Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, August 4, 2023

కొన్ని లిప్తలు మనిషిగా

బ్రతికి ఉన్న ప్రతిక్షణం  మనిషి జీవించడు.  మనిషి 80 ఏళ్ళు బ్రతికితే 80  రోజులు కూడా  జీవించ లేకపోవచ్చు. అప్పుడప్పుడూ మనిషిలా జీవిస్తూ  యంత్రం లా బ్రతికేస్తాడు. 


గోట్ + షీప్ =  గీప్ , లయన్ + టైగర్  = లైగర్  ,  బఫెలో + కౌ  = బీఫలో   వోల్ఫ్ + డాల్ఫిన్ = వోల్ఫిన్ 

మగ సింహం ఆడచిరుత ని కలిస్తే వచ్చేది   లిపార్డ్.    మనిషి హైబ్రీడ్.   మేన్ + మెషీన్   =  మెన్షిన్ 

ఏ  అర్ధ రాత్రో  కొద్ధి  క్షణాలు మనజీవితం గుర్తొచ్చి మనకి నిజమైన దుఃఖం కలుగుతుంది. మన తప్పులను మన మనసుకి చెప్పుకుని , ఒప్పుకుని  జెన్యూన్ గా ఏడుస్తాం. మన జీవితాన్ని నగ్నంగా ముద్దాడతాం. ఆక్షణాలు మనం బ్రతుకుతున్న నిజమైన  క్షణాలు.  మరుక్షణం కళ్ళు తుడుచుకుని అహంకారం  అనే ముసుగు కప్పుకుని మొండిగా  యంత్రంలా బ్రతకడానికి తయారవుతాం.  ఐతే ఈ విషయం అందరికీ అర్థమవ్వాలనిలేదు.  ఒక చిన్న విషయం కనుక్కోడానికి శాస్త్రవేత్తలకి అనేక సంవత్సరాలు పడుతుంది.   కొన్ని సంవత్సరాలు పాటు చూసిన విషయాన్నే చూస్తూ చేసిన ప్రయోగాన్నే చేస్తూ  అనేక పొరపాట్లు దిద్దుకుంటూ ఒక చిన్న విషయాన్ని కనిపెడతారు.  ఒక టన్ను పిచ్ బ్లెండ్ నుంచి గ్రాములో పదవ వంతు రేడియం తీయచ్చని తెలుసు కోడానికి  మేరీక్యూరీ కి  1898 నుంచి 1910 దాకా అంటే 12 సంవత్సరాలు పట్టింది. నువ్వు ఏంటో నీకు కొంత కొంతగా అర్థమవుతూ వచ్చిందని అనుకుంటాను. అయితే అర్ధమైన విషయాలని ఒప్పుకోడానికి అహంకారం అడ్డొస్తుంది. అందరూ బ్రతుకుని కోరుకుంటారు  అందులో తప్పులేదు. ఒప్పుకోవాలని రూలేమీ లేదు. అప్పుడప్పుడూ మనిషిగా జీవిస్తే అదేచాలు.   

  

2 comments:

  1. Chaduvuthunappudu na gurinche edi annatlu anipinchindi oka manshini kuda chala lothuga chadivuna vyakti meru

    ReplyDelete
  2. No one intentionally want to become a machine
    Every person need to be loved
    Every person wants to be respected
    Every person wants to lead a perfect and meaningful life
    But illfate leads to misunderstandings
    Self respect is called as ego
    Sensitive heart is called as cowardness

    ReplyDelete