అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసాడా ? దాన్ని రాయడం అంటారా?
షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు అంటాము. ఆ లెక్కలో చూసుకున్న రాజ్యాంగ ధర్మాసనం అధ్యక్షుడు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన రచన కాబట్టి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ కి ఆ ఘనత దక్కాలి కదా?
1950 రాజ్యాంగం డ్రాఫ్ట్ ను తయారు చేయడంలో 286 మంది పాల్గొన్నారు అని ఖచ్చితంగా సమాచారం ఉండగా తాజ్మహల్ కట్టిన కూలి వాళ్ళ పేర్ల ను తీసిపారేసినట్టు వాళ్ళ పేర్లను తీసిపారేసి అప్పటి భారత అధ్యక్షుడు, రాజ్యాంగ ధర్మాశనం అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ పేరునుకూడా కరివేపాకులా తీసిపారేసి అంబేద్కర్ ఈజ్ ద సోల్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టి ట్యూషన్" అని అంబేద్కర్ ని ఎందుకు అంతగా ప్రచారం చేస్తున్నారు?
కమలా చౌదరి |
ఒక్క బోయ మాత్రమే పల్లకీ మోయగలడా ?
ఒక్కడే మోసేసాడు అంటున్నారు. అది సాధ్యమా ? అలాగే ఉంటుంది అంబేడ్కర్ ఒక్కడే రాసాడంటే. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాసాడు. దాని ముందూ వెనక ఏమీ ఉండదు. రాజ్యాంగ రచనలో 286 మంది పాల్గొన్నారు రాజ్యాంగం రాయడంలో 15 మంది మహిళలు ఉన్నారన్న సంగతి తెలుసా?
అబ్బే వాళ్ళు లెక్కలోకి రారు. వాళ్ళ గురించి మనం లెక్కలోకి తీసుకోకూడదు. గొప్పతనం అంతా అంబేడ్కర్ కే ఆపాదించేద్దాం. అంబేద్కర్ ని అడ్డుపెట్టుకుని మన ప్రయోజనాలు మనం చూసుకుందాం.ఈ ఉద్దేశంతోనే మిగితా రాజ్యాంగ రచయిత లనందరినీ చీకట్లోకి నెట్టి అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగ నిర్మాత అనే ప్రచారం జరిగింది. నిజానికి అంబేద్కర్ ఒక్కడే కలం కాగితాలు పుచ్చుకుని ఒక బల్ల వద్ద కూర్చొని రాత్రీ పగలు రాజ్యాంగం రాసాడని అర్ధం వచ్చేలా ప్రచారం చేశారు.
నిజానికి ప్రచారాలన్నీ ఇలానే ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ సినిమా. సినిమాల్లో ధనికులుగా మారిన నటులను పడే పడే చూపిస్తూ వారు కేపిటలిస్టులు గా మారి తమ చిత్రాలను తమ బిడ్డల చిత్రాలను నిర్మించుకుంటూ చెత్త కథలతో సమాజ వినాశనానికి యువత పతనానికి కారణం అవుతున్న వారినే సూపర్ స్టార్, మెగా స్టార్ లగా చూపిస్తున్నారు. కేపిటలిస్టులు గా మారిన కళాకారులు ప్రతిభావంతులైన కళాకారులను ఎంతమందిని ఎలా అణగ దొక్కుతున్నారో చూపిస్తే వారిలో ఉన్న నిజమైన కళ బైటబడుతుంది. సినిమాలు తీసి రోడ్డునపడ్డ నిర్మాతల కుటుంబాలు వారి పిల్ల బ్రతుకులను చూపకుండా డబ్బులున్న నలుగురు నటనిర్మాతల వైభవాలని ప్రచారం చేస్తూ చిత్రసీమని అంటే డబ్బే డబ్బు అని వ్యామోహం సృష్టించారు. ప్రచారాలు ఇలా ఉంటాయి. అసలు నిజాలు చెప్పకుండా అతిప్రచారాలతో వ్యక్తి పూజకు తెరతీస్తున్నారు వారి పాదాలకు మోకరిల్లే లా చేసుకుంటున్నారు. అంబేద్కర్ విషయంలో కూడా జరిగింది ఇదే. ఆయన కన్నా తోపులు ఎంతో మంది ఉన్నా ఆయనే అందరికి కన్నా గొప్పవాడని, ఆయన ఒక్కడే రాజ్యాంగాన్ని రాయకున్నా ఆయనే రాసేశాడని ప్రచారం చేసారు.
