చంపక మాలలో పద్యాన్ని మొదట ఇలా రాసాను
చంపకమాల పద్యంలో నజ భజ జ జ ర అనే గణాలు ఉండాలి. 1వ అక్షరానికి 11 వ అక్షరానికి యతి మైత్రి కుదరాలి అనే నియమాలు ఉన్నాయి. క్రింది చంపకమాల 2వ పద్యంలో అన్ని నియమాలు సరిగానే ఉన్నాయి కానీ మొదటి పద్యంలో 2వ పాదంలో యతి మైత్రి క-కు హల్లుల వరకూ సరిపోతుంది. అచ్చు లకు సరిపోదు. ఇది చాలా సూక్షమైన లోపం.
(మొదటి అక్షరంగా కి వచ్చి నపుడు 11 వ అక్షరం కె కానీ గె కానీ రావచ్చు.)
కినుక మువీడి నిచ్చెను కుశాగ్ర రసజ్ఞ నవచై తన్యమున్ - ఈ పాదం లో "కుశాగ్ర రసజ్ఞ నవచై తన్యమున్ మార్చేస్తే పద్యం అందం పోతుంది. కు అనే అక్షరం ఒక్కటి ముట్టుకుంటే ఆ తరువాత వచ్చే అన్ని పదాలు మార్చాలి. మొదటి పద్యం చూడండి. ఇలా ఉంటుంది.
చ . అనువు గవేడ భారతి అహార్య మహత్వ కవిత్వ శక్తతన్
కినుక మువీడి నిచ్చెను కుశాగ్ర రసజ్ఞ నవచై తన్యమున్
కనక మునీకృ ప భృగువు గాదె సనాతని దివ్య బాసటన్
మనమున బుట్టు పద్యముల నిత్తు తల్లికి నివాళి నిత్యమున్
రెండవపాదంలో మొదటి అక్షరాన్ని సరిచేసి రాసాను . రెండవ సారి పద్యం ఇలా ఉంటుంది.
చ . అనువు గవేడ భారతి అహార్య మహత్వ కవిత్వ శక్తతన్
గొనబ గుభాష యునిచ్చె కుశాగ్ర రసచై తన్యమున్
కనక మునీకృ ప భృగువు గాదె సనాతని దివ్య బాసటన్
మనము న బుట్టు పద్యముల నిత్తు తల్లికి నివాళి నిత్యమున్
కానీ మొదటిసారి రాసిన పద్యమే బాగుంటుంది. కారణం శబ్దం ముందు ఆ సూక్ష్మ లోపం ఒడిపోతుంది. పోతన భాగవతం లో కూడా అక్కడక్కడా ఛందస్సు లో కాంప్రమైజ్ అయ్యాడు. మహాను భావుడు ఆయన ముందు నేనెంత ?
(అంటే మనోజ్ఞమైన భాష అని అర్థం)
No comments:
Post a Comment