జీవితం ఎలా ఉంటుంది ?
చదరంగా ఉంటుందా ? కోలగా ఉంటుందా?
ఎర్రగా ఉంటుందా ? నల్లగా ఉంటుందా ?
పుల్లగా ఉంటుందా ? ఉప్పగా ఉంటుందా?
వేడిగా ఉంటుందా? చల్లగా ఉంటుందా?
వదులుగా ఉంటుందా ? బిగుతుగా ఉంటుందా ?
లోతుగా ఉంటుందా ? మిట్ట గా ఉంటుందా?
మితంగా ఉంటుందా ? అమితంగా ఉంటుందా ?
చిరంగా ఉంటుందా ? అచిరంగా ఉంటుందా ?
సారవంతంగా ఉంటుందా ? నిస్సారంగా ఉంటుందా?
సీమంగా ఉంటుందా? ఆసీమంగా ఉంటుందా?
ఏటవాలుగా ఉంటుందా ? నిటారుగా ఉంటుందా?
సమంగా ఉంటుందా ? అసమంగా ఉంటుందా ?
(ఇలా అనంతంగా సమాధానాలు వ్రాయవచ్చు)
కానీ అవేవీ సమాధానాలు కావు. ఎందుకు ?
ఈ ప్రశ్న వదిలిపెట్టి వేరే ప్రశ్న చూడు
నీ మనసు ఎలా ఉంటుంది ?
మబ్బుగా వుంటుందా ? తేటగా ఉంటుందా ?
తేలికగా ఉంటుందా ? బరువుగా ఉంటుందా?
తెలివిగా ఉంటుందా ? మూర్ఖంగా ఉంటుందా?
కఠినంగా ఉంటుందా ? సరళంగా ఉంటుందా?
సంతోషంగా ఉంటుందా ? విచారంగా ఉంటుందా?
సున్నితంగా ఉంటుందా ? బండగా ఉంటుందా?
గంభీరంగా ఉంటుందా ? బీరంగా ఉంటుందా ?
పదునుగా ఉంటుందా ? మొద్దుగా ఉంటుందా ?
నీలో ఉంటుందా ? నీ బైట ఉంటుందా ?
పక్కనే ఉంటుందా ? దూరంగా ఉంటుందా
చేతికి దొరుకుతుందా దొరకకుంటుందా
నిన్ను వెంటనడుస్తుందా ? వెంటాడుతుందా ?
దీనికి సమాధానాలు అసంఖ్యాకంగా వ్రాయవచ్చు చిట్టచివరకు
స్థిరంగా ఉంటుందా అస్థిరంగా ఉంటుందా
నీ మనసు ఎలా ఉంటే నీజీవితం అలా ఉంటుంది ?
నీ మనసు ఎలా ఉంటుంది ?
గాజు కాయలా ఉంటుందా ? రబ్బరు బంతి లా ఉంటుందా?
గోలుగావాగుతుందా , డోలులా వాగుతుందా?
జీడిలా సాగుతుందా? కర్రలా విరుగుతుందా?
ఇనుములా అతుకుతుందా , లక్కలా కరుగుతుందా ?
నీ మనసు నీకు లొంగుతుందా ?
లొంగుతుందని ఒక్కనాటికి అనుకోకు ?
మనసు అనిర్వచనీయమైనది
అంటే మనసు పెళ్ళాం లాంటిది
జీవితం ఏం కోరుతుంది?
కళ్ళకు అద్భుతాలు చూపమంటుంది
కళ్ళు చూసినవి అన్నీ కావాలి అంటుంది
అందానికి దాసోహమంటుంది
అందనివల్లా కావాలంటుంది ?
అందకపోతే అలిగి కూర్చుంటుంది.
అసలు జీవితం అంటే ఏమిటి?
జీవితం అంటే ప్రతి ఒక్కరికి ప్రేమ అపారం
కానీ జీవితం అంటే వ్యాపారం
వ్యాపారం అంటే వ్యవహారం
ఆహారం కోసం చేసే వ్యవహారం
సమంగా చూస్తే ప్రతి వ్యవహారం
ఒక హారం జీవితం అనేక వ్యవహారాల సమాహారం
అసలు ఎవరి జీవితం వారి చేతుల్లో ఉంటుందా! బాధ్యతలకు, బంధాలకు మధ్య నలుగుతూ ఉంటుందా? అనుమతుల కోసం ఎదురు చూస్తూ ఉంటుందా? తిరస్కారాలతో అలమటిస్తూ ఉంటుందా?
ReplyDelete