Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, March 30, 2025

విశ్వావసుకు స్వాగతం

  క. ఆమని రాకకు  చూపడు 

శ్యామల కోకిల నుచూచి  సంతస మాయెన్   

 ఏమని   కోకిల  చాటెను 

ప్రేమని  తెలపవ లెనంచు ప్రీతిగ  చాటెన్

వసంతఋతువు రాకతో చూపడు (కనబడు) కోకిలను చూసి సంతోషం వెల్లివిరిసింది   కోకిల కూతలు ఏమని చాటెను ?   ప్రేమను తెలపవలెనని ప్రీతిగ   చాటెను. అందరి పట్ల ప్రేమను కలిగి ఉండాలని  కోకిల కూతలు సందేశాన్ని ఇస్తున్నాయి. 



 సీ. కూలిన కూలును కుప్పగ కూలును   పోవల సినదంత  పోయి నాక   

ధర్మము ఒక్కటి ధరణిన  మిగులును  స్వాంతము పొందుచు స్వార్ధ  మడచి 

నడచిన నరులకు నరహరి   నెరవుగ  నొసగును నెమ్మది  నెనరు గొనును     

ప్రకృతి మాతసం పదయన్న ప్రకృతి,  తెలుపగ వచ్చెను   తెలుగు యుగాది  


కూలిన కూలును కుప్ప గ కూలును పోవల సినది పోయిన పిదప ధర్మ ము ఒక్కటి ధరణిన  మిగులును.స్వాంతము కలగి స్వార్ధము నడచి (ఆడచి /అదిమి)  నడచిన నరులకు నరహరి నెరవుగ నెమ్మి నొసగును నయము చూపు  ప్రకృతి మాత సంపదయన్న ప్రకృతి యని తెలుపుచు యుగాది వచ్చెను.


సీ. వానలు కురియువి శ్వవసు  దెచ్చును  శుభములు  జగమున శోభలు పెరుగు    

అన్నిరా  సులకందు ఆయము వృద్ధగు   పొంగుదు  రెల్లరు   ప్రగతి  నంది  

వృత్తులం దుపెరుగు ఫలము ఈశ్వర కృపచే తొలగును భాధలు జీవిత మందు 

కళకళ  లాడుచు కాంతులీ నిసకల   భారత  దేశము  వాసి  నొందు.


వానలు కురియును మెండుగ , పంటలు పండును, ఫల మిచ్చు అన్నిరాసులకందు ఆయము (ఆదాయము )  వృద్ధగు (పెరుగును) పనులందు, వాణిజ్య వృత్తులం దుక్షేమము కలుగు.  ఈశ్వర కృపచే తొలగు బాధలు కళకళ  లాడుచు కాంతులీనుచు  భారత  దేశము వాసి  (  ఆధిక్యత ) నొందు. 

No comments:

Post a Comment