Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, January 13, 2024

బ్రహ్మ కూతురులను ముద్దాడే చంపకమాల పద్యం

 చంపకమాల:   న జ భ జ జ జ ర ;  యతి 11 వ అక్షరం   

   III        IUI        UII            IUI           IUI         IUI           UIU


తెరిచి గవాక్ష   మంతట  యు తే ట  గవెన్నె లకాంచ  నుల్లమే 

విరిసె  సుమాలు ముచ్చట గ వే డు    కజేయ   గనూర్ధ్వ  లోకమే 

మురిసి  వరాల   జల్లుల  ను మూట  గగుగుప్పె నొతాలు  తాపరే      

అరలు  తనూజ లందడి మి  హత్తు  కుభాష్ప ఝరుల్గు ప్పించెనో. 



 కిటికీతెరచి తేటగ ( స్పష్టంగా)  వెన్నెలనుచూడగా  ఉల్లము సుమము 

వలే విరిసినది.  విరిసిన సుమాల చూసి ఊర్ధ్వలోకము( స్వర్గము) మురిసి 

వానజల్లు కురిపించెనో లేక తాలుతావిరి  ( బ్రహ్మ) తన  విరిత నూజలను 

(పువ్వులు బ్రహ్మ దేముని కుమార్తెలు) ముద్దాడు చుండెనో! అన్నట్లున్నది. 

మరీదు అతికష్టముపై మండువాలోకి దృష్టి మరల్చెను.

.

స్వర్గం  పూలను అభినందించి వాన జల్లు  కురిపించడం  

బ్రహ్మ విరులను  ( కూతురులను) ముద్దాడి ఆనంద బాష్పాలను

 రాల్చడం చంపకమాలలో ఇమడ్చడం ప్రాచీన  కవితా ధోరణి.

No comments:

Post a Comment