న్యూఢిల్లీ చాణక్యపురి : శిశిరము తుషారమును జల్లు చుండెను. నగరమును పొగమంచు అల్లుచుండెను. ఢిల్లీ దారులు మసక బారినవి. దూరమునున్న వా రెల్లరూ తెల్లని వస్త్రము మాటున దాగి నట్టు మసక మసకగానగు పించుచున్నారు. ఆకాశమున మబ్బులలిమినవి. లీలామహల్ పేలస్ 5 వ అంతస్తు మేడపై నిలిచి చూచుచున్న కేశవునకు బాల భానుని రేఖలు ఆ పొరలను చీల్చుకొని నీటి ధారలవలె ఎగయుచు కనిపించుచుండెను. భవంతులు ఉల్లిపొర కాగితము నందు చుట్టబడిన బహుమతులు వలే కనిపించుచుండెను. భారత రాజధాని యందు రాయభార కార్యాలయముల కాలవాలమై రాచఠీవిని వొలకబోయు చాణక్యపురి నందు ఇండియా గేట్, అక్షర్ధామ్ కన్నాట్ ప్లేస్ మరియు లోధి ఉద్యానవనముల సమీపంలో, సౌందర్య వ్యాయామ శాలలుతో పాటుగా మిద్దెపై ఈతకొలను గల ఏకైక విలాసవంతమైన హోటల్ లీలామహల్ పేలస్. మేడదిగి తన గదిలోకి పోవుచూ ప్రక్కనే వున్న రంజిని గదివైపు చూసేను. ఆమె గది తలుపు వేసి యున్నది. కొలది సేపు చూసి తలుపు కొట్టగా రంజిని తలుపు తీసెను. కేశవుడు లోనికి పోక తలుపు వద్దనే యుండెను.
“ఇచ్చట విదేశీ రాయబారులు, ఇతర దేశ ఉన్నతాధికారులు కేంద్రమంత్రులు బసచేయుదురు, మనమున్నచో డబ్బు మంచినీటి ప్రాయముగా ఖర్చుచేయవలెను అని చెప్పిననూ వినక మీరు దినమునకు పన్నెండు వేలు అద్దె చెల్లించు చూ వేర్వేరు గదిలో మన బస ఏర్పాటు చేసినారు.” అని కేశవుడనగా “ఒకే గదిలో ఇరువరము యుండుట నీకు అసౌ కర్యముగా నున్నది కదా! నీ సౌకర్యముకొరకు డబ్బు లెక్క చేసెదనా!”
“ఇచ్చట ప్రెసిడెంట్ స్వీట్ యను ఒక రాచ గృహము ఒక రాత్రికి మామూలు ధరలో ఏడున్నర లక్షలు, తగ్గింపు ధరలో ఐదు లక్షలు ఖరీదు చేయును. నాకు వలసినచో అదియునూ తీసుకొందురా?” అని కేశవుడు అడగగా “వేర్వేరు గదిలో బసచేయుచున్నాము పైగా మీరు అనుచున్నావు ఇంకా ఇచ్చట ఉండుట ఏల? నేడే హైద్రాబాద్ పోయెదము రెండు మనసులతో ఇచ్ఛటుండిన లాభమేమి? అని రంజిని తలుపు వేసెను. కానీ కేశవుడు తన గదికి పోక ఆ తలుపు వద్దే నిలిచి యుండెను . ఒక అరగంట గడిచిన పిదప కోపము చల్లారిన రంజిని తలుపు తీసి చూడగా జాలి గొలుపు మోహ ముతో కేశవుడు రంజిని వంక చూచుచుండెను. రంజిని లోపలకి రమ్మని చేయిపట్టుకుని కొనిపోయి సోఫాపై కూర్చొండ బెట్టెను. కొంత సేపు మౌనము వహించెను. వివర్ణమైన రంజిని వదనమును ఆమె మనోవ్యధను గమనించు చుండెను. గది అంతయూ నిశ్శబ్దమలుముకొనెను.
నేను లేమినుండి వచ్చితిని , నా కుటుంబ నేపద్యము తెలియదు తార , మాలిని మరియు మీ వంటి అమ్మలు ఆదరించుటచే కళ యందు జీవితము లభించెను. నాకు మీవంటి వారిని చూచిన భయము సహజమే కదా!
