అనంతపురం చరిత్రలో ఒక అరుదైన సంఘటన
ఒక తెలుగు గ్రంధానికి సన్మానం జరపడం కొంచెం అరుదైన సంఘటనని చెప్పవచ్చు. ఒక రచయిత సభకు రాలేకపోయినా అతడి గ్రంథానికి సన్మానం జరపడం బహు అరుదు. కాదంటారా ? నేటి కాలంలో ఇలాటి సంఘటనలు జరగడం మనం చూసామా ?
వెంకట్ పూలబాల రచించిన 1265 పేజీల భారతవర్ష అచ్చతెలుగు గ్రంథం గురించే ఇదంతా.
భారతవర్ష గురించి ఆన్లైన్ లో చూసి రచయిత పూలబాలతో ఫోన్ లో మాట్లాడి భారతవర్ష ఒక్క ఆంగ్ల పదం లేకుండా 2,50,000 తెలుగు పదాలతో నవరస పద్యాలతో వంద పాత్రలతో రచించి బడిన అతిపెద్ద గ్రంథమని తెలుసుకుని ఆసక్తి తో భారతవర్ష లో కొంత భాగం చదివి ప్రపంచ రికార్డ్ పొందిన తెలుగు గ్రంథాన్ని సన్మానించాలని నిర్ణయించుకున్నారు మాతృ భాషానురక్తులైన యువకులు రవిచంద్ర, వెంకటేష్
విజయవాడలో సన్మాన సభకి ఉన్న రచయిత కి ఆహ్వానం పంపారు అనంతపురం జిల్లాలో మారుమూల పల్లె గణిగెరలో ఉన్న యువకులు రవిచంద్ర, వెంకటేష్. ఒక వైపు ప్రయాణం 12 గంటలు. కారణాంతరాలవల్ల ఎంత ప్రయత్నించినా రచయిత వెళ్లలేకపోయాడు అందుకని సహృదయులైన, ఆ యువకులు కార్యక్రమాన్ని రద్దు చేయకుండా భారతవర్ష కావ్యాన్ని భుజాల కెత్తుకొన్నారు. తెలుగు మీద పూలవర్షం కురిపించారు. మాతృ భాషానురక్తులైన యువకులు రవిచంద్ర, వెంకటేష్
జూన్ 17 వ తారీకున (17th june 2023) మదర్ తెరిస్సా విద్యా సంస్థల వార్షి కోత్సవం సందర్భంగా ప్రపంచ రికార్డు పొందిన తెలుగు గ్రంధాన్ని సభకి పరిచయం చేశారు. అమ్మభాషని ఎందుకు వీడకూడదో అన్న రచయిత సందేశాన్ని చదివి వినిపించి నృత్యం గానంతో కూడిన భారతవర్ష సాంస్కృతిక కార్యక్రమాన్ని కొనసాగించారు. కొనసాగించడమే కాకుండా రచయిత పూలబాలకి ఆ వీడియోని పంపారు. మాతృ భాషానురక్తులైన రవిచంద్ర, వెంకటేష్ లకు పూలబాల వందనాలు తెలియజేసారు.
తెలుగు వారికి జేజేలు! తెలుగు తల్లికి జేజేలు !!
No comments:
Post a Comment