Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, March 23, 2017

జానపదం మన పల్లెల జీవన విధానం




J'ai traduit 71 chansons. La traduction des chansons folkloriques est tres complexe. Certaines chansons m'ont donné des larmes et d'autres les sourires. Mais certainement chaque chanson m'a donné des crampes musculaires. Finalement, c'est un grand succès et une joie. J'ai fait cela pour mon apprentissage et ma joie.  ces chansons donneront également à chacun la même joie. J'enverrai ces chansons à ceux qui me demandent. Je veux apporter ces chansons sous la forme d'un livre.

ప్రసార భారతి అధికారులు ఎంతో  శ్రమదమాదులకోర్చి అనేక జిల్లాలలో పల్లెలను సందర్శించి , జానపదాలు తమలో నిక్షిప్తం చేసుకున్న అనేక వృద్ధులను , స్త్రీలను , రైతులను కలిసి వారి వద్దనుంచి సేకరించిన (పాడించి ఆడియో గ్రహించారు)  విలువైన జానపద గీతాలను సీడీ రూపంలో నాకు అందజేశారు. ఈ పాటలు పల్లె చరిత్రను , ప్రజల జీవన విధానాన్ని, వారి జీవితాల లో ప్రేమ,పెళ్లి , శృంగారం, విషాదం వంటి అనేక  విషయాలను హృద్యంగా వెల్లడిస్తున్నాయి. కొంత మంది స్త్రీలు రామాయణం లో ఘట్టాలను జానపదాలలో అద్భుతంగా పాడారు . ఈ పాటలు ఆరు నుంచి పది పేజీల నిడివి కలిగి ఉన్నాయి . ఎంతో సునాయాసంగా ఈపాటలను వారు నిత్యం పాడుకుంటారు . వాళ్ళ జ్ఞాపక శక్తి కి నా జోహార్లు.  కామందు కొంచం దయ చూపితే మురిసిపోయే పల్లె పడచు పాడిన పాట , కామందు వెంట పడితే హెచ్చరించే పల్లె పడుచు పాడిన పాట, మనకు చక్కిలిగింతలు పెడితే  ఒక మహా వృక్షాన్ని కొట్టేసే టప్పుడు పల్లె పడిన బాధ మన మనసులని మెలిపెడుతుంది   71 పాటలను నేను అనువదించాను. జానపద పాటల అనువాదం చాలా క్లిష్టమైనది. కొన్ని పాటలు నన్ను కన్నీళ్లు మరియు ఇతరులు నవ్వి ఇచ్చాయి. కానీ ఖచ్చితంగా ప్రతి పాట నా నరాలను మీటింది.  నేను నా ఆనందం కోసం దీన్ని చేసాను. ఈ  ఆనందాన్ని మీతో పంచుకోడానికి నేను ఈ బ్లాగ్ రాస్తున్నాను.  ఎవరైనా కోరితే  ఈ పాటలను పంపుతాను. త్వరలో నేను ఈ పాటలను ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలనుకుంటున్నాను.
ఇంగ్లిష్ లోకి అనువదించిన జానపద గీతాలను రేడియో స్టేషన్ లో అందజేస్తున్న ఫోటో 

 రియల్ హీరో లని  గుర్తించడం ఆరాధించడం ఒక సామాజిక అవసరం.  మనం రీల్ హీరోల వెంట పడి  రియల్ హీరోలని మర్చి పోయినట్టుగా సినీ గాయకులే గాయకులని అనుకుంటే పొరపాటే. జానపదం మన పల్లెల జీవన విధానం. జానపదగీతాలు జీవితం లోంచి పుట్టుకొచ్చినవి. పెట్టుడు గీతాలు కాదు.  అరువు తెచ్చుకున్న గోతుతో పాడుతున్న నకిలీ గీతాలు కావు. శ్రమని మరిపింపజేసి పనిని ముందుకు తీసుకెళ్లే జీవన గీతాలు. ఇవి నిత్యం చదువుతూ , వింటూ రాస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా ఆనందం లో మీకు భాగం ఉంది.



1. అందగాడా వన్నెకాడ మస్తానా నీ ఉంగరాల చెయ్యి జూసి మస్తానా  నీ పైన మోజైనది మస్తానా
ఓరందగాడ వన్నెకాడ మస్తానా .. నే కడవ మీద కడవ పెట్టి మస్తానా ...
2.చిక్కెఓయమ్మా చెరువు గట్టుమీద చిక్కేఓయమ్మా అరెరే చిక్కెఓయమ్మా..

3. ఏడెకరాల పాలమిస్తా ఎర్రెద్దుల బండిస్తా రమ్మని చెప్పారో లంబాడోళ్ళ రాందాసా
ఏడెకరాల పొలమోద్దు ఎర్రెద్దుల బండొద్దు రానని చెప్పారా లంబాడోళ్ళ రాందాసా ...

4. ఎంకత్తా నీకొడుకు ఎంతోడయ్యాడే ...

ప్రజలచే ప్రజలకొరకు రచించబడి  ప్రజలచే పాడుకొనబడే గీతాలు జానపదాలు మీకొరకు అందజేస్తున్నవారు            

- మీ మిత్రుడు పూలబాల 

No comments:

Post a Comment