Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, June 20, 2023

ఎందరో మహానుభావులు

సభ్యమైన  భాషని వదిలి,  సవ్యమైన ఆలోచనలని  వదిలి,  పెడదారి పట్టిన సినిమాకి తెలియదు. శాంతికి, సభ్య ప్రవర్తనకి మంచి భాష  మంచి సాహిత్యమే నాందని.  ఈ విషయమ డబ్బులున్నవాడి బుర్రకి ఎక్కలేదు. ఎక్కి ఉంటే  చిత్తశుద్ధితో కళాదృష్టితో సినిమా సృష్టి జరిగేది. ధన వృష్టి కొరకు కామదృష్టి తో కమర్షియల్ సినిమాలు తీసి ప్రజల బలహీనతలతో, మతంలో పురాణాలతో చరిత్రతో ఆడుకుంటున్నారు.  తలకి హృదయానికి బంధం తెంచుకొని  బరితెగించి బతుకుతున్నారు. 

                                       

అశ్లీల భాష అసభ్య ప్రవర్తన  సినిమాకి రెండు కళ్ళు.   అశ్లీల బాష, అసభ్య ప్రవర్తనను పట్టించుకోకుండా   దుస్తులు నాగరికంగా ఉంటే  చాలని చూపిస్తుంది  సినిమా.  ఆధునిక సినిమా ప్రజలని క్షోభపెట్టినట్టుగా మరేదీ క్షోభ పెట్టదు. సినిమా నటులకు తెర మీద డ్రామా నే అలవాటైపోయి వారి    నిత్య జీవితంలో కూడా అసభ్య వాగుడు పిచ్చి ప్రవర్తన ప్రభలిపోతున్నాయి. పుట్టగొడుగుల్లా మొలిచిన తెలుగు వెబ్ వార్తల పోర్టల్స్  వార్తల పేరుతో దొంగల్లా మన మొబైల్స్ లో, కంప్యూటర్స్ లో   జొరబడి మనుషుల మనసులని  అశాంతితో రగులుస్తున్నారు. 



మనసుకి హత్తుకునే  శాస్త్రీయమైన  అందమైన  తెలుగు భాషలో వ్రాసిన భారతవర్ష మీ మనసు మైదానం పై వర్షమై కురుస్తుంది. మీ మనసులో ఆనందం పచ్చని పంటై పండుతుంది. భారతవర్ష చదివేదాకా కావ్యం చదవడానికి నవల చదవడానికి ఉన్న తేడా  తెలియదు, తెలుగులో నిజమైన మాధుర్యం  తెలియదు. ఆనందం  ఆకుపచ్చగా ఉంటుందని అసలే తెలియదు. 

పాండిత్యాన్ని పట్టించుకునే  వాడెవ్వడు? అన్నారు.  ఉన్నారు ఎందరో మహానుభావులు. వస్తాడు తలకి హృదయానికి బంధం ఉన్న ఒక మహానుభావుడు. వస్తాడొక మహానుభావుడు తన అమృత హస్తాలతో సమాజానికి ఏదైనా చేస్తాడు. 



3 comments:

  1. Hi , I am very happy and delighted to get the opportunity to meet poola bala garu. I am very thankful to him for presenting me his valuable and most celebrated book "Bharatha Varsha" .
    I will read this book and provide my opinion as soon as possible. Once again congratulations for your achievements and continuous effort in making our telugu language reachable to several audience Poola bala garu .

    ReplyDelete
  2. Our culture and language spoiling by cinema. But writer giving life to our culture and language .you doing excellent job to enhance our culture and language

    ReplyDelete
  3. YES,i agree with you,
    In todaya's world cineama industry has a huge impact on younstars.
    In olden days the movie contained an culter,and tradition but i did
    not find anything like that in todays's movies

    ReplyDelete