అయినా నాకు మిగిలింది కన్నీరే - రచయిత పూలబాల
భారతవర్ష కు మొదటి గాయనీ మణి లక్ష్మి శ్రీవల్లి. పరిచయం అవసరం లేని ఆంధ్రుల అభిమానాన్ని ఆంధ్రుల అభిమాన గాయకుడు శ్రీ బాలసుబ్రమణ్యం గారి ఆశీస్సులను పొందిన లక్ష్మి శ్రీవల్లి గారిని ఒక్క సారిగా కలవలేకపోయినా అంచలంచలుగా తెలుసుకుని వారి తల్లి తండ్రుల దయతో చివరకు భీమవరం లో వారి ఇంట్లో కలవగలిగాను.
.
భారతవర్ష పాటలు కీర్తనలు పాడించడానికి నెలల అన్వేషణ వెదుకుతూ వెళ్లిన నాకు పాటకు , 50 వేలు లక్ష అడిగేవాళ్ళే దొరికేరు. పాటకి 25 వేలు ఇద్దామని తయారయ్యాను. ఒకావిడ చక్కగా పాడేరు. నేను మా తోడి కోడలు కలిసి పాడతాము. ఇద్దరికీ చెరో పాతిక వేలు ఇవ్వాలి అన్నారు. కొంత మందికి స్వరం బాగుందనే మాటే గానీ పాడే పద్దతి బాగాలేదు. నేను కట్టిన బాణీలు సహజంగా రాస్తున్నప్పడు పుట్టినవి. నేను పాట బాణీతో సహా రాస్తాను. ఎవరైనా అంటే అనుకుంటాను. పాడే వాళ్లు బాణీ కట్టించమని అడిగారు.
.
దాంతో సంగీత గురువుల చుటూ పరిగెత్తాను. వారు బేక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండాలన్నారు. స్థూడియోల చుట్టూ పరిగెత్తాను. నా సాహిత్యానికి ఆరెండూ జతపరచిన తరువాత వింటే ... దారుణంగా ఉన్నాయి. నేను రాసిన గీతాలలా లేవు. వాళ్ళిచ్చిన శాంపిల్స్ ఇంకా నాదగ్గర ఉన్నాయి. వింటే బాధే కలిగేది. బాగా పాడే వాళ్ళుంటే బాగుండునని అనేక మందిని కలుస్తూ అనేక ఊర్లు తిరుగుతూ ఉండగా విజయవాడకు చెందిన బుచ్చయ్యాచారి అపాయింట్ మెంట్ దొరికింది.
.
నాగీతాలు బాగున్నాయని మెచ్చుకోడమే కాకుండా నాబాణీలు విన సొంపుగా ఉన్నాయని చెప్పారు. అప్పటికి మూడు నెలలు గడిచిపోయాయి. బాణీలు ఒకే అయితే పాడేవాళ్లు దొరకద్దూ. అన్వేషణ కొనసాగిస్తుండగా ఎట్టకేలకు లక్ష్మి శ్రీవల్లి గారి నాన్న గారి ఫోన్ నెంబర్ దొరికింది. ఆయన భారతవర్ష గురించి విని తెలుగు భాషా సంస్కృతుల గురించి శాస్తీయ సాహిత్యం గురించి నే పడే శ్రమను గుర్తించి వాళ్ళ అమ్మాయికి భారతవర్ష పాటలు పాడమని అనుమతిచ్చేరు.
భీమవరంలో వారి ఇంటికి అనుకున్నరోజున వెళ్లి పాటలు చూబించి. నేననుకున్న బాణీల లో పాడి విని పించాను. ఆ బాణీకి దగ్గర రాగం ఎంచుకుని చిన్న చిన్న మార్పులు చేసి పాడి వినిపించించారు శ్రీ వల్లి గారు. కొద్దీ రోజుల తరువాత భీమవరం విష్ణు రేడియోస్టేషన్ రికార్డింగ్ స్టూడియో లో రికార్డింగ్ చేసాము. రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళమ్మగారు కూడా ఉన్నారు. ఆ పాటలు వింటుంటే మనసు గాల్లో తేలిపోయింది. పాటల కోసం స్వరాన్వేషణ ముగిసింది. స్వరరాణి దొరికింది. రికార్డింగ్ ముగిసిన తర్వాత శ్రీ వల్లి గారికి కృతఙ్ఞతలు చెప్పి చేతులో ఒక చెక్కు పెట్టాను. ఇంత వరకూ ఆమె ఆ చెక్కు మార్చుకోలేదు.
.
అంత ప్రతిభ ఉండి కూడా, ఇంత చేసి కూడా నాకు తన ఓదార్యం తో కన్నీరే మిగిల్చింది - ఆ కన్నీటికి మరో పేరు ఆనంద భాష్పాలు.
రచయిత పూలబాల
No comments:
Post a Comment