ఆకాశం అందాన్ని చూసి ఆనందించనివాడు ఉండదు, ప్రకృతిని చూసి పరవసించని వాడు ఉండదు. పూలతోటలో పడుకుని, పూల పరిమళాలను ఆస్వాదిస్తూ, ఆకాశంలో చంద్రుడిని చూస్తూ వెన్నెలలో చుక్కలని లెక్కిస్తూ ఉంటే స్వర్గానికి సమీపంలో ఉన్నట్టే , అదే పక్కనే చుక్క ఉంటే... వెన్నెలలో ప్రణయ సాగర మథనం చేస్తూ ఉంటే .. వెన్నెల్లో మనుషులే కాదు సకల చరాచర ప్రాణువులు ఆనందిస్తాయి. ఆకాశం అందాలను వర్ణించే ఈ కావ్యంలో చంద్రుడి వెన్నెల లో సకల చరాచర ప్రాణులు ఎలా ఆనందిస్తాయో వర్ణించబడింది.
మొదటి 20 పద్యాలు తొలిరాత్రి నూతన వధూవరుల ప్రణయాన్ని వర్ణిస్తాయి. ప్రాచీన లోగిలి ఇంట్లో ఉద్యానవనాన్ని ఆనుకొని ఉన్న ఉన్న శోభన గృహంలో వరుడు వధువు కోసం ప్రణయాత్రతో ఎదురు చూస్తూ ఉంటాడు. పెద్దలు సంతోషంతో విశ్రాంతి పొందు తుంటారు.
వధువును ఆటపట్టించి ఆలస్యంగా పంపడం వల్ల శయన గృహంలో ఆస్తిమితుడై ఉన్న ప్రణయిడు (వరుడు ) కిటికీ తెరచి ఆకాశాన్ని చంద్రుడిని చూస్తాడు.
1. ప్రణయిడు, దెరిచి గవాక్షమున్, కాంచె నబ్రపథమునన్
హసిత రజతోజ్వల మేఘోపరి చంద్రబింబమున్
ప్రణయ ప్రయోక్త హిమకర గగన సాగర
మధనమున్
పొందె శృంగార యుక్త హరిచందన చర్చన ప్రణయతాపమున్
ప్రణయిడు( వరుడు) దెరిచి గవాక్షమున్, కాంచెను = చూచెను అబ్రపథమునన్ = ఆకాశములో ; హసిత = నవ్వుతున్న; రజతోజ్వల = వెండిలా ధగధగలాడు; మేఘోపరి = మేఘాలపైనున్న; చంద్రబింబమున్ = పూర్ణ చంద్రుణ్ణి ; ప్రణయ, ప్రయోక్త = ప్రణయ మును ప్రయోగించువాడు ; హిమకర = చంద్రుని ; గగన సాగర = ఆకాశ సముద్ర; మధనమున్ = చిలకడాన్ని; పొందె = అలా చూసిన వరుడు పొందెను; శృంగార యుక్త = మోహము పుట్టించు; హరిచందన చర్చన = వెన్నెల తాపడము, మరియు ప్రణయతాపమున్ = వలపు బాధను.
The bride groom opened window and saw in the sky
The smiling moon above the clouds dazzling with sliver light
The romance spiller moon was churning the sea of sky
That inspires and gives all life on earth a full romantic charge
2. గగనమునేలె శశాంక ప్రసరిత మనోఙ్ఞ మయూఖముల్
నిశ నేలె నిశంక ప్రభవ నిశ్శబ్ద విమల సౌందర్యముల్
ప్రభవించె వధూవరుల మనముల ప్రణయరాగముల్
నర్తించె నరముల ప్రణయ మయూర సంభోగ భావముల్
గగనమునేలె = ఆకాశమునేలె; శశాంక ప్రసరిత = చంద్రుడు పుట్టించిన మనోఙ్ఞ = అందమైన మయూఖముల్ = చంద్ర కిరణాలు; నిశ నేలె = రాత్రినేలె ; నిశంక = నిశ్శబ్ద రాజు ( వ్యక్తీకరణ) ప్రభవ = జనిత ; నిశ్శబ్ద విమల సౌందర్యముల్ = నిర్మల నిశ్శబ్దత యొక్క అందము; ప్రభవించె = పుట్టించె వధూవరుల మనముల ప్రణయరాగముల్ = ప్రేమ; నర్తించె నరముల= వారి నరములో నాట్యమాడెను ; ప్రణయ మయూర = వలపు నెమళ్ళు ; సంభోగ భావముల్.
At night the moonlight reigns the heavens
The beauty of silence reigns the earth
They soothe the couple and stimulates
Desire, that dances like peacock in their nerves
3. వారిద వాణినీ గణరవ రంజిత సురపథమంబునన్
ఉజ్వల తారాలంకృత బృహత్ రంగమండపంబునన్
కేళీ విలసిత శశాంకుని గాంచి శోకించ బహుత్ర
నృపుల్
మదోర్జితుఁడై యుబ్బడే శశాంకుడుపర్యూపరి హాసంబునన్
వారిద వాణినీ = మబ్బు నర్తకిల; గణ = సమూహము యొక్క ; రవ = మువ్వల సవ్వడుల చే ; రంజిత = రంజించబడిన; సురపథమంబునన్ = ఆకాశములో; ఉజ్వల తారాలంకృత = ప్రకాశవంతమైన నక్షత్రాల ; బృహత్ = పెద్ద రంగమండపంబునన్ = కళావేదిక పైన ; కేళీ విలసిత = వేడుకలో మునిగిన శశాంకుని గాంచి = చంద్రుణ్ణి చూచి శోకించ = ఏడవగా ; బహుత్ర = అనేక ప్రదేశాల్లో ఉన్న; నృపుల్ = రాజులు ; మదోర్జితుఁడై = గర్వాతిశయముతో యుబ్బడే = పెరిగి పోడా; శశాంకుడు = చంద్రుడు ; పర్యూపరి హాసంబునన్ = పడీపడీ నవ్వుచూ
Surrounded by cloud dancers and sound of anklets
Seated in the vast sky auditorium embellished by stars
the moon is entertained. As kings on earth are jealous of him
the moon is swollen with pride and continuous laughter.
