Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, December 9, 2023

ఆర్ కే నారాయణ్ ఇల్లు - విజయవాడలో కూడా

రోడ్డుపైన నడుస్తున్నా  రోజుకి 1500 పదాలు వ్రాసే రచయిత. 

ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకున్నాడో  -  తెలిస్తే ఆశ్చర్యం  

విజయవాడలో కూడా ఇలాగే చేస్తే బాగుంటుంది.  

ఆర్కే నారాయన్  అనగానే  అందరికి  మాల్గుడి డేస్  గుర్తుకొస్తాయి.  మాల్గుడి డేస్ సీరియల్ భారతీయుల గెండెల్లో చెరగని ముద్ర వేసింది.  మాల్గుడి డేస్ లో  స్పష్టమైన పాత్రలు, సరళమైన కథనాలు,  భారతీయ  సంస్కృతి  జీవన విధానాన్ని ప్రతిబింబిస్థాయి. 

ఆర్కే నారాయణ్   భారతదేశంలో నే కాక విదేశాల్లో  మారుమ్రోగిన పేరు.  ఉపాధ్యాయుని కొడుకుగా  మధ్యతరగతి కుటుంబంలో  పుట్టి పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకోడమే కాక 1960 లో జాతీయ అత్యున్నత గౌరవం సాహిత్య అకాడమీ అవార్డు  అందుకు న్నారు. అమెరికా,  ఆస్ట్రేలియా లో  పర్యటించి  మూడు వారాల పాటు  భారతీయ సాహిత్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. ఆపై రాజ్యసభ సభ్యుడిగా  కూడా నియమించబడ్డారు  రచనల ద్వారా  అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న రచయిత ఆర్ కే . నారాయన్  రచనల ద్వారా  రాజకీయ హోదా పొందచ్చని  నిరూపించారు. ఇవన్నీ  చదువు రాత పూర్తిగా రాని నేటి యువత కి తెలియకపోవచ్చు , పాఠ్య పుస్తకాలే చదివే శక్తి లేక  రొప్పుతున్న యువత  ఆయన పుస్తకాలు చదివి  ఆయన  గొప్పతనం తెలుసుకోలేకపోయినా 

                                       


అటువంటి రచయితలకి  గొప్పతనాన్ని తెలియజేసి వారి రచనలను తెలియజేసే భాధ్యత  ప్రభుత్వాలకి ఉంది. ఆ బాధ్యత ను మైసూర్ స్థానిక ప్రభుత్వం గుర్తించడం చాలా ఆనందం. నారాయన్ ఇంటిని మ్యూజియం గా మార్చి  ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచారు.  మైసూర్ కి ఆర్ కే   ఎలాగో విజయవాడకి  విశ్వనాథ వారు అలాగే. బాధా కరమైన  విషయం  ఏంటంటే మన స్థానిక ప్రభుత్వాలకు అలాటి స్పృహ లేకపోవడం.  

సామాజిక ప్రయోజనం కోసం రచనలు చేసే రచయితలని, వారి రచనలని ఆదరించడం ప్రభుత్వాలకు బరువైనప్పుడు ప్రజలే ఆ రచనలని ఆదరించాలి.  భారతవర్ష అటువంటి సామాజిక ప్రయోజనం కోసం చేసిన రచన.    తెలుగు పై ఆంగ్ల ప్రభావం తగ్గించి స్వచ్ఛమైన తెలుగు భాషలో మాధుర్యాన్ని చూపించడానికి వ్రాసిన గ్రంథం భారతవర్ష. ఏమాత్రం సందేహం లేదు. 




2 comments:

  1. Whenever i heard about RK narayan. I remembered malgudi days. In my childhood, i loved to watch malgudi days serial every day.
    Through vivid characters and simple narratives, it portrays the essence of Indian life, culture, and values.
    Each story captures the human relationships and their values.

    ReplyDelete
  2. R k Narayan proved that anyone can achieve success, regardless of their background, only when they are focused on their goals

    ReplyDelete