పుస్తకం చేతికి శోభ , మెదడుకి మేత , మనసుకి తోవ మొత్తంగా మనిషికి జ్ఞానం.
అటువంటి చేతికి శోభను చేకూర్చి, మేధను పెంచి, త్రోవను చూపించి, జ్ఞానం కలిగించి, చివరకు మోక్షం ప్రసాదించే ఆక్షర సాక్షాత్కారం భారత వర్ష గ్రంథం.
'భారత వర్ష' ' చక్కని వచన ప్రబంధం. ఆధునిక కాలంలో గ్రాంధికం రాయబడిన కావ్యం.
చక్కటి గద్యం , ఛందోబద్ధమైన పద్యాలు, సంస్కృత శ్లోకాలు , గీతాలు, మంచి వర్షనలతో నిండి వెలుగులీను తెలుగు కావ్యం.
భారత వర్షను చదివిన త ర్వాత మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి . ఇందులో ప్రేమ, శృంగారం, ఆధ్యాత్మక దృష్టి, ధర్మ ప్రబోధం, సంస్కృతి పరిరక్షణ, ఆధునిక, భాషా పోషకత్వం, శాస్త్రజ్ఞాన మున్నగు ఎన్నో అంశాలు ఆలోబింపజేస్తాయి.ఇన్ని అంశాలు ప్రక్షిప్తం చేయబడిన మానవతా ప్రబోధ కావ్యం భారతవర్ష. ఎన్నో పాత్రలు , మరెన్నో సందరాలలో, ఎన్నో సన్నివేశాలతో చదువరులకు ఉత్సుకతను కలిగిస్తూ సాగిపోయే రచన.
ఉత్తమోత్తము మైన భారతీయ సంస్కృతిని ఉ న్నతమైన తెలుగు భాషా సౌందర్యాన్ని అత్యున్నతమైన మానవతా విలువలను అత్యవసరమైన మనిషి ధర్మాన్ని తెలియ జేస్తూ గుర్తు చేస్తూ, వికసింప జేస్తూ హృదయ వైశాల్యాన్ని పెంచే కావ్యం - భారతవర్ష.
ఖారతవర్ష, విదిష, నంది ని, లకుమ, ఆరుణ తార, మీనాక్షి, రాఘవ , కేశవుడు, నాయుడు, మొదలగు వంద పాత్రలను అనుసంధానిస్తూ, మనవుని సకల లక్షణాలనూ స్పష్టంగా వ్యక్తీకరించిన మృహత్ గ్రంథం.
కథానాయకుడు భారతవర్ష ఉత్తమ శ్రేణి సంస్కారవంతుడు. భారతీయల సంస్కృతిని, భారతీయ ధర్మాన్ని, భారతీయ శాస్త్ర జ్ఞానాన్ని, భారతీయ ఆధ్యాత్మిక చింతనను ఆశ్ర యించినవాడు. మనవ జన్మ సార్థకతను గుర్తించినవాడు, ఆచరణవాది అతి సామన్య స్థితి నుండి అత్యున్నత స్థాయికి చేరినా మనిషిగా కర్తవ్యం మీరని స్థితప్రజ్ఞుడు . ఎదుటి వారికి చేతనైన సాయం చేసే కారుణ్యమూర్తి. మనుషులందరూ బాగుండాలని సమాజం పురోగతిలో సాగలని కాంక్షించే మననతామూర్తి. అందర్నీ సమనంగా గౌరవించి, ఆదరించే ఉదారమూర్తి.
శాంతి, సహనం, ధర్మం, ధైర్యం, ప్రేమ, కరుణ , ఆధ్యాత్మికత అభ్యదయం, మోక్షం - అన్నీ కలసిన స్థిత ప్రజ్ఞతే భారతీయ ఆత్మ. ఆ ఆత్మమ ప్రతికగా నిలిచే పాత్ర భారత వర్ష. భారత వర్ష. అందరూ తప్పక చదవవలసిన కావ్యం
భారత వర్ష కావ్యం భారతీయ సంస్కృతిని, భారత ధర్మాన్ని, మాతృ భాషా ఒన్నత్యాన్ని ప్రకటించే భారతీయ దర్పణం.
భారతవర్ష పూర్తిగా చదివి మూడు పేజీలు ఇచ్చిన గురువు గారు నాకోసం ఎంతశ్రమ తీసుకు న్నారో కదా!
నాలాటి అనామకుడికి మీరు ఇంత సమయం వెచ్చిస్తారని కలలోకూడా అనుకోలేదు. ముత్యముల వంటి మీ పదాలు చూసి తెలుగు తల్లి నవ్వులనుకున్నాను. మూడు పుటల వ్రాసిన మీచేతులు తెలుగుతల్లి చేతి చేమంతులను కున్నాను.
గురువుగారి చరణాలకు వర్ణమాలలో సుమమాల
అ -ఆ అన్యభాషల్లోవ్రాసినా - ఆనందం దొరకలేదు.
ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్. ఇంగ్లీషులో పుస్తకాలు వ్రాసాను, అప్పుడు పొందిన ఆనందం భారతవర్ష వ్రాసినప్పుడు కలిగిన ఆనందంతో పోలిస్తే చాలా తక్కువ.
ఇ -ఈ ఇప్పుడు కలిగిన - ఈ ఆనందాన్ని చెప్పడానికి నాకు స్ఫురించిన ఒకే ఒక మాట
"బాల్యంలో మా అమ్మ నన్నెత్తుకొని ముద్దాడినట్టుంది.
ఉ - ఊ ఉన్న మాట చెప్పాలంటే మనసు ఊయలూగేస్తోంది.
ఋ - ౠ
ఋషి వంటి ఆచార్య కృష్ణారావు గారి కరస్పర్శ తన గ్రంధపు ౠ ఛందము పెరిగింది.
ఎ- ఏ - ఐ
ఎగ్గులు ( దోషాలు ) ఏఱుగొని ( వరద ప్రవాహంలో కొట్టుకొని పోవు) గ్రంధం గంధం పూసుకొంది.
ఒ - ఓ - ఔ
ఒనరారు పదములతో ఎనలేని ఓర్పుతో ఓరుదీర్చి మీరిచ్చిన అక్షరదీవెన ముందుమాట
అం అః అంతాయత్తైన(సొంపైన ) మీ ముందుమాట నాకు అందుమాటా!
అందుకే
మందాక్రాంతమందు గురువర్యులకు పూలబాల పాదాక్రాంతము
UUU UII II UUI UUI UU
శ్రీమంతం బౌనెన రుగన పత్రంబు లేకాంచ చిత్త
మేమందా రంబగు చదవ నామ్రేడి తంబౌగు ణంబు
హేమంబే యంచుతొ లగగ దాహేఠ ముల్లాస మెల్ల
ఆమంత్రి తంబౌము దముగ తెల్గంద మేలెకృ తినే
శ్రీమంతంబగుపత్రములను చూచిన మనస్సు ఆనందమును పొందుచున్నది.
మీరు వ్రాసిన మూడు పత్రములనూ తెలుగందం పరిపాలించుచూ ఆనందమును ఆమంత్రించుచుండగా (నాలో) హేఠము తనంత తానే తొలగి పోయెను.
No comments:
Post a Comment