4. ధాత్రి నిమనోన్నతముల్ గాంచి దగదగలాడుచు
రజిత కాంతులన్ జిమ్ముచు చంద్రమబ్రమందలరార
నిగనిగలాడు వధువు నిమ్నోన్నతముల్
గాంచి
కుహకుహ పెరిగి పురుషులు తహతహలాడిరి
కుహతోన్
Seeing the great peaks and deep valleys of the earth
the moon shines blissfully, his glint reflects his ecstasy
Seeing the peaks and curvaceous bodies of their ladies
the new grooms reel under the flames of carnal desire
5. లఘాట ఘట్టనన్ కందముల్ స్పోటన చెందగన్
ఊర్ధ్వాభివీత మేఘమాల ఇందుని నిఘూడపరచగన్
మేఘతిమిరాంబరము వసుధను అసిత పరచగన్
యామిని శోభను తారలు విశిదపరచగన్
with a sudden gust of wind the clouds scatter
They rise higher like a garland hiding the moon
the cloud covered sky has darkened the earth
Thus the beauty of the star lit sky is revealed.
6. ప్రసుప్త తటాకమున్ బోలిన తమవృత రాత్రిన్
ప్రదీప్త పారమేష్ట్య సభామంటప గృహమున్ కాంచ
తలపించెను నీలిజల పూరిత సరోవరమునన్ దేలు
ధవళ పుండరీకమున్ వెలిగించె వీక్షకుల మనములన్
నవ్విన తెలియున్ సుదతి యని
బిమ్బాధారి రమ్భేయది దరిజేరి
చేకొందు ఈ ఇంతి
పూబంతి
10. ఇష్టుడు నిష్టాభికుఁడు గాంచె అపాంగ దృష్టిన్
సయ్యోపవిష్ట డై సూర్య స్వీదిత కిసలయ దేహమున్
తత్ దృష్టిన్ గాంచి నిలిచె వధువు ద్వారముఖమునన్
అవరోపిత నేత్ర స్పందిత బిమ్బోష్ట లజ్జావేష్టితంబునన్
11. కాంచ కాంతుని కాంక్షాపూరిత నయనముల్
చూపె విహస్త లలిత లులిత
నయనముల్
కాంచె వరుడు ప్రచీర్ణ హిరణ నయనముల్
వ్రజ
వధు సంకీర్ణ వలగ్న వేణి బంధంబునన్
12. సాగె
గజగామిని మందగమనంబునన్
మృదుమధుర
నూపురస్వనంబునన్
నిలిచె నితంబి చేకొని తల్ప స్తంభంబున్
పుష్పాలంకృత శయన మందిరంబునన్
13. రత్న విభూషిత దర్పణ సమీపంబునన్
నాసాభరణ తుల్య నాగాభరణంబున్
కాంచి చేరె కాంతా కర్షిత సమ్మోహనంబునన్
దీపాకర్షిత సలభ సద్రశతన్
14. క్రీగంట కాంచె ఆర్య పుత్రుని ఆసన్నతన్
చూపుచు నిలిచె అంగన పృష్ఠ భూషణంబులన్
స్పీత
నితంబులన్, భుజగేశ ప్రతిభాస నిబిడ
ద్రాష్టిగ కేసంబులన్ తత్ ప్రతిన శీలతన్
మనోధినాథుఁడు పొందె మధుర భావంబులన్
15.నింగి కి జలజుని వోలె నారికి శిరోజములు
తరువుకు కొమ్మలవోలె తరుణికి కేశములు
సముత్తేజిక శృంగార సజీవ
హారంబులు
అవిరళ అసమాన సౌందర్య
వారంబులు
16. కంఠహార అతిశయ ఘన జఘన హారంబు
ఊర్మిమత ద్రాష్టిగ కేశములుపహారంబు
నితంబి నెఱజాణ వేణి నేత్ర పాసంబు
నేత్రుడు గాంచె దళ కోమల నేత్రి విగ్రహంబు
సితాసితక దలనయనముల్ స్పీత నితంబముల్ ,
మృగయాక్షి సితద్రాపి గుప్త సౌందర్యముల్
Great sir. Wish you all the success to reach one more milestone .
ReplyDeleteYour work looks great sir, it's clear that how you love and live with pen 🖊️..... You are ready to take on new challenges.... u have so much of knowledge sir, helpful attitude person you have strong communication skills....
ReplyDeleteExcellent sir💐
ReplyDeleteమా ఊహకు కొత్త ఊపిరి పోసేలా.., మనసులో రసజరులు పొంగేలా ఉంది చదువుతుంటే ప్రతి అక్షరం
ReplyDeleteExcellent and unique sir
ReplyDelete