జయజయ వాగ్దేవి పుత్ర సాహిత్య మిత్ర ధౌతకౌశేయ ధారా!
సర్వతీ పుత్ర, సాహిత్య మిత్ర , పట్టు వస్త్రములు ధరించేవాడా నీకు జయము
శ్రుతివిహిత ధర్మాది ధౌరేయ దినేష సంకాశ ప్రకాశ కవి వరేణ్య
వేదములలో చెప్పబడిన ధర్మాన్ని పాటించేవాడా సూర్య తేజము కలిగిన కవివరేణ్యా
వేదాంత విచారజ్ఞ సభ్య భాషానురక్త, సంస్కార యుక్త
వేదాంతమందు ఆసక్తి కలవాడా మంచి భాష సంస్కార మందు ఇష్టము కలవాడా
భక్తి ప్రభవ జ్ఞానేషిత, ఏషిత దమిత స్థితిపథ గమన
భక్తివలన పుట్టిన జ్ఞానమును పొందినవాడా కోరికలను అణచినవాడా సన్మార్గుడా
శ్రీ సనాతన పాదసేవక కవితాభిజాత శోణిమ స్యందనాభిగంత
సరస్వతి పాద సేవక కవిత్వమందు ఉత్సాహము కలవాడా ఎర్ర కారులో తిరుగువాడా
ఇంద్రకీలాద్రి పురనివాస భవ భావ పరిషద్య భావగమ్య
విజయవాడ నివాసి , గొప్పభావాల సభలో ఉండువాడా , ఆలోచనకి చిక్కువాడా
మధుర మానస చందన గంధ వ్యాపక వేదాంతాభిక జ్ఞానాధ్వర లబ్ధ
మనసులో మధుర చందన పరిమళాన్ని వ్యాపింపజేయువాడా యజ్ఞ ము ద్వారా జ్ఞాన ను పొందినవాడా
బహుభాషా ప్రయోక్త యుక్త దృహిత భాషాశాసనాధిప
అనేక భాషలను ప్రయోగించువాడా వృద్ధి పొందిన భాష ను శాసించువాడా
దృక్చరణ వ్రజన మృగణాధిప శబ్దానుశాసనాధిప
ఉన్నత దృష్టి ని ప్రసాదింపబడిన వాడా , అన్వేషకుడా శబ్దాన్ని శాసించువాడా
శృంగార కావ్యకృత విదుర కీర్తిత భ్రూ సంజ్ఞా నియంత్రిత
శృంగార కావ్యమును రచించిన వాడా పండిత మెప్పును పొంది కనుబొమలతో
పద దళాధిప సృజన సేనాధిప వేంకటాధిప
నియంత్రించబడు పదాలకధిపతి అధిపతి వెంకటాధిప
శ్రీ తులసీ సృత బృందారక, శత పాత్రోచిత సంభాషణ కృత
పద ధనుర్ధారీ కుసుమ సంధాతృ కృశాను గీర్వాణ సాహిత్య కర్తృత్వ
పుష్ప బాణ ధారీ, విలుకాడా భాషా బాణ విదురా , సాహిత్యము చే నియంత్రించుబడువాడా
సాహిత్యామృతానంద,
కవిజేష్ఠ దుర్లలిత మానస ముదిత మృదిత
సాహిత్య అమృతముచే ఆనందమందువాడా అణచబడ్డ స్త్రీల
హృదయ విహర్త, కంచుకిత సలలిత శృంగార నేత్ర ప్రణఖ జేయ
మనసులలో విహరించువాడా, కోరికగల శృంగార నేత్ర శరములచే జయించబడ్డ వాడా
సలలిత దిత దళిత లలిత దళపుష్పము గంధ గండశైల రుత మధుర
అణచబడిన దళములు గల మొగలి పరిమళముగల కోకిల ధ్వనిగల
ముదిత శాఖ్యాభిలాషి
యువతి యొక్క స్నేహాభిలాషి
సస్య పరీవృత వసు,
