ఊహించలేము.తర్వాత భాగం కోసం ఎదురు చూడాల్సిందే

      Delete
  12. పండిట్ అనే భారతదేశ సుప్రసిద్ద ప్రయివేట్ ఇన్వెస్టిగేటర్ పాత్రకి స్ఫూర్తి రజని పండిట్( లేడీ డిటెక్టివ్ టి వి సీరియల్ ) ఒక్క సారి వికీ చూడండి. అలాగే ప్రతి పాత్ర , సంఘటన జరిగినవే . లూయీ విల్ లో భారత కవికి సన్మానం కూడా జరిగినదే. మరి విదిష పాత్రకి స్ఫూర్తి ఎవరు వ్రాసినవారికి వేయి నూట పదహార్లు బహుమానం సంతోషంగా అందజేస్తాను.

    ReplyDelete
  13. ఈ కథలో సాహిత్య సరదాలు ఎన్ని సార్లు చూసారు ?

    ReplyDelete
  14. Happy Ending, Tragic ending or supernatural ending which is more suitable to this novel?

    ReplyDelete
  15. Happy ending or supernatural ending. No tragic ending please,

    ReplyDelete
  16. కథలోని పాత్రల్లో తెలిసీ, తెలియక తప్పు చేసి కొందరు, ఇతరుల స్వార్ధానికి బలై కొందరు చాలా పరీక్షలు ఎదుర్కొన్నారు.అందుకే చివర్లో సుఖాంతం అవ్వాలి తప్ప విషాదాంతం అవ్వకూడదు అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. True, this novel ends in happy note. Thank you very much

      Delete