నిజానికి రాజ్యాంగ రచన అని అనకూడదు. అనేక దేశాల రాజ్యాంగాల ను లో చట్టాలను తీసుకుని మన రాజ్యాంగ తయారు చేశారు అంటే రచించినట్టు ఎలా అవుతుంది ? మన రాజ్యాంగం కాపీ రాజ్యాంగం అని మనకి తెలుసు కదా. 60 రాజ్యాంగాలను తీసుకొని అనేక మంది అభిప్రాయాలని తీసుకుని సవరిస్తూ పోగా సుమారు 3 సం. (2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు) పట్టింది. 286 మంది రాజ్యాంగ రచనలో పాల్గొన్నారు అందుకే రాశారు అనేకంటే కూర్చారు అనడం సబబు. కానీ రాజ్యాంగ కూర్పులో లేదా నిర్మాణం లో పాల్గొన్న 15 మంది మహిళలు లు కూడా ఉన్నారు. అందులో కమలా చౌదరి ఒకరు.
కమలా చౌదరి
ఆమె అమెరికా మిచిగన్ యూనివర్సిటీ నుంచి పీ. హెచ్. డీ. చేసి ఐ. ఐ .ఎమ్. ప్రొఫెసర్ గా, రీసెర్చ్ సెంటర్ లకి డైరక్టర్ గా, హార్వర్డ్ విసిటింగ్ ప్రొఫెసర్ గా, ఇంకా అనేక ఉన్నత పదవులలోప్రకాశించిన సంగతి తెలుసా ?
లీలారోయ్
లీలారోయ్
మహిళలకి ప్రవేశం లేని దాకా యూనివర్సిటీలో ప్రత్యేక అనుమతితో చదువుకుని వాళ్ళని ఎంత ప్రభావితం చేశారంటే, ఆ యూనివర్సిటీ లో ఒక భవనానికి ఆమె పేరు పెట్టారు.
బీ. ఎన్. రావు మొట్టమొదటి రాజ్యాంగ డ్రాఫ్ట్ ను తయారు చేశారు.
రాజ్యాంగ నిర్మాణ క్రెడిట్ బీ. ఎన్. రావు కి ఎందుకు ఇవ్వకూడదు?
సరోజినీ నాయుడు
స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తన రచనలు పద్యాలద్వారా సమాజాన్ని ప్రభావితం చేసి ఇండియన్ నైటింగేల్ గా కీర్తికెక్కి సరోజినీ నాయుడు కూడా రాజ్యాంగ రచనలో పాలు పంచుకున్నారు.
రాజ్యాంగ ధర్మాసనం కావాలని 1935 లో బ్రిటిష్ వారిని కోరింది రాజాజీ. బ్రిటిష్ వారు దానిని 1940 లో అంగీకరించారు. రాజ్యాంగ నిర్మాణ క్రెడిట్ రాజాజీ కి ఎందుకు ఇవ్వకూడదు?
బీ. ఎన్. రావు మొట్టమొదటి రాజ్యాంగ డ్రాఫ్ట్ ను తయారు చేశారు.
రాజ్యాంగ నిర్మాణ క్రెడిట్ బీ. ఎన్. రావు కి ఎందుకు ఇవ్వకూడదు?
మహాభారత రచయిత వ్యాసుడు అంటాము వినాయకుడు అనం కదా!
No comments:
Post a Comment