సస్యముల మధ్య నివసించువాడా
ధాతు అపోధాతు స్ఫూర్జిత రసిక సుధాతు
మూల శక్తి, మార్పుగల, పిడుగువంటి రసిక శక్తి గల, పుష్టములైన ధాతువులుగల
స్ఫార భవ భోగ దక్ష , 20
గొప్ప సుఖ భోగమునందిచగల
నిత్య శుభ శృంగార నిషిక్త హృదయ
నిత్య శుభ శృంగారచే తడవబడిన హృదయము గల
ఉక్తానుక్తదురుక్తార్థ కావ్యకృత జనజాగృత సంభృతశ్రుత గద్య పద్య సవ్యసాచి
మంచిచెడ్డలు బేధము చెప్పు కావ్యముతో ప్రజలను మేల్కొలుపు కవి లొక్క రీతిన రాయగల వాడు
విస్తృత జనహిత లోచన, విక్రమ లోక కళ్యాణ , ప్రభల నిభృత భుజబలదాన
విస్తృతం గా జనులగురించి ఆలోచించేవాడా , ధైర్యంగా లోకోపయోగ పనులు వినయముగా భుజబలముతో చేయువాడా
నిర్దుష్ట నిగమన జనపదోద్దారక విచలిత లలిత వివక్షిత రచనాతృష్ణ
దోషములు లేని చేసిన ప్రతిజ్ఞను పాలించే వాడా , రహదార్లను బాగు పరుచువాడా, స్త్రీ పక్షపాత రచనలు చేయువాడా
శ్రీకృష్ణ దివ్యచరణ ప్రేరిత రసభరిత రణసహిత కావ్య సంధాతృ ప్రణత 25
శ్రీకృష్ణ ప్రేరణ చే శృంగార, రణ భరితమైన కావ్యమును కూర్చిన వందిత
ధంధణ ప్రణదన తాళ ధురీణ , అభంగ చరణ ధారణా సుర వైతాళిక వర
ధన ధన శబ్ద ప్రాస శ్రేష్ఠ , నిరాటంక కవితా ప్రవాహముతో వేల్పుల మేలుకొలుపు వాడా
దృత చిత్త రంజక దురిత భంజక దృక్ప్రసాద ప్రణీత కవన ప్రవీణ
చిదిగిన మనసుల రంజింపజేసెడివాడా చెడును ఛేదించు దృష్టిని ప్రసాదించు కవితా విశారదా
అంజిష్ఠ రశ్మి చుంబిత ప్రత్యూష హిమ మౌక్తికా జ్ఞపిత సరస కవితా విశారదా,
ప్రత్యూష వేళ సూర్య రశ్మి పది మెరిసెడి మంచు ముత్యములవంటి సులభ కవితలు
నిష్ఠుర కఠోర గ్రీష్మ ప్రతాప ప్రతీఘాత విప్లవ ధాత
మండు వేసవి జ్వాలా వ్యతిరేక విప్లవ కవితలు ధరించువాడా
శృంగార రసగంగాధరా, రసగంధ శీఘ్ర
శృంగార కవితాగ్రేస
శృంగారా కవితలను పాదరస వేగముతో లిఖించు కవి చక్రవర్తీ
విప్రకీర్ణ చంద్రికా సితకర గంధ శృంగభావ ధరణ 31
కర్పూర పరిమళమును వెదజల్లు వెన్నెల వంటి భావములుగలవాడా
రాక్షస గుణావరోధక అవికత్థ శుభ్ర నిభృత రచనాధీర
రాక్షస గుణాలను అడ్డగించేవాడ ఆత్మశ్లాఘ లేని వినమ్ర రచనాధీర
అవ్యంగ్య నిశ్చలాంగ ప్రరూఢ అవిద్య నియుద్ధ యోధ,
నిర్దుష్ట దృఢ దేహా పేరొందిన అజ్ఞానమును బాహు బలముతో ఆడుచు వీరా
