పండుగంటే ఆనందం. ఎలా గడిపితే వస్తుంది ఆనందం
పండుగలంటే కొత్తబట్టలు పిండివంటలు కావు
పండుగలంటే కోడిపందేలు పేకాట్లు కావు
పండుగంటే భార్యల షాపింగ్, భర్తల మాపింగ్ కాదు
సంతసమిచ్చు మిత్రులుయు చక్కటి విందులు బంధువర్గమున్
సంతతి యంత నీదరిన చల్లటి సంగతులన్ని విప్పగన్
వంతుకు సంతలం బడక వాకిట ముచ్చట లాలకిం చగన్
అంతట పండుగే వెడలు అందరు మెచ్చగ కూర్మి చాటుచున్
ఉ . సంతస మిచ్చుమి త్రులుయు చక్కటి విందులు బంధువ ర్గమున్
సంతతి యంతనీ దరిన చల్లటి సంగతు లన్నివి ప్పగన్
వంతుకు సంతలం బడక వాకిట ముచ్చట లాలకిం చగన్
అంతట పండుగే వెడలు అందరు మెచ్చగ కూర్మి చాటుచున్
Thank you
ReplyDelete