Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, June 30, 2023

Indian Sonneeters for Nobel Prize

 1910 లో  అతడు 156  బెంగాలీ భక్తి గీతాలని అందంగా అల్లేడు.   ఈ  బెంగాలీ కవితా సంకలనం 4 ఆగస్టు 1910న ప్రచురించ బడింది. ఆ భక్తి గీతాలనుండి 103 గీతాలను  తానే  స్వయంగా  ఇంగిలీష్ లోకి  అనువదించు కున్నాడు. 1912 లో ఇంగ్లాండ్ లో ఇండియన్ సొసైటీ దానిని ముద్రించింది. 1913 లో నోబెల్ ప్రైజ్ కొట్టాడు. తరువాత రక్తం కారేలా ఏడ్చాడు. స్విట్జర్లాండ్  సంస్థ ఆయన్నుఆదరించక పోతే అయన పేరు ఎవరికీ తెలిసి ఉండేది కాదు. ఆయన ఊరుపేరు లేని ఒక బెంగాలి కవి గా మిగిలిపోయి ఉండేవాడు.  ఆయన పేరు రబీన్ద్రనాథ్ ఠాగూర్.   


110 సంవత్సరాల క్రితం 1913 లో రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలికీ నోబెల్ ప్రైజ్ పొందాడు. ఆపై వేలాది అభినందన టెలిగ్రాములు పొందాడు. (గీతాంజలి రచించినందుకు కాదు) ఆవిషయం ఆయనను కలచివేసింది. పెద్ద సభ, విందు ఏర్పాటు చేయబడింది. జనాలు బాగా వచ్చారు అందరూ సంతోషంగా తింటున్నారు. అతడి ముఖంలో సంతోషం లేదు. ఆ విషయం ఒక పాత్రికేయుడు ఠాగూర్ ని అడిగాడు "నాకు సంతోషం ఎలా కలుగుతుంది? ఇప్పుడు వచ్చే అభినందనలు అన్నీ నోబెల్ ప్రైజ్ కే కానీ నాకు కాదు. నా పద్యాలు ఎవరైనా చదివి అభినందిస్తే అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది." అన్నాడు. 110 సంవత్సరాల తరువాత కూడా మనదేశం అలాగే ఉంది.


ఇండియన్స్ కి  తెలిసినది ఒక్కటే అవార్డులు వస్తే దండలు, పదవులు వస్తే దండాలు.  సాహిత్యం అక్కరలేని ఒక గొడ్డు మోతు సమాజం మనది.  ఈ మాట  ఎందుకన్నానో చివరిదాకా చదివితే తెలు స్తుంది. కాపీ కొట్టి అయినా సర్టిఫికెట్ , పైరవీల చేసైనా పదవులు,  ప్రాణాలు తీసయినా  డబ్బు ఇవే ముఖ్యం. 

ఠాగూర్ 103  రైమ్,  స్ట్రక్చరల్ సక్సషన్  లేని మామూలు పద్యాలు  వ్రాసారు, కానీ అవి చాలా అందంగా అత్యద్భుతంగా వ్రాసారు గురుదేవ్ ఠాగూర్ గొప్పవారని నేను ఒప్పు కుంటాను. ఆయన వ్రాసిన అన్ని పద్యాలు నేను చదివాను. చాలా అందంగా ఉంటాయి.   ఇండియన్ సొనెటీ ర్  నేను స్ట్రక్చరల్ సక్సషన్  రైమ్ఉన్న  200 సొనెట్స్ రాసాను. ఈ పద్యాలు కూడా అంతే అందంగా ఉంటాయి

కానీ చాలామందికి  ఠాగూర్ గీతాంజలి లో వ్రాసినవి 103 పద్యాలని తెలీదు, అవి బెంగాలీ భక్తి గీతాలని అంటారు. అది కూడా తప్పే అని తెలియదు. వాటిని ఆయనే  స్వయంగా ఇంగిలీషులోకి అనువదించుకున్నారని తెలియదు.  వాటిని ప్రోస్ పోయెట్రీ  అంటారని తెలియదు. దానికి Y. B. Yeats (ఈట్స్) అనే ఆంగ్లకవి ముందు మాట వ్రాసాడని తెలియదు. T. Strudge Moor స్ట్రడ్జ్ మూర్ అనే  బ్రిటిష్ కవి గీతాంజలిని నోబెల్ కమిటీకి నామినేట్ చేసాడని తెలియదు. ఏమీ తెలియకున్నా అవార్డులంటే, ఆకాశానికెత్తేస్తారు.  అందునా పాశ్చాత్యుల అవార్డులంటే చెప్పన క్కరలేదు.  

నేను వ్రాసిన సొనెట్స్ ఠాగూర్ వ్రాసిన గీతాంజలి పద్యాలు చదవకున్నా ఆయన  నోబుల్ ప్రైజ్ మాత్రమే చూసి ఆయన గొప్పవాడని చెప్పే వాళ్ళే . ఈ నాటికీ ఉన్న సమాజం మనది.  మనవాళ్లె  వరూ చదవరు. చదవలేరు.  డిగ్రీలు , పీజీలు  చేసిన వారిలో 90 శాతం మందికి చదువు లేదు.   మనవ్రాసినవి  అకాడెమీ లకి  చూపించి జబ్బలు తట్టుకుని మురిసిపోడమే  ఇప్పుడొప్పు  కుంటారా మనది గొడ్డుమోతు సమాజం అని?   

2 comments:

  1. మనదే కాదు మాస్టారూ... అందరూ అలానే ఉన్నారు.ప్రస్తుత కాలంలో సత్య వాక్కుకు,ధర్మానికి గుర్తింపు కోసం వెతుక్కుంటున్న పరిస్థితిని చూస్తున్నము.....ఈ సమాజంలో తీరు మార్చాలి మాస్టారూ....

    ReplyDelete