ఇంకా కొనసాగుతున్న బానిసత్వం ఇంగ్లిష్ మీడియం చదువు.
భారత ప్రధాని మాతృభాష లో నే విద్య నేర్చుకోవాలని అనడం చూసి ఆనందంతో ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. నేను జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ వంటి విదేశీభాషలు నేర్పే ఉపాధ్యాయుడిని. నాదగ్గర ఈ భాషలు నేర్చుకునే వారు చదువుకోడానికి , ఉద్యోగాలు చేయడానికి జర్మనీ , ఫ్రాన్స్ , స్పెయిన్ దేశాలు వెళుతున్నారు. వాళ్ళు ఫ్రెంచ్ మీడియంలో, జర్మన్ మీడియంలో లేదా స్పానిష్ మీడియంలో చదువుకోడం లేదు కదా! కోద్దినెలలు ఆ భాషలు నేర్చుకుని మాట్లాడగలుగుతున్నప్పుడు, విదేశాలు కూడా వెళ్లగలుగుతున్నప్పుడు, మన పిల్లలు ఇంగ్లిష్ మీడియం లో ఎందుకు చదువుకోవాలి.? ఇంగ్లిష్ ని ఒక భాషగా నేర్చుకుని బాగామాట్లాడి ఉద్యోగాలు సంపాదించు కోవచ్చు.
ఇంగ్లిష్ వాడిలో మరియు వాడి సంస్కృతి లో ఎన్ని తప్పులున్నా వాడి ముడ్డి నాకే విధంగా ఉంటుంది మన ఇంగ్లిష్ మీడియం విద్య. వాడి సంస్కృతిని నరనరాన జీర్ణించుకున్నాం. పిల్లలకు పెట్టే పేర్లు, కట్టే బట్టలులలో వాడి వేష బాషలు ప్రదర్శించే వాళ్ళు మనకి చుటూ కనిపిస్తారు. మాతృత్వానికి కూడా జీన్స్ పేంట్ తొడుగుతాం. మనసంప్రదాయాల, (మన అల్ట్రా సైన్స్) ను వాడి అల్ప సైన్స్ జ్ఞానంతో ఓడించి వెనక్కి నెట్టేయ డమే అనాదిగా ఇక్కడజరుగుతోంది. ఇంగ్లిష్ వాడిని వాడి జ్ఞానాన్ని ప్రశ్నించే శక్తి మన వాళ్ళకి ఎక్కడొస్తుంది ?
రవి అస్తమించని బ్రిటిష్ స్వామ్రాజ్యం అనే మాటను మన భారతీయులు గొప్పగా చెపున్నారు అంటే మన ఇంగ్లిష్ మీడియం విద్య ఎలాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదే (సూర్యుడు అస్తమించని బ్రిటిష్ స్వామ్రాజ్యం ) మాటకు శశిథరూర్ కేరళ ఎం పి ( అద్భుత భాషాజ్ఞానం గల నిజమైన విద్యాధికుడు గొప్ప రచయిత , ఇంగ్లిష్ వార్తాపత్రికల్లో కాలమిస్ట్) ఏమన్నాడో తెలుసా?
"దేవుడుకూడా చీకటిలో బ్రిటిషువాడిని నమ్మలేదు అందుకే అతడికి రాత్రిని ఇవ్వలేదు" అన్నాడు. ఇంగ్లీషుమీడియంలో చదువుకుంటే గానీ ఉద్యోగాలు రావు అంటున్నారు మన పెద్దలు అలా అనడానికి మనం ఇంకా బ్రిటిష్ దొరల కొలువులో లేం కదా?
విదేశీయులు ఎప్పుడూ మనదేశాన్ని యుద్ధంతోనే కాక , మతంతో , విద్యతో వాళ్ళ ఫేషన్స్ తో మనని మన సంస్కృతిని వశపరుచుకొని మనం దేశాన్ని బలహీనపరచి వశపరుచుకోడానికి ప్రయత్నిస్తుంటారు.
బెర్లిన్ గోడ గురించి వినే ఉంటారు జర్మనీ రాజధాని బెర్లిన్లో ప్రసిద్ధిగాంచిన గోడ. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు, పశ్చిమ జర్మనీలను వేరుచేస్తూ నిర్మించబడింది. దీనిని ఐరన్ కర్టన్ అని కూడా పిలుస్తారు. యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత అమెరికా, రష్యాలు దాన్ని రెండు భాగాలు చేశాయి. 1989 నవంబర్ 9 వాతారీకున అది కూల్చి వేయబడించి. రష్యన్ ప్రసిడెంట్ గోర్బచెవ్ దీనిమీద ఒక వ్యాసం వ్రాసాడు " మార్గరెట్ థాచర్ ఈ గోడకూల్చకూడదని ఎంతో ప్రయత్నించించిందని , వేడుకుంది." ఈ గోడకూలిస్తే ఆమెకెంటి నష్టం ? ఉంటే ఆమె కేంటి లాభం ? అనుకుంటున్నారా ! బెర్లిన్ గోడ ఉంటే జర్మనీ రెండు దేశాలుగా విభజించబడి ఉంటుంది అంటే బలహీనంగా ఉంటుంది. అప్పుడు వారి ప్రపంచ పెత్తనానికి ఏ ఢోకా ఉండదు
చంద్రయాన్ 3 కి వ్యతిరేకంగా చైనా కుట్ర బైటకు వస్తోంది చూస్తున్నారా ?
