మంత్రాలు ఉన్నాయా? మంత్రాలు ఎక్కడ ఉంటాయి?
ఎలా పనిచేస్తాయి? వాటి ప్రభావం ఎలా ఉంటుంది ?
మంత్రం అంటే మంతనం , ఒక రహస్య సమాలోచన , ఒక పథకం
వివేకహీనుడికి మంత్రం అంటే వికృతాకారంగల మాంత్రికుడు, మంత్ర దండం పట్టుకుని జపించే మాటలు. దాని ఫలితంగా ఎలుక - పిల్లిగానో, మనిషి - కుక్కగానో మారిపోడం. అల్పబుద్దితో ఆలోచిస్తే మంత్రం అంటే ఇదే. మానవ మస్తిష్కాన్ని ప్రభావం చేసే ప్రతి మాట మంత్రమే.
మిత బుద్ధితో ఆలోచిస్తే అన్నీ మితంగా కనిపిస్తాయి. ఉదాహరణకి మితబుద్ధి తో ఆలోచిస్తే ప్రపంచం అనే మాట భౌతిక ప్రపంచానికి పరిమితవవుతుంది. నిజానికిఅ నేక ప్రపంచాలు ఉన్నాయి. సంగీత ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం, సాంకేతిక ప్రపంచం. బుద్ధిని వికసింపజేసే జ్ఞాన ప్రపంచంలో ఉండాలంటే భాష, ఆలోచన రెండూ (కావాలి కాదు)పూర్తిగా పరిణితి చెంది ఉండాలి.
ఉ . చిత్రము గాదెవెం డితెర చిత్తము నేలచు వేలుపే యగున్
మంత్రము లెచ్చట కలవు మాటలు పాటలు అన్నివే ద ధీ
మంత్రము లేకదా పనికి మాలిన భావము లన్నియూ విరాట్
తంత్రము లేకదా జనులు తప్పక విందురు చప్పట్ల దురన్
చిత్రముగాదె వెండితెర చిత్తము నేలచు వేలుపే యగున్
మంత్రము లెచ్చట కలవు మాటలు పాటలు అన్నివేద ధీ
మంత్రములే కదా పనికిమాలిన భావములన్నియూ విరాట్
తంత్రము లేకదా జనులు తప్పక విందురు చప్పట్ల దురన్
No comments:
Post a Comment