1. అమ్మకు దయకలి గినచో
కమ్మని తేనెల తలంపు కలమున బట్టున్
నెమ్మిక కలిగిన మదిలో
అమ్మయె కొలువ యియుండు అన్నియు తానై
2. తలచిన తడవగ పుట్టును
చలనము మనసున, మిటారు చందము తోడన్
అలలుగ సాగును తలపులు
అలసట ఎట్లుండు నొతెలియ దంతము వరకున్
3. జాపితి కరములు నీకడ
జూపుము నీదయ నొసంగి శుభమగు విద్యన్
చూపుము త్రోవను ముందుకు
దీపుర మగుకను లతోడ దీపము నీవై
4. మందమ తినిమతి మరుపును
తొందర చిత్తము లనెల్ల తొలగిం చిమ్మా
అందరు మెచ్చెడి గుణమును
చిందర కానట్టి తలపులు స్థిరమ గుబుద్ధిన్
5. వందన మగునీ వదనము
కుందన కాంతుల నుచిమ్ము క్రోధము లేకన్
పొందిక కగుఅధి నాయిక
సుందర రూపము నుచూడ శోకము తొలగున్
6. వదలను భారతి పదములు
వదలను పుస్తక ముచూపు మార్గము విడిచా
పదలను ఎన్నడు పిలువను
మదకట వెలుతు రునిచ్చు మనసుకు విద్యే
*మదకట = ఆనందమును ప్రకటించునది
7. వందన మిదిగో భారతి
సుందర సుమముల నుదెచ్చి శోభిత మగునీ
స్కందము లకుమా లగవే
సందమ మగురూ పుచూడ సంతస మవదా
8. కోరిన విద్యల నిచ్చెడి
భారము నీదిక తల్లీ బాటను చేయా
సారము నియ్యగ వేడెద
కూరును నీదయ కలిగిన కోరిన వెల్లన్
9. నీరద యాన స నాతని
వారము లోనిల చి యుంటి వాక్జెలి నీకై
నేరము లెంచక రమ్మా
కోరన విద్యల నొసగుము కూరిమి తోడన్
10. ధనమెం తున్నను అందున
ఘనమే మికలదు తలంప కలిగే యాలో
చనలే నడిపిం చెడిఇం
ధనమం చుతెలిసి నవాడు ధన్యుడు ఇలలో
11. తోచని వానికి పొత్తము
దాచిన సిరిని చ్చుజ్ఞాన ధామము చూడన్
చూచిన జ్ఞానము నీవే
వేచిన పొత్తము నుఇవ్వ వేడెద రావే
12. బారుగ బోకులు జేరగ
దూరము అయ్యెని కవిద్య దోపిడి మిగిలెన్
ఘోరము సంఘము చెడితల
భారము మిగిలెవి నరాము భావము వీడన్
13. ముష్టికి వచ్చిన మనిషి
కిష్టము ఏమ గు నుముద్ద కేడ్చును గానీ
ఇష్టము జ్ఞానము అందురు
స్పష్టము మార్కుల ఏడ్తురు చదువరు లిట్లే
No comments:
Post a Comment