సెప్టెంబర్ 9వ తారీకు సోమవారం రాత్రి విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయం లోనాకు చిరు సత్కారం జరిగింది. మా అమ్మాయి ఋగ్వేదం పద్మశ్రీ సంగీతప్రతిభ తో అంతర్జాతీయ పురస్కారం గెలుచుకోవడాన్ని పురస్కరించుకుని ఏర్పాటయిన సభలో వేదిక నెక్కి నాలుగు చేతులతో నా అర్థాంగి వరలక్షి తో కలిసి మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా సన్మాన పత్రాన్ని తీసుకున్నాను (ము). వంద మంది దాకా హాజరైన ఆ సభలో తెలుగు చిత్ర గీతాలు వెల్లువై పొంగాయి. నంది అవార్డు గ్రహీత డాక్టర్ సునీల్ గారు సభ ను నిర్వహించారు. కళావాచస్పతి డాక్టర్ కొప్పుల అశోక్ ఆనంద్ గారు వ్యాఖ్యానం అందరిని ఆకట్టుకుంది.
నా సాహిత్యాన్ని నిజంగా ఇష్టపడి చదివి నాకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఎంతో శ్రమతీసుకుని నాకీ సన్మానం జరిపించారు ఋగ్వేదం కిషోర్ గారు. నిండైన మనసుతో వేదిక పై పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు అందించిన అజ్ఞాత స్త్రీ మూర్తి ప్రేమకి పులకరించి నా మనసు కురిపించిన ఆంగ్లకవిత ఇవెంటస్ (లాటిన్). ఇవెంటస్ అంటే విజయం అని అర్థం.
Very nice andi 🎉🎉🎉🎉
ReplyDelete