ప్రస్తుత కాలంలో తెలుగు సాహిత్యాన్ని నేటి తరం యువత ఎవరు పట్టించుకోవడం లేదు. నేడు తెలుగు చదవడం చాలా మంది పిల్లలకి తెలీదు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలల కారణంగా, అక్కడ కూడా ఇంగ్లీష్ కి ప్రాధాన్యత ఇవ్వటం. ఇంట్లోని తల్లిదండ్రులు ఉద్యోగాల్లో, కంప్యూటర్లు, సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ పిల్లలకి కూడా అవే నేర్పిస్తున్నారు.
అంతే కాకుండా నేటి సినిమాలు కూడా తెలుగు సాహిత్యం విలువ తగ్గిపోవటానికికారణం. సినిమాల్లోని అసభ్యకరమైన పదజాలం, కార్యక్రమాలు పిల్లలపై, యువతపై ప్రభావం చూపుతుంది. గ్రంథాలయలు, తెలుగు భాష కీర్తికి సంబందించిన పుస్తకాలు కనుమరుగు అయిపోతున్నాయి. మన చరిత్రను, సాహిత్యాన్ని కాపాడుకోవాలి అంటే పద్దతిని మార్చుకోవాలి నిపుణులు చెప్తున్నారు.
No comments:
Post a Comment