Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, July 8, 2023

అమూల్యభావ పరంపర - అమూల్య

రమ్మని పిలువగ వత్తురా రమణులు 

ఇమ్ముగ వ్రాసిన గ్రంధము చూపిన 

ఇమ్మనువారెందరు గలరిచ్చట.  

కమ్మని తెలుగు గ్రంధమును జూచి  


ముచ్చట పడక, పడక వేయగ స్థైర్యము  

రిచ్ఛపాటు  చూపి  రెండు పుటలు చదివి 

ముచ్చెమటలు పట్టగ స్వచ్ఛమైన  సంతోషము

నచ్చటె విడుతురు.  ఎచ్చట భాషాభిమానులు  











ఎచ్చట  నేటి విద్యాధికు లెచ్చట?

విచ్చిన భావాల మెచ్చెడి చదువరు 

లెచ్చట? అచ్చెరువందక అచ్చ తెలుగును 

లచ్చించు తెలుగువారెచ్చట?  పూల

గుచ్ఛమంటి పొత్తము జదువఁ సమయము 

వెచ్చించు వారెచ్చట?



 విజ్ఞులెచ్చట సజ్జనులెచ్చట ?

అభిజ్ఞులు లెచ్చట ?  రసజ్ఞులెచ్చట?

అచ్చుపోసిన  పసిడి పలుకులను 

అచ్చువేసిన అచ్చ తెలుగును 

పచ్చటివెలుగుల పదబంధాల

సుగంధాలను మూర్కొను  వారెచ్చట?


మృదు మనస్కులెచ్చట?కవితా 

స్పృహ గల్గినవారెచ్చట? కవితా 

బృందావన విహారులెచ్చట ?

వెచ్చటి హాయినిచ్చు వేవేల పద 

కవితల హారతి  గొను వారెచ్చట?

పద ముత్యాలను నిత్య సత్యాల

హారాలను ధరించి తరించు వారెచ్చట?

వేయితంత్రుల వీణియను మ్రోగించు 


 

క. అమ్మకు దయకలి గినచో

  కమ్మని   తేనెల  తలంపు   కలమున  బట్టున్ 

  నెమ్మిక  కలిగిన   మదిలో  

  అమ్మయె  కొలువ  గయుండు  అన్నియు తానై

3 comments:

  1. Your thirst for mothertongue is amazing. Your sahityam , every single letter and every single words is amazing. You are an amazing writer born for a cause. Meeting a person like you is the most memorable event of my life.

    ReplyDelete
  2. The poem is like rich with splendid vocabulary of word and rich rhyme. It feels like drums played in quick succession or 1000 wala

    ReplyDelete
  3. సాహిత్యం కి గొంతూ వుంటే ఇంతా అందంగా వుంటుందిఏమో అని అనిపించింది గురువు గారు

    ReplyDelete