SRM యూనివర్సిటీ గ్రంధాలయంలో భారతవర్ష గ్రంథం
SRM యూనివర్సిటీ ప్రొఫెసర్ భరద్వాజ్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ విష్ణుపాద్ ఇద్దరు తమిళులైనా నేటి తరానికి పనికొస్తుందని భావించి భారతవర్ష గ్రంధాన్ని SRM యూనివర్సిటీ గ్రంధాలయంలో తమ విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
పూర్తి తెలుగులో ఒక్క ఇంగ్లిష్ మాట వాడకుండా రెండు లక్షల యాభై వేల పదాలతో 1265 పేజీలలో వ్రాయబడిన అతిపెద్ద గ్రంధం “భారతవర్ష.”ప్రపంచ రికార్డు సాధించిన భారతవర్ష సరళ గ్రాంధిక ప్రబంధం వేయి కవితల సమాహారం అచ్చ తెలుగు మాధుర్యం. ఈ టీ వీ పూలబాల “భారతవర్ష” పై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. రచయిత పూలబాలకి రాష్ట్ర అధికార భాషా సంఘం మాతృభాషసేవా శిరోమణి అనే బిరుదు విద్యాశాఖామంత్రి చేతులమీదుగా అందజేసింది.
అనేక పాఠశాలలు, కళాశాలలు సాంస్కృతిక సంస్థలు భారతవర్ష కు సన్మానం చేశాయి. అన్నిటికంటే గొప్ప సన్మానం ఒక యూనివర్సిటీ తమ గ్రంధాలయంలో ఉంచడం
నేటి కాలంలో తెలుగువ ఉపయోగంలేదని వదిలిపెట్టేసినవారికి కనువిప్పు కలిగిస్తుంది భారతవర్ష. బాషా సంస్కృతిని నాశనం చేసేస్తే ఒక దేశాన్ని సులభంగా తమ చెప్పుచేతల్లోకి తీసుకోవచ్చు అని విదేశీపాలకులు విద్యా వినోద రంగాలను మన బాషా సంస్కృతులను నాశనం చేయడానికి వాడారు. నేటి పాలకులు కూడా వారికి ఏమీ తీసిపోలేదు. ఒక జాతంతా వేషం మార్చుకుని బ్రతుకుతున్నాది. ఆంగ్లవస్త్రధారణ లేకపోతె నాగరీకుడు కానట్టే అని నాటుకుపోఎలా చేసాం. ఇంగిలీషులేకపోతే బ్రతుకులేదని బెదిరిస్తూ సాగిన విద్యావిధానం వల్ల తెలుగుని వదిలి పెట్టేసి అత్యధికులు ఆంగ్లాన్ని ఆలింగనం చేసుకున్నారు. సినిమాల ప్రభావంతో ఆంగ్లంలో మాట్లాడితే విద్యావంతుడని ఆంగ్లంలో మాట్లాడితేనే ప్రతిష్ట అని స్థాపించాం. కడకు మన బాషా సంస్కృతులని భూస్థాపితం చేసేశాం. ఇది మనం సాధించింది.
భారతవర్ష తెలుగు భాషలో అందాన్ని , భారత దేశ సంస్కృతి లో గొప్పతనాన్ని , తెలుగు సంప్రదాయాలలో నిండు తనాన్ని 200 వృత్త పద్యాలలో అనేక సంస్కృత గీతాలతో , కీర్తనలతో ఒక సామాజిక ఇతివృత్తం గల శృంగార కథ ద్వారా మనసులలో నాటుకునేలా చెబుతుంది.
No comments:
Post a Comment