విద్యాలయ సందర్శ క విభ్రాంతశీల విమత్సర ఆచార్యక
విద్యాలయాలు సందర్శించు సహృదయ సంచార విద్యాబోధక
సుగుణలక్షణ శిక్షక దుర్గుణ వికార విరంజన విక్రమాదిత్య
వ్యక్తిత్వ వికాస మొనర్చి దుర్గుణ వికారములను మాపు వాడా సూర్యతేజము కలవాడా
ప్రద్రాణక భుక్తిప్రద శ్రోత్రియ ప్రియంకర ప్రియశిష్యాభయంకర 36
ఆకొన్న వారికి భుక్తినొసగువాడా వేదపండితులు మెచ్చువాఁడా ప్రియా శిష్యులకభయమిచ్చువాడా
ప్రథమ ఫ్రాన్సేష కాందంబరి లేఖిక సప్తభాషా బోధక
భారత ప్రథమ ఫ్రెంచ్ నవల రచయితా , ఏడు భాషలు బోధించువాడా
గీష్పతీ పరిష్కృత జాతీయ పరిషదాహ్వానితా
పండితులచే అలంకరించబడిన జాతీయస్థాయి సమావేశ ఆహ్వానితా
అంతర్జాతీయ శాస్త్రీయ సాహిత్య వాచస్పతి, భాషా గీష్పతి
అంతర్జాతీయ శాస్త్రీయ సాహిత్య వక్త, భాషా పండితుడా
సిద్ధ గుణ ధామ మృదువదన భాషాభిరామ 40
నిరూపిత ప్రతిభ గల , మృదుభాషి భాషాభిరామ
తర్క వితర్క కుతర్క భేద విదితార్క
శృత పుస్తక స్వరదాత కరపుస్తక దాతృత్వ దుర
వివ్యజా వర జాల క్రియమాణకా ప్రకాశక జ్ఞాన విభవ
అజ్ఞాన వైషమ్య విదిషా నిషేక గమ్య
హస్తినపుర గురుజన ప్రతిభా లబ్ద
పరిగృహ్య సమేత బహుకాలాలయ కృత్యకృత్య శిక్షణ కృత
బహు ఏనస నిగ్రహ, సజ్జన స్నేహ , దుర్జన దుర్యోధ,
దుర్గమ కృచ్ర నిర్జేత్రు బాతు నిరవధిక సాహిత్య అన్వేష్ట్రు పాతు
విద్యావిరాధ విరోధ, విహిత బుధ, అధ్యేత పక్షపాత
విద్యా సమర పథ సమరోత్సాహ సమారాధన ధురంధర 50
సకల జన సేవక సర్వ జన సన్మానిత ఛాత్ర జన భవ తపన తపసీ
సుశిష్టిత సనాతనీ పరిపుష్ట దర్శిత నిస్సీమ వైభవ వాధిప వెంకటాధిప 52
క్షీరాబ్ది వాసిని, జ్యోతి స్వరూపిణీ, కళారస హృదయ, జయ జయ వాగ్దేవి
బ్రహ్మ సువాసిని , పూర్ణేందు బింబానన జయ జయ వాగ్దేవి
ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి , బ్రహ్మజిహ్వ కారిణి జయ జయ వాగ్దేవి
భార స్తనద్వయి, నిరుక్త నితంబిని బిమ్బాధరి జయ జయ రుచిరాంగి
నీరదేందు ఘనసార పటీర మరాళ గామిని జయ జయ రుచిరాంగి
మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ జయ జయ వాగ్దేవి
వాక్ శబ్ద శాస్త్ర బుద్ధి జనని బ్రహ్మ బృహస్పతి జ్ఞాన దాయని జయ జయ వాగ్దేవి
మాతా జయజయ వాగ్దేవి 60
ఇతి పూర్ణ జ్యోతి స్వరూపిణి వాగ్దేవీ వైభవ సూక్తం పరిపూర్ణం .