ఉ. తూరుపు రత్న దీప జిగి తోరణ సోయగ మేలె నాకశ
మ్మేరవికాంతి తో వెలిగె వేంకట నాథుని సుప్రభా తసం
కీర్తన జేయు భాస్కరుని కేళిక చూడరె కీరవాణి రా
గార్చన చేయుకీరముల గారము చేయరె ముద్దుముద్దుగా
ఆదిత్యుడు తూరుపున రత్నదీప జిగి తోరణమును గట్టి ఆకాశము నలకరించి అబ్ర దీపమై వెలుగుచుండగా ఆ జగత్ చక్షువు వెంకటేశ్వరునికి సుప్రభాతసంకీర్తన జేయుచున్నట్టున్నది. చలించు వెలుగు రేఖలను చూడగా అంశుపతి కేళిక (నృత్యము) చేయుచున్నట్టున్నది. కీరముల (చిలుకల) కిలకిలారావములు కీరవాణి రాగార్చన చేయుచున్నట్టున్నది. అట్టి కీరములను ముద్దుముద్దుగా గారముచేయ వలెను. ప్రాతఃకాల శోభను ఆస్వాదించవలెను. అట్టి సమయమున అరుణతార నిద్దుర పోవుచుండెను.
No comments:
Post a Comment