విశ్వమంగళ గీతాల రచనతో ప్రపంచ శాంతి కై పరితపించి వినుతికెక్కిన
విశ్వ విఖ్యాత వంగీపుర శ్రీనాథ చార్యులకు పూలబాల కవితాంజలి
నీ సాటె వ్వరు నాథ, గౌరు గంభీర సాహిత్య తేజ
దోష రాహిత్య నిత్య సాహిత్య భోజ విశ్వకవిరాజ విరాట్ తేజ
నీ యాంగ్ల కవన దౌరు, ప్రభవిల్లు సాహిత్య సౌరు
ఘోషించు నీ నీలంపు తలంపుల విశ్వశాంతి గోరు
నీభావగీతాల నాసాదించు దాతృత్వ భావముల్
అతులిత పద బంధ ముల్ అంద చందముల్
చైతన్య బీజముల్, శాంతివారముల్
అకుంఠిత దీక్షోద్బవ అఘోర శాంతిమార్గముల్
ఆత్రేయు తేజంబు లొప్పు అసమాన ఆచార్య
జితకాశి, వారణాసి జాత విశ్వవిఖ్యాత స్పూర్తి ప్రదాత
భూమండలోత్తుంగ భూరి కవినాథ , వంగీపురనాథ శ్రీనాథ
దశ సర్గ విశ్వమంగళ కామ్య కవన నాథ, శ్రీనాథ
జయ జయ పురంజయ హర హర నాథ హరి నాథ జగన్నాథ
కరుణతో కావవయ్య శ్రీనాధా చార్యున్ నాథ పశుపతి నాథ
బ్రోవవయ్య నీల రామానుజా సుతున్ నాథ ప్రమథ నాథ
భవదీయ భజనీయ కమనీయ రమణీయ మంత్ర మహిమ
సంభావించి సవిత్తున్ ఐక్య రాజ్యముల మరంబగుగాక
No comments:
Post a Comment