" చంద్రయాన్ 3 చంద్రుడిని చేరకుండా చూడమని , చేరితే చైనా శాస్త్రవేత్తల చంపేస్తానని" జింపింగ్ చైనా శాస్త్రవేత్తలకు ఇచ్చిన వార్నింగ్ తెలుసా ?
మన వేదాలు, ఉపనిషత్తుల గురించి అందులో జ్ఞానం గురించి కొంచెమైనా తెలుసుకుంటే కదా మన పూర్వీకుల వేద జ్ఞానం ( సైన్స్ ) ఎంత గొప్పదో ఇంగ్లిష్ వాడి సైన్స్ ఎంత అల్పమో మనకి తెలుస్తుంది. ఆసీనో దూరం వ్రజతి, శయానో యాతి సర్వతః".... అంటే ఆత్మ 'కదలకుండానే' సుదూరాలకు, 'పడుకొనే' అన్నిచోట్లకూ పోతుంది!" అని అర్థం.
బానిసభావం విడనాడి ఏ జాతి బతుకునో అదే జాతి అని సినిమా పాట లో ఎంత సత్యం ఉందో తెలుసుకోవాలి. వాడి భాషనేకాదు బానిస వేషం కూడా వదల్లేకపోతున్నాము.
ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటే నమస్కారం అని కూడా అనలేము. గుడ్ మార్నింగ్ తో మొదలెట్టాలి. వాళ్ళ బట్టలు వేసుకుని స్కూల్ కి వెళ్లి వాళ్ళ భాష చదువుకుంటూ వాళ్ళే గొప్పఅని నమ్మాలి. నమ్ముతాం. యజమాని దొంగైనా కుక్క అతడిని చూసి మొరగదు , తోకఊపుతుంది.
ఇంగ్లిష్ వాడు ఎంత క్రూరుడు దోపిడీదారుడు అయినా మనం వాడి భాష సంస్కృతి కోసం అంగలారుస్తూ, వాడి భాష రాకపోయినా వచ్చినట్టు నటిస్తూ బతుకుతున్నాము. ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ కి ఆదాయం ఇంగ్లిష్ భాషే కనుక వాళ్ళు ఇలాటి విషయాలు పిల్లకి చెప్పరు. డబ్బుకోసం జరుగుతున్న జాతి ద్రోహం ఇంగ్లిష్ మీడియం విద్య.
చక్కటి వ్యాసం Poolabala వారు. Congress party లో Sashi Tharoor ఒక exception. Just like late Mr. Vajpayee in BJP. Political Analysts used to hail Vajpayee as an exception in BJP. Modi Prime Minister గా ఉంటే, Sashi Tharoor లాంటి తెలివైన వక్తలు Historians గానూ, రాజకీయ వేత్తలు గాను ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజలు నిజాన్ని గ్రహించి, జాగరూకులై మెలుగుతారు అని నా
ReplyDeleteఅభిప్రాయం.
చాలా చక్కగా తెలుగు భాష గురించి వివరించారు 🙏🌹👌
ReplyDeleteడబ్బు, స్త్రీ, అధికారం. దేశంలో మార్పులని తీసుకురాగల ల్ శక్తి పైనా చెప్పిన వాటికి ఉన్నాయ్. శంలో మార్పు కోసం 100 శాతం లో 80సాతం కోరుకుంటే మార్పు వస్తుంది. కానీ 93 శాతం మందికి వాళ్ల రక్తంలో దేశం ఎలా ఉంటే మనకేంటి మనం బాగుంటే చాలు అన్న భావన మాత్రమే ఉంది. ప్రభుత్వాన్ని నడిపించే నాయకుడికి దేశం గురించి తెలిసి ఉండాలి తను చేసే పనులు దేశ మనుషుల చేత చేయించగల సామర్థ్యం ఉండాలి. ఇంకా చెప్పాలని ఉన కారణాలు చాలా ఉన్నాయ్. చెప్పినా ఎవరు చూడరు. చూసినా పాటించుకోరు.
ReplyDeletechadivi nanduku chala thanks.