మీరు కోరినచో శ్రీమంతులెందరో మీ చేయి అందుకొనుటకు సిద్ధముగా నుందురు. " నన్ను విడిచి పోయిన వాడు కూడా శ్రీమంతుడే , నాకు శ్రీమంతుడు కంటే గుణవంతుడే ముఖ్యము. మన వయో భేదములనెఱిఁగిన పెద్దలెవరైననూ మన బంధమును అంగీకరింతురా? ప్రేమ విషయమున ఒప్పు మెప్పులు గణింప పని ఏమున్నది ? చేయు ప్రతిపనిని ఇతరులు ఒప్పుకొనుట మెచ్చుకొనుట ఆశించిన మనను మనము కించ పరుచుకొనుటయే. నేను మీనాక్షి వలె పాతివ్రత్యమునాచరించలేను. అరుణతార వలే వంటిరి జీవితమును గడుపజాలను. మీనాక్షి సంగతి నీకెట్లు తెలియును. మీనాక్షి సంగతి అప్రస్తుతము , ముందు నీ సంగతి తెలుపుము.
నేను మాలిని తారలవలె అమ్మ అనిపించినచో నీ గదికి పొమ్ము లేనిచో .. రంజిని మాట పూర్తి చేయక మునుపే కేశవుడు ఆమె చేతిని పరిగ్రహించెను . " ఒకసారి అందుకొన్నచో చేతిని విడువజాలను " అని చెప్పుచుండగా " నువ్వు విడిచిననూ నేను విడవనిత్తునా ?" అని రంజిని అనుచుండగా కేశవుడు కొంటెతనమును గ్రహించి ఆమె పిరుదుల క్రింద తన రెండు బాహువులను బిగించి పైకి ఎత్తిగిరగిరా త్రిప్పసాగెను. రంజిని శరీరము గిరగిరా గాలిలో తిరుగుచుండగా ఆమె కురులు నీటి యందలలవలె విస్తరించి అల్లాడుచుండెను. రంజిని కిలకిలా రావములతో గది అంతయూ నిండిపోయెను. ఆమె కురులయందు దాగిన కుసుమ సువాసన కేశవుని నాసికా పుటములను తాకి మరులు గొలుపుచుడెను. ఆ మత్తునందు వివశుడైన కేశవుడు క్రమముగా ఆమె ఘన నితంబములొత్తుకొన క్రిందకు జార్చెను.
కేశవుడామెను మెల్లగా జార్చుచుండగా పట్టువలె మెత్తని ఆమె ఆమె దేహమంతయూ అతడి దేహమునకు రాసుకొనెను. చెకుముకిరాళ్లు రాపాడ నిప్పు కణికలు పుట్టవా! వారి దేహములు మోహ హవనమందు కాగి వేడెక్కినవి. ఆమె కాళ్ళు నేలను తాకిననూ కేశవుడు ఆమెనింకనూ కౌగిట బంధించి వదలలేకుండెను. ఆమె పయోధరములు అతడి ఛాతీని అదుముకొనగా అతడి పెదవులు ఆమె పెదవులనందుకొన్నవి. అట్లు ఒండొరులు , కౌగిలించుకొని , చుంబించుకొని మైకముగొని అట్లే నిలిచి యుండిరి.
కేశవుడు తన గది ఖాళీ చేసి రంజిని గదిలోకి ప్రవేశించెను. పిదప ఇద్దరూ మిద్దెపైగల కొలనులో ఈదులాడి క్రిందకు వచ్చిరి. రంజిని అద్దము ముందు నిలబడి చీర ధరించి " కేశవా ఈ రవిక ముడి వేయుము , అని కేశవుని పిలవగా కేశవుడు వెనుకనుండి రవిక ముడివేసెను. నేడు మనము రాజొరీ గార్డెన్స్ నందు గల లైఫ్ స్టైల్ మాల్కి పోయి షాపింగ్ చేసెదము.
చాలా ఆహ్లాదంగా ఉంది సార్ ఈ భాగం.రంజని పాత్ర ఆశక్తికరంగా ఉంది. పండితుడు (వర్షుడు) చాలా కొంటె వాడు సుమా! భారత వర్ష ఒత్తిడిని దూరం చేసి మరో లోకంలో పయనించేలా చేస్తుంది.
ReplyDelete