Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, September 25, 2023

మన పిల్లలకు ఇది చాలా అవసరం.

 మాటలు  తూటాలకంటే అణు బాంబులకంటే చాలా శక్తివంతమైనవి. భాష మన జాతి శ్వాస , మన ఉనికి  ఆత్మ నిగ్రహం , ఇంద్రియ నిగ్రహం , సత్యవాకుపాలన , తపోబలం బ్రహ్మచర్యం ఇలాటి మాటలకి నేడు కాలం చెల్లిపోయింది.  ఇంద్రియ నిగ్రహం   బ్రహ్మచర్యం బూతుమాటలు.  ఇప్పుడు అలాటి మాటలు మాట్లాడితే  ఛి ఛీ   అంటారు.

మంచి ఫిగర్ , కెవ్వు కేక , ఫుల్ ఎంజాయ్  ఆన్ లిమిటెడ్ ఫన్ ,   ఇలాటిమాటలే సినిమా  వ్యాపార ప్రపంచం  పుట్టిస్తున్నది.  మాటలు    విలువలని నిలబెడతాయి, మన సంస్కృతిని   

పాత మాటలు , పాత పాటలు మనకెందుకనుకుంటున్నాము.  మనం డవలప్ అయిపోయాము అనుకుంటున్నాము.  సెల్ ఫోన్ , కంప్యూటర్,  కారు  రూపంలో మన డవలెప్ మెంట్ కనిపిస్తున్నాయి.    కానీ ఇది మన ఫిజికల్  డవలెప్ మెంట్ మాత్రమే.  నోరిప్పితే తెలుస్తుంది మన మెంటల్ డవలెప్ మెంట్ ,  మన ప్రవర్తనలో మన సాంస్కృతిక  కార్యక్రమాల్లో మోరల్ డవలెప్ మెంట్  కనిపిస్తాయి. కానీ మన సాంస్కృతిక కార్యక్రమాలు కాలక్రమేణా బ్రష్టు పట్టిపోయాయి



 


ఒక్క మంచి పాటతో  మొదలు పెడతారు , తరువాత అసలు స్వరూపం బయటపెడతారు.  వల్గర్ ఇంగ్లిష్ మాటలు భావజాలం గల పాటలు ,  హెవీ డ్రమ్స్ , ఫాస్ట్ బీట్ , సినిమా స్టెప్స్ మొదలెట్టే స్తారు . ఆధునిక సినిమా పాటలు మోజు తో  అచ్చతెలుగు   మరియు సంస్కారం చచ్చిపోతున్నాయి  మంచి మాటలు మంచి సాహిత్యం నేడు చాలా అవసరం  మంచి సాహిత్యం జాతికి పోషకాహారం , మంచి కవులు జాతికి వెన్నెముక.

 

భారతాన్ని తెలుగులో రచించిన  నన్నయ్య గొప్ప సాహిత్య విలువలున్న కవిపండితుడు.  వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు,  సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు.  ఆయన బిరుదులకి అర్థం చెప్పడానికి నాలాటి అల్పకవికి సాధ్యం కాదు. ఆదిపర్వం సభా పర్వం , అరణ్య పర్వం - రాసి నన్నయ్య 11 శతబ్దం లో చనిపోతే ఎర్రన అనువదించే వరకు తెలుగు ప్రజలు ఒక శతాబ్దానికి పైగా చివరి అనువాదం లేకుండానే ఉన్నారు.

డాక్టర్ మన్మోహన్ ఘోష్ అనే   కలకత్తా యూనివర్సిటీ ప్రొఫెసర్  భరతముని వ్రాసిన నాట్య శాస్త్రాన్ని    ఆంగ్లానువాదం చేసిన  మేధావి .  ఈయన 1925 లో భరతముని నాట్య శాస్త్రాన్ని చదవడం  ప్రారంభించి  చదువుతుండగా 19 సంవత్సరాల తరువాత  1944 లో  గ్రంధాన్ని  ఆంగ్లానువాదం చేయగలను అనే నమ్మకం వచ్చింది. అలా ఆత్మవిశ్వాసం   వచ్చిన తరువాత  ఆసియాటిక్ సొసైటీ వారికి చెప్పగా వారు అనువాదం చేసే పనిని ఈయనకి అప్పగించారు. 1944 నుండి 1951 వరకు 8 మంది భారతీయ ఆంగ్ల ఆచార్యులు కలిసి (7 సంవత్సరాలు)  శ్రమించి భరతముని నాట్య శాస్త్రాన్ని  భారతదేశానికి, ప్రపంచానికి అందజేశారు. నేటికీ కూడా భారతదేశంలో అనేక ప్రాచీన గ్రంధాలు అనువాదం చేయగల వారు లేక అలా ఉండిపోయాయి.

 నేను  భారతవర్ష అనే విలువలతో కూడిన అచ్చ తెలుగు లో అతిపెద్ద  గ్రంధాన్ని వ్రాసిన అనుభవంతో ఒక్క మాట చెపుతున్నాను.  మన పిల్లలకి  ఆధునిక సినిమాగీతాలతో వచ్చే ఆధునికత కంటే  పాతగీతాలతో స్వచ్ఛమైన తెలుగుతో వచ్చే సంస్కారం చాలా విలువైనది. 

No comments:

